Yadadri
-
పత్తి రైతుపై విత్తన భారం!
సంస్థాన్ నారాయణపురం: పత్తి విత్తనాల ధర మళ్లీ పెరిగింది. గతేడాది రూ.864 ఉన్న ప్యాకెట్ ధర రూ.37 పెరిగి రూ.901కి చేరింది. ఫలితంగా ఏటా పెరిగిపోతున్న ఖర్చులతో సేద్యం భారంగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీటీ పత్తి విత్తనాల రేట్లు మూడేళ్లుగా పెరుగుతూ వస్తున్నాయి. మూడేళ్లుగా పెరుగుతున్న రేట్లు 2022లో పత్తి విత్తనాల ప్యాకెట్ (450 గ్రా) ధర రూ.767 ఉండగా 2023లో రూ.43 పెరిగి రూ.810కి చేరింది. 2024లో రూ.853కు పెరిగింది. ప్రస్తుతం 901కి చేరింది. ఏటా విత్తన రేట్లు పెరుగుతుండడంతో కొనుగోలు చేయడం రైతులకు తలకుమించిన భారంగా మారింది. 2.30లక్షల ప్యాకెట్ల విత్తనాలు అవసరం వానాకాలం సీజన్లో జిల్లా వ్యాప్తంగా 1.15లక్షల ఎకరాల్లో పత్తి సాగు కానుందని, ఇందుకు గాను 2.30లక్షల ప్యాకెట్ల విత్తనాలు అవసరమని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. కానీ, చాలా మంది రై తులు ఎకరానికి రెండుమూడు ప్యాకెట్ల వరకు వి త్తనాలు విత్తుతుంటారు. మొలకెత్తకపోతే అదనంగా మ రికొన్ని ప్యాకెట్లు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ లెక్కన పెరిగిన ధరలతో జిల్లా రైతులపై సు మారు రూ.1.30 కోట్లు అదనపుభారం పడనుంది. ముందుస్తుగానే విత్తనాల కొనుగోలు గత ఏడాది కంపెనీ, బ్రాండెడ్ విత్తనాల కొరత ఏర్పడింది. దీంతో చాలా మంది రైతులు ఎమ్మార్పీ రేటు కంటే ఎక్కువ చెల్లించి తక్కువ నాణ్యత కల్గిన విత్తనాలు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత ఏడాది అనుభవాల దృష్ట్యా ఈసారి చాలా మంది రైతులు ముందస్తుగానే విత్తనాలు కొనుగోలు చేశారు. హైదరాబాద్, నల్లగొండ, చౌటుప్పల్, భువనగిరి మునుగోడు, చండూరు, మిర్యాలగూడ, దామరచర్ల, మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ తదితర ప్రాంతాల్లో పత్తి విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు. ప్యాకెట్‌పై రూ.37 పెంపు ఫ రూ.864 నుంచి రూ.901కి చేరిన ధర ఫ జిల్లా రైతులపై రూ.1.30 కోట్ల భారం ఫ 1.15 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుందని అంచనా ఫ 2.30 లక్షల ప్యాకెట్ల సీడ్ అవసరం పత్తి సాగు పెరిగే అవకాశం ఈసారి పత్తి సాగు పెరిగే అవకాశం ఉన్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు భావిస్తున్నారు. 1.15లక్షల ఎకరాల్లో పత్తి సాగయ్యే అవకాశం ఉందని అంచనా వేసినప్పటికీ, మరో 20వేల ఎకరాల్లో సాగు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ నెల 25నుంచి రోహిణి కార్తె ప్రవేశిస్తుడటం, ముందుస్తుగానే రుతుపవనాలు రానున్నాయన్న వాతావరణ శాఖ ప్రకటనతో రైతులు దుక్కులు సిద్ధం చేస్తున్నారు. వర్షం కురుస్తుందన్న అశాభావంతో కొంతమంది రైతులు ఇప్పటికే విత్తనాలు విత్తారు. రాయితీ ఇవ్వాలి ఏటేటా పత్తి విత్తనాల రేట్లు పెరుగుతుండడం రైతులకు సేద్యం భారంగా మారుతోంది. ఇప్పటికే పెట్టుబడి ఖర్చులు పెరిగాయి. విత్తన ధరల పెంపుతో ఆర్థిక భారం పడుతుంది. రైతులను ప్రోత్సహించడానికి పత్తి విత్తనాలను రాయితీపై విక్రయించాలి. లేనిపక్షంలో నష్టాలపాలవుతాం. –ఐతరాజు యాదయ్య, రైతు, సంస్థాన్ నారాయణపురం -
నెలాఖరులోగా కొనుగోళ్లు పూర్తి చేయాలి
భూదాన్‌పోచంపల్లి: ధాన్యం కొనుగోళ్లు త్వరగా పూర్తిచేయాలని అదనపు కలెక్టర్ వీరారెడ్డి నిర్వాహకులను ఆదేశించారు. బుధవారం సా యంత్రం భూదాన్‌పోచంపల్లి మండలంలోని జూలూరు పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. కొనుగోళ్లు జరుగుతున్న తీరును పరిశీలించారు. రుతుపవనాల ఆగమనంతో వర్షాలు పడనున్న నేపథ్యంలో కాంటాలు, హమాలీలను పెంచుకొని ఈ నెల 25లోపు కొనుగోళ్లను పూర్తి చేయాలని ఆదేశించారు. ఆయన వెంట తహసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డి, ఆర్ఐలు వెంకట్‌రెడ్డి, సత్యనారాయణ తదితరులు ఉన్నారు. పెరిగిన మద్యం ధరలుఅమల్లోకి.. భువనగిరిటౌన్ : {糿¶æ$-™èlÓ… ò³…_¯]l Ð]l$§ýlÅ… Æó‡r$Ï AÐ]l$-ÌZÏMìS Ð]l^éaƇ$$. ÑïÜP, {»ê…© M>ÓÆý‡t-ÆŠ‡-Oò³ Æý‡*.10, B‹œ »êsìæ-ÌŒæ Æý‡*.20, çœ#ÌŒæ »êsìæ-ÌŒæ-Oò³ Æý‡*.40 ^ö糚¯]l ò³…^èl$™èl* {糿¶æ$-™èlÓ… D¯ðlÌS 18¯]l E™èl¢-Æý‡$Ó-Ë$ gêÈ ^ólíܯ]l ÑçÙĶæ$… ™ðlÍíÜ…§ól. M>V> ´ë™èl ÝëtMŠS E…yýl-yýl…-™ø 20Ð]l ™ól© Ð]lÆý‡MýS$ ´ë™èl «§ýlÆý‡-ÌSMýS$ Ð]l$§ýlÅ… Ñ{MýS-Ƈ$$…^èl-V>.. Mö™èl¢ Æó‡r$Ï º$«§ýl-ÐéÆý‡… ¯]l$…_ AÐ]l$-ÌZÏMìS Ð]l^éaƇ$$. పారిశుద్ధ్యాన్నినిర్లక్ష్యం చేయొద్దుసంస్థాన్నారాయణపురం: మండలంలోని గుడిమల్కాపురం, కోతులాపురం, మల్లారెడ్డిగూడెం, కంకణాలగూడెం, సర్వేల్ గ్రామాల్లో బుధవారం డీపీఓ సునంద పర్యటించారు. పారిశుద్ధ్యాన్ని పరిశీలించారు. కంపోస్ట్ ఎరువు తయారీ విధానంపై కార్యదర్శులకు అవగాహన కల్పించారు. తడి, పొడి చెత్త వేరు చేసి కంపోస్ట్ ఎరువును తయారు చేయించాలని వారికి సూచించారు. ప్లాస్టిక్ కవర్ల నిర్మూలనుకు ప్రజలు సహకరించాలని కోరారు. అమె వెంట డీఎల్పీఓ ప్రతాప్‌నాయక్, ఎంపీఓ నర్సింహరావు తదితరలు పాల్గొన్నారు. రెవెన్యూ చట్టాలపై అవగాహన అవసరం భువనగిరిటౌన్ : రెవెన్యూ చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఉద్యోగ సంఘాల జేఏసీ మందడి ఉపేందర్‌రెడ్డి పేర్కొన్నారు. రెవెన్యూ చట్టాలపై బుధవారం భువనగిరిలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. గత రెవెన్యూ చట్టాల్లో ప్రభుత్వం పలు మార్పులు తీసుకువచ్చిందన్నారు. ఒక్కో సెక్షన్లో అనేక విభాగాలున్నాయని, వాటి గురించి ప్రజలు తప్పనిసరిగా తెలుసుకోవాలన్నారు. ప్రభుత్వ భూములు, గ్రామ కంఠంపై ఆయన వివరించారు. ఉద్యోగ సంఘాల జేఏసీ జిల్లా అధ్యక్షుడు ధరణికోట భగత్, హైదరాబాద్ తహసీల్దార్ గోవర్దన్, కౌశిక్, శ్రీనివాస్, బాలకష్ణ, సురేష్ పాల్గొన్నారు. -
గత పాలకుల తీరుతో రాష్ట్రానికి అన్యాయం
హుజూర్నగర్: కృష్ణానది జలాల పంపకాల విషయంలో గత పాలకుల తీరుతో పదేళ్లు తెలంగాణకు తీవ్రమైన అన్యాయం జరిగిందని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌పై గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో దక్షిణ తెలంగాణ ఎడారిగా మారిందన్నారు. తెలుగు రాష్ట్రాలకు 811 టీఎంసీలు కేటాయించగా ఆంధ్రప్రదేశ్‌కు 512 టీఎంసీలు(66 శాతం), తెలంగాణకు 299 టీఎంసీలు (34శాతం) అని జరిగిన లిఖిత పూర్వక ఒప్పందాన్ని గత పాలకులు అంగీకరించి తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశారని ఆయన పేర్కొన్నారు. మంత్రి ఉత్తమ్ సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని రాజీవ్‌గాంఽధీ, ఎంబీసీ, నక్కగూడెం ఎత్తిపోతల పథకాల పనుల పురోగతిపై బుధవారం చింతలపాలెంలోని అంజలి సిమెంట్ ఆడిటోరియంలో జిల్లా కలెక్టర్ తేజస్‌నంద్‌లాల్ పవార్‌తో కలిసి ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. తాము అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రిగా నేను, న్యాయకోవిదుల, నిపుణులను సంప్రదించి సలహాలు తీసుకొని కృష్ణా జలాల పంపకంలో 70 శాతం తెలంగాణకు తీసుకొచ్చేలా ట్రిబ్యునల్ పునఃసమీక్షించేలా చేశామన్నారు. తమ ప్రభుత్వం ట్రిబ్యునల్‌తో పోరాటం చేస్తుందని ఆయన తెలిపారు. పాలమూరు – రంగారెడ్డి ఎత్తపోతల పథకానికి కృష్ణా జలాలలో నీరు కేటాయించలేదని, తాము వచ్చాక నీటి కేటాయింపు కోసం పట్టుబట్టి పోరాడుతున్నామని మంత్రి తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుమీద పెద్ద ఎత్తున నిధులు వృథా చేశారని, లక్ష కోట్లతో కట్టిన ప్రాజెక్టు కూడా వారి హయాంలోనే కూలిపోయిందన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రూ.38,000 కోట్లతో మొదలుపెట్టిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పనులు మొదలు పెట్టారని, అది పూర్తి చేస్తే బాగుండేదన్నారు. దానిని రద్దు చేసి కాళేశ్వరం పేరుతో అంచనాలు పెంచి అప్పలు తెచ్చి లక్ష కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేశారని మంత్రి ఉత్తమ్ అన్నారు. కృష్ణానదిపై నిర్మిస్తున్న అన్ని ప్రాజెక్టులు త్వరగా పూర్తయ్యే విధంగా సీఎంతో కలిసి సమీక్షించినట్లు ఆయన తెలిపారు. కృష్ణా జలాల్లో వాటా పెంపునకు ట్రిబ్యునల్‌తో పోరాడుతున్నాం నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి -
ఫేక్ మనీ ట్రాన్స్ఫర్ యాప్‌తో మోసం
గరిడేపల్లి: గరిడేపల్లి మండలం అబ్బిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన ఓ యువకుడు ఫేక్ మనీట్రాన్స్‌ఫర్ యాప్ ద్వారా డబ్బులు పంపిస్తూ దొరికిపోయాడు. బుధవారం గరిడేపల్లిలోని ఓ వైన్స్‌లో మద్యం తీసుకున్న అతడు రూ.1200 ట్రాన్స్ఫర్ చేసినట్లు చూపించగా.. మెసేజ్ వచ్చినా డబ్బులు అకౌంట్లో జమకాకపోవడంతో అనుమానంతో యువకుడిని వైన్ షాప్ యాజమాని పట్టుకొని పోలీసులకు అప్పగించాడు. దీనిపై పోలీసులు విచారణ చేసి ఇది చైన్ సిస్టంతో కూడుకున్న మోసంగా అనుమానిస్తున్నారు. యువకుడి సెల్‌ఫోన్, యాప్ మూలాలు, ఇతర వివరాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఏడుగురి వ్యక్తుల రిమాండ్ఆత్మకూరు(ఎం): ఆత్మకూరు(ఎం) మండలంలోని మొరిపిరాల గ్రామానికి చెందిన ఏడుగురు వ్యక్తులను రిమాండ్ చేసినట్లు ఏసీపీ పి. మధుసూదన్‌రెడ్డి బుధవారం పేర్కొన్నారు. భర్త, అత్తమామల వేధింపులు తాళలేక మొరిపిరాల గ్రామానికి చెందిన కటిక సంధ్య ఈ నెల 18న ఆత్మకూరు(ఎం) మండల కేంద్రంలో ఓ వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సంధ్య ఆత్మహత్యకు కారకులైన వారిని గుర్తించి రిమాండ్ చేసినట్లు ఏసీపీ తెలిపారు. రిమాండ్ చేసిన వారిలో సంధ్య భర్త కటికె కృష్ణ, అత్త మారెమ్మ, మామ రాములుతో పాటు శివగణేష్, శ్రీను, రమ్య, వాణి ఉన్నట్లు పేర్కొన్నారు. కృష్ణా నదిలో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యంహుజూర్నగర్: కృష్ణా నదిలో గల్లంతైన వ్యక్తి మృతదేహం బుధవారం లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హుజూర్నగర్ మండలం చింత్రియాల గామానికి చెందిన బంగారు పార్వతీశంచారి(40) మంగళవారం సాయంత్రం పాత కిష్టాపురం గ్రామ పరిధిలో కృష్ణా నది పాయలో ఉన్న గేదెలను తోలేందుకు నదిలో ఈదుకుంటూ వెళ్లి గల్లంతయ్యాడు. అతడి ఆచూకీ కోసం పడవల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టగా బుధవారం మృతదేహం లభ్యమైంది. మృతుడికి భార్య లావణ్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. మృతుడి భార్య లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ప్రొబెషనరీ ఎస్ఐ అజయ్‌కుమార్ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో యువకుడికి గాయాలుచౌటుప్పల్: విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లింగోజిగూడెం గ్రామ శివారులో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడికి గాయాలయ్యాయి. లింగోజిగూడెం గ్రామానికి చెందిన మందోరి మహేష్ ద్విచక్ర వాహనంపై చౌటుప్పల్ నుంచి స్వగ్రామానికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో గ్రామ సమీపంలో విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై గల అండర్‌పాస్ బ్రిడ్జిపై ముందు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేశాడు. దీంతో వెనుకనే వస్తున్న మహేష్ బస్సును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో మహేష్‌కు గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం అతడిని హైదరాబాద్‌కు తరలించారు. మహేష్ అన్న సురేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు. -
ఒకదానికొకటి ఢీకొన్న ట్రావెల్స్ బస్సులు, కంటెయినర్
చౌటుప్పల్ రూరల్: హైవేపై ట్రావెల్స్ బస్సు డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో దాని వెనుకనే వస్తున్న మరో రెండు బస్సులు, కంటెయినర్ ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటన విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై చౌటుప్పల్ మండలం బొర్రోళ్లగూడెం గ్రామ స్టేజీ సమీపంలో బుధవారం ఉదయం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రయాణికులతో వస్తున్న ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ చౌటుప్పల్ మండలం బొర్రోళ్లగూడెం గ్రామ పరిధిలోకి రాగానే విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. దీంతో దాని వెనుక నుంచే వస్తున్న రమణ ట్రావెల్స్ బస్సు, ఆ వెనుకనే వస్తున్న కంటెయినర్, కంటెయినర్‌ను వెనుక నుంచి మరో ట్రావెల్స్ బస్సు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రెండు బస్సులు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. హైవేపై హైదరాబాద్ వైపు ట్రాఫిక్ జాం అయ్యింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని చౌటుప్పల్ సీఐ మన్మథకుమార్ తెలిపారు. రెండు బస్సులు పాక్షికంగా ధ్వంసం క్షేమంగా బయటపడిన ప్రయాణికులు -
వాగా.. డంపింగ్ యార్డా
ఆలేరు: ఆలేరు వాగు ఆనవాళ్లు కోల్పోతోంది. చెత్త డంపింగ్ చేయడం ద్వారా వాగు జలాలు కలుషితం అవుతున్నాయి. వాగులో చెత్త డంపింగ్‌ను నిలిపివేసి, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. రోజూ 3 టన్నుల చెత్త తరలింపు మున్సిపాలిటీలో 12 వార్డుల నుంచి రోజూ సుమా రు మూడు టన్నుల చెత్త, ఇతర వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. మున్సిపల్ వాహనాలతో పాటు ప్రైవేట్ వాహనాల్లో చెత్తను సేకరించి వాగులో, దాని పరిసరాల్లో డంప్ చేస్తున్నారు. తడి, పొడి చెత్తతో పాటు మటన్, చికెన్ షాపుల నుంచి వచ్చే వ్యర్థాలు, ప్లాస్టిక్ కవర్లు, పాత బట్టలు.. ఇలా మొత్తం వాగులో డంపింగ్చేస్తున్నారు. మూడేళ్లుగా ఇదే పరిస్థితి కొనసాగుతుండడంతో వాగు ఆనవాళ్లు కోల్పోతోంది. అంతేకాకుండా నిరంతరం పందులు సంచరిస్తుడటంతో జనాలు వాగునీటిని వినియోగించుకోలేని దుస్థితి నెలకొంది. దుర్గమ్మ గుడి నుంచి కొలనుపాకకు వెళ్లే రోడ్డు మార్గంలో దుర్వాసన వస్తుండటంతో వాహనదారులు, స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. సాయిగూడెం శివారులో రెండెకరాలు కేటాయింపు ఆలేరు మున్సిపాలిటీ పరిధిలోని సాయిగూడెం శివారులో మూడేళ్ల క్రితం చెత్త డంపింగ్ యార్డుకు రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని అధికారులు కేటాయించారు. అయితే స్థానికులు, రైతుల నుంచి అభ్యంతరం వ్యక్తం కావడంతో డంపింగ్‌యార్డు ఏర్పాటుకు బ్రేక్ పడింది. మరోచోట స్థలం ఎంపికకు అధికారులు య త్నించకపోవడంతో డంపింగ్ యార్డు ఏర్పాటులో జాప్యం జరుగుతుందనే వాదనలు ఉన్నాయి.ఆలేరు పెద్ద వాగులో గుట్టలుగా వ్యర్థాలు ఫ సాయిగూడెం శివారులో డంపింగ్ యార్డు ఏర్పాటుకు స్థలం కేటాయింపు ఫ స్థానికుల నుంచి అభ్యంతరం రావడంతో పనులకు బ్రేక్ -
‘ఇస్రో’ శిక్షణ తరగతులకు ఎంపిక
కోదాడ: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) జూన్ 23 నుంచి 27 వరకు రిమోట్ సెన్సింగ్ పరిజ్ఞానంపై నిర్వహించనున్న శిక్షణ తరగతులకు కోదాడ పట్టణంలోని తేజ విద్యాలయంకు చెందిన పదో తరగతి విద్యార్థులు ఏసిరెడ్డి శ్రీవల్లి, తూనుగంట్ల సమజ్ఞ ఎంపికయ్యారు. వీరికి ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహడ్రూన్‌లో గల ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ కార్యాలయంలో శిక్షణ ఉంటుందని పాఠశాల ప్రిన్సిపాల్ ఉస్తేల రమాసోమిరెడ్డి బుధవారం తెలిపారు. ఎంపికై న విద్యార్థులను ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు అభినందించారు. అధ్యాపకుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానంసంస్థాన్ నారాయణపురం: మండలంలోని సర్వేల్ గురుకుల కళాశాలలో కాంట్రాక్టు పద్ధతిలో అధ్యాపకుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఎస్. సతీష్‌కుమార్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఇంగ్లిష్ మాధ్యమంలో గణితం, భౌతికశాస్త్రం, రసాయన శాస్త్రంతో పాటు సంస్కృతం సబ్జెక్టులు బోధించడానికి ఆసక్తి గలవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 99899 51824 నంబర్‌ను సంప్రదించాలన్నారు. వృద్ధురాలి మెడలో బంగారు గొలుసు చోరీచౌటుప్పల్ రూరల్: గుర్తుతెలియని వ్యక్తులు వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసు లాక్కోని పారిపోయారు. ఈ ఘటన చౌటుప్పల్ మండలం ఖైతాపురం గ్రామంలో బుధవారం మధ్యాహ్నం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖైతాపురం గ్రామానికి చెందిన గోపనబోయిన యశోద దండుమల్కాపురం గ్రామంలో తమ బంధువుల వెళ్లి వస్తుండగా.. ఖైతాపురం గ్రామంలోకి రాగానే వర్షం పడింది. దీంతో ఆమె గ్రామ చౌరస్తాలో ఉన్న ఓ ఇంటి వద్ద కూర్చుంది. వర్షం తగ్గిన తర్వాత ఇంటికి వెళ్తుండగా.. బైక్‌పై ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు వెనుక నుంచి వచ్చి ఆమె మెడలోని తులంన్నర బంగారు గొలుసు లాక్కోని పరారయ్యారు. వెంటనే యశోద కేకలు వేయడంతో గ్రామస్తులు బైక్‌పై పారిపోతున్న వ్యక్తులను పట్టుకునే ప్రయత్నం చేయగా, వారు దొరకకుండా హైదరాబాద్ వైపు పారిపోయారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చౌటుప్పల్ సీఐ మన్మథకుమార్ తెలిపారు. పిడుగు పడి మహిళా రైతు మృతిరామగిరి(నల్లగొండ): నల్లగొండ మండలం అప్పాజిపేట గ్రామ పంచాయతీ పరిధిలోని బంటుగూడెంలో బుధవారం మధ్యాహ్నం పిడుగుపడి మహిళా రైతు మృతిచెందింది. బంటుగూడేనికి చెందిన జాల బిక్షపమ్మ(46) తన వ్యవసాయ బావి వద్ద నిమ్మ తోటలో పనిచేస్తుండగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం వచ్చింది. ఈ సమయంలో ఆమైపె పిడుగుపడడంతో అక్కడికక్కడే మృతిచెందింది. మృతురాలికి భర్త, కుమార్తె, కుమారుడు ఉన్నారు. పిడుగుపాటుకు ఇతర కూలీలు భయాందోళనకు గురయ్యారు. -
పంట మార్పిడితో అధిక దిగుబడులు
● మిపర, క్యాబేజీ పంటలకు ఆశించే లద్దె పురుగుల తాకిడి తగ్గాలంటే జొన్న, వరి, సజ్జ, రాగి, పొద్దుతిరుగుడు, వంటి ఆరుతడి పంటలతో పంట మార్పిడి చేయాలి. ● వ్యవసాయ శాస్త్రవేత్తల సలహాల ఆధారంగా పంట మార్పిడి చేయాలి. ● భూసార పరీక్షల ఆధారంగా పంటలకు ఎరువులు వేయడం ఉత్తమం. త్రిపురారం : ప్రతి సీజన్లో ఒకే పంట కాకుండా పంట మార్పిడి చేయడం వల్ల భూసారం పెరిగి అధిక దిగుబడులు సాధించవచ్చని కృషి విజ్ఞాన కేంద్రం కంపాసాగర్ ప్రోగ్రాం కో ఆర్డినేటర్ డాక్టర్ శ్రీనివాసరావు సూచిస్తున్నారు. ఒకే పంటను ఏళ్ల తరబడి సాగు చేయడం ద్వారా చీడపీడల తాకిడి అధికమవుతుందని, భూమి నిస్సారంగా మారుతుందని చెబుతున్నారు. పంట మార్పిడిపై సలహాలు సూచనలు ఆయన మాటల్లోనే.. ఎంపికలో జాగ్రత్తలు తప్పనిసరి పంట మార్పిడి చేయాలంటే అంతకు ముందు సాగు చేసిన పంటకు భిన్నంగా పంటను ఎంచుకోవాలి. కొన్ని పంటల వేరు వ్యవస్థ నేలలోని పొరల నుంచి పోషకాలను ఎక్కువగా గ్రహిస్తాయి. పోషకాలను ఎక్కువగా గ్రహించే నువ్వులు, పొద్దుతిరుగుడు, మొక్క జొన్న పంటలకు బదులుగా భూమికి పోషకాలు సమకూర్చే అపరాల పంటలను సాగు చేసుకుంటే మంచి దిగుబడులు వస్తాయి. అపరాల పంటలు కరువు పరిస్థితులను తట్టుకోవడంతోపాటు ఆకులు రాలడం వల్ల భూమికి సేంద్రియ పదార్థాలు అందుతాయి. రాలిన ఆకులను నేలలో కలియదున్నడం వల్ల భూమి సారవంతంగా మారుతుంది. నల్ల రేగడి నేలల్లో సోయా చిక్కుడు వేసుకోవడం వల్ల పైరు కోత సమయానికి ఆకులు పూర్తిగా రాలుతాయి. దీనివల్ల ఒక్కటి నుంచి రెండు టన్నుల సేంద్రీయ పదార్థం లభిస్తుంది. పంట మార్పిడి ఇలా చేసుకోవచ్చు.. ● వరి పంటను వరుసగా సాగు చేయకుండా పప్పు ధాన్యాలు, నూనె గింజల పంటలు కూడా సాగు చేసుకోవచ్చు. ● పొద్దు తిరుగుడు పంటను సాగు చేసే వారు జొన్న, సజ్జ, కొర్రలు వంటి చిరు ధాన్యపు పంటలను లేదా కంది, శనగ, మినుము వంటి అపరాల పైర్లు లేదా వేరుశనగతో పంట మార్పిడి చేసుకోవచ్చు. ● వానాకాలంలో వేరుశనగ వేసుకునే రైతులు తరువాత వచ్చే యాసంగిలో మొక్కజొన్న పంట వేసుకుంటే పైరుకు కొంత నత్రజని ఎరువు లభిస్తుంది. ● కంది, శనగ పంటలను వరుసగా సాగు చేస్తే కాయ తొలుచు పురుగు అధికంగా ఉంటుంది. అందువల్ల ఈ పురుగులు తక్కువగా ఆశించే జొన్న, నువ్వులు, మినుము, సోయా చిక్కుడు, ఉలవ, మెట్ట వరి పంటలతో పంట మార్పిడి చేసుకోవాలి. ● వరితో పంట మార్పిడి చేసుకుంటే వేరు శనగ పైరుకు నులిపురుగుల బెడద తగ్గుతుంది. ● వంగ తోట వేసుకునే రైతులు కాలీఫ్లవర్‌తో పంట మార్పిడి చేసుకుంటే పంటకు ఎండు తెగులు సోకదు. ● టమాట, ఆవాలు, బంతి ధాన్యపు పంటలతో పంట మార్పిడి చేస్తే నులిపురుగుల ఉధృతి తగ్గుతుంది. ● దోస, కాకర, గుమ్మడి పొట్లకాయ, బీర, బూడిద, గుమ్మడి, దొండ వంటి తీగ జాతి కూరగాయల పంటలను వరి పైరుతో పంట మార్పిడి చేసుకోవచ్చు. ● ఉల్లి సాగు చేసేవారు ధాన్యపు పంటలలో పంట మార్పిడి చేసుకోవచ్చు. ● ఒక్కసారి పసుపు పంట సాగు చేసిన వారు రెండేళ్ల పాటు ఆ భూమిలో మరోసారి పసుపు సాగు చేయకూడదు. ఒకవేళ సాగు చేస్తే చీడపీడల ఉధృతి పెరిగి దిగుబడులు తగ్గుతాయి. పసుసు పంట తర్వాత వరి, మొక్క జొన్న వేసుకుంటే నులి పురుగుల ఉధృతి తగ్గుతుంది. కంపాసాగర్ కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ శ్రీనివాసరావు సూచనలు -
ఇంటికొక రక్తదాత తయారు కావాలి
మోత్కూరు: రక్తాన్ని కృత్రిమంగా తయారు చేయలేమని, ఇంటికొక రక్తదాత తయారుకావాలని సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ అన్నారు. మోత్కూరు మండలం పాటిమట్లలో మాతృదేవోభవ–పితృదేవోభవ సంస్థ 6వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం రక్తదాతల అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. యువత స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. మాతృదేవోభవ–పితృదేవోభవ సంస్థ అధ్యక్షుడు కురుమేటి నవీన్ బాల్యంలోనే తన తల్లిదండ్రులను కోల్పోయి, వారి జ్ఞాపకార్ధం ఈ సంస్థను ఏర్పాటు చేసి వృద్ధులు, వితంతువులు, అనాథలు, పేదలు, నిరుపేదలకు సేవ చేయడం అభినందనీయమన్నారు. కురుమేటి నవీన్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సర్దార్ సర్వాయి పాపన్న, గీత కార్మిక సంఘం ఆలిండియా అధ్యక్షుడు కప్పల రవికుమార్‌గౌడ్, తెలంగాణ నర్సింగ్ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కురుమేటి గోవర్ధన్, ఇండియన్ రెడ్‌క్రాస్ జిల్లా అధ్యక్షుడు గుర్రం లక్ష్మీనర్సింహారెడ్డి, మదర్ డెయిరీ డైరెక్టర్ రచ్చ లక్ష్మీనర్సింహారెడ్డి, ఉపాధ్యాయుడు ముక్కాముల లింగమల్లు, జనయేత్రి ఫౌండేషన్ అధ్యక్షుడు మునీర్ అహ్మద్ షరీఫ్, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, రక్తదాతలు పాల్గొన్నారు. సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ -
గుర్తుతెలియని వ్యక్తుల మృతదేహాలు లభ్యం
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట పట్టణంలో బుధవారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. పట్టణ సీఐ బి. భాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం.. యాదగిరిగుట్ట పట్టణంలోని రింగ్ రోడ్డు సమీపంలో గల పార్కింగ్ ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి వయస్సు సుమారు 35 నుంచి 40ఏళ్లు ఉంటాయని, అతడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదని సీఐ తెలిపారు. మృతదేహాన్ని భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసినట్లుపేర్కొన్నారు. మోత్కూరులో.. మోత్కూరు: మోత్కూరు మున్సిపల్ కేంద్రంలోని కొత్త బస్టాండ్ సమీపంలో బుధవారం మధ్యాహ్నం స్థానికులు గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు. మృతుడు కొద్దిరోజులుగా భిక్షం ఎత్తుకుంటూ బస్టాండ్ సమీపంలో సంచరిస్తున్నాడని స్థానికులు పేర్కొన్నారు. మృతదేహాన్ని రామన్నపేట ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ డి. నాగరాజు తెలిపారు. -
జీపీఓల పరీక్షకు పటిష్ట ఏర్పాట్లు
సాక్షి,యాదాద్రి : ఈ నెల 25న జరగబోయే గ్రామ పాలన అధికారు(జీపీఓ)ల రాత పరీక్షకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ హనుమంతరావు ఆదేశించారు. బుధవారం భువనగిరిలోని వెన్నెల కాలేజీలో ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. పరీక్ష కేంద్రంలో విద్యుత్, తాగునీటి సౌకర్యం కల్పించాలని సూచించారు. మాస్ కాపీయింగ్ ఆస్కారం ఉండవద్దని, పరీక్ష సమయంలో 144 సెక్షన్ అమలు చేయా లని, జిరాక్స్ సెంటర్లను మూసి వేయించాలన్నారు. ఆయన వెంట ఆర్డీఓ కృష్ణారెడ్డి, కలెక్టరేట్ ఏఓ జగన్మోహన్ప్రసాద్ ఉన్నారు. ఫ కలెక్టర్ హనుమంతరావు -
మండుటెండల నుంచి ఉపశమనం
భువనగిరిటౌన్ : ఆవర్తన ద్రోణి ప్రభావంతో జిల్లాలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాతావరణం చల్లబడింది. దాదాపు అన్ని మండలాల్లో 41 డిగ్రీల లోపే పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బుధవారం యాదగిరిగుట్ట పట్టణంలో 41, వలిగొండలో 41, మోటకొండూరు మండలంలో 32 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. వాతావరణం చల్లడటంతో ప్రజలు ఉపశమనం పొందారు. పలుచోట్ల రహదారులపై నీరు నిలిచింది. మరోవైపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని 40నుంచి 50 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ భావిస్తోంది. ఈ క్రమంలో జిల్లాకు ఎల్లో అలర్ట్ హెచ్చరికలు జారీ చేసింది. రోహిణి కార్తెకు ముందే వర్షాలు కురుస్తుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆలేరు: ఆలేరు పట్టణంలో భారీ కురిసింది. రోడ్లు, లోతట్టు ప్రాంతాల్లో పలు కాలనీలు జలమయం అయ్యాయి. దీంతో ప్రజలు ఇబ్బందులకు గుర య్యారు. రైల్వేగేట్ వద్ద అండర్ బ్రిడ్జి నిర్మాణం కోసం తీసి గుంతల్లో వర్షపు నీరు చేరింది. అక్కడక్కడ చెట్ల కొమ్మలు విరిగి కరెంట్ తీగలపై పడటంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఆత్మకూరు(ఎం) : మండలంలో సుమారు గంట సేపు భారీ వర్షం పడింది. రైతులు ముందు జాగ్రత్తగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశులపై టార్ఫాలిన్ పట్టాలు కప్పి ఉంచడంతో నష్టం తప్పింది. వర్షాలు కురుస్తున్నందున ధాన్యాన్ని త్వరగా కొను గోలు చేయాలని రైతులు అధికారులను కోరారు. మోత్కూరు: పట్టణంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో మోస్తరు వర్షం కురిసింది. వర్షానికి మోత్కూరులో రోడ్లు జలమయం అయ్యాయి. యాదగిరిగుట్ట : పట్టణంలో రెండు గంటల పాటు మోస్తరు వర్షం కురిసింది. వర్షానికి పట్టణంలోని ప్రధాన రహదారులపై నీరు ప్రవహించింది. అంతే కాకుండా యాదగిరి క్షేత్రానికి వచ్చిన భక్తులు టెంట్ కింద, ప్రాకార మండపాల కిందికి చేరారు. యాద గిరికొండపై ఎండ, ఉక్కపోతతో అవస్థలు పడ్డ ప్రజానీకం ఉపశమనం పొందారు. కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం వలిగొండ : మండలంలో బుధవారం కురిసిన అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది. వర్కట్‌పల్లి, గోకారం, సంగెం, నాగా రం, వెల్వర్తి కేంద్రాల్లో లారీలు రాకపోవడం వల్ల తూకం వేసిన ధాన్యం పాక్షికంగా తడిసింది. ఏదుళ్లగూడెంలో రైతు కొలను సంధ్యకు చెందిన సుమారు 1,376 బస్తాల ధాన్యం రవాణా చేసే లోపే వర్షానికి తడిసిపోయింది. వర్కట్‌పల్లిలో కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ వీరారెడ్డి, సివిల్ సప్లై మేనేజర్ హరికృష్ణ సందర్శించి ధాన్యాన్ని పరిశీలించారు. తడిసిన ధాన్యాన్ని మిల్లులకు ఎగుమతి చేసేందుకు చర్యలు తీసుకుంటామని, ఆందోళన చెందవద్దని రైతులకు అదనపు కలెక్టర్ భరోసా ఇచ్చారు. కాంటా వేసిన ధాన్యాన్ని ఏరోజుకారోజు మిల్లులకు ఎగుమతి చేయాలని అధికారులను ఆదేశించారు. వారి వెంట తహసీల్దార్ దథరథ ఉన్నారు. అదే విధంగా పలు చోట్ల ఈదురుగాలులకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఫ జిల్లాలో మోస్తరు వర్షాలు ఫ చల్లబడ్డ వాతావరణం బుధవారం నమోదైన వర్షపాతం (మి.మీ) మండలం వర్షపాతం యాదగిరిగుట్ట 41వలిగొండ 41మోటకొండూరు 32ఆత్మకూర్ 26రాజాపేట 23ఆలేరు 21భువనగిరి 20బొమ్మలరామారం 19మోత్కూరు 15తుర్కపల్లి 13అడ్డగూడూరు 13పోచంపల్లి 11గుండాల 06బీబీనగర్ 05చౌటుప్పల్ 04నారాయణపురం 03 -
కమిటీల ఎన్నికపై వీడని ఉత్కంఠ
ఆలేరు: కాంగ్రెస్ నూతన కమిటీల ఏర్పాటులో ఉత్కంఠ వీడటం లేదు. ఒక వైపు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెబు తున్నా.. మరోవైపు సదరు నేతలు పోటీకి సై అంటున్నారు. దాంతో కొత్త కమిటీల అధ్యక్షుల ఎంపిక జిల్లా నాయకత్వానికి కత్తిమీద సాములా మారింది. బుధవారం ఆలేరు పట్టణంలోని ఇందిరా కాంగ్రెస్ భవన్లో డీసీసీ అధ్యక్షుడు సంజీవరెడ్డి, పార్టీ పరిశీలకులు డాక్టర్ అనిల్ ఆధ్వర్యంలో ఆలేరు పట్టణం, మండల, బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల ఎంపికకు నేతల నుంచి దరఖాస్తుల స్వీకరణ సమావేశం జరి గింది. కానీ, పట్టణ, మండల, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్ష పదవుల కోసం పోటీ అధికంగా ఉండటంతో దరఖాస్తుల స్వీకరణపై స్పష్టత రాలేదు. తీర్మానం ఇలా.. సమావేశం రసాభస కాకుండా కమిటీల ఎంపికలో ఎమ్మెల్యే నిర్ణయం ప్రకారం నడుచుకుంటామని నేతలతో చేతులు ఎత్తి తీర్మానం చేశారు. ఈ సందర్భంలో సీనియర్ నాయకుడు నీలం వెంకటస్వామి మాట్లాడుతూ పదవి కోసం సదరు నేతలు పోటీలో ఉన్నట్టు మరి ఎమ్మెల్యేకు ఎలా తెలుస్తోందని ప్రస్తావించారు. జోక్యం చేసుకున్న డీసీసీ అధ్యక్షుడు బరిలో నిలిచే నేతలు నేరుగా ఎమ్మెల్యేను కలిసి తమ అభ్యర్థనలు చేసుకోవాలని సూచించారు. ఇదే విధంగా 2017 తరువాత పార్టీలో చేరిన నేతలు పార్టీ పదవికి పోటీ చేయడానికి అనర్హులని ఆయన స్పష్టం చేశారు. తాను 2017 తరువాతనే కాంగ్రెస్‌లో చేరినప్పటికీ సిన్సియర్‌గా సేవ చేస్తున్నాను.. తనకు పార్టీ పదవుల్లో అవకాశం కల్పించాలని నాయకుడు విజేందర్‌రెడ్డి అడుగగా..ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళతానని సంజీవరెడ్డి సమాధానం ఇచ్చారు. పీసీసీ సూచనలు, పార్టీ పరిశీలకులు, ఎమ్మెల్యే తుది పరి శీలన తరువాత కమిటీ అధ్యక్షుల నియామకం ఉంటుందని చెప్పారు. సాధ్యమైనంత వరకు ఏకగ్రీవంగా కమిటీల ఏర్పాటుకు యత్నిస్తున్నట్టు చెప్పారు. పార్టీ నిబంధనలు ఉల్లంఽఘించే నేతలపై సీరియస్ చర్యలు ఉంటాయని డీసీసీ అధ్యక్షుడు హెచ్చరించారు. టీపీసీసీ కార్యదర్శి జనగాం ఉపేందర్‌రెడ్డి, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు నీలం పద్మ, నాయకులు శ్రీ నివాస్‌రెడ్డి, ఇజాజ్, ఎంఎస్ విజయ్‌కుమార్, సాగర్ రెడ్డి, వెంకటేశ్వరాజు, వెంకటస్వామి మండలాల నాయకులు, మాజీ ప్రజాపతినిధులు పాల్గొన్నారు. పదుల సంఖ్యలో ఆశావహులు పదవుల కోసం పదుల సంఖ్యలో నేతలు పోటీ పడుతున్నారు. ఇప్పటికే వీరంతా ప్రభుత్వ విప్ అయిలయ్యను కలిశారు. కమిటీలను ఏకగ్రీవం చేయాలని ఎమ్మెల్యే ప్రయత్నిస్తుండగా, పోటీ తీవ్రంగా ఉండటంతో తలనొప్పిగా మారింది.కాంగ్రెస్‌లో సంస్థాగత పదవుల కోసం తీవ్ర పోటీ ఫ నాయకత్వానికి కత్తిమీద సాములా ఎంపిక ఫ ఆలేరు పట్టణ, మండల, బ్లాక్ కమిటీలకు దరఖాస్తుల స్వీకరణపై రాని స్పష్టత అధిష్టానం నిర్ణయం మేరకు నడుచుకుంటా: సంజీవరెడ్డి డీసీసీ అధ్యక్షుడి నియామక అంశం అధిష్టానం చూసుకుంటుందని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి స్పష్టం చేశారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సంస్థాగత ఎన్నికల్లో భాగంగా తనను డీసీసీ అధ్యక్షుడిగా కొనసాగించాలా, వద్దా? అనేది అధి ష్టానం నిర్ణయిస్తుందన్నారు. అధిష్టానం నిర్ణయమే శిరోధార్యమన్నారు. ఈనెలాఖరునాటికి జిల్లా వ్యాప్తంగా గ్రామ, మండల, బ్లాక్‌స్థాయి కాంగ్రెస్ నూతన కమిటీల నియామక ప్రక్రియ పూర్తి చేయనున్నట్టు చెప్పారు. నేతలకు పార్టీ పదవులు లేదా స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఏదో ఒకటే అవకాశం ఉంటుందన్నారు. ఒకరికి రెండు పదవులు అసాధ్యమన్నారు. ఒకవేళ పార్టీ పదవిలో ఉండి, ఎన్నికల్లో పోటీకి నేతలకు అనివార్యమైతే పార్టీ పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. -
పర్యావరణాన్ని పరిరక్షిద్దాం
చౌటుప్పల్ రూరల్: పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ కృషిచేయాలని బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓవెన్ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురంలోని గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్‌లో ప్లాస్టిక్ ప్రత్యామ్నాయ సంచులను తయారు చేస్తున్న రమణీ ఇండస్ట్రీస్‌ను సోమవారం బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ సందర్శించారు. డీఆర్డీఓ శాస్త్రవేత్తలు అందించిన సాంకేతిక సహకారంతో రమణి, డాక్టర్ ప్రసాద్‌లు నెలకొల్పిన రమణీ ఇండస్ట్రీస్‌లో బయో డిగ్రేడబుల్ సంచుల తయారీని పరిశీలించారు. ఉత్పత్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ బఝె డిగ్రేడబుల్ సంచులను ప్రపంచం అంతటికీ ఎగుమతి చేయాల్సిన అవసరం ఉందన్నారు. సామాజిక సేవా దృక్పథంతో బ్యాగులు తయారు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. అనంతరం టిప్ కార్యాలయానికి వెళ్లి గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్‌లో చేపడుతున్న పరిశ్రమల వివరాలు తెలుసుకున్నారు. టిప్ మేనేజర్ శ్రీకాంత్.. పార్క్ అభివృద్ధిని, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం గురించి వివరించారు. ఇండస్ట్రియల్ పార్క్ పక్కనే ఉన్న టెక్స్టైల్ పార్క్‌లో తయారవుతున్న వస్త్రాల తయారీ విధానాన్ని చూశారు. మిమీ క్రాఫ్ట్స్ హస్తకళల కేంద్రాన్ని పరిశీలించారు. మిమీ క్రాఫ్ట్స్ నిర్వాహకులు బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారేత్ విన్ ఓవెన్ ను శాలువాతో సన్మానించారు. బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓవెన్ దండుమల్కాపురం గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్‌లోని రమణీ ఇండస్ట్రీస్ సందర్శన -
కారు బీభత్సం.. యువకుడి మృతి
నార్కట్‌పల్లి: కారు అదుపుతప్పి మూడు ద్విచక్ర వాహనాలు, మరో కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన నార్కట్‌పల్లి–అద్దంకి రహదారిపై నార్కట్‌పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెంలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన ఆర్. శృతుత్రెడ్డి, అతడి భార్య శ్రావణిరెడ్డి, అత్త వసంత కలిసి సోమవారం గుంటూరు నుంచి కారులో హైదరాబాద్‌కు వెళ్తున్నారు. మార్గమధ్యలో నార్కట్‌పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం వద్దకు రాగానే ముందు వెళ్తున్న స్కూటీని ఢీకొట్టారు. దీంతో స్కూటీపై ప్రయాణిస్తున్న నార్కట్‌పల్లి మండలం అక్కెనపల్లి గ్రామానికి చెందిన అక్కెనపల్లి సునీల్(33) అక్కడికక్కడే మృతిచెందాడు. అనంతరం కారు అదుపుతప్పి రహదారి పక్కనే నిలిపి ఉంచిన రెండు ద్విచక్ర వాహనాలతో పాటు మరో కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న శృతుత్రెడ్డి, అతడి భార్య, అత్తకు గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న నార్కట్‌పల్లి ఎస్ఐ క్రాంతికుమార్ తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులతో పాటు సునీల్ మృతదేహాన్ని నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పైళ్లెన మూడు నెలలకే..అక్కెనపల్లి గ్రామానికి చెందిన సునీల్ అదే గ్రామానికి చెందిన యువతిని మూడు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. నల్లగొండలో భార్యతో కలిసి నివాసముంటూ అక్కడే ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు. సోమవారం గ్రామంలో బియ్యం తీసుకొచ్చేందుకు గాను తన స్నేహితుడి స్కూటీని తీసుకుని స్వగ్రామం బయల్దేరగా.. మార్గమధ్యలో కారు ఢీకొట్టడంతో మృతిచెందాడు. మూడు ద్విచక్ర వాహనాలు, కారు ధ్వంసం నార్కట్‌పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం వద్ద ఘటన -
చోరీ కేసులో నిందితుల అరెస్ట్
నల్లగొండ: ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలిపై దాడి చేసి చోరీకి పాల్పడిన ఇద్దరు నిందితులను నకిరేకల్ పోలీసులు అరెస్ట్ చేశారు. నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి సోమవారం తన కార్యాలయంలో విలేకరులకు వెల్లడించిన వివరాల ప్రకారం.. నకిరేకల్ పట్టణంలోని వీటీకాలనీలో ఒంటరిగా నివాసముంటున్న నాగులవంచ లక్ష్మమ్మ ఇంటికి ఈ నెల 17న ముగ్గురు వ్యక్తులు వచ్చి ఆమైపె దాడి చేసి, చేతులు కట్టేసి 3 తులాల బంగారు పుస్తెలతాడు, 4 రోల్డ్ గోల్డ్ గాజులు అపహరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆదివారం సాయంత్రం నకిరేకల్ పట్టణంలోని తిప్పర్తి ఫ్లైఓవర్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులను చూసి యాక్టీవాపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు పారిపోతుండగా వారిని పట్టుకుని పట్టుకుని విచారించగా వారి వద్ద పుస్తెలతాడు దొరికింది. లక్ష్మమ్మపై దాడి చేసి చోరీ చేసింది తామేనని నిందితులు సత్యారం కృష్ణ అలియాస్ కృష్ణమూర్తి, మామిడి బాలకృష్ణ ఒప్పుకున్నారు. వీరితో పాటు మరో ఇద్దరు మల్లం నర్సింహ, ముష్టి వెంకటేశ్ కూడా ఈ చోరీలో పాలుపంచుకున్నారని డీఎస్పీ తెలిపారు. సత్యారం కృష్ణ మీద 31 కేసులు, మామిడి బాలకృష్ణపై 13 కేసులు, ముష్టి వెంకటేశ్‌పై ఒక కేసు ఉన్నట్లు డీఎస్పీ పేర్కొన్నారు. మల్లం నర్సింహ, మామిడి బాలకృష్ణ ఆరు నెలల క్రితం దొంగతనం కేసులో అరైస్టె చంచల్‌గూడ జైలులో కలిశారని, ఆ సమయంలో ఒంటరిగా ఉన్న మహిళలపై దాడి చేసి దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో సీఐ రాజశేఖర్, ఎస్ఐలు లచ్చిరెడ్డి, సైదులు, సాయిప్రశాంత్, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, రమేష్, సునీల్, కె. రవి పాల్గొన్నారు. లారీని ఢీకొని గాయాలునాగారం: సూర్యాపేట–జనగామ జాతీయ రహదారిపై నాగారం బంగ్లా సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆత్మకూర్ మండలం ఇస్తాలపురం గ్రామానికి చెందిన మున్న ప్రవీణ్ బైక్‌పై తిరుమలగిరి వైపు వెళ్తున్నాడు. నాగారం బంగ్లా సమీపంలోకి రాగానే బైక్ అదుపుతప్పడంతో ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ప్రవీణ్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బాధితుడిని చికిత్స నిమిత్తం 108 వాహనంలో సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
ఏఎమ్మార్పీ కాలువలో పడి వృద్ధురాలి గల్లంతు
పెద్దఅడిశర్లపల్లి: ప్రమాదవశాత్తు ఏఎమ్మార్పీ ప్రధాన కాలువలో పడి వృద్ధురాలు గల్లంతయ్యింది. ఈ ఘటన పెద్దఅడిశర్లపల్లి మండలంలో సోమవారం చోటు చేసుకుంది. గుడిపల్లి మండలం సింగరాజుపల్లి గ్రామానికి చెందిన ఓర్సు వెంకటమ్మ(60) సోమవారం పెద్దఅడిశర్లపల్లి మండలం వడ్డరిగూడెంలో ఉంటున్న తన కుమార్తె వద్దకు వచ్చి అక్కంపల్లి రిజర్వాయర్ కట్టపై నడుచుకుంటూ వెళ్తూ ఏకేబీఆర్ హెడ్ రెగ్యూలేటర్ వద్ద గల ఏఎమ్మార్పీ ప్రధాన కాలువలో నీరు తాగేందుకు ప్రయత్నిస్తూ కాలువలో జారిపడి కొట్టుకుపోయింది. స్థానికులు గమనించి గుడిపల్లి పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్ఐ నర్సింహులు ఘటనా స్థలానికి చేరుకొని నీటి విడుదలను నిలిపివేసి గాలింపు చర్యలు చేపట్టినా ఆమె ఆచూకీ లభించలేదు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. బైక్ అదుపుతప్పి కాలువలో పడి.. వలిగొండ: బైక్ అదుపుతప్పి కాలువలో పడి వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన వలిగొండ మండలంలోని ఎదుళ్లగూడెం గ్రామ సమీపంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. సోమవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిట్యాల మండలం వెలిమినేడుకు చెందిన అంతటి అజయ్‌కుమార్(26) ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆదివారం వలిగొండ మండలం పొద్దుటూరులోని తన బంధువుల ఇంట్లో శుభకార్యానికి వచ్చి తిరిగి స్వగ్రామానికి వెళ్తున్నాడు. తిరుగు ప్రయాణంలో ఏదులగూడెం సమీపంలో బైక్ అదుపుతప్పి కాలువలో పడి మృతిచెందాడు. వెనుక నుంచి వస్తున్న వ్యక్తి ప్రమాదాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి వెళ్లి పోస్టుమార్టం నిమిత్తం అజయ్‌కుమార్ మృతదేహాన్ని రామన్నపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి అంజయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ యుగంధర్ తెలిపారు. -
తాళం వేసిన ఇంట్లో చోరీ
భువనగిరిటౌన్: భువనగిరి పట్టణంలో సోమవారం మధ్యాహ్నం తాళం వేసిన ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భువనగిరి పట్టణంలోని వసుంధర థియేటర్ ఎదురుగా నివాసముంటున్న ఆమిల్ రాకేష్ సోమవారం ఉదయం ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్‌కు వెళ్లాడు. గుర్తుతెలియని వ్యక్తులు రాకేష్ ఇంటి తాళాలు పగులగొట్టి లోనికి ప్రవేశించి బీరువాల్లో దాచిన రూ.2.60లక్షల నగదు, తులం బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. గేటు, ఇంటి దర్వాజా తీసి ఉండటం గమనించిన పక్కంటి వారు లోనికి వెళ్లి చూడగా కుటుంబ సభ్యులు ఎవరు లేకపోవడం, బీరువాలు తెరిచి ఉండటంతో చోరీ జరిగినట్లు గ్రహించి రాకేష్‌కు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్ఐ లక్ష్మీనారాయణ ఘటన స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. రాకేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణంతిప్పర్తి: తిప్పర్తి మండలం కేశరాజుపల్లి గ్రామ సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ తీవ్రంగా గాయపడి మృతిచెందింది. సోమవారం తిప్పర్తి ఎస్ఐ సాయిప్రశాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్‌కు చెందిన కల్లేపల్లి శ్రీనివాసరాజు, అతడి భార్య పుణ్యలక్ష్మి (54), మరదలు తిరుమలరాజు సుజాత కలిసి ఆదివారం సికింద్రాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాపట్ల జిల్లా నాగండ్ల గ్రామానికి వెళ్తుండగా.. తిప్పర్తి మండలం కేశరాజుపల్లి గ్రామ సమీపంలో కారు అదుపుతప్పి రోడ్డు పక్కన డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పుణ్యలక్ష్మి బలమైన గాయాలయ్యాయి. శ్రీనివాస్‌రాజు, సుజాతలకు స్వల్ప గాయాలయ్యాయి. పుణ్యలక్ష్మిని నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందింది. మృతురాలి భర్త శ్రీనివాసరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సాయిప్రశాంత్ తెలిపారు. హత్య కేసులో నిందితులపై పీడీ యాక్ట్ నమోదు నూతనకల్: నూతనకల్ మండలం మిర్యాల గ్రామానికి చెందిన మెంచు చక్రయ్య హత్య కేసులో ఇద్దరు నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేసి హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలుకు తరలించినట్లు సీఐ నర్సింహారావు సోమవారం తెలిపారు. మార్చి 17న మెంచు చక్రయ్య హత్య జరగగా.. ఈ కేసులో ప్రధాన నింధితులైన కనకటి వెంకన్న అలియాస్ వెంకటేశ్వర్లు, కనకటి శ్రావణ్‌పై పీడీ యాక్ట్ నమోదు చేశామని సీఐ పేర్కొన్నారు. కనకటి వెంకన్నపై 11 క్రిమినల్ కేసులు, కనకటి శ్రావణ్‌పై 7 క్రిమినల్ కేసులు ఉన్నాయని, వారు మళ్లీ ఇలాంటి నేరాలకు పాల్పడకూడదనే ఉద్దేశంతో పీడీ యాక్ట్ నమోదు చేసి సూర్యాపేట సబ్ జైలు నుంచి హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలుకు తరలించినట్లు తెలిపారు. యాదగిరి స్థానాచార్యులుగా ‘నల్లంథీఘల్’● అదనపు బాధ్యతలు అప్పగింతయాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రధానార్చకుడిగా విధులు నిర్వహిస్తున్న నల్లంథీఘల్ లక్ష్మీనరసింహచార్యులకు స్థానాచార్యులుగా దేవాదాయశాఖ అధికారులు అదనపు బాధ్యతలు అప్పగించారు. గత కొన్నేళ్లుగా ఆలయ స్థానాచార్యుల పోస్టు ఖాళీగా ఉంది. దీంతో ఆ స్థానాచార్యుల పోస్టును ఆలయ ప్రధానార్చకుడిగా విధులు నిర్వహిస్తున్న నల్లంథీఘల్ లక్ష్మీనరసింహచార్యులకు అదనంగా బాధ్యతలను అప్పగిస్తు ఉత్తర్వులు జారీ చేశారు. ఆలయంలో పాంచరాత్ర ఆగమశాస్త్రానుసారంగా పూజల్లో స్థానాచార్యులు కీలకంగా బాధ్యతలు నిర్వహించనున్నారు. మట్టపల్లిలో నిత్యకల్యాణంమఠంపల్లి: మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో సోమవారం స్వామివారి నిత్య కల్యాణాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కల్యాణాన్ని కమనీయంగా జరిపించారు. అదేవిధంగా క్షేత్రంలోని శివాలయంలో శ్రీపార్వతీ రామలింగేశ్వర స్వామికి ఏకాదశ రుద్రాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక చైర్మన్ చెన్నూరు విజయ్‌కుమార్, ఈఓ, అర్చకులు పాల్గొన్నారు. -
ఇంటి పెద్ద.. మంచానికే పరిమితం
● భర్త కిడ్నీలు చెడిపోవడంతో దిక్కుతోచని స్థితిలో భార్య ● కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు రూ.11 లక్షలు అవసరం ● ఇప్పటికే వైద్యం కోసం రూ.20 లక్షలు ఖర్చు ● దాతల సాయం కోసం ఎదురుచూపులుకనగల్: కుటుంబాన్ని పోషించాల్సిన ఇంటి పెద్ద రెండు కిడ్నీలు చెడిపోయాయి. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు రూ.11లక్షలు అవసరమని వైద్యులు చెప్పడంతో ఆ పేద కుటుంబం దిక్కుతోచని స్థితిలో ఉంది. దాతలు సాయం చేసి తన భర్తను కాపాడాలని భార్య వేడుకుంటోంది. వివరాలు.. కనగల్ మండల కేంద్రానికి చెందిన రావుల ఉపేందర్(34) రెండు కిడ్నీలు ఐదేళ్ల క్రితం చెడిపోయాయి. వైద్యం కోసం అప్పులు చేయడంతో పాటు తమకున్న అర ఎకరం భూమి అమ్మి రూ.20లక్షలు ఖర్చు చేశారు. ఉపేందర్ బీఈడీ వరకు చదివి కిడ్నీ వ్యాధితో మంచానికే పరిమితం కావడంతో అతడి భార్య స్రవంతి కూలీ పనులకు వెళ్లి మరీ కుటుంబాన్ని పోషిస్తోంది. వీరికి 7వ తరగతి చదివే కుమార్తె ఉంది. ఉన్న భూమి మొత్తం అమ్మినా.. గత మూడున్నర ఏళ్లుగా రూ.8లక్షల వరకు అప్పులు తెచ్చి మరీ ఉపేందర్‌కు వైద్యం చేయిస్తున్నారు. ఏడాదిన్నర నుంచి వారానికి రెండు సార్లు నల్లగొండ పట్టణానికి వచ్చి డయాలసిస్ చేయించుకుంటున్నాడు. దీని కోసం ఉన్న అర ఎకరం భూమి అమ్మితే రూ.12లక్షలు వచ్చాయి. ఇప్పటి వరకు రూ.20లక్షలు ఖర్చు చేశామని, ఇక తమ వద్ద ఎలాంటి ఆస్తులు లేవని ఉపేందర్ భార్య స్రవంతి కన్నీటి పర్యంతమవుతోంది.కిడ్నీ ఇచ్చేందుకు ముందుకొచ్చిన మేనమామ..ఉపేందర్ అవస్థను చూసి సంధ్య తండ్రి (ఉపేందర్ మేనమామ) తన కిడ్నీని అల్లుడిని ఇచ్చేందుకు ముందుకొచ్చాడు. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ 23న హైదరాబాద్‌లోని స్టార్ ఆస్పత్రిలో జరగనుంది. చేతిలో చిల్లిగవ్వ లేదని దాతలు ఆదుకోవాలని ఉపేందర్ భార్య స్రవంతి వేడుకుంటోంది. -
రైతులను పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం
చిట్యాల: కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర్శించారు. చిట్యాలలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కొనుగోలు కేంద్రాలకు రైతులు ధాన్యం తీసుకొచ్చి ఇరవై రోజులు దాటినా కొనుగోలు చేయడం లేదని ఆరోపించారు. కొనుగోలు చేసిన ధాన్యానికి కొర్రీలు పెడుతూ రైస్ మిల్లర్లు దోపిడీకి పాల్పడుతున్నారన్నారు. భూ భారతి, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో అధికారులు బిజీగా ఉండి ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులను పట్టించుకోవటం ఆరోపించారు. రైతులు నుంచి కొనుగోలు చేసిన సన్నధాన్యానికి బోనస్ ఇవ్వకుండా, కాంగ్రెస్ నేతలు పక్క రాష్ట్రాల నుంచి సన్నధాన్యం తీసుకొచ్చి బోనస్ కోసం ఇక్కడి కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారని అన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు నష్టపోయిన రైతులకు పంట నష్ట పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించటం లేదని, ఇచ్చిన హామీలను అమలు చేయటంలో అధికార పార్టీ విఫలమైందని అన్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అవుల అయిలయ్య, పీఏసీఎస్ మాజీ చైర్మన్ రుద్రారపు భిక్షం, మాజీ సర్పంచ్ సుంకరి యాదగిరిగౌడ్, మాజీ ఉప సర్పంచ్ బాతరాజు రవీందర్, బీఆర్ఎస్ జిల్లా నాయకుడు కొలను వెంకటేష్‌గౌడ్, జిట్ట శేఖర్ పాల్గొన్నారు. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య -
బావిలో దూకిన వివాహిత మృతదేహం లభ్యం
ఆత్మకూరు(ఎం): భర్త, అత్తంటి వారి వేధింపులు తాళలేక ఆదివారం రాత్రి వ్యవసాయ బావిలో దూకిన వివాహిత మృతదేహం సోమవారం తెల్ల వారుజామున లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కంచనపల్లి గ్రామానికి చెందిన సంధ్యకు ఆత్మకూరు(ఎం) మండలం మొరిపిరాల గ్రామానికి కటికె కృష్ణతో ఏడాదిన్నర క్రితం వివాహమైంది. భర్త కృష్ణ, అత్తమామలు మారెమ్మ, రాములు, బావ శ్రీను, తోటి కోడలు రమ్య వేధిస్తుండడంతో జీవతంపై విరక్తి చెందిన సంధ్య ఆదివారం సాయంత్రం ఆత్మకూరు(ఎం) మండల కేంద్రంలో సిద్దాపురం రోడ్డు పక్కన వ్యవసాయ బావిలో దూకింది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. బావిలో నీరు ఎక్కువగా ఉండడంతో ఫైర్ సిబ్బంది సహాయంతో నీటిని బయటకు తోడించగా.. సోమవారం తెల్లవారుజామున సంధ్య మృతదేహం లభ్యమైంది. సంధ్య ఆత్మహత్య చేసుకోవడానికి కారకులైన వారిని శిక్షించే వరకు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తీసుకెళ్లనివ్వమని ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు అడ్డుకున్నారు. రామన్నపేట సీఐ ఎన్. వెంకటేశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకుని వారికి సర్దిచెప్పి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన..సంధ్య కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు సోమవారం ఆత్మకూరు(ఎం) పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. దోషులను పోలీసులు కాపాడుతున్నారని ఆరోపించారు. ఘటనా స్థలంలో దొరికిన సూసైడ్ నోట్లో రాసిన విధంగా సంధ్య భర్త కృష్ణ, అత్తమామలు మారెమ్మ, రాములు, బావ శ్రీను, తోటికోడలు రమ్యతో పాటు వారికి సహకరించిన శివనాగేష్, వాణి, రేణుక, స్వాతి, నాగమణి, మాలతిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రామన్నపేట సీఐ ఎన్. వెంకటేశ్వరావు తెలిపారు. పోలీస్ స్టేషన్ వద్ద అవాంఛనీయ సంఘటనలు చేసుకోకుండా వలిగొండ, మోత్కూరు, గుండాల, అడ్డగూడూరు పోలీసులచే బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు స్పందించి ఉంటే మా బిడ్డ బ్రతికేది..తమ కుమార్తైపె భర్త, అత్తమామలు, బావ, తోటికోడలు కలిసి అన్యాయంగా దొంగతనం కేసు పెట్టారని సంధ్య తల్లిదండ్రులు కెమిడి బైరయ్య, జయలక్ష్మి ఆరోపించారు. దొంగతనం కేసులో పోలీసులు కూడా తనను వేధిస్తున్నారని ఎన్నోసార్లు సంధ్య తమకు ఫోన్ చేసి చెప్పిందని వారు పేర్కొన్నారు. పోలీసులు స్పందించి న్యాయం చేసి ఉంటే తమ బిడ్డ బ్రతికేదని బోరున విలపించారు. న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్ ఎదుట కుటుంబ సభ్యుల ఆందోళన -
చికిత్స పొందుతూ యువకుడు మృతి
హుజూర్‌నగర్‌రూరల్: పాముకాటుకు గురైన యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివా రం రాత్రి మృతి చెందాడు. సోమవారం మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. హుజూర్నగర్ మండలం వేపలసింగారం గ్రామానికి చెందిన గుజ్జుల కార్తీక్‌రెడ్డి (33) వరికోత మిషన్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల వరికోతలు కోయడానికి మెదక్ జిల్లాలోని కాగితంపల్లికి వెళ్లాడు. ఈ నెల 11వ తేదీన అక్కడ వరి పొలం కొస్తుండగా కోత మిషన్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో కార్తీక్‌రెడ్డి కోత మిషన్ కిందకు దిగి పరిశీలిస్తుండగా పాము కాటేసింది. కార్తీక్‌రెడ్డి కేకలు వేయడంతో అక్కడే ఉన్న రైతులు గమనించి సమీపంలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిఇ తరలించగా.. చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందాడు. మృతుడు అవివాహితుడు. అతడి తండ్రి గతంలోనే మృతిచెందగా.. తల్లి, ఇద్దరు తమ్ముళ్లతో కలిసి ఉంటున్నట్లు బంధువులు తెలిపారు. ట్రాక్టర్ బోల్తా.. మహిళ మృతిమోటకొండూర్ : ట్రాక్టర్ బోల్తా పడి మహిళ మృతిచెందింది. ఈ ఘటన మోటకొండూర్ మండలం కాటేపల్లి గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. ఎస్ఐ నాగుల ఉపేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. మోటకొండూర్ మండలం ముత్తిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన పీట్ల పద్మ(45), నరసింహ దంపతులు బండ కొట్టి జీవనం సాగిస్తున్నారు. సోమవారం ఉదయం నాంచారిపేటలో గ్రానైట్ రాయి కొట్టి తమ సొంత ట్రాక్టర్లో లోడ్ చేసుకుని కాటేపల్లి గ్రామంలో అన్లోడ్ చేసి వస్తుండగా.. కాటేపల్లి సమీపంలోని బ్రిడ్జి వద్ద ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయే క్రమంలో ట్రాక్టర్ అదుపుతప్పి రోడ్డు పక్కన బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పద్మ అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి కుమారుడు మత్స్యగిరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతురాలికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉంది. తాటిచెట్టు పైనుంచి పడి గీత కార్మికుడు..హుజూర్నగర్ : తాటిచెట్టు పైనుంచి పడి గీత కార్మికుడు మృతి చెందాడు. ఈ ఘటన హుజూర్‌నగర్‌లో సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హుజూర్నగర్ పట్టణంలోని తిలక్‌నగర్‌కు చెందిన నర్సింగ్ ధనమూర్తి (49) కల్లు గీస్తూ జీవనం సాగిస్తున్నాడు. రోజుమాదిరిగానే సోమవారం కల్లు గీసేందుకు తాటిచెట్టు ఎక్కాడు. కల్లుగీస్తూ ప్రమాదవశాత్తు కింద పడిపోయాడు. స్థానికులు గమనించి అతడిని స్థానిక ఏరియా హాస్పిటల్‌కు తరలించగా.. అప్పటికే మృతిచెందాడు. మృతుడికి భార్య లక్ష్మి, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గౌడ సంఘ నాయకులు వల్లపుదాసు కృష్ణగౌడ్, అమర్‌గౌడ్ కోరారు. బాలుడిపై పోక్సో కేసుమోత్కూర్ : బాలికను లైంగికంగా వేధించిన మోత్కూర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలుడిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి సోమవారం జువైనల్ హోంకు తరలించారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేయగా.. సదరు బాలుడు బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తమ విచారణలో తేలడంతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ డి. నాగరాజు తెలిపారు. -
వేధింపులు తాళలేక బావిలోకి దూకిన వివాహిత
ఆత్మకూరు(ఎం): భర్త, అత్తమామల వేధింపులు తాళలేక వివాహిత వ్యవసాయ బావిలో దూకింది. ఈ ఘటన ఆత్మకూరు(ఎం) మండల కేంద్రంలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆత్మకూరు(ఎం) మండలం మొరిపిరాల గ్రామానికి చెందిన కటికె రాములు, మారెమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు. చిన్న కుమారుడు కటికె కృష్ణకు జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కంచనపల్లి గ్రామానికి చెందిన కేమెడీ బైరయ్య, జయలక్ష్మి దంపతుల రెండో కుమార్తె సంధ్యతో ఏడాదిన్నర క్రితం వివాహమైంది. వివాహానికి ముందు కృష్ణ హైదరాబాద్‌లోని కృష్టవేణి టాలెంట్ స్కూల్లో పనిచేసేవాడు. వివాహం తర్వాత గ్రామంలోనే వ్యవసాయం చేసుకుంటూ ఉన్నాడు. ఆరు నెలల నుంచి భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆత్మకూరు(ఎం) పోలీస్ స్టేషన్లో సంధ్యపై కృష్ణ, జనగామ జిల్లా రఘునాథపల్లి పోలీస్ స్టేషన్లో కృష్ణపై సంధ్య పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. దీంతో జీవతంపై విరక్తి చెందిన సంధ్య ఆదివారం సాయంత్రం ఆత్మకూరు(ఎం) మండల కేంద్రంలో సిద్ధాపురం రోడ్డు పక్కన వ్యవసాయ బావిలో దూకింది. సమీపంలో మామిడి చెట్టుకు కాపలాగా ఉన్న కుర్రాడు చూసి చుట్టుపక్కల వారికి సమామాచారం అందించాడు. విషయం తెలుసుకున్న ఎస్ఐ కృష్ణయ్య ఘటనా స్థలాన్ని చేరుకుని పరిశీలించారు. బావి గట్టుపై ఆధార్‌కార్డు, చెప్పుల జత, సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫైరింజన్ సహాయంతో వ్యవసాయ బావి నుంచి నీటిని తోడుతున్నారు. బావిలో నీరు చాలా ఉండటంతో రాత్రి 11.30గంటల వరకు కూడా సంధ్య ఆచూకీ లభించలేదు. తనను భర్త కృష్ణతో పాటు అత్త, మామ, బావ, తోటికోడలు వేధిస్తున్నారని, పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ సమస్యకు పరిష్కారం దొరక్కపోవడంతో తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సంధ్య సూసైడ్ నోట్లో రాసినట్లు తెలిసింది. బావిలో నీటిని తొలగిస్తున్న ఫైర్ సిబ్బంది గాలింపు చర్యలు ముమ్మరం -
నిడమనూరు పీహెచ్సీలో అగ్నిప్రమాదం
నిడమనూరు: నిడమనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా స్టోర్ రూంలో మంటలు చెలరేగడంతో ఆస్పత్రి కాపలాదారుడు ఉదయ్‌రాజ్ ఊపిరాడక నిద్రలేచి ఆస్పత్రి బయటకు పరిగెత్తాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఏఎస్ఐ జోజి వెంటనే ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించారు. సబ్ స్టేషన్ సిబ్బందికి చెప్పి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. హాలియా నుంచి ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు. స్టోర్ రూంలో కొన్ని మందులు మండే స్వభావం కల్గి ఉండటంతో ఆస్పత్రిలోని అన్ని గదులకు పొగ వ్యాపించింది. ఫ్రిజ్‌లు, ఆపరేషన్ థియేటర్లోని పరికరాలు, ఫర్నీచర్, ఆస్పత్రి బెడ్స్, ల్యాబ్ పరికరాలు, రిజిస్టర్లు, డాక్యుమెంట్లు, దగ్ధమయ్యాయి. రూ.5లక్షలకు పైగా నష్టం జరిగినట్లు పోలీసులు, ఆస్పత్రి వర్గాలు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ఆస్పత్రి సీహెచ్ఓ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ జోజి తెలిపారు. డిప్యూటీ డీఎంహెచ్ఓ కేస రవి ఆదివారం తెల్లవారుజామున పీహెచ్‌సీని పరిశీలించారు. నిర్వహణ సరిగ్గా లేక.. నిడమనూరు పీహెచ్సీ భవనం 2001లో నిర్మించారు. నీటి లీకేజీతో భవనం స్లాబ్ ధ్వంసమైంది. భవన నిర్వహణ సరిగ్గా లేకనే షార్ట్ సర్క్యూట్ జరగడానికి కారణమని తెలుస్తోంది. నీటి లీకేజీలతో ఎర్త్ వచ్చేదని, కనీస జాగ్రత్తలు పాటిస్తే షార్ట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం జరిగే ఉండేది కాదని పలువురు అంటున్నారు. కాలిబూడిదైన రూ.5లక్షలకు పైగా విలువైన మందులు, సామగ్రి -
అత్త, మామపై అలుడి దాడి
గుండాల: మద్యం మత్తులో అత్త, మామపై అల్లుడు దాడి చేయడంతో అత్త మృతి చెందింది. మామకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన గుండాల మండలం సుద్దాల గ్రామంలో శనివారం రాత్రి జరిగింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ జిల్లా లింగాల ఘణపురం మండలం మాణిక్యపురం గ్రామానికి చెందిన గుగులోతు జున్నూబాయి(50), రాజయ్య దంపతుల కుమార్తె చుక్కవ్వను అదే గ్రామానికి చెందిన కాలియా బచ్చన్, లింగబాయి దంపతుల కుమారుడు కనకయ్యకు ఇచ్చి 16ఏళ్ల క్రితం వివాహం చేశారు. గుగులోతు జున్నూబాయి, రాజయ్య దంపతులు గుండాల మండలం సుద్దాల గ్రామానికి చెందిన గూడ పృథ్వీ మామిడి తోటను కౌలుకు తీసుకొని జీవనం సాగిస్తున్నారు. వ్యసనాలకు బానిసైన కనకయ్య ఇటీవల మరో మహిళ గౌరమ్మను పెళ్లి చేసుకొని గుండాల మండలం బూర్జుబావి గ్రామంలో ఇద్దరు భార్యలతో కలిసి మామిడి తోటను కౌలుకు తీసుకొని ఉంటున్నాడు. శనివారం రాత్రి మద్యం మత్తులో ఉన్న కనకయ్య సుద్దాల గ్రామంలో అత్తమామలు ఉంటున్న మామిడి తోట వద్దకు వచ్చి వారితో గొడవపడ్డాడు. ఈ క్రమంలో ఇనుప వస్తువుతో అత్త, మామపై దాడి చేయడంతో జున్నూబాయి అక్కడికక్కడే మృతి చెందింది. రాజయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. గుండాల గ్రామంలో మామిడి తోటను కౌలుకు తీసుకొని ఉంటున్న కాలె కృష్ణ ఆదివారం ఉదయం సుద్దాల గ్రామానికి వెళ్లి చూడగా రాజయ్య రక్తపు మడుగులో పడి ఉండటం చూసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. మృతురాలి పెద్ద కుమార్తె కాలియా పెంటమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని గాయాలపాలైన రాజయ్యను చికిత్స నిమిత్తం జనగామ ఏరియా ఆస్పత్రికి, జున్నూబాయి మృతదేహాన్ని ఆలేరు ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు చెప్పారు. ఘటనా స్థలాన్ని భువనగిరి డీసీపీ ఆకాంంక్ష్ యాదవ్, సీఐ శంకర్, ఎస్ఐ జి. సైదులు పరిశీలించారు. అత్త మృతి మామకు తీవ్ర గాయాలు -
చికిత్స పొందుతూ మహిళ మృతి
తిప్పర్తి: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందింది. తిప్పర్తి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిప్పర్తి మండలం సర్వారం గ్రామానికి చెందిన రాచమల్ల మల్లమ్మ(60) ఈ నెల 14న తన కుమారుడు రాచమల్ల కోటిలింగంతో కలిసి సర్వారం నుంచి మామిడాల గ్రామానికి వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తుండగా.. రోడ్డుపై గుంతలు ఉండటంతో మల్లమ్మ కిందపడిపోయింది. ఈ ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆమెను నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందింది. మృతురాలి కుమారుడు రాచమల్ల నాగయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమొదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌కానిస్టేబుల్ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. కారు ఢీకొని.. నకిరేకల్: నకిరేకల్ మండలం చందపట్ల గ్రామానికి చెందిన గాదె అర్జున్(26) బైక్‌పై ఈ నెల 3న నకిరేకల్‌కు వస్తుండగా.. పట్టణ శివారులోని ఎస్ఎఫ్ గార్డెన్ సమీపంలో ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అర్జున్ను స్థానికులు నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి కుటుంబ సభ్యులు నల్లగొండలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్ధితి విషమంగా ఉండటంతో ఈ నెల 14న హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతిచెందాడు. మృతుడు అవివాహితుడు. ఆదివారం మృతుడి సోదరుడు ప్రవీణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ లచ్చిరెడ్డి తెలిపారు. -
పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్య
రామన్నపేట: విద్యార్థి దశలో ఇంటర్మీడియట్ విద్య చాలా కీలకమైనది. చాలామందికి ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలల్లో ఇంటర్ విద్యనభ్యసించాలనే కోరిక ఉంటుంది. కానీ కార్పొరేట్ విద్య పేదలకు అందని ద్రాక్షగా మారింది. ప్రతిభ గల పేద విద్యార్థుల కలను సాకారం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం కార్పొరేట్ విద్యా పథకాన్ని తీసుకొచ్చింది. పదో తరగతి పరీక్షల్లో ప్రతిభ చాటిన విద్యార్థులు ఈ పథకం ద్వారా తమ ఉజ్వల భవిష్యత్‌కు బాటలు వేసుకునేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఈ పథకానికి సంబంధించి 2025–26 విద్యా సంవత్సరానికి గాను దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 4వేల మంది విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకం అందించనుంది. ఈ ఏడాది పదో తరగతి పరీక్షల్లో నాలుగు వందలకు పైగా మార్కులు సాధించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, మైనార్టీ, ఈబీసీ వర్గాలకు చెందిన విద్యార్థులకు ఈ పథకం వర్తిస్తుంది. విద్యార్థులు జిల్లా పరిషత్, ప్రభుత్వ ఉన్నత, ఏయిడెడ్, కస్తూర్బా, నవోదయ, గురుకుల, ఆదర్శ పాఠశాలల్లో చదివిన విద్యార్థులు ఈ పథకానికి అర్హులు. మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఎంపికై న విద్యార్థులకు కళాశాలతో కూడిన సమాచారం అందిస్తారు. దరఖాస్తు చేసుకునే విధానం మీసేవా కేంద్రాల ద్వారా టీఎస్ ఈపాస్ పోర్టల్‌లో telanganaepass.cgg.gov.in వెబ్సైట్ ద్వారా ఈ నెల 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థి తమ పూర్తి వివరాలు, పదో తరగతి మార్కుల ధ్రువపత్రం, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో, 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివిన స్టడీ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు, ఆదాయ, కుల ధ్రువపత్రాలను సమర్పించాలి. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల వారికి రూ.1.50లక్షలు, పట్టణ ప్రాంతాల వారికి రూ.2లక్షలకు మించరాదు. ఒక్కో విద్యార్థికి ప్రభుత్వం రూ.36వేలు ప్రోత్సాహకం అందించనుంది. కార్పొరేట్ విద్యా పథకంతో ఉజ్వల భవిష్యత్‌కు ప్రభుత్వ సహకారం 31 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశంగడువులోగా దరఖాస్తు చేసుకోవాలి కార్పొరేట్ విద్యా పథకం ప్రతిభ గల పేద విద్యార్దులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వి నియోగం చేసుకోవాలి. ఈ నెల 31వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికై న విద్యార్థులకు రెండేళ్లపాటు కార్పొరేట్ కళాశాలల్లో ఉచిత విద్య, వసతి కల్పించబడతాయి. – వసంతకుమారి, యాదాద్రి భువనగిరి జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ అధికారి -
పెద్దదేవులపల్లి వాసికి డాక్టరేట్
త్రిపురారం: త్రిపురారం మండలం పెద్దదేవులపల్లి గ్రామానికి చెందిన పసుల సైదులు, రాములమ్మ దంపతుల కుమారుడు మధుబాబు అమెరికాలోని యూనివర్సీటీ ఆఫ్ లూసియానాలో పీహెచ్డీ పూర్తిచేసి డాక్టరేట్ అందుకున్నాడు. న్యూరో సైన్స్ విభాగంలో చేసిన మధుబాబు చేసిన పరిశోధనకు గాను శనివారం రాత్రి యూనివర్సీటీలో నిర్వహించిన గ్రాడ్యుయేషన్ వేడుకల్లో డాక్టరేట్ ప్రదానం చేశారు. వ్యవసాయ కుటుంబానికి చెందిన మధుబాబు చిన్నప్పటి చదువులో చురుగ్గా ఉండేవాడని, అతడికి డాక్టరేట్ రావడం పట్ల తల్లిదండ్రులు, బంధువులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. గంజాయి తాగుతూ పట్టుబడ్డ యువకులుయాదగిరిగుట్ట రూరల్: యాదగిరిగుట్ట మండలం మహబూబ్‌పేట గ్రామంలో ఆదివారం గంజాయి తాగుతూ ముగ్గురు యువకులు పోలీసులకు పట్టుబడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహాబూబ్పేట గ్రామ శివారులో ఆదివారం కొంతమంది యువకులు గంజాయి తాగుతున్నారని పక్కా సమాచారం రావడంతో ఎస్ఐ అనిల్‌కుమార్ తన బృందంతో కలిసి దాడులు జరిపారు. ఈ దాడుల్లో గ్రామానికి చెందిన ముగ్గురు గాజుల బాలకృష్ణ, గాజుల ప్రవీణ్, గాజుల సాయి గంజాయి సేవిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. వారి నుంచి 150 గ్రాముల గంజాయి, రెండు బైక్‌లు, మూడు సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. షార్ట్ సర్క్యూట్‌తో గోల్డ్ వర్క్‌షాప్ దగ్ధంమిర్యాలగూడ అర్బన్: షార్ట్ సర్క్యూట్‌తో గోల్డ్ వర్క్‌షాప్ దగ్ధమైంది. ఈ ఘటన శనివారం అర్ధరాత్రి మిర్యాలగూడ పట్టణలో చోటు చేసుకుంది. మిర్యాలగూడ పట్టణంలోని పెద్దబజారులో మారోజు కిరణ్‌కుమార్, మునగాల శ్రీనివాస్ బంగారం వర్క్‌షాప్ నిర్వహిస్తున్నారు. రోజుమాదిరిగా శనివారం రాత్రి షాప్ మూసివేసి ఇంటికి వెళ్లారు. అర్ధరాత్రి ఒకటిన్నర ప్రాంతంలో షాప్ నుంచి మంటలు వస్తుండటంతో స్థానికులు గమనించి ఫైర్ సిబ్బందికి, షాప్ యజమానులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో రూ.5లక్షలతో పాటు ఐదు తులాల బంగారం దగ్ధమైనట్లు బాధితులు తెలిపారు. కార్లు ఢీకొని చుక్కల దుప్పి మృతిమిర్యాలగూడ: రోడ్డు దాటుతున్న చుక్కల దుప్పిని రెండు కార్లు ఢీకొట్టడంతో మృతిచెందింది. ఈ ఘటన శనివారం అర్ధరాత్రి దామరచర్ల మండలం బొత్తలపాలెం గ్రామ శివారులో చోటు చేసుకుంది. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ముఖేష్ తెలిపిన వివరాల ప్రకారం.. బొత్తలపాలెం గ్రామ శివారులో చుక్కల దుప్పి రోడ్డు దాటుతుండగా.. కల్లేపల్లి వైపు వెళ్తున్న కారు ఢీకొట్టింది. అదే సమయంలో కల్లేపల్లి నుంచి మిర్యాలగూడకు వస్తున్న మరో కారు కూడా దుప్పిని ఢీకొట్టడంతో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతిచెందింది. విషయం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని దుప్పి కళేబరాన్ని స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కొండ్రపోల్ పీహెచ్సీలో దుప్పి కళేబరానికి పోస్టుమార్టం నిర్వహించి ఖననం చేసినట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. -
మీసేవ ఆపరేటర్స్ అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారిగా శ్రీకాంత్
సూర్యాపేట అర్బన్ : తెలంగాణ మీసేవ ఆపరేటర్స్ అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారిగా సూర్యాపేట పట్టణానికి చెందిన గొట్టిపర్తి శ్రీకాంత్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం హైదరాబాద్‌లోని బృందావన్ ఇన్‌లో అన్ని జిల్లాల అసోసియేషన్ల అధ్యక్ష, కార్యదర్శుల సమక్షంలో రాష్ట్ర కోశాధికారిగా ఎన్నికై న శ్రీకాంత్‌తో ప్రమాణస్వీకారం చేయించి సన్మానించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ రాష్ట్ర కార్యవర్గంలో స్థానం కల్పించినందుకు అధ్యక్ష, కార్యదర్శులు, వర్కింగ్ ప్రెసిడెంట్‌కు కృతజ్ఞతలు తెలిపారు. శ్రీకాంత్ ఎన్నిక పట్ల సూర్యాపేట జిల్లా మీసేవ ఆపరేటర్స్ అభినందనలు తెలిపారు. ‘గోపా’ బలోపేతానికి కృషిచేయాలి తాళ్లగడ్డ (సూర్యాపేట): గౌడ్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (గోపా) బలోపేతానికి కృషిచేయాలని ఆ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చీకూరు సత్యం గౌడ్ అన్నారు. ఆదివారం సూర్యాపేట పట్టణంలోని సాయి గౌతమి జూనియర్ కళాశాలలో గోపా జిల్లా అధ్యక్షుడు బూర రాములు గౌడ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన జిల్లా కార్యవర్గ సమావేశాని ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విస్తృత స్థాయిలో గోప సభ్యత్వాలు చేయించాలని, భవిష్యత్ కార్యక్రమాల నిర్వహణపై చర్చించారు. ఈ సందర్భంగా పలువురికి సభ్యత్వాలు అందజేశారు. ఈ సమావేశంలో అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు నాతి సవీందర్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎరగాని లక్ష్మయ్య గౌడ్, ఉపాధ్యక్షుడు నామాల గురుమూర్తి గౌడ్, కోశాధికారి అయితబోయిన రాంబాబు గౌడ్, జాయింట్ సెక్రటరీలు రాపర్తి మహేష్ గౌడ్, భూపతి నారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
నృసింహుడిని దర్శించుకున్న సమాచార కమిషనర్
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని రాష్ట్ర సమాచార కమిషనర్ పీవీ శ్రీనివాస్‌రావు కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి సంప్రదాయంగా స్వాగతం పలికారు. అనంతరం గర్భాలయంలో స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చనమూర్తులను దర్శించుకుని, అష్టోత్తర పూజల్లో పాల్గొన్నారు. వారికి అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా, డిప్యూటీ ఈఓ భాస్కర్‌శర్మ లడ్డూ ప్రసాదం, స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. అంతకుముందు అతిథి గృహం వద్ద కలెక్టర్ హనుమంతరావు, ఆర్డీఓ కృష్ణారెడ్డి వారికి స్వాగతం పలికారు. -
వడ్డెర కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చాలి
తాళ్లగడ్డ (సూర్యాపేట): వడ్డెర కులాన్ని ఎస్టీ జాబితాలో చేర్చడంతో పాటు వడ్డెరులకు రాయి, మట్టిపై ప్రభుత్వం తగిన హక్కులు కల్పించాలని వడ్డెర మేలుకొలుపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆలకుంట్ల బాలకృష్ణ అన్నారు. ఆదివారం సూర్యాపేట పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ‘హలో వడ్డెర–ఛలో సూర్యాపేట’ సభకు ఆయన హాజరై మాట్లాడారు. నిత్యం క్వారీల్లో, మట్టి పనిచేసే వడ్డెర కులస్తులకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలన్నారు. గుట్టలపై క్రషర్ మిల్లులను వడ్డెరులకు కేటాయించాలని కోరారు. వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలు అందేలా చర్యలు చేపట్టాలన్నారు. వయసు పైబడిన వడ్డెర వృత్తిదారులకు పెన్షన్ ఇవ్వాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వడ్డెర కులస్తులకు అధిక సీట్లు కేటాయించాలన్నారు. తమ సమస్యలను పరిష్కరించని ప్రభుత్వాలను గద్దె దింపుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓర్సు రాజు, రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఓర్సు అంజయ్య, కార్యదర్శి రూపని రాజు, పసుల సోమయ్య, కోశాధికారి గోగుల మహేష్, యూత్ అధ్యక్షుడు వరికుప్పల నవీన్, సోషల్ మీడియా ఇన్చార్జి శివరాత్రి గోపి, రాష్ట్ర కమిటీ సభ్యుడు పాల్గొన్నారు. వడ్డెర మేలుకొలుపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆలకుంట్ల బాలకృష్ణ -
ఉరేసుకొని మహిళ ఆత్మహత్య
కోదాడరూరల్: ఆర్థిక పరిస్థితులు బాగోలేక మానసికంగా కృంగిపోయిన మహిళ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన కోదాడ మండలం కూచిపూడి గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. కోదాడ రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోదాడ పట్టణానికి చెందిన నవ్య(22)కు కోదాడ మండలం కూచిపూడికి చెందిన సాయిబాబాతో నాలుగేళ్ల కిందట వివాహం జరిగింది. కుటుంబ ఆర్థిక పరిస్థితులు, మానసికంగా కూడా బాగోలేకపోవడంతో ఆదివారం భర్త బయటకు వెళ్లిన తర్వాత నవ్వ ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు చేసుకుంది. నవ్య కుమార్తె గేటు వద్ద ఏడుస్తూ కనిపించడంతో పక్కింటివాళ్లు వచ్చి ఇంట్లోకి వెళ్లి చూడగా నవ్య విగతజీవిగా కనిపించింది. మృతురాలి తల్లి వెంకటరమణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వడదెబ్బతో దివ్యాంగుడు మృతిపెన్పహాడ్: వడదెబ్బకు గురై దివ్యాంగుడు మృతి చెందాడు. ఈ ఘటన పెన్‌పహాడ్ మండలం అనంతారం గ్రామంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతారం గ్రామానికి చెందిన షేక్ లతీఫ్సాబ్ కుమారుడు ముజీబ్(30) శుక్రవారం సూర్యాపేటలో నిర్వహించిన దివ్యాంగులకు ట్రైసైకిళ్ల పంపిణీ కార్యక్రమానికి ఎండలో వెళ్లి వచ్చి వడదెబ్బకు గురయ్యాడు. అతడిని కుటుంబ సభ్యులు సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందాడు. ఏఐవైఎఫ్ జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా వెంకటేశ్వర్లునల్లగొండ టౌన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతిలో ఈ నెల 15 నుంచి 18 వరకు జరిగిన ఏఐవైఎఫ్ జాతీయ మహాసభల్లో నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో సంఘం నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి తీర్పారి వెంకటేశ్వర్లును ఏఐవైఎఫ్ జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. -
25లోగా కొనుగోళ్లు పూర్తి చేయాలి
భూదాన్‌పోచంపల్లి, వలిగొండ : ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేసి ఈ నెల 25లోపు పూర్తి చేయాలని కలెక్టర్ హనుమంతరావు ఆదేశించారు. ఆదివారం భూదాన్‌పోచంపల్లితో పాటు మండలంలోని జూలూరు, శివారెడ్డిగూడెం, దంతూర్ గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. కొనుగోళ్లు జరుగుతున్న తీరును పరిశీలించారు. ఇప్పటివరకు ఎంత కాంటా చేశారని, ఇంకా ఎన్ని కుప్పలు మిగిలి ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. రికార్డులను పరిశీలించారు. కాంటా చేసిన ధాన్యాన్ని ఎప్పటికపుడు మిల్లులకు పంపించాలని నిర్వాహకులను ఆదేశించారు. నిరంతరం పర్యవేక్షించాలని, సమన్వయంతో పనిచేస్తూ రైతులకు ఇబ్బందులు కలగకుండా తగుచర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. భూదాన్‌పోచంపల్లిలోని పీఏసీఎస్ కేంద్రం వద్ద కొత్తగా వేసిన బోరును కలెక్టర్ పరిశీలించి ముఖం కడుక్కున్నారు. ఆయన వెంట జిల్లా సివిల్సప్లై అధికారిణి రోజా, ఇంచార్జ్ తహసీల్దార్ నాగేశ్వర్రావు, డీటీ బాలమణి, ఎంఆర్ఐ గుత్తా వెంకట్‌రెడ్డి, ఏఆర్ఐ సత్యనారాయణరెడ్డి, పీఏసీఎస్ సీఈఓ సద్దుపల్లి బాల్‌రెడ్డి, ఆర్.నర్సింహ తదితరులు పాల్గొన్నారు. వలిగొండలో.. వలిగొండ మండలం సంగెం గ్రామంలోని ఐకేపీ కేంద్రాన్ని కలెక్టర్ హనుమంతరావు సందర్శించారు. కొనుగోళ్లలో జాప్యం జరగకుండా చూడాలని నిర్వాహకులకు సూచించారు. కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించాలని పేర్కొన్నారు. ఆయన వెంట ఏపీఎం ఝాన్సీ, ఆర్ఐ కరుణాకర్‌రెడ్డి ఉన్నారు. ఫ కలెక్టర్ హనుమంతరావు -
సప్లిమెంటరీకి సన్నద్ధత ఏదీ?
కార్యాచరణ ఇదీ.. ● మండలా వారీగా ఫెయిలైన విద్యార్థులను గుర్తించాలి.●● విద్యార్థి ఏ సబ్జెక్టులో ఫెయిల్ అయ్యాడో ఆ సబ్జెక్ట్‌కు సంబంధించిన ఉపాధ్యాయుడు వారిని దత్తత తీసుకోవాలి. ● విద్యార్థులకువాట్సప్ ద్వారా ముఖ్యమైన అంశాలను వివరించడంతో పాటు చదువుకునేందుకు ముఖ్యమైన అంశాలు ఇవ్వాలి. ● ఎక్కువ మంది ఫెయిలైన పాఠశాల విద్యార్థులకు నేరుగా పాఠశాలకు రప్చించి ప్రత్యేక తరగతులు నిర్వహించారు. కానీ, ఇప్పటి వరకు అమలు కావడం లేదు. భువనగిరి : పదో తరగతి పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులపై దృష్టి కొరవడింది. ఉత్తీర్ణత శాతం మెరుగయ్యేలా అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను సద్విని యోగం చేసుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసినా క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసినప్పటికీ అమలులో జాప్యం జరుగుతోంది. పరీక్షలకు గడువు సమీపిస్తుండడంతో విద్యార్థులే స్వతహాగా పరీక్షలకు సిద్ధమవుతున్నారు. ఫెయిలైన విద్యార్థులు 199 మంది మార్చి 21 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు పదో తరగతి వార్షిక పరీక్షలు జరిగాయి. పరీక్షలకు 8,631 మంది విద్యార్థులు హాజరు కాగా 8,432 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 199 మంది విద్యార్థులు ఫెయిలయ్యారు. ఇందులో ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులు 75 మంది ఉన్నారు. వంద శాతం ఉత్తీర్ణత సాధించాలనే లక్ష్యంతో ఫెయిలైన విద్యార్థులు సప్లిమెంటరీలో పాసయ్యేలా కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని ఉన్నతస్థాయి ఆదేశాలున్నాయి. ఎక్కువగా తెలుగు, గణితంలో.. తెలుగు, గణితం, ఆ తరువాత ఇంగ్లిష్, సైన్స్‌లో ఎక్కువ మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. పరీక్షలకు తక్కువ వ్యవధి జూన్ 14నుంచి 22వ తేదీ వరకు పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. వ్యవధి తక్కువగా ఉండటంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. వృత్యంతర శిక్షణలో ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ ఇస్తున్నారు. వీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు శిక్షణ లోనే ఉంటున్నారు. దీంతో కార్యాచరణ అమలులో జాప్యం జరుగుతుంది. ఫ జూన్ 14నుంచి పదో తరగతిఅడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఫ ఫెయిలైన విద్యార్థుల కోసం ప్రత్యేక కార్యాచరణ సిద్ధం ఫ అమలు చేయడంలో జాప్యం -
చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తాం
చౌటుప్పల్ : రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యంలో చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తామని, ఆందోళన చెందవద్దని అదనపు కలెక్టర్ వీరారెడ్డి పేర్కొన్నారు. చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ యార్డులోని కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం ఆయన సందర్శించి ధాన్యాన్ని పరిశీలించారు. రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకుని భరోసా ఇచ్చారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఇప్పటి వరకు రూ.555 కోట్ల విలువ చేసే 2.70లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, ఈనెల 17వ తేదీ వరకు రూ.470 కోట్లు రైతుల ఖాతాల్లో జమ అయినట్లు తెలిపారు. 375 కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోళ్లు చేపట్టగా, అందులో 100 సెంటర్లలో ధాన్యం సేకరణ పూర్తయినట్లు చెప్పారు. రూ.250 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేస్తామన్నారు. కాంటా వేసిన ధాన్యాన్ని 675 లారీల ద్వారా ఎప్పటికప్పుడు మిల్లులకు ఎగుమతి చేస్తున్నట్లు వెల్లడించారు. చౌటుప్పల్, భూదాన్‌పోచంపల్లి, వలిగొండ, సంస్థాన్‌నారాయణపురం, రామన్నపేట మండలాల్లో వచ్చే నెలలో కూడా కొనుగోళ్లు జరిగే అవకాశం ఉందన్నారు. అంతకుముందు మార్కెట్ యార్డులో ప్యాడీ క్లీనర్ పనితీరు అదనపు కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, సింగిల్‌విండో చైర్మన్ చింతల దామోదర్‌రెడ్డి, తహసీల్దార్ హరికృష్ణ, మార్కెట్ వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి, వ్యవసాయాధికారి ముత్యాల నాగరాజు, మార్కెట్ సెక్రటరీ రవీందర్‌రెడ్డి, పీఏసీఎస్ సీఈవో ఎరుకల రమేష్, పబ్బు రాజుగౌడ్, మొగుదాల రమేష్, బొబ్బిళ్ల మురళి, పబ్బు శ్రీకాంత్, సప్పిడి సంజీవరెడ్డి, ఎండి.గౌస్‌ఖాన్, దాచేపల్లి విజయ్, బోయ వెంకట్, వెంకటేశం, రాజశేఖర్‌రెడ్డి, పాల్గొన్నారు. ఫ అదనపు కలెక్టర్ వీరారెడ్డి -
బెస్ట్ అవైలబుల్ స్కూళ్లకు దరఖాస్తుల ఆహ్వానం
భువనగిరిటౌన్ : 2025–26 విద్యా సంవత్సరానికి గాను బెస్ట్ అవైలబుల్ స్కూళ్ల ఎంపికకు ప్రైవేట్ ఆంగ్ల మాధ్యమ పాఠశాలల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి డీకే వసంతకుమారి ఒక ప్రకటనలో తెలిపారు. పాఠశాల స్థాపించినప్పటి నుంచి ప్రభుత్వ గుర్తింపు పొంది ఉండాలని, గత ఐదేళ్ల నుంచి టెన్త్‌లో 95 శాతానికి తగ్గకుండా ఉత్తీర్ణత నమోదై ఉండాలని, అందులో 50 శాతం మంది ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులై ఉండాలన్నారు. సొంత బిల్డింగ్ కలిగి ఉండాలని, దరఖాస్తుకు పాఠశాల భవనం ఫొటో జతపర్చాలన్నారు. ఫీజు వివరాలు సమర్పించాలన్నారు. పైప్‌లైన్ పనులు ప్రారంభం భువనగిరిటౌన్ : మున్సిపాలిటీల్లో తాగునీటి ఎద్దడిపై ‘పట్టణాల గొంతెండుతోంది’ శీర్షికతో సాక్షిలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని సీతానగర్‌లో పైపులైన్ పనులను ఆదివారం ప్రారంభించారు. గత కొన్నేళ్లుగా పైప్‌లైన్ లేకపోవడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేసవి వచ్చిందంటే ట్యాంకర్లపై ఆధారపడుతున్నారు. పండుగలు, శుభకార్యాల సమయంలో ట్యాంకర్‌కు రూ.700 వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. పైపులైన్ వేస్తుడంతో కాలనీవాసులు అనందం వ్యక్తం చేస్తున్నారు. నేత్రపర్వంగా తిరువీధి సేవ భువనగిరి : పట్టణ పరిధిలోని స్వర్ణగిరి క్షేత్రంలో గల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం రాత్రి స్వామివారికి తిరువీధి సేవ నేత్రపర్వంగా నిర్వహించారు. అంతకుముందు వేకువజామున సుభ్రబాత సేవ, తోమాల సేవ, సహస్రనామార్చన, నిత్యకల్యాణ వేడుక తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మధ్యాహ్నం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. సాయంత్రం స్వామివారికి కర్పూర మంగళహారతులు సమర్పించారు. మంత్రి తుమ్మలను కలిసిన డీసీసీబీ చైర్మన్ నల్లగొండ టౌన్ : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఆదివారం హైదరాబాద్‌లో డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్‌రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. సహకార సంఘాల అభివృద్ధికి సహకారం అందించాలని కోరారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు 50 శాతం సబ్సిడీతో రుణాలు అందేలా ప్రణాళిక సిద్ధం చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని విన్నవించారు. సానుకూలంగా స్పందించిన మంత్రి సహకార సంఘాల బలోపేతానికి తనవంతు సహకారం అందిస్తాని హామీ ఇచ్చారని తెలిపారు. ఆత్మస్థైర్యంతో జీవించాలిభువనగిరి: అంతర్జాతీయ ఎయిడ్స్ కొవ్వొత్తుల స్మారక దినోత్సవాన్ని ఆదివారం భువనగిరిలో జిల్లా వైద్యారోగ్య, హెచ్ఐవీ, టీబీ, లెప్రసీ విభాగాల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎయిడ్స్‌తో మృతిచెందిన వారికి కొవ్వొత్తులతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. ఎయిడ్స్ వచ్చిన వ్యక్తులు ఆత్మస్థైర్యంతో జీవించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీబీ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ సాయిశోభ, ఐసీటీసీ సూపర్వైజర్ డాక్టర్ వంశీకృష్ణ, ముత్యాలు, నర్సింహ, స్కిడ్ సంస్థ ప్రాజెక్టు మేనేజర్ భానుకుమార్, చంద్రమౌళి, సిబ్బంది పాల్గొన్నారు. -
కంటిపాపలకు కష్టమొచ్చింది!
చిరుప్రాయంలోనే షుగర్ వ్యాధి భువనగిరిలోని ఓ యువకుడికి పుట్టుకతోనే డయాబెటిస్ వచ్చింది. వైద్యులు పరిశీలించి టైప్–1 డయాబెటిస్‌గా నిర్ధారించారు. అప్పటి నుంచి ఇన్సులిన్‌ను ఇంజక్షన్ రూపంలో తీసుకుంటున్నాడు. రోజూ ఇంజక్షన్ తీసుకోవాలంటే నరకంగా ఉందని యువకుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇష్టమైన స్వీట్లు తినాలని ఉన్నా.. మనసు చంపుకోవాల్సి వస్తుందని వాపోయాడు. భువనగిరి పట్టణానికి చెందిన నాలుగో తరగతి విద్యార్థి తరచూ అనారోగ్యం బారిన పడుతుండేవాడు. బరువు తగ్గడం, బక్కచిక్కిపోవడం, విపరీతమైన ఆకలి, దాహంతో ఇబ్బందులు పడేవాడు. స్థానిక డాక్టర్లకు చూపించినా ఫలితం లేకపోవడంతో హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్య నిపుణులు.. బాలుడికి టైప్–1 డయాబెటిక్ ఉన్నట్లు నిర్ధారించారు. బాలుడి విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ప్రతి రోజూ తప్పినిసరిగా ఇన్సులిన్ ఇవ్వాలని సూచించారు. అయితే పేదరికం వల్ల ఇన్సులిన్, సంబంధిత పరికరాలు కొనుగోలు చేయలేని పరిస్థితి తల్లిదండ్రులది. మాయ రోగంతో తమ బిడ్డ నరకయాతన అనుభవిస్తున్నాడని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఇటువంటి పరిస్థితిని జిల్లాలో సుమారు 300 మంది చిన్నారులు ఎదుర్కొంటున్నారు. ● -
యాదగిరి క్షేత్రంలో కోలాహలం
యాదగిరిగుట్ట: ఓ వైపు నిత్య పూజా కార్యక్రమాలు, మరోవైపు భారీగా తరలివచ్చిన భక్తుజనులతో యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో కోలాహలం నెలకొంది. ఆదివారం వేకువజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపారు. అనంతరం గర్భాలయంలోని స్వయంభూలు, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం చేసి తులసీదళ అర్చనతో కొలిచారు. ఆ తరువాత ప్రథమ ప్రాకార మండపంలో సుదర్శన నారసింహహోమం ఆగమశాస్త్రం ప్రకారం నిర్వహించారు. అలాగే గజవాహన సేవ, ఉత్సవమూర్తులకు నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, ముఖ మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించారు. ఆయా వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. రాత్రికి శ్రీస్వామి, అమ్మవార్లకు శయనోత్సవం చేసి ఆలయ ద్వారబంధనం చేశారు. -
యాదగిరి కొండపై కార్పెట్లు, మ్యాట్లు
యాదగిరిగుట్ట : ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వచ్చే భక్తులు భానుడి భగభగలకు అల్లాడిపోతున్నారు. మాడ వీధుల్లో పరుగులు తీసే పరిస్థితి ఉంది. సమస్య పరిష్కరించేందుకు నూతన ఈఓ వెంకట్రావ్ చర్యలు చేపట్టారు. ఆలయ పరిసరాలు, క్యూలైన్లు, బస్టాండ్ ప్రాంతంలో పర్యటించి భక్తులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఎండ తీవ్రతకు కాళ్లు కాలుతున్నాయని, పరుగులు తీయాల్సి వస్తుందని ఈఓ దృష్టికి తీసుకెళ్లారు. భక్తుల విజ్ఞప్తుల మేరకు బస్టాండ్, మాడ వీధుల్లో ఆదివారం కాయిర్ మ్యాట్లు, కార్పెట్లు ఏర్పాటు చేశారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడటమే లక్ష్యమని, సమస్యలను గుర్తించి పరిష్కరిస్తానని ఈఓ తెలిపారు. ఫ భక్తులకు కాళ్లు కాలకుండా ఏర్పాటు -
యాదగిరి క్షేత్రానికి పోటెత్తిన భక్తులు
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. వేసవి సెలవులు కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు శనివారం భక్తులు అధికంగా తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు, క్యూలైన్లు, ముఖ మండపం, ప్రసాద విక్రయశాల, ఇతర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి. భక్తులు అధికంగా రావడంతో ధర్మ దర్శనానికి 3గంటలకు పైగా సమయం పట్టగా, వీఐపీ దర్శనానికి గంట సమయం పట్టింది. స్వామిని 40వేలకు పైగా భక్తులు దర్శించుకొని తమ మొక్కులను తీర్చుకున్నారు. వివిధ పూజలతో నిత్యాదాయం రూ.42,32,003 వచ్చినట్లు ఆలయాధికారులు వెల్లడించారు. నృసింహుడి సన్నిధిలో విశేష పూజలు.. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం విశేష పూజలు కొనసాగాయి. వేకువజామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామి, అమ్మవార్లకు సుప్రభాతం నిర్వహించారు. అనంతరం స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, తులసీదళాలతో అర్చన చేశారు. ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం చేపట్టారు. సాయంత్రం జోడు సేవలను మాడ వీధిలో ఊరేగించారు. ఆయా పూజల్లో భక్తులు పాల్గొన్నారు. 40వేలకు పైగా దర్శించుకున్న భక్తులు ధర్మ దర్శనానికి 3గంటలకు పైగా సమయం -
సెలవుల్లో.. కంప్యూటర్ శిక్షణ
తాళ్లగడ్డ (సూర్యాపేట): ఒకప్పుడు వేసవి సెలవులు వచ్చాయంటే చాలు విద్యార్థులు, యువత తమకు ఇష్టమైన క్రీడల్లో శిక్షణ లేదా స్విమ్మింగ్, కరాటే, స్పోకెన్ ఇంగ్లిష్ వంటివి నేర్చుకునేవారు. మరికొందరు సంగీతం, వివిధ రకాల కళలను నేర్చుకునేవారు. కానీ ప్రస్తుత ఆధునిక యుగంలో కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి కావడంతో తల్లిదండ్రులు తమ పిల్లలకు వేసవి సెలవుల్లో కంప్యూటర్ పరిజ్ఞానంపై శిక్షణ ఇప్పించేందుకు ఆసక్తి చూపుతున్నారు. అందుకనుగుణంగానే పట్టణాల్లో కంప్యూటర్ ఇనిస్టిట్యూట్లు విద్యార్థులు, యువతతో కళకళలాడుతున్నాయి. సూర్యాపేట జిల్లా కేంద్రానికి చుట్టుపక్కల గ్రామాల యువత, విద్యార్థులు వేసవి సెలవుల్లో ప్రతిరోజు వచ్చి కంప్యూటర్ ఇనిస్టిట్యూట్లలో చేరి శిక్షణ పొందుతున్నారు. కొందరు ఉపాధి కోసం మరికొందరు ఉన్నత చదువుల కోసం, ఇంకొందరు ఉద్యోగోన్నతి కోసం కంప్యూటర్ శిక్షణ తీసుకుంటున్నారు. ఆకట్టుకుంటున్న నిర్వాహకులు..సూర్యాపేట పట్టణంలో కంప్యూటర్ ఇనిస్టిట్యూట్ల సంఖ్య పెరగడంతో పోటీని తట్టుకునేందుకు పలువురు నిర్వాహకులు ఫీజులో రాయితీ కూడా కల్పిస్తున్నారు. వేసవి కాలం కావడంతో ఎక్కువగా యువత, చిన్నారులు శిక్షణకు వస్తుండటంతో బ్యాచ్‌కు 10 నుంచి 5 మంది చొప్పున, ప్రతిరోజు 10 బ్యాచ్‌ల వరకు నడుపుతున్నారు. నెల రోజులు పాటు ఇచ్చే శిక్షణకు గాను రూ.2000 వరకు తీసుకుంటున్నారు. శిక్షణ అనంతరం పరీక్ష నిర్వహించి కేంద్ర ప్రభుత్వం అనుమతి పొందిన ఐఎస్ఓ సర్టిఫికెట్ అందజేస్తున్నట్లు పలువురు నిర్వాహకులు తెలిపారు. వేసవి సెలవులను సద్వినియోగం చేసుకుంటున్న విద్యార్థులు, యువత క్రీడలతో సమానంగా పిల్లలకు నేర్పించేందుకు ఆసక్తి చూపుతున్న తల్లిదండ్రులుకొన్ని కోర్సులకు మంచి డిమాండ్యువత కంప్యూటర్ కోర్సులో ఎంస్ ఆఫీస్ నేర్చుకునేందుకు ఎక్కువగా ఇష్టపడతారు. ఆ తర్వాత ఫొటోషాప్, డీటీపీ, టాలీ, ఆటో కాడ్ వంటి కోర్సులు నేర్చుకుంటున్నారు. వీటి తర్వాత పీజీడీసీఏ ఆరు నెలల కోర్సు కావడంతో అవసరం ఉన్న వారు మాత్రమే దానిని ఎంచుకుంటారు. శిక్షణ పొందిన వారు కొందరు ఇంటర్నెట్ సెంటర్లలో, కాలేజీలు, ఆస్పత్రుల్లో కంపూటర్ ఆపరేటర్లుగా పనిచేస్తూ జీవనోపాధి పొందుతున్నారు.ఫోన్ వద్దని కంప్యూటర్ క్లాసులకు.. ఇంటి దగ్గర ఫోన్ వాడుతుండటంతో మా అమ్మానాన్నలు ఫోన్‌కి బదులుగా జీవితంలో ఉపయోగపడే కంప్యూటర్ నేర్చుకోమని ఇనిస్టిట్యూటల్లో జాయిన్ చేశారు. కంప్యూటర్ కొంతమేర నేర్చుకున్నాను. చాలా హ్యాపీగా ఉంది. – ఈషాన్, 8వ తరగతి, సూర్యాపేటఉపాధి పొందేందుకు ఉపయోగంవేసవి సెలవులను వృఽథా చేయకుండా ప్రస్తు తం సూర్యాపేట పట్ట ణంలోని ఈసీఎస్ కంప్యూటర్ కోచింగ్ సెంటర్లో టాలీ నేర్చుకుంటున్నాను. కాల వ్యవధి లోగా టాలీపై పట్టుసాధించి ఏదైనా ప్రైవేట్ ఉద్యోగంలో చేరాలనేదే నా లక్ష్యం.. – నసీర్, డిగ్రీ, సూర్యాపేట భవిష్యత్ కోసం.. నేను పదో తరగతి పూర్తి చేశాను. సూర్యాపేట పట్టణానికి 15 కిలోమీటర్ల దూరం ఉన్న గుంజలూరు నుంచి రోజూ వచ్చి కంప్యూటర్ నేర్చుకుంటున్నాను. ఉన్నత చదువుల కోసం, భవిష్యత్‌లో ఉద్యోగ ప్రయత్నాల్లో ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఎంఎస్ ఆఫీస్ నేర్చుకుంటున్నాను. – ప్రదీప్, 10వ తరగతి, గుంజలూరుకంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఏ రంగంలోనైనా కంప్యూటర్ అనుసంధానంగానే పనులు జరుగుతున్నాయి. గతంతో అవసరం ఉంటేనే కంప్యూటర్ నేర్చుకునేవారు.. కానీ నేడు కంప్యూటర్ నేర్చుకొని ఉండటం తప్పనిసరి. శిక్షణ అనంతరం కొంత మందికి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తున్నాము. మా వద్ద శిక్షణ తీసుకున్న వారు కంప్యూటర్ ఆపరేటర్లుగా పనిచేస్తూ ఉపాధి పొందుతున్నారు. – ఎండీ మహ్మద్, కంప్యూటర్ కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు -
డీఎంహెచ్ఓ కార్యాలయంలో విచారణ
సూర్యాపేటటౌన్: క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ నిబంధనలు ఉల్లంఘించి నడుస్తున్న సూర్యాపేట జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రులు, స్కానింగ్ సెంటర్లపై చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి భారీగా అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో సూర్యాపేట కలెక్టరేట్లో గల డీఎంహెచ్ఓ కార్యాలయంలో ప్రజారోగ్యశాఖ ఉన్నతాధికారులు శనివారం తనిఖీలు చేపట్టారు. ఇందుల్లో భాగంగా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బృందం సభ్యులు పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ పర్సనల్ డైరెక్టర్ డాక్టర్ రాథోడ్, డిప్యూటీ సీఎస్ పీసీపీ ఎన్డీటీ డాక్టర్ సుమిత్రా రాణి, డిపూఓ్యటీ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అడ్మిన్ శ్వేతా మోహన్‌లు.. డీఎంహెచ్ఓ కోటాచలాన్ని విచారించారు. పలు విషయాలపై ఆరా తీశారు. సూర్యాపేటలో నాలుగు ఆసుపత్రుల పర్మిషన్‌కు సంబంధించిన అన్ని వివరాలు, సర్టిఫికెట్స్‌ను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బృందం స్వాధీనం చేసుకుంది. వీటి పరిశీలన, చర్యల నిమిత్తం సంబంధిత వివరాలను రాష్ట్ర ఆరోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ రవిచంద్రనాయక్, ప్రిన్సిపల్ సెక్రటరీ పంపిస్తామని అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ రాథోడ్ తెలిపారు. -
ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా..?
● క్యూలైన్లలో భక్తుల సమస్యలు తెలుసుకున్న ఈఓ వెంకట్రావ్ వేసవి సెలవుల్లో శ్రీయాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. శనివారం సుమారు 40వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ఈఓ వెంకట్రావ్ శనివారం క్యూలైన్లలో, మాఢ వీధుల్లో తిరుగుతూ భక్తుల సమస్యలు తెలుసుకున్నారు. ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా అని భక్తులను అడిగారు. ఎండల తీవ్రతకు, ఉక్కపోతకు భక్తులు ఇబ్బందులుపడకుండా ఏర్పాట్లు చేస్తున్నామని ఈవో వెంట్రావ్ పేర్కొన్నారు. కొండ కింద శ్రీసత్యనారాయణస్వామి వ్రత మండపం వెంటనే ఏసీలు బిగించాలని అధికారులను ఆదేశించారు. వ్రత పూజల్లో పాల్గొనే భక్తులకు సామాగ్రీ, రవ్వ ప్రసాదంతో పాటు అదనంగా శ్రీస్వామి వారి శేష వస్త్రం (శెల్లా, కనుము) అందజేసేందుకు ఏర్పాటు చేయాలని ఆధికారులకు చెప్పారు. ఆయన వెంట డిప్యుటీ ఈఓ దోర్బాల భాస్కర్‌శర్మ ఉన్నారు. -
వృద్ధురాలిపై దాడి చేసి ఆభరణాల అపహరణ
నకిరేకల్: వృద్ధురాలిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి ఆమె మెడలోని బంగారు, వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన నకిరేకల్ పట్టణంలో శనివారం జరిగింది. పోలీసులు, బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. నకిరేకలపట్టణంలోని వీటీ కాలనీలో నివాసముంటున్న స్థానిక పీఏసీఎస్ చైర్మన్ నాగులంచ వెంకటేశ్వరరావు తల్లి లక్ష్మమ్మ ఇంటికి శనివారం మధ్యాహ్నం 2.30గంటల సమయంలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు అద్దెకు రూములు కావాలంటూ వచ్చారు. తమ ఇంట్లో అద్దెకు రూములు లేవని లక్ష్మమ్మ వారికి చెప్పింది. తాగడానికి మంచినీళ్లు కావాలని సదరు వ్యక్తులు ఆమెను అడిగారు. దీంతో మంచినీళ్లు ఇచ్చేందుకు లక్ష్మమ్మ ఇంట్లోకి వెళ్తుండగా.. ఆమైపె ఆ ఇద్దరు వ్యక్తులు దాడి చేసి కాళ్లు, చేతులు కట్టివేశారు. లక్ష్మమ్మ కేకలు వేయడంతో ఆమె నోట్లో గుడ్డలు పెట్టి మొహంపై పిడుగుద్దులు గుద్దారు. అనంతరం ఆమె మెడలోని నాలుగు తులాల బంగారు గొలుసులు, చేతులకు ఉన్న వెండి గాజులు లాక్కోని పరారయ్యారు. కొద్దిసేపటి తర్వాత లక్ష్మమ్మ చేతి కట్లు విప్పుకుని కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా సమాచారం అందించింది. వెంటనే ఆమె కూమారుడు వెంకటేశ్వరావు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో సీఐ రాజశేఖర్, ఎస్ఐ లచ్చిరెడ్డి తమ సిబ్బందితో లక్ష్మమ్మ ఇంటికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. చుట్టుపక్కల సీసీ కెమెరాలను పరిశీలించారు. నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి క్లూస్‌టీంతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దుండగుల దాడిలో గాయపడిన లక్ష్మమ్మను నకిరేకల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న లక్ష్మమ్మను స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం పరామర్శించారు. వృద్ధ మహిళలే టార్గెట్..వృద్ధ మహిళలనే టార్గెట్ చేస్తూ కొన్ని రోజులుగా గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం నకిరేకల్ మండలం మర్రుర్ గ్రామంలో పుట్ట చంద్రమ్మ అనే వృద్ధురాలు తన ఇంటి బయట కూర్చోని ఉండగా గుర్తుతెలియన ఇద్దరు యవకులు వచ్చి తన మెడలో ఉన్న రెండున్నర తులాల బంగారు గొలుసు అపహరించారు. -
విత్తనాలు, ఎరువుల కొనుగోళ్లలో జాగ్రత్త
పెద్దవూర: మరో పది, పది హేను రోజుల్లో వానాకాలం సాగు ప్రారంభం కానుంది. రైతులు బోర్లు, బావుల కింద పత్తి విత్తనాలు వేయడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కొందరు రైతులు పత్తి, మిరప విత్తనాలను సైతం కొనుగోలు చేశారు. విత్తనాలు, ఎరువుల కొనుగోళ్లలో రైతులు జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉందని పెద్దవూర మండల వ్యవసాయాధికారి సందీప్‌కుమార్ సూచిస్తున్నారు. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ప్రైవేట్ కంపెనీలు ఆకర్షణీయమైన ప్రకటనలు, ప్రచార ఆర్భాటాలతో రైతులను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు ప్రారంభిస్తున్నాయని, వాటిని చూసి విత్తనాలు కొనుగోలు చేయొద్దని ఆయన పేర్కొన్నారు. విత్తనాలు, పురుగుల మందు ఎంపిక, కొనుగోలులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆయన మాటల్లోనే.. విత్తనాల ఎంపిక..● వ్యవసాయ శాఖ ద్వారా లైసెన్స్ పొందిన డీలర్ల వద్దనే విత్తనాలు కొనుగోలు చేయాలి. ● విత్తనాల కొనుగోలు రశీదులపై నంబర్, విత్తన రకం, కొనుగోలు తేదీ, డీలర్ సంతకం, రైతు సంతకం ఉండేలా చూసుకోవాలి. ● గడువు దాటిన విత్తనాలు, వదులుగా, చిరిగిన ప్యాకెట్లు, తెరిచిన డబ్బాల నుంచి ఇచ్చిన ప్యాకెట్లు కొనుగోలు చేయొద్దు. ● రశీదుపై విక్రయదారుడి పేరు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అమ్మకాల పన్ను నంబర్, విక్రయదారుడి గ్రామం పేరు, సంతకం, తేదీలు, విత్తన రకం పేర్లు, బ్యాచ్ నంబర్, గడువు తేదీలు, నికర తూకం, నికర ధర, కంపెనీ పేరు తప్పనిసరిగా నమోదు చేయాలి. ● కొనుగోలు చేసిన సరుకును డీలర్ వద్ద తూకం వేయించాలి. ● మొలకెత్తే దశ, పూత దశలో పంటలో లోపం కనిపిస్తే వ్యవసాయశాఖ అధికారి, శాస్త్రవేత్తలను సంప్రదించాలి. ● విత్తనాలు కొనుగోలు చేసిన రశీదును పంట కాలం పూర్తయ్యే వరకు జాగ్రత్తగా ఉంచుకోవాలి. ● విత్తనాలు తీసుకున్న వెంటనే మొలక శాతాన్ని చూసుకోవాలి. మొలక శాతం సంతృప్తికరంగా ఉన్న వాటినే విత్తనాలుగా వాడాలి. పురుగు మందుల ఎంపిక..● పంటలో చీడపీడల ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు సూచించిన పురుగుల మందులు కొనుగోలు చేయాలి. ● అవసరానికి మించి కొనుగోలు చేసిన, నిల్వ ఉంచిన పురుగుల మందులను వాడొద్దు. లైసెన్స్ ఉన్న దుకాణాల్లోనే కొనుగోలు చేయాలి. ● పురుగు మందు డబ్బాలపై చక్రాకారంలో పురుగు మందు స్థాయిని తెలిపే రంగులు ఉంటాయి. అత్యంత విషపూరితమైతే నీలం రంగు, స్వల్ప విషపూరితమైతే ఆకుపచ్చ రంగు గుర్తులు ఉంటాయి. ● పురుగు మందులు రెండు, మూడు రకాలు కలిపి వాడకూడదు. వాడిన డబ్బాలు, సీసాలు ధ్వంసం చేసి గుంతలో పూడ్చిపెట్టాలి. ● ఒక పంటకు వాడిన పురుగుల మందును మరో పంటకు శాస్త్రవేత్తల సూచనల మేరకు వాడాలి. ఎరువుల ఎంపిక..● లైసెన్స్ కల్గిన దుకాణాల్లోనే ఎరువులు కొనుగోలు చేయాలి. బిల్లులు, ఖాళీ సంచులను పంట కాలం పూర్తయ్యే వరకు జాగ్రత్తగా ఉంచుకోవాలి. ● మిషన్ కుట్టుతో ఉన్న ఎరువుల సంచులు మాత్రమే వాడాలి. ఒకవేళ చేతికుట్టుతో ఉంటే సీసం సీల్ ఉందో లేదో చూసుకోవాలి. ప్రామాణిక పోషకాల వివరాలు, ఉత్పత్తి సంస్థ, ఉత్పత్తిదారుడి పేరు కచ్చితంగా ఉండాలి. ● ఎరువులు కొనుగోలు చేసే సమయంలో డీలర్ రికార్డులో రైతులు విధిగా సంతకం చేయాలి. ఎరువుల నాణ్యతపై రైతులకు ఏమైనా అనుమానం ఉంటే వెంటనే వ్యవసాయ అధికారి సహకారంతో పరీక్షలకు పంపాలి. ● చిల్లులు పడి, చిరిగిన ఎరువుల బస్తాలు కొనుగోలు చేయొద్దు. ఇతర పదార్థాలు కలిస్తే ఆ ఎరువును కల్తీగా గుర్తించాలి. కంపెనీల ప్రకటనలు చూసి రైతులు మోసపోవద్దుకల్తీలను గుర్తించండిలా.. యూరియా, కాల్షియం, అమ్మోనియం, నైట్రేట్ వంటి ఎరువులు గుళికల రూపంలో ఉంటాయి. ఎరువులు ఇసుక రేణువుల రూపంలో, పొటాష్, సూపర్ ఫాస్పేట్ పొడి రూపంలో ఉంటాయి. 5 మిల్లీలీటర్ల నీటిలో చెంచా ఎరువును వేసి బాగా కలపాలి. ఇది స్వచ్ఛమైన ద్రావణంగా తయారైతే నాణ్యమైన ఎరువుగా గుర్తించవచ్చు. యూరి యా, అమ్మోనియా క్లోరైడ్ ఎరువుల పరీక్షకు 10 మిల్లీలీటర్ల పరిశుభ్రమైన నీటిని వినియోగించాలి. యూరియా వంటి ఎరువును ఒక చెంచాను ఐదు మిల్లీలీటర్ల పరిశుభ్రమైన నీటిలో వేసి బాగా కలిపితే అడుగున మట్టి చేరితే కల్తీగా గుర్తించాలి. కొన్ని కాంప్లెక్స్ ఎరువులను ఇదే పద్దతిలో పరీక్షిస్తే ఇసుక రేణువులు వచ్చే అవకాశం ఉంది. అలా వచ్చినా కల్తీ ఎరువుగా గుర్తించాలి. -
విజ్ఞానం.. వినోదం.. వికాసం
కంప్యూటర్‌పై అవగాహన ఏర్పడింది ఆత్మకూర్(ఎం) కేజీబీవీలో 9వ తరగతి పూర్తిచేశాను. అమ్మాయిలకు సమ్మర్ క్యాంప్ ద్వారా కోర్సులు నేర్పిస్తున్నారని మా టీచర్ చెపితే ఇక్కడ జాయిన్ అయ్యాను. క్యాంప్ ద్వారా కంప్యూటర్లో బేసిక్, స్పీడ్ మ్యాథ్స్, డ్యాన్స్ నేర్చుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. –జ్యోత్స్న, ఆత్మకూర్(ఎం) కేజీబీవీ ఫ్రెండ్స్సర్కిల్ పెరిగింది మాది సూర్యాపేట. చౌటుప్పల్ కేజీబీవీలో చదువుతున్నా. వేసవి సెలవుల్లో ఇంటికి వెళ్లలేదు. ఆడుతూ పాడుతూ సమ్మర్‌క్యాంప్ ద్వారా డ్రాయింగ్, మ్యుజిక్, మ్యాథ్స్, స్పోకెన్ ఇంగ్లిష్ నేర్చుకుంటున్నందుకు ఆనందంగా ఉంది. అన్ని కేజీబీవీల విద్యార్థులు రావడంతో మంచి ఫ్రెండ్స్ సర్కిల్ కూడా పెరిగింది. – తేజస్వి, చౌటుప్పల్ సంగీతం నేర్చుకుంటున్నా నేను 9వ తరగతి పూర్తి చేశాను. అంతకుముందు సంగీతం గురించి కనీస పరిజ్ఞానం లేదు. ఇక్కడికి వచ్చిన తరువాతనే సరిగమలు, క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకున్నా. మా తల్లిదండ్రులు కూడా నన్ను ప్రోత్సహించి పంపించారు. వేసవి సెలవులు వృథా కాకుండా కొత్త కోర్సులను నేర్చుకున్నందుకు సంతోషంగా ఉంది. –అక్షిత, బొమ్మలరామారం కేజీబీవీ విద్యార్థినులకు వేసవి శిక్షణ ఫ ఆత్మవిశ్వాసం, నైపుణ్యం పెంచే కోర్సులకు ప్రాధాన్యం ఫ వసతి, భోజన సదుపాయం ఫ 120 మంది బాలికలు హాజరు ఫ జలాల్పురం కేజీబీవీలో ఈనెల 19 వరకు సమ్మర్ క్యాంప్ భూదాన్‌పోచంపల్లి : వేసవి శిక్షణ శిబిరాలు విద్యార్థులకు విజ్ఞానంతో పాటు వినోదం పంచుతున్నాయి. భూదాన్‌పోచంపల్లి మండలం జలాల్పురంలోని కస్తూరిబాగాంధీ బాలికల విద్యాలయంలో ఈ నెల 5వ తేదీ నుంచి జిల్లావ్యాప్తంగా ఉన్న కస్తూరిబాగాంధీ బాలికల విద్యాలయాల విద్యార్థులకు ఉచితంగా పలు కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు. విద్యార్థులు ఉత్సాహంగా, ఉల్లాసంగా పాల్గొంటూ వేసవి సెలవులను సద్వినియోగం చేసుకుంటున్నారు. 11మండలాల నుంచి విద్యార్థినుల రాక భూదాన్‌పోచంపల్లి, భువనగిరి, వలిగొండ, చౌటుప్పల్, సంస్థాన్‌నారాయణపురం, బొమ్మలరామారం, తుర్కపల్లి, ఆత్మకూర్(ఎం), గుండాల, మోత్కూర్, అడ్డగూడురు మొత్తం 11 మండలాల కేజీబీవీల నుంచి 120 మంది బాలికలు శిక్షణలో పాల్గొంటున్నారు. 15 రోజుల పాటు ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు శిక్షణ ఇస్తున్నారు. డ్రాయింగ్, క్రాప్ట్ మెటీరియల్, పుస్తకాలు వారే అందిస్తున్నారు. అలాగే మెనూ ప్రకారం ఉచిత భోజన సదుపాయం కల్పించారు. నిపుణులతో శిక్షణ ఇప్పిస్తున్నాం జలాల్పురం కేజీబీవీలో 11 మండలాలకు చెందిన 120 మంది విద్యార్థినులకు వివిధ కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నాం. శారీరక ధృఢత్వం, మానసిక వికాసం, నైపుణ్యాలు పెంపొందించే కోర్సులలో ప్రత్యేక శిక్షకుల ద్వారా శిక్షణ అందిస్తున్నాం. ఆటపాటలతో నేర్చుకోవాలన్నదే ముఖ్య ఉద్దేశం. పాఠశాలలు పునః ప్రారంభించేనాటికి పిల్లలు మాససికంగా రీఫ్రెష్ కావడానికి సమ్మర్ క్యాంపు దోహదపడుతుంది. –ఇందిర, జలాల్పురం కేజీబీవీ ప్రత్యేక అధికారిణి ఈ కోర్సుల్లో శిక్షణ కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు గణిత సమస్యలను సులభంగా సాధించే మెళకువలు (రీజనింగ్ మ్యాథ్స్), మెంటల్ ఎబిలిటీ, పోటీ పరీక్షల ప్రిపరేషన్, స్పోకెన్ ఇంగ్లిష్ నేర్పిస్తూ విజ్ఞానం ఆత్మవిశ్వాసం పెంపొందిస్తున్నారు. అదేవిధంగా డ్రాయింగ్, క్రాప్ట్, క్లాసికల్ డ్యాన్స్, మ్యూజిక్, యోగా, క్రీడలతో పాటు లలితకళలలో శిక్షణ ఇస్తూ విద్యార్థులలో శారీక, మానసిక ఉల్లాసం కల్గించేలా శిక్షణ ఇస్తున్నారు. -
భూములు కోల్పోయే రైతులకు న్యాయం చేస్తాం
తుర్కపల్లి: గందమల్ల రిజర్వాయర్‌లో భూములు కోల్పోయే రైతులకు న్యాయం చేసేందుకు కృషి చేస్తామని ఆర్డీఓ కృష్ణారెడ్డి అన్నారు. శనివారం తుర్కపల్లి మండలం గంధమల్ల రైతులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలు సేకరించడంతో పాటు పరిహారంపై చర్చించారు. రిజర్వాయర్‌లో భూములు కోల్పోయే ప్రతి రైతుకు మెరుగైన పరిహారం అందేలా చూస్తామన్నారు. రిజర్వాయర్ నిర్మాణం కోసం వెయ్యి ఎకరాలు సేకరించాల్సి ఉందని, రైతులు సహకరించాలని కోరా రు. ఈ సమావేశంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జయశ్రీ, తహసీల్దార్ దేశ్యానాయక్, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు. జీపీఓ పరీక్షకు 151 మంది అర్హులు సాక్షి, యాదాద్రి: గ్రామ పాలన అధికారుల (జీపీఓ) ఎంపిక ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. ఇందులో భాగంగా పూర్వపు వీఆర్ఓలు, వీఆర్ఏలకు పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో 321 రెవెన్యూ గ్రామాలు ఉండగా జీపీఓ పోస్టుల కోసం 189 మంది ధరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తులను పరిశీలించిన అధికారులు.. 151 మందిని పరీక్షకు అర్హులుగా తేల్చారు. ఈనెల 25న జీపీఓ పరీక్ష జరగనుంది. 2022 ఆగస్టులో 212 మంది వీఆర్ఓలు, 2023 ఆగస్టులో 510 మంది వీఆర్ఏలను ఇతర శాఖలకు బదిలీ చేశారు.ముగిసిన వృత్యంతర శిక్షణ భువనగిరి : బోధన మెరుగుపరిచేందుకు ఉపాధ్యాయులకు జిల్లా కేంద్రంలోని బీచ్మహాల్లా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గణితం, ఇంగ్లిష్, సాంఘిక శాస్త్రంలో ఇస్తున్న వృత్యంతర శిక్షణ శనివారం ముగిసింది. ఈ సందర్భంగా ఏ ర్పాటు చేసిన కార్యక్రమానికి డీఈఓ సత్యనారా యణ హాజరై మాట్లాడారు. ఉపాధ్యాయులు శిక్షణలో నేర్చుకున్న మెళకువలను విద్యార్థులకు ఉపయోగపడేలా బోధన చేయాలన్నారు. అనంతరం ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో కోర్సుల ఇంచార్జి ఎం.భాస్కర్, డీఆర్పీలు బుచ్చిరెడ్డి, శ్రీధర్, నరేంద్రస్వామి, వెంకన్న, రఘు తదితరులు పాల్గొన్నారు. గౌస్‌కొండ టీచర్‌కు కీర్తిరత్న పురస్కారం భూదాన్‌పోచంపల్లి : భూదాన్‌పోచంపల్లి మండలం గౌస్‌కొండ గ్రామానికి చెందిన కవి, ఉపాధ్యాయుడు డాక్టర్ పాండాల మహేశ్వర్ కీర్తి రత్న పురస్కారానికి ఎంపికయ్యారు. పెద్దపల్లి జిల్లా మంథనిలోని గౌతమేశ్వర సాహితీ కళా సేవాసంస్థ 5వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని కళా,సేవా రంగాల్లో సేవలందిస్తున్న వారికి కీర్తిరత్న పురస్కారాలతో సత్కరిస్తుంది. అందులో భాగంగానే విద్యారంగంలో విశిష్ట సేవలందిస్తున్న డాక్టర్ పాండాల మహేశ్వర్ పురస్కారానికి ఎంపికయ్యారు. కాగా ఆదివా రం మంథనిలోని జానకిరామ కల్యాణవేదికలో నిర్వహించే కార్యక్రమంలో ఆయనకు స్వర్ణకంకణం తొడిగి శాలువా కప్పి, మెమొంటో, పురస్కారం అందజేయనున్నారు. పురస్కారం వచ్చినందుకు ఆనందంగా ఉందని మహేశ్వర్ తెలిపారు. పాండాల మహేశ్వర్‌ను మాజీ సర్పంచ్ పక్కీరు లావణ్యదేవేందర్రెడ్డి, నేతాజీ యువజన సమాఖ్య అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి, కార్యదర్శి మల్లేశం, మన్నె శ్రీనివాస్‌రెడ్డి, వెంకన్న, శ్రీనివాస్, అశోక్, నర్సింహ, చెక్క శ్రీను తదితరులు అభినందించారు. 22న భువనగిరి మీదుగా స్పెషల్ టూరిస్ట్ రైలు భువనగిరి : జిల్లా కేంద్రం భువనగిరి మీదుగా ఈనెల 22వ తేదీన స్పెషల్ టూరిస్ట్ రైలు వెళ్లనుందని సౌత్‌సెంట్రల్ జోన్ జాయింట్ టూరి జం జనరల్ మేనేజర్ కిషోర్ సత్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 12 గంటలకు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి టూరిస్ట్ రైలు బయలుదేరి భువనగిరి, జనగామ, కాజీ పేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం మీదుగా విజయవాడకు చేరుకుంటుందన్నారు. టూర్ ప్యాకేజీ రూ.14,250 ఉంటుందన్నారు. రైలులోని ప్రతి కోచ్ సౌకర్యాలు ఉంటాయన్నా రు. అలాగే పర్యాటక ప్రాంతాల్లో భోజనం, వసతి సౌకర్యం కల్పిస్తారని పేర్కొన్నారు. భారత్ స్పెషల్ టూరిస్ట్ రైలు ద్వారా అరుణాచలం, రా మేశ్వరం, మధురై, శ్రీరంగం ప్రాంతాలకు వెళ్లవచ్చన్నారు. వివరాలకు 9701360701, 92810 30712ను సంప్రదించాలని కోరారు. -
సీఎంఆర్‌లో అగ్రస్థానంలో నిలుపుదాం
సాక్షి,యాదాద్రి : కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) డెలివరీ వేగవంతం చేసి జిల్లాను అగ్రస్థానంలో నిలుపుదామని, అందుకు అధికారులు, మిల్లర్లు కృషి చేయాలని అదనపు కలెక్టర్ వీరారెడ్డి(రెవెన్యూ) కోరారు. శనివారం కలెక్టరేట్లో ఎఫ్‌సీఐ, సివిల్ సప్లయ్ అధికారులు, మిల్లర్లతో సమావేశం అయ్యారు. కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ ముమ్మరంగా జరుగుతుందని, అదే స్థాయిలో సీఎంఆర్ ఇవ్వాలని మిల్లర్లకు సూచించారు. ఎఫ్‌సీఐ గోదాములలో దిగుమతి సమస్య తలెత్తకుండా సరిపడా హమాలీలను ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. తగినన్ని గోదాములు కేటాయించడంతో పాటు అవసరం మేరకు రైల్వే వ్యాగన్లు ఏర్పాటు చేస్తే గడువులోపు 3 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ప్రభుత్వానికి అందజేస్తామని మిల్లర్లు తెలిపారు. సమావేశంలో ఎఫ్‌సీఐ ఏరియా మేనేజర్ శ్రీ సువిస్కుమార్, సివిల్ సప్లై జిల్లా మేనేజర్ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. రాజీవ్ యువ వికాసంపై సమీక్ష రాజీవ్ యువ వికాసం పథకం అమలుకు తీసుకుంటున్న చర్యలపై అదనపు కలెక్టర్ వీరారెడ్డి శనివారం కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలని ఆదేశించారు. ఇంటర్ సప్లిమెంటరీకి పటిష్ట ఏర్పాట్లు భువనగిరి : ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు పటిష్ట ఏర్పాటు చేయాలని అదనపు కలెక్టర్ వీరారెడ్డి ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ నుంచి సంబంధిత అధికారులతో జూమ్ సమావేశం ఏర్పాటు చేసి ఏర్పాట్లపై సమీక్షించారు. పరీక్ష సమయంలో కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని, జిరాక్స్ సెంటర్లను మూసివేయించాలని సూచించారు. ఫ అదనపు కలెక్టర్ వీరారెడ్డి -
ధాన్యం తరలింపులో జాప్యం చేయొద్దు
వలిగొండ : కొనుగోలు కేంద్రాల్లో కాంటా వేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హనుమంతరావు అధికారులను ఆదేశించారు. శనివారం వలిగొండ మండలంలోని ప్రొద్దుటూరు, ఏదుళ్లగూడెం, నాతాళ్లగూడెంలో కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. వర్షాలు కురుస్తున్నందున ధాన్యాన్ని కేంద్రాల్లో నిల్వ ఉంచటానికి వీల్లేదన్నారు. జాప్యం చేయకుండా మిల్లులకు ఎగుమతి చేయాలని సూచించారు. ఎగుమతి చేసిన ధాన్యం వివరాలను ఏరోజుకారోజు ట్రక్‌షీట్ కట్ చేసి రికార్డుల్లో నమోదు చేయాలని సూచించారు. రైతులతో మాట్లాడి కొనుగోలు కేంద్రాల్లో సమస్యలపై ఆరా తీశారు. ధాన్యం తడవకుండా ధాన్యం రాశులపై ముందుస్తుగా టార్పాలిన్లు ఏర్పాటు చేసుకోవాలని వారికి సూచించారు. ఆయన వెంట వెంట రెవెన్యూ అధికారులు ఉన్నారు. ఫ కలెక్టర్ హనుమంతరావు -
తెలంగాణ ఉద్యమాన్ని రాజేసింది కళాకారులే..
యాదగిరిగుట్ట: కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ ఉద్యమ కళాకారులందరికీ న్యాయం జరుగుతుందని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. శనివారం యాదగిరిగుట్ట పట్టణంలో నిర్వహించిన తెలంగాణ ఉద్యమ కళాకారుల ఆత్మీయ సమ్మేళనంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమాన్ని రాజేసింది కళాకారులేనన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కళాకారులు లేకుండా ఏసభ జరగదన్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సాంస్కృతిక సారధిలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఉద్యోగం కల్పించే విధంగా కృషి చేస్తానన్నారు. కళాకారులకు ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ యువ వికాసం పథకంలో ప్రాధాన్యమిస్తామని హామీ ఇచ్చారు. అంతకుముందు కళాకారులు ర్యాలీ నిర్వహించారు. సభా వేధికపై గద్దర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కళాకారుడు గణేష్ అధ్యక్షతన జరిగిన సమ్మేళనంలో వైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కాల్వ సుజాత, ఏపూరి సోమన్న, కళాకారులు పాల్గొన్నారు. ఫ ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య -
కొనుగోళ్లు వేగవంతం చేయాలని ధర్నా
వలిగొండ : ధాన్యం కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ వెల్వర్తి రైతులు శనివారం వలిగొండ మండల కేంద్రంలో రాస్తారోకో చేశారు. వెల్వర్తిలోని కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకువచ్చి నెలరోజులు గడిచినా కాంటా వేయడం లేదన్నారు. లారీలు, హమాలీల కొరత సాకు చూపించి ఆలస్యం చేస్తున్నారని పేర్కొన్నారు. అకాల వర్షాలకు ధాన్యం తడుస్తుందని, తరుచుగా ఆరబెట్టాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని కోరారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రైతులతో చర్చలు జరిపారు. అధికారులతో మాట్లాడి కొనుగోళ్లు వేగవంతం చేయడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. ఈ కార్యక్రమంలో కల్కూరి చంద్రయ్య, కల్కూరి శ్రీను, బాలస్వామి, రోమన్, పాముల చంద్రయ్య, బోడిగ జోగయ్య, బత్తేపు శ్రీను, కొండూరు సత్తయ్య పాల్గొన్నారు. -
బహుజనుల విప్లవ కెరటం మారోజు వీరన్న
తుంగతుర్తి: బహుజనుల విప్లవ కెరటం మారోజు వీరన్న అని ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు. వీరన్న వర్ధంతి సందర్భంగా శుక్రవారం మండల పరిధిలోని కొత్తగూడెంలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వీరన్న విజ్ఞాన కేంద్రం ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మారోజు వీరన్న సతీమణి మారోజు చైతన్య, కుమార్తె మారోజు దిశ, కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు తిరుమలప్రగడ అనురాధ కిషన్ రావు, మార్కెట్ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దొంగరి గోవర్ధన్, పూసపల్లి భిక్షం, మల్లేష్, రామచంద్రు, మంగళపల్లి నాగరాజు, కాసర్ల గణేష్, పరమేష్, వివిధ ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మందుల సామేలు -
వానాకాలం సాగుకు సిద్ధమవ్వండిలా..
పంట మార్పిడి తప్పనిసరి ఒకే భూమిలో ఏటా ఒకే పంటను కాకుండా పంట మార్పిడి చేసుకోవాలి. రైతులు ఒకే రకమైన పంటను వరుసగా సాగు చేస్తూ దిగుబడులు రాక నష్టపోతున్నారు. ఒకే పంటను ఏళ్ల తరబడి పండించడం వల్ల చీడపీడలకు ఎప్పుడూ ఆహారం సమృద్ధిగా లభించి అవి వృద్ధి చెందుతాయి. పంట వేర్లు వ్యాపించిన మేర భూమి పొరలు నిస్సారమవుతాయి. పంట మార్పిడి నేలసారాన్ని కాపాడుకోవడంతోపాటు తేమను సమర్ధవంతంగా వినియోగించుకోవచ్చు. వివిధ రకాల వేరు వ్యవస్ధలు కలిగి భిన్నంగా పెరిగే పైర్లను పంట మార్పిడి కోసం ఎంపిక చేసుకోవాలి. పత్తి, ఆముదం, పొద్దు తిరుగుడు వంటి పైర్లు నేల లోపలి నుంచి పోషకాలు తీసుకుంటాయి. పోషకాలు ఎక్కువగా తీసుకునే నువ్వులు, పొద్దు తిరుగుడు వంటి పంటలకు భూమికి పోషకాలు సమకూర్చే అవసరాల పైర్లతో పంట మార్పిడి చేసుకోవాలి. ఇవి బెట్ట పరిస్థితులను తట్టుకుంటాయి. వరుసగా పప్పుధాన్యాల పంటలు కాకుండా నూనె పంటలు సాగు చేయాలి. టమాట, వేరుశనగ, పంటలను ఆశించే లద్దె పురుగు నివారణకు జొన్న, సజ్జ, రాగి ఎర పంటలుగా వేసుకోవాలి.పెద్దవూర: వానాకాలం సీజన్ సమీపిస్తుండటంతో రైతులు వ్యవసాయ పనులకు సన్నద్ధమవుతున్నారు. వేసవి దుక్కులు, భూసార పరీక్షలు, నేల స్వభావాన్ని బట్టి పంటల సాగు ఇతర సాగు విధానాలపై రైతులు మెళకువలు, అవగాహన కలిగి ఉండాలని, వేసవి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని పెద్దవూర మండల వ్యవసాయాధికారి సందీప్‌కుమార్ పేర్కొంటున్నారు. లోతు దుక్కులతో మేలు లోతు దుక్కులు దున్నినప్పుడు భూమిలో ఉండే పురుగులు, తెగుళ్లను నశింపజేసే అవకాశం ఉంటుంది. భూమిలో దాగి ఉన్న లేదా నిద్రావస్థలో ఉన్న పురుగులు, తెగుళ్లను కలుగజేసే శిలీంద్రాలకు సూర్యరశ్మి సోకి నశిస్తాయి. దుక్కిలో బయట పడిన గుడ్లు, ప్యూపాలను పక్షులు తిని నాశనం చేస్తాయి. అందుకే తొలకరిలో వేసే పైర్లకు వీటి తాకిడి తగ్గడానికి అవకాశం ఉంటుంది. భూమిలో 9 అంగుళాల వరకు లోతు తగ్గకుండా దుక్కులు దున్నుకోవడం శ్రేయస్కరం. కలుపు నిర్మూలన తుంగ, గరిక వంటి కలుపు మొక్కలు పొలాల్లో పెరిగి పంటలు నాశనం చేస్తాయి. దీనివల్ల భూసారం తగ్గడమేకాకుండా భూమిలోని లోతైన పొరల్లో తేమ తగ్గుతుంది. తుంగ, గరికల వేర్లు దుబ్బుగా ఉండి నేలలో బాగా విస్తరించి ఉండటం వల్ల నివారణ కష్టం అవుతుంది. వేసవిలో బాగా దుక్కి దున్నినప్పుడు ఈ కలుపు వేర్లు , దుంపలు ఏరడంతో వీటిని అరికట్టవచ్చు. వేసవిలో లోతుగా దున్ని తొలకరి వర్షాలకు గొర్రు, గుంటులతో దున్నినప్పుడు నేల బాగా గుల్ల బారుతుంది. పైర్ల వేర్లు బాగా విస్తరించడానికి అనుకూలంగా ఉంటుంది. నేలకోతకు గురికాకుండా వాలుకు అడ్డంగా దున్నడం, వర్షపు నీటికి ప్రవాహానికి అడ్డంగా చిన్నపాటి మట్టి, రాతి కట్టడాలు ఏర్పాటు చేసుకోవాలి. గత ఖరీఫ్‌కు సంబందించి పొలాల్లో ఉన్న ప్రత్తి, కంది, ఆముదం కట్టెలను తొలగించి పొలంలోనే కాల్చివేయాలి. భూసార పరీక్షల ఆధారంగా పంటలు రైతులు ముఖ్యంగా పండ్లతోటలు సాగు చేసే రైతులు భూసార పరీక్షలు చేయించి పంటలు సాగు చేసుకోవాలి. లేకపోతే ఐదేళ్ల వరకు పెంచి కాపు కొచ్చే దశలోనే క్షీణించి రైతుకు పెట్టుబడి నష్టపోయే ప్రమాదం ఉంది. భూసార పరీక్షలు ద్వారా తమ నేల ఏ పంటలకు అనూకూలమో నిర్ధారించుకోవాలి. -
నల్లగొండలో కార్డన్ సెర్చ్
నల్లగొండ: నల్లగొండ పట్టణంలో గురువారం అర్ధరాత్రి నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. గురువారం రాత్రి 11 గంటల నుంచి శుక్రవారం ఉదయం 7 గంటల వరకు పట్టణంలోని మాన్యంచెల్కలో సుమారు 500 ఇళ్లలో ఆకస్మిక తనిఖీలు చేశారు. 8 మంది సీఐలు, 24 మంది ఎస్ఐలు, 80 మంది కానిస్టేబుళ్లు మొత్తం 320 మందితో తనిఖీలు నిర్వహించారు. జార్ఖండ్, ఉత్తర ప్రదేశ్, బిహార్, ఒడిశా రాష్ట్రాల నుంచి ఇక్కడకు వచ్చి వలస ఉంటున్న వారిని గుర్తించారు. అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరి వివరాలు సేకరించి వారి ఆధార్ కార్డులతో ఆన్లైన్లో విచారణ చేశారు. నలుగురు రౌడీ షీటర్లతోపాటు 30 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వీరందరికీ గంజాయి పరీక్షలు నిర్వహంచగా ఎనమిది మందికి పాజిటివ్ వచ్చింది. అదేవిధంగా ధ్రువపత్రాలు లేని 165 వాహనాలను, నాలుగు ఆటోలను సీజ్ చేశారు. అక్రమంగా ఎయిర్లేన్ కలిగిన వ్యక్తితోపాటు గాంజా చాక్లెట్లను అదుపులోకి తీసుకున్నారు. వారికి కౌన్సిలింగ్ నిర్వహించి మరోసారి నాకాబందీలో దొరికితే జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. అనుమానం వస్తే సమాచారం ఇవ్వాలికమ్యూనిటీ కాంటాక్టులో భాగంగా నల్లగొండ పట్టణంలో కార్డన్ సెర్చ్ నిర్వహించినట్లు ఎస్పీ శరత్ చంద్రపవార్ తెలిపారు. శుక్రవారం ఆయన స్థానికంగా మీడియాతో మాట్లాడారు. కాలనీల్లో, ఇంటి ప్రదేశాల్లో అనుమానిత వ్యక్తులు కనబడితే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని కోరారు. పట్టణాన్ని నేర రహితంగా తీర్చిదిద్దడంతోపాటు ప్రజలకు శాంతిభద్రతలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో గంజాయిని అరికట్టేందుకు మూడు దశల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఎక్కడైనా గంజాయి తాగుతున్నట్లు, రవాణా చేస్తున్నట్లు తెలిస్తే డయల్ 100, పోలీసులకు సమాచారం ఇవ్వాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. కార్యక్రమంలో డీఎస్పీలు, సీఐలు ఏమిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, రాఘవరావు, ఆదిరెడ్డి, కొండల్ రెడ్డి, నాగరాజు, రాజశేఖర్, ట్రాఫిక్ సీఐ మహాలక్ష్మయ్య, సీఐ కరుణాకర్, ఎస్ఐలు సైదాబాబు, వై.సైదులు, శంకర్, గోపాల్‌రావు, సందీప్ రెడ్డి, మానస పాల్గొన్నారు. ధ్రువపత్రాలు లేని 165 ద్విచక్ర వాహనాలు, నాలుగు ఆటోలు సీజ్ -
సీఎం సమీప బంధువు మృతి
మునుగోడు : సీఎం రేవంత్ రెడ్డి సమీప బంధువు వరుసకు మామ అయిన వెదిర మధుసూదన్‌రెడ్డి(95) శుక్రవారం అనారోగ్యంతో మృతి చెందారు. మునుగోడు మండలంలోని కొంపల్లి గ్రామానికి చెందిన మధుసూదన్‌రెడ్డి భార్య పూలమ్మ చెల్లెలు సూదిని పారిజాత, సీఎం సతీమణి తల్లి అక్కాచెల్లెలు. కాగా.. మధుసూదన్‌రెడ్డి గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుండగా హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందించారు. శుక్రవారం ఆయన మృతిచెందడంతో అంత్యక్రియల నిమిత్తం మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చారు. మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు ఇతర నాయకులు మధుసూదన్‌రెడ్డి మృతదేహానికి నివాళులర్పించారు. శనివారం జరగనున్న అంత్యక్రియలకు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నట్లు తెలిసింది. చెరువుగట్టులో కొబ్బరికాయల షాపు సీజ్నార్కట్పల్లి : నార్కట్‌పల్లి మండలం చెరువుగట్టు గ్రామంలోని శ్రీపార్వతీ జడల రామలింగేశ్వరస్వామి ఆలయం వద్ద ఉన్న కొబ్బరి కాయల షాప్‌కు టెండర్‌కు సంబంధించి రూ.19లక్షలు పెండింగ్ ఉండటంతో శుక్రవారం దేవదాయ శాఖ ఆధ్వర్యంలో సీజ్ చేశారు. రామలింగేశ్వరస్వామి ఆలయ గుట్టపైన కొబ్బరి కాయల విక్రయం కోసం గత సంవత్సరం ఆగస్టు 1న టెండర్ ఏర్పాటు చేశారు. ఈమేరకు టెండర్‌దారుడు రూ.72లక్షలకు వేలం ద్వారా దక్కించుకున్నాడు. అతను ఇప్పటికీ రూ.19లక్షల వరకు బకాయి ఉండటంతో కొబ్బరికాయల షాపును సీజ్ చేసినట్లు ఈఓ నవీన్‌కుమార్, సూపరింటెండెంట్ ఇంద్రాసేనారెడ్డి తెలిపారు. -
వీరన్న ఆశయాలను కొనసాగిస్తాం
తుంగతుర్తి : మారోజు వీరన్న ఆశయాలను కొనసాగిస్తామని సీపీయూఎస్ఐ (ఇండియా సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్టు పార్టీ) కేంద్ర కమిటీ సభ్యుడు పగడాల కోదండ అన్నారు. మారోజు వీరన్న సందర్భంగా శుక్రవారం మండల పరిధిలోని కొత్తగూడెం గ్రామంలో ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మలిదశ తెలంగాణ ఉద్యమ నిర్మాత మారోజు వీరన్న వర్ధంతితో పాటు దళిత బహుజన జనత ప్రజాస్వామ్య విప్లవం కోసం నేలకొరిగిన 145 మంది అమరవీరులను స్మరిస్తూ ఈనెల 16 నుంచి మే 31 వరకు అమరవీరుల సంతాప సభలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రొఫెసర్ కాసీం మాట్లాడుతూ.. ఉమ్మడి అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాలను రద్దుచేసి ఏ కులానికి ఆ కులం ప్రతిపాదికన ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో సీపీయూఎస్ఐ రాష్ట్ర కార్యదర్శి దైద వెంకన్న, మారోజు వీరన్న, సహచరి చైతన్య, వీరన్న కుమార్తె దిశ, లలిత, మట్టపల్లి యాదయ్య, గుడిపల్లి రవి, శరత్, మౌర్య, బెల్లయ్య నాయక్ పాల్గొన్నారు. -
ప్రియుడితో కలిసి భర్త హత్య
● ఇద్దరు నిందితుల రిమాండ్ ● వివరాలు వెల్లడించిన రామన్నపేట సీఐ వలిగొండ : ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన ఘటనలో ఇద్దరు నిందితులను పోలీసులు శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. శుక్రవారం వలిగొండ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామన్నపేట సీఐ వెంకటేశ్వర్లు వివరాలు వెల్లడించారు. భువనగిరి మండలంలోని సింగన్నగూడెం గ్రామానికి చెందిన సురేష్, మంగ భార్యాభర్తలు. గౌస్ నగర్‌కు చెందిన ఆటోడ్రైవర్ పల్లెర్ల స్వామితో మంగ వివాహేతర సంబంధం కొనసాగిస్తుండడంతో భర్త తన భార్యను పలుమార్లు మందలించాడు. బుధవారం తెల్లవారుజామున పల్లెర్ల స్వామి వీరి ఇంటికి రావడంతో సురేష్, స్వామి ఇద్దరు కలియబడ్డారు. ఇద్దరి మధ్య జరిగిన తోపులాటలో సురేష్ మృతిచెందాడు. అతడి మృతదేహాన్ని స్వామి, మంగ కలిసి ఆటోలో భీమలింగం కత్వ సమీపంలోకి తీసుకవెళ్లి కాల్వలో పడేశారు. బుధవారం కాల్వలో మృతదేహం లభ్యం కావడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. భార్య అనుమానంగా మాట్లాడటంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని విచారించగా.. ప్రియుడితో కలిసి హత్య చేసినట్లు అంగీకరించింది. ఈమేరకు ఇద్దరిపై కేసు నమోదు చేసి కోర్టులో రిమాండ్ చేసినట్లు సీఐ తెలిపారు. సమావేశంలో స్థానిక ఎస్సై యుగందర్, ప్రొబెషనరీ ఎస్సై శ్రీనివాస్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
కారు అదుపుతప్పి యువకుడు మృతి
మునగాల: కారు అదుపుతప్పి బోల్తా పడడంతో యువకుడు మృతిచెందగా మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ సంఘటన శుక్రవారం తెల్లవారుజామున మునగాల మండలంలోని బరాఖత్‌గూడెం శివారులో చోటుచేసుకుంది. స్థానిక ఏఎస్సై వెంకటరత్నం తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌కు చెందిన మహమ్మద్ అబ్దుల్ ఖలీల్(25) తన స్నేహితులు మహమ్మద్ కై సర్ అలీ, అబ్దుల్లా అంజద్, దిలీప్‌కుమార్‌లు కలిసి కారులో డ్రైవర్ మహ్మద్ యాసిన్‌తో హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లారు. తిరుగు ప్రయాణంలో హైదరాబాద్ వెళ్తుండగా మార్గమధ్యంలో మహ్మద్ అబ్దుల్ ఖలీల్ డ్రైవర్‌ను పక్కకు తప్పించి కారు నడుపుకుంటూ వస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున మునగాల మండలం బరాఖత్‌గూడెం వద్ద గల ఫ్లైౖఓవర్ పైకి చేరుకున్న తర్వాత అబ్దుల్ ఖలీల్ కారును అతివేగంగా నడపడంతో అదుపుతప్పి కుడివైపున ఉన్న డివైడర్‌ను ఢీకొట్టి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న అబ్దుల్ ఖలీల్‌కు తీవ్రగాయాలయ్యాయి. స్నేహితులు అతడిని 108వాహానంలో చికిత్స నిమిత్తం కోదాడ తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. మృతుడి బాబాయి మహ్మద్ అబ్దుల్ హబీబ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై వెంకటరత్నం తెలిపారు. -
చిరుధాన్యాల్లో పోషకాలు పుష్కలం
హుజూర్నగర్ : చిరుధాన్యాల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయని గడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) గృహ విజ్ఞాన శాస్త్రవేత్త సుగంధి అన్నారు. శుక్రవారం కేవీకే ఆధ్వర్యంలో చిరుధాన్యాల ప్రాముఖ్యత, వాటి ఆహార ఉత్పత్తులు, పెరటి తోటల పెంపకంపై హుజూర్నగర్ మెప్మా కార్యాలయంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా చిరుధాన్యాలతో వివిధ రకాల ఉత్పత్తులు అయిన రాగి, జొన్న లడ్డూ, బిస్కెట్లు, మురుకులు ఏ విధంగా తీసుకోవాలని వివరించారు. వీటిని మార్కెట్ చేసుకుని స్వయం ఉపాధిని ఎలా పొందవచ్చో తెలిపారు. మనకు కావాల్సిన సూక్ష్మ పోషకాలు, విటమిన్లు, మినరల్స్ కూరగాయల్లో ఎక్కువగా ఉంటాయని, వాటి ద్వారా పోషకాహార లోపాలను తగ్గించుకోవచ్చని తెలిపారు. అదేవిధంగా యోగా ప్రాముఖ్యత, ఔషధ మొక్కల ఉపయోగాలను ఆయుష్ డిపార్ట్మెంట్ యోగా ఇన్స్ట్రక్టర్ రామాంజి రెడ్డి వివరించారు. కార్యక్రమంలో అటవీశాఖ అధికారి మహేష్, మెప్మా ఏడీఎంసీ వసంత కుమార్, సీఓ సాయికృష్ణ, కనకదుర్గ, సుజాత, నాగమణి, స్వయం సహాయ సంఘాల, సమభావన సంఘాల మహిళలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ సమావేశంలో రసాభాస
అర్వపల్లి: అర్వపల్లిలోని శ్రీరామ ఫంక్షన్ హాల్లో శుక్రవారం నిర్వహించ తలపెట్టిన కాంగ్రెస్ పార్టీ మండల సమావేశం ప్రారంభంలోనే రసాభాసగా మారింది. సమావేశానికి ఎమ్మెల్యే, పార్టీ పరిశీలకుడు, డీసీసీ అధ్యక్షుడు రావాల్సి ఉంది. అయితే వారు రాకముందే కాంగ్రెస్‌లో ఇరువర్గాల మధ్య ఘర్షణ మొదలైంది. సమావేశం స్టేజీపైకి కుర్చీలు విసిరారు. దీంతో ఎమ్మెల్యే సామేలు, డీసీసీ ఉపాధ్యక్షుడు దరూరి యోగానందచారి వర్గీయుల మధ్య ఘర్షణ పెరగడంతో పోలీసులు చెదరగొట్టారు. దీంతో సమావేశాన్ని వాయిదావేశారు. ఆ తర్వాత మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మోరపాక సత్యం మండల కమిటీ పోటీలో ఉంటున్న కొంతమంది నుంచి దరఖాస్తులను స్వీకరించారు. కాగా కాంగ్రెస్ వర్గీయుల మధ్య ఘర్షణ విషయం తెలిసిన జిల్లా ఏఎస్పీ నాగేశ్వర్రావు అర్వపల్లికి చేరుకొని కొంతసేపు అక్కడే ఉన్నారు. నాగారం సీఐ రఘువీర్‌రెడ్డి, స్థానిక ఎస్ఐ బాలకృష్ణ జిల్లా స్పెషల్ పార్టీ, స్థానిక పోలీస్ సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. ఇరువర్గాల మధ్య ఘర్షణ వాయిదా పడిన అర్వపల్లి సమావేశం -
ఆటో బోల్తా.. వ్యక్తి మృతి
యాదగిరిగుట్ట రూరల్: ఆటో బోల్తా పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన యాదగిరిగుట్ట మండలం గౌరాయపల్లి గ్రామ పరిధిలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. పోలీ సులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదగిరిగుట్ట పట్టణానికి చెందిన సదా ప్రవీణ్ కుమార్ (36), గురువారం రాత్రి తన సొంత పనుల నిమిత్తం యాదగిరిగుట్టకు చెందిన ఆటో డ్రైవర్ ఉట్కూరి రాజు గౌడ్‌తో కలిసి ఆటోలో గౌరాయపల్లికి వెళ్లాడు. పనులు ముగించుకుని తిరిగి యాదగిరిగుట్టకు వస్తున్న క్రమంలో గౌరాయపల్లి గ్రామ శివారులోని దుర్గమ్మ గుడి సమీపంలో ప్రమాదవశాత్తు ఆటో అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న కల్వర్టును ఢీ కొట్టింది. దీంతో ఆటోలో ఉన్న సదా ప్రవీణ్ కుమార్‌కు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఆటో డ్రైవర్ రాజుకు స్వల్ప గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ భాస్కర్ తెలిపారు. లారీ ఢీకొని వ్యక్తి దుర్మరణం చిట్యాల: చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామ పరిధిలోని జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. చిట్యాల ఎస్ఐ అమ్రీన్ నసీహా తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా దాచెపల్లి మండలం తంగేడ గ్రామానికి చెందిన తోకల రవి(45) అతని తల్లి నాగమ్మ, డ్రైవర్ పోల్ సాగర్‌తో కలిసి కారులో హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వెళ్తున్నారు. చిట్యాల మండలం వట్టిమర్తి పరిధిలోని దూన్ పంజాబి దాబా వద్దకు రాగానే దాబా నుంచి లారీ అకస్మాత్తుగా జాతీయ రహదారిపైకి వచ్చి కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న రవికి తీవ్ర గాయాలై అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అతడిని వెంటనే నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి సోదరుడు తోకల శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. బుచ్చిరెడ్డికి స్ఫూర్తి పురస్కారంకనగల్ : బాల సాహిత్యంలో చేస్తున్న కృషికి గాను కోమటిరెడ్డి బుచ్చిరెడ్డిని వసుంధర విజ్ఞాన వికాస మండలి (కరీంనగర్) స్ఫూర్తి పురస్కారానికి ఎంపిక చేసినట్లు జ్యూరీ కమిటీ శుక్రవారం ప్రకటించింది. త్వరలో హైదరాబాద్ జరిగే కార్యక్రమంలో ఈ పురస్కారం అందజేయనున్నట్లు నిర్వాహకుడు వైద్యుల మధుకర్ తెలిపారు. ప్రస్తుతం బుచ్చిరెడ్డి కనగల్ మండల పరిధిలోని చినమాదారం ఉన్నత పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. -
సమస్యలు పరిష్కరించాలని ధర్నా
భువనగిరిటౌన్ : దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వికలాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కె.వెంకట్ మాట్లాడుతూ దివ్యాంగులు 30 రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి అవన్నీ పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అలాగే ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ యువ వికాసం పథకంలో దివ్యాంగులకు 5 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సురుపంగ ప్రకాష్, జిల్లా ప్రధాన కార్యదర్శి వన ఉపేందర్, సామాజిక ఉద్యమ నేత బట్టు రామచంద్రయ్య, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బొల్లేపల్లి స్వామి, జిల్లా కోశాధికారి కొత్త లలిత, ఉపాధ్యక్షురాలు బర్ల పార్వతి, మాదిరే పద్మ, బల్గురు అంజయ్య పాల్గొన్నారు. ‘ప్రీ లిటిగేషన్’ ద్వారా కేసులు పరిష్కరించుకోవచ్చు భువనగిరి : కోర్టుకు లేదా ఫోరం ముందుకు రాలేని వయోవృద్ధులు ప్రీ లిటిగేషన్ వాజ్యాల ద్వారా సివిల్ కేసులను పరిష్కరించుకోవచ్చని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, జడ్జి మాధవీలత సూచించారు. భువనగిరి మండలం చీమలకొండూరు పరిధిలో గల బెజ్జ లక్ష్మయ్య ఫౌండేషన్ అశ్రమంలో ఉంటున్న ఓ వృద్ధురాలు తన కుమారులు తన బాగోగులు చూడటం లేదని న్యాయ సేవాధికారి సంస్థకు దరఖాస్తు చేసుకుంది. జడ్జి మాధవీలత శుక్రవారం బాధితురాలి దరఖాస్తును పరిశీలించారు. వృద్ధురాలి కుమారులను పిలిపించి ప్రతి నెలా రూ.20 వేలు ఇవ్వడంతో పాటు ఆమె బాగోగులను చూసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన సీనియర్ సివిల్ జడ్జి ఉషశ్రీ తదితరులు ఉన్నారు. 20న ఉచిత వైద్యశిబిరంసంఘటిత, అసంఘటిత కార్మికుల కోసం జిల్లా కార్మిక శాఖ, న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 20న ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయనున్నట్లు జడ్జి మాధవీలత తెలిపారు. వైద్య శిబిరాన్ని కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సర్టిఫికెట్లు ప్రదానం నల్లగొండ టూటౌన్ : సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్సీ సంస్థ నిర్వహించిన నైపుణ్య శిక్షణ అభివృద్ధి (టాస్క్)కి సహకరించిన యూనివర్సిటీ సిబ్బందికి శుక్రవారం ఎంజీయూ వీసీ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ సరిఫికెట్లు, మెమొంటోలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్సీని టాస్క్‌ను రూ.30 లక్షలతో ఏర్పాటు చేసిందన్నారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ అల్వాల్ రవి, డాక్టర్ వై.ప్రశాంతి, సుధారాణి, జయంతి, దుర్గాప్రసాద్ పాల్గొన్నారు. ప్రైవేట్ స్కూళ్ల నుంచి దరఖాస్తుల ఆహ్వానంభువనగిరి : బెస్ట్ అవైలబుల్ స్కీం కింద 2025–26 విద్యా సంవత్సరంలో ఎస్సీ విద్యార్థులకు 1వ తరగతిలో డే స్కాలర్, 5వ తరగతిలో రెసిడెన్షియల్లో ప్రవేశం కల్పిచేందుకు అర్హత కలిగిని ఇంగ్లిష్ మీడియం పాఠశాలలు దరఖాస్తు చేసుకోవాలని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాజ్‌కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. ఈ నెల 25వ తేదీలోగా దరఖాస్తులు సమర్పించాలని, ఇతర వివరాలకు ఎస్సీ అభివృద్ధి కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. ఆర్టీసీలో టెండర్లురామగిరి(నల్లగొండ): ఆర్టీసీ నల్లగొండ రీజియన్‌లోని బస్ స్టేషన్లలో పలు పనులకు టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు రీజనల్ మేనేజర్ జానిరెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ బస్ స్టేషన్లలో ఖాళీ షాపులు, వాహన పార్కింగ్, లాజిస్టిక్ సర్వీసెస్ నిర్వహణకు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఆసక్తి గల వారు www.tgrtc.teangana.gov.in వెబ్‌సైట్‌ను, ఆన్లైన్ టెండర్లో పాల్గొనేందుకు www. tender.telangana.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలన్నారు. మరిన్ని వివరాలకు రీజనల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అధికారి 73828 34223 నంబర్‌ను సంప్రదించాలన్నారు. -
అర్జీలు వేలల్లో.. మంజూరు వందల్లో!
ఆలేరురూరల్: జిల్లాలో రేషన్‌కార్డుల కోసం 96,792 మంది దరఖాస్తు చేసుకోగా.. కేవలం 405 మందికి మాత్రమే మంజూరయ్యాయి. దీంతో ప్రతి రోజూ దరఖాస్తుదారులు రెవెన్యూ కార్యాలయాలకు వెళ్లి ఆరా తీస్తున్నారు. ఆరు గ్యారంటీల్లో భాగంగా ప్రజాపాలన గ్రామసభల్లో తెల్ల రేషన్‌కార్డుల కోసం రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించింది. గ్రామ సభల్లో 96,792, మీసేవ కేంద్రాల ద్వారా 1,029 దరఖాస్తులు వచ్చాయి. వీటితో పాటు పాత కార్డుల్లో కుటుంబ సభ్యుల నమోదుకు 21,770 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో 20,133 దరఖాస్తులను ఓకే చేశారు. 1,637 పెండింగ్‌లో ఉన్నాయి. నిరాశలో వేలాది మంది.. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డు ఇస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెసప్రభుత్వం హామీ ఇచ్చింది. దీంతో ప్రజాపాలన గ్రామసభలు, మీసేవ కేంద్రాల ద్వారా వేలాది మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తులను పరిశీలించిన అధికారులు తొలి విడతలో 405 కార్డులకే మంజూరు ఇచ్చారు. సుమారు లక్ష వరకు దరఖాస్తులు రాగా కొద్ది మందికే కార్డులు మంజూరు చేయడంతో మిగతా వారు అయోమయంలో ఉన్నారు. తమకు కార్డులు వచ్చేసరికి ఎన్నేళ్లు పడుతుందోనని మదనపడుతున్నారు. కొత్త కార్డులు మంజూరుకాకపోవడంతో ప్రభుత్వ పథకాలు, ఆదాయ తదితర ధ్రువీకరణ పత్రాలకోసం ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త కార్డుదారులకు సన్నబియ్యం ఏప్రిల్ కోటా ప్రకారం జిల్లాలో 2,16,904 కార్డులు, 6,76,188 యూనిట్లు ఉన్నాయి. వీరికి 4,307 టన్నుల బియ్యం అవసరం. వీరితో పాటు కొత్తగా మంజూరైన 405 (20,133 యూనిట్లు) కార్డులకు ఈ నెల నుంచి సన్నబియ్యం పంపిణీ చేస్తున్నారు.అర్హులందరికీ అందని రేషన్ కార్డులు ఫ కొత్తగా 405 మందికే మంజూరు ఫ ఎదురుచూపుల్లో మిగతావారుఅర్హులందరికీ కార్డులు రేషన్ కార్డు మంజూరుకాని దరఖాస్తుదారులు ఆందోళన చెందవద్దు. విడతల వారీగా అర్హులందరికీ వస్తాయి. నూతన కార్డుదారులకు మేనెల సన్నబియ్యం పంపిణీ చేశాం. గతంలో దొడ్డు బియ్యం ఇస్తే కొందరు అమ్ముకునేవాళ్లు. ప్రస్తుతం సన్నబియ్యాన్ని అందరూ ఇష్టంగా తీసుకెళ్తున్నారు. –అంజిరెడ్డి, తహసీల్దార్, ఆలేరు -
కనుల పండువగా ఊంజల్ సేవోత్సవం
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో శుక్రవారం ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవం పాంచరాత్ర ఆగమశాస్త్ర ప్రకారం నిర్వహించారు. సాయంత్రం వేళ అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ఆలయ తిరు వీధుల్లో ఊరేగించారు. అమ్మవారికి మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. అనంతరం అద్దాల మండపంలో అమ్మవారిని అధిష్టింపజేసి ఊంజల్ సేవ నిర్వహించారు. ఆండాళ్ అమ్మవారికి ఇష్టమైన నాధస్వరం వినిపించారు. సంప్రదాయ పూజలు ప్రధానాలయంలో సంప్రదాయ పూజలు శాస్త్రోక్తంగా చేపట్టారు. వేకువజామున సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపిన అర్చకులు.. గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకార మూర్తులకు నిజాభిషేకం, తులసీదళ అర్చనతో కొలిచారు. అనంతరం ప్రథమ ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, స్వామి, అమ్మవారికి నిత్యకల్యాణం, ముఖ మండపంలో జోడు సేవోత్సవం తదితర పూజలు నిర్వహించారు. ఈ వేడుకల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి స్వామివారికి శయనోత్సవం చేసి ఆలయ ద్వారబంధనం చేశారు. -
డెంగీరహిత జిల్లాగా మార్చుదాం
భువనగిరి : డెంగీరహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డీఎంహెచ్ఓ డాక్టర్ మనోహర్ అన్నారు. జాతీయ డెంగీ దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం భువనగిరిలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని డీఎంహెచ్ఓ ప్రారంభించి మాట్లాడారు. ప్రతి ఒక్కరూ తాము ఉంటున్న పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ప్రతి శుక్రవారం డ్రై డే ఫ్రై డేగా పాటించాలని కోరారు. దోమలు వృద్ధి చెందకుండా ఉండాలంటే ఇంటి పరిసరాల్లో నీటి నిల్వ ఉండకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ వీణ, డాక్టర్ నిరోష, డిప్యూటీ డెమో అంజయ్య, ఆశ నోడల్ ఆఫీసర్ సత్యవతి, సిబ్బంది పాల్గొన్నారు.ఫ డీఎంహెచ్ఓ మనోహర్ -
భూ భారతి దరఖాస్తులు 128
ఆత్మకూరు(ఎం): భూ భారతి చట్టంపై అవగాహన కల్పించడంతో పాటు భూ సమస్యల సత్వర పరిష్కారానికి ఆత్మకూర్(ఎం) మండలంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో 128 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో అత్యధికంగా సర్వే నంబర్ల సమస్యకు సంబంధించి 11 ఫిర్యాదులు ఉన్నాయి. భూ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి చట్టానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద ఆత్మకూర్(ఎం) మండలాన్ని ఎంపిక చేశారు. ఈ నెల 5 నుంచి 12వ తేదీ వరకు తహసీల్దార్ లావణ్య ఆధ్వర్యంలో రెవెన్యూ గ్రామాల వారీగా సదస్సులు నిర్వహించి రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సదస్సులను కలెక్టర్ హనుమంతరావు, అదనపు కలెక్టర్ వీరారెడ్డి, భువనగిరి ఆర్డీఓ కృష్ణారెడ్డితో పాటు పలువురు అధికారులు హాజరయ్యారు. 1,828 దరఖాస్తు ఫారాలు పంపిణీ మండలంలోని 17 రెవెన్యూ గ్రామాల్లో 1,828 మంది రైతులకు దరఖాస్తు ఫారాలు పంపిణీ చేశారు. పలు రకాల భూసమస్యలపై 128 దరఖాస్తులు అందాయి. రెవెన్యూ గ్రామాల వారీగా దరఖాస్తులు రాయిపల్లిలో 15, సర్వేపల్లి 5, రహీంఖాన్‌పేట 31, రాఘవాపురం 4, సింగారం 3, పల్లెర్ల 16, కాల్వపల్లి 1, లింగరాజుపల్లి 6, కప్రాయపల్లి 2, కూరెళ్ల 7, పారుపల్లి 2, తుక్కాపురం 7, పల్లెపహాడ్ 2, మొరిపిరాల 10, ధర్మారం 2, కొరటికల్ 7, ఆత్మకూర్(ఎం) 8 దరఖాస్తులు వచ్చాయి. 1లోగా పరిష్కారం రైతులకు సహకారం అందించేందుకు ఆయా గ్రామాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేశారు. రెవెన్యూ సిబ్బంది రైతుల దరఖాస్తు ఫారాలు నింపి ప్రత్యేక పోర్టల్‌లో నమోదు చేశారు. క్షేత్రస్థాయిలో విచారణ చేసి జూన్ 1వ తేదీలోగా సమస్య పరిష్కరించేలా ప్రణాళిక రూపొందించారు. జూన్ 2వ తేదీన దరఖాస్తుదారులకు పరిష్కార పత్రాలు ఇవ్వనున్నారు.ఫ ఆత్మకూరు(ఎం) మండలంలో ముగిసిన రెవెన్యూ సదస్సులు ఫ అత్యధికంగా సర్వే నంబర్ల మిస్సింగ్‌పై ఫిర్యాదులు ఫ జూన్ 2వ తేదీన పరిష్కార పత్రాలు ఆధారాలతో దరఖాస్తు చేశాం మా తాత ఉప్పల రామయ్యకు చెందిన 17 గుంటల భూమిని 2019–20లో అధికారులు ఇతరులకు అక్రమ పౌతి చేశారు. దీనిపై పూర్తి ఆధారాలతో రెవెన్యూ సదస్సులో దరఖాస్తు చేశాం. అధికారులు పరిశీలించారు. విచారణ జరిపి న్యాయం చేస్తామన్నారు. రెవెన్యూ సదస్సుల ద్వారా సమస్య చెప్పుకునే అవకాశం వచ్చింది. –మత్స్యగిరి కూరెళ్ల, ఆత్మకూరు(ఎం) మండలం జూన్ 2న పరిష్కార పత్రాలిస్తాం మండలంలోని 17 రెవె న్యూ గ్రామాల్లో రెవె న్యూ సదస్సులు సజావుగా పూర్తి చేశాం. రైతులు అందజేసిన దరఖాస్తులను పరిశీలించాం. క్షేత్రస్థాయిలో విచారణ జరిపిన అనంతరం జూన్2వ తేదీన పరిష్కార పత్రాలు అందజేస్తాం. పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన ఉన్నతాధికారులకు, సదస్సులు విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. –లావణ్య. తహసీల్దార్, ఆత్మకూరు(ఎం)మిస్సింగ్ సర్వే నంబర్లు 11పెండింగ్ మ్యుటేషన్ 04డిజిటల్ సంతకం పెండింగ్ 08విస్తీర్ణంలో తేడాలు 25పేర్లలో తప్పుల సవరణ 08లావణి పట్టా 07అసైన్డ్ ల్యాండ్ 02పౌతి 22ఇతర సమస్యలు 41 -
నకిలీ కట్టడికి టాస్క్‌ఫోర్స్
వ్యవసాయ, పోలీస్ శాఖల ఆధ్వర్యంలో మూడు ప్రత్యేక బృందాలువిత్తన ఎంపికలో జాగ్రత్త నకిలీ విత్తనాల బారిన పడకుండా రైతులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ అధికారులు హెచ్చరిస్తున్నారు. లైసెన్స్డు డీలర్ల వద్దనే విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు కొనుగోలు చేయాలని, తప్పనిసరిగా రశీదు తీసుకోవాలని సూచిస్తున్నారు. తక్కువ ధరకు విక్రయిస్తున్నారని, ఆఫర్లు, రంగురంగుల ప్యాకెట్లను చూసి మోసపోవద్దని, విత్తన నాణ్యత, మొలక శాతం, కంపెనీ బ్రాండెడ్ వివరాలను పరిశీలించిన తరువాతే కొనుగోలు చేయాలని చెబుతున్నారు. ఆలేరు: వానాకాలం సాగు షురూ అయింది. చాలా మంది రైతులు వరి, పత్తి పంటలు అధికంగా సాగు చేస్తుంటారు. ఇదే సమయంలో అనుమతి లేని విత్తనాలు, బీటీ–3 విత్తనాలు, నకిలీ సీడ్‌ను మార్కెటింగ్ చేసుకోవడానికి వ్యాపారులు ప్రయత్నిస్తుంటారు. ఆకర్షణీయంగా ఉండే రంగురంగుల ప్యాకెట్లలో నింపి, తమ వంగడాలు అధిక దిగుబడి ఇస్తాయని నమ్మబలుకుతూ వాటిని రైతులకు అంటగడుతుంటారు. నకిలీ విత్తనాల వల్ల దిగుబడి తగ్గి రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం పొంచి ఉంది. దీన్ని అరికట్టేందుకు వ్యవసాయ, పోలీసు శాఖలు సంయుక్తంగా వ్యూహాలను సిద్ధం చేశాయి. నకిలీ విత్తన ముఠాల ఆటకట్టించేందుకు మూడు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాల(స్క్వాడ్)ను ఏర్పాటు చేశాయి. ఇదీ.. టాస్క్‌ఫోర్స్ టీం టాస్క్‌ఫోర్స్ బృందంలో వ్యవసాయ సహాయ సంచాలకులు (ఏడీఏ), ఇద్దరు మండల వ్యవసాయ అధికారులు, ఒక ఏఎస్ఐ, ఒక కానిస్టేబుల్ ఉంటారు. వీరికి ఏడీఏ నేతృత్వం వహిస్తారు. జిల్లాలో 17 మండలాలు ఉండగా రెండు బృందాలు ఐదు మండలాల చొప్పున, ఒక బృందం ఏడు మండలాల్లో తనిఖీలు చేస్తుంది. రైతుల భాగస్వామ్యంతో టీంలు పని చేయనున్నాయి. టీంల పనితీరుపై కలెక్టర్, జిల్లా వ్యవసాయ అధికారి, డీసీపీ పర్యవేక్షణ ఉంటుంది. తనిఖీలకు సిద్ధం వ్యవసాయ సీజన్ ప్రారంభంకానున్న నేపథ్యంలో తనిఖీలు ముమ్మరం చేయాలని అధికారులు నిర్ణయించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అనుమానిత ప్రదేశాలు, ఎరువులు, విత్తన దుకాణాలతో పాటు ఫిర్యాదులు అందిన షాపుల్లో టాస్క్‌ఫోర్స్ టీంలు తనిఖీలు నిర్వహించేందుకు సిద్ధమవుతు న్నాయి.అంతేకాకుండా జిల్లా సరిహద్దు ప్రాంతాలు, గతంలో అధికంగా నకిలీ విత్తనాలు పట్టుబడిన మార్గాలపై ప్రత్యేక నిఘా ఉంచుతాయి. వరుసగా మూడుదఫాల కంటే ఎక్కువ సార్లు పట్టుబడిన వ్యక్తులపై పీడీ యాక్ట్ నమోదు చేయనున్నారు. అదే విధంగా నాసిరకం విత్తనాలు కొనుగోలు చేయకుండా రైతులకు అవగాహన కల్పించనున్నారు. లైసెన్స్డు డీలర్ వద్దనే విత్తనాలు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటారు. గతంలో పట్టుబడిన నకిలీ విత్తనాలు గతంలో మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ నుంచి తీసుకువచ్చిన నకిలీ పత్తి విత్తనాలను టాస్క్‌ఫోర్స్ టీంలు పట్టుకున్నాయి. ఫ ఎరువులు, విత్తన దుకాణాల్లో తనిఖీలకు సిద్ధం ఫ జిల్లా సరిహద్దులు, గతంలో నకిలీ సీడ్ పట్టుబడిన ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఫ మూడు కంటే ఎక్కువ సార్లు పట్టుబడిన వ్యక్తులపై పీడీ యాక్ట్నకిలీ సీడ్ అమ్మితే క్రిమినల్ కేసులు రైతులు నకిలీ విత్తనాలు కొని నష్టపోవద్దన్న ఉద్దేశంతో తనిఖీల కోసం ఉన్నతా ధికారుల ఆదేశాల మేరకు ప్రత్యేకంగా మూడు టాస్క్ ఫోర్స్ టీంలను ఏర్పాటు చేశాం. నిషేధిత, నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, విత్తనాలు సీజ్ చేస్తాం. జిల్లాలోని 17 మండలాలతో పాటు సరిహద్దు ప్రాంతాలపై నిరంతర నిఘా ఉంటుంది. ఎవరైనా నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నట్లు తెలిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలి. రైతులు విత్తన కొనుగోలులో జాగ్రత్తలు తీసుకోవాలి. లైసెన్స్డు డీలర్ల వద్దనే కొనాలి. –గోపాల్, జిల్లా వ్యవసాయాధికారి యాదాద్రి భువనగిరి జిల్లాలో వానాకాలం 4.35 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అధికారులు అంచనాలు రూపొందించారు. అందులో సుమారు 3 లక్షల ఎకరాల్లో వరి, 1.10 లక్షల ఎకరాల్లో పత్తి, మిగతా ఎకరాల్లో ఇతర పంటలు సాగు కానున్నాయి. -
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయండి
ఆత్మకూరు(ఎం): మండలంలోని లింగరాజుపల్లిలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం కలెక్టర్ హనుమంతరావు సందర్శించారు. లింగరాజుపల్లిలో కొనుగోళ్లు ఆలస్యం అవుతున్నాయని ఫిర్యాదు అందడంతో పాటు రైతులు రాస్తారోకో చేయడంతో ఆయన కేంద్రాన్ని సందర్శించారు. కొనుగోలు చేసిన ధాన్యం, తూకం వేయని ధాన్యం వివరాలు కేంద్రం నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు.రైతులతో మాట్లాడి రాస్తారోకో చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. కొనుగోళ్లలో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట తహసీల్దార్ లావణ్య, ఆర్ఐ మల్లికార్జునరావు ఉన్నారు. 2.37లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు సాక్షి,యాదాద్రి : జిల్లాలో ఇప్పటి వరకు 2.37 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు చేశామని, పక్షం రోజుల్లో మరో లక్ష టన్నులు సేకరిస్తామని కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు, పొన్నం ప్రభాకర్ శుక్రవారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ధాన్యం కొనుగోళ్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ వీరారెడ్డితో కలిసి కలెక్టర్ మాట్లాడారు. సేకరించిన ధాన్యానికి సంబంధించి రూ.452 కోట్ల రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు చెప్పారు. ధాన్యం ఎక్కువ ఉన్న కేంద్రాలకు ప్రత్యేక అధికారులను నియమించినట్లు తెలిపారు. ఫ కలెక్టర్ హనుమంతరావు -
మార్కెట్లోకి పచ్చడి మామిడి
భువనగిరి: మార్కెట్లోకి పచ్చడి మామిడి పెద్ద ఎత్తున వస్తోంది. జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ రోడ్డు పక్కన.. పచ్చడి మామిడి విక్రయాలకు పెట్టింది పేరు. జిల్లాలోని వివిధ ప్రాంతాలతో పాటు జనగాం, సిద్ధిపేట, మేడ్చల్, హైదరాబాద్ ప్రాంతాల నుంచి వినియోగదారులు ఇక్కడ కాయలు కొనుగోలు చేసుకుని తీసుకెళ్తారు. ప్రస్తుతం నీలం, నాటకు పచ్చడి కాయలు విక్రయిస్తున్నారు. కాయ రకాలు, సైజను బట్టి ఒకటి రూ.8 నుంచి రూ.12లకు అమ్ముతున్నారు. మృగశిర కార్తె ప్రారంభం వరకు అమ్మకాలు కొనసాగుతాయని వ్యాపారులు తెలిపారు. నృసింహుడికి సంప్రదాయ పూజలుయాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో గురువారం సంప్రదాయ పూజలు వైభవంగా నిర్వహించారు. వేకువజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు శ్రీస్వామివారిన సుప్రభాత సేవతో మేల్కొలిపారు. అనంతరం స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం చేసి తులసీ దళాలతో అర్చించారు. ఇక ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన తదితర పూజలు చేశారు. రాత్రి స్వామివారికి శయనోత్సవం చేసి ఆలయ ద్వారబంధనం చేశారు. స్వర్ణగిరీశుడికి తిరుపావడ సేవ భువనగిరి : పట్టణ పరిధిలోని స్వర్ణగిరి క్షేత్రంలో గల శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో గురువారం తిరుపావడ సేవ వైభవంగా నిర్వహించారు. 450 కిలోల అన్నప్రసాదం, లడ్డూ, వడ తదితర పిండి వంటలను స్వామివారికి నైవేద్యంగా సమర్పించారు. అంతకుముందు ఉదయం ఆలయంలో సుప్రభాతసేవ, తోమాల సేవ, సహస్రనామార్చన, స్వామి, అమ్మవారికి నిత్యకల్యాణం నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ చేశారు. -
నీటిని వృథా చేయొద్దు.. ఆదా చేద్దాం
సంస్థాన్ నారాయణపురం : నీటిని వృథా చేయొద్దని.. ఆదా చేసి పొదుపుగా వాడుకోవాలని వ్యవసాయ శాస్త్రవేతలు డాక్టర్ సుజాత, డాక్టర్ వాణిశ్రీ సూచించారు. గురువారం సంస్థాన్‌నారాయణపురం మండలం పుట్టపాకలో నిర్వహించిన రైతు ముగింట శాస్త్రవేతలు కార్యక్రమంలో వారు పాల్గొని నీటి ఆదా, సాగు విధానాలపై రైతులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. రసాయనిక ఎరువులు, యూరియా వాడకం తగ్గించాలన్నారు. పంటల మార్పిడి విధానం అవలంభించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఓ వర్షితరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ యాదవరెడ్డి, వైస్ చైర్మన్ చెన్నోజు బ్రహ్మచారి, యాదవరెడ్డి, ఏఈఓలు నవ్య, శశిబిందు, అనురాధ, సైదులు తదితరులు పాల్గొన్నారు. -
‘అమృత్’కు ఆరు నెలలే గడువు!
గడువులోపు పూర్తిచేయాలి మున్సిపాలిటీల్లో రానున్న 30 ఏళ్ల వరకు తాగునీటి ఎద్దడి రాకుండా ఉండేందుకు కేంద్రం ప్రతిష్టాత్మకంగా అమృత్ 2.0 పథకం ద్వారా నిధులు మంజూరు చేసింది. పనులు సాఫీగా సాగేలా చూడాల్సిన బాధ్యత అధికారులదే. గడువులోపు పనులను పూర్తి చేసి పట్టణవాసులకు తాగునీరు అందించాలి. –చాడ మంజుల, బీజేపీ మోత్కూరు పట్టణ అధ్యక్షురాలు నిరంతరం పర్యవేక్షించాలి అమృత్ పథకం పనులు గడువులోపు పూర్తి చేయాలి. మధ్యలో నిలిచిపోకుండా అధికారులు పర్యవేక్షిస్తుండాలి. అంతేకాకుండా ట్యాంకుల నిర్మాణ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. నాణ్యతా ప్రమాణాలు పాటించే విధంగా చూడాలి. నిలిచిపోయిన ట్యాంకుల పనులను త్వరగా పునఃప్రారంభించాలి –చొల్లేటి నరేష్, మోత్కూరు కాంట్రాక్టర్‌కు నోటీసులు ఇచ్చాం పనుల్లో జాప్యం వాస్తవమే. ఇప్పటికే కాంట్రాక్టర్‌ను హెచ్చరించాం. పనులు దక్కించుకున్న మెయిన్ కాంట్రాక్టర్.. వాటిని సబ్ కాంట్రాక్టర్‌కు ఇచ్చుకున్నాడు. జాప్యంపై కాంట్రాక్టర్‌కు నోటీసులు ఇచ్చాం. సకాలంలో పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటాం. –సురేష్, ఏఈ, పబ్లిక్ హెల్త్ విభాగం మోత్కూరు : మున్సిపాలిటీ పరిధిలో తాగునీటి అవసరాలు తీర్చి, భవిష్యత్‌లో సమస్య రాకుండా ఉండేందుకు కేంద్రం తీసుకువచ్చిన అమృత్ పథకం పనులు అగమ్యగోచరంగా మారాయి. పనులు ప్రారంభించి ఏడాదిన్నర కావొస్తున్నా నేటికీ ట్యాంకులే పూర్తి కాలేదు. రెండేళ్లలో పనులు పూర్తి చేయాలని ఒప్పందం ఉన్నా అధికారులు చోద్యం చూస్తున్నారు. రూ.12 కోట్లు మంజూరు మోత్కూరు మున్సిపాలిటీకి అమృత్ 2.0 పథకం ద్వారా తాగునీరు అందించేందుకు కేంద్రం రూ.12 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో ఆరున్నర లక్షలు, ఎనిమిది లక్షల లీటర్ల సామర్థ్యం గల ట్యాంకులు, వాటికి ప్రహరీలు, 12 కిలో మీటర్ల దూరం పైపులైన్ నిర్మాణంతో పాటు సుమారు వెయ్యి నల్లా కనెక్షన్లు ఇవ్వాలి. 2050 సంవత్సరం వరకు పట్టణంలో తాగునీటి ఎద్దడి ఏర్పడకుండా ఉన్నతాధికారులు ప్రణాళికలు రూపొందించారు. 2024 ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ట్యాంకుల నిర్మాణానికి తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ శంకుస్థాపన చేశారు. కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ సంస్థ టెండర్ ద్వారా పనులు దక్కించుకుంది. పనులు పూర్తి చేయడానికి రెండేళ్ల ఒప్పందం కుదుర్చుకొని 2024 ఏప్రిల్‌లో కాంట్రాక్టర్ పనులు చేపట్టారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆరున్నర లక్షలు, జూనియర్ కళాశాల ఆవరణలో ఎనిమిది లక్షల లీటర్ల సామర్థ్యం గల ట్యాంకులు నిర్మిస్తున్నారు. జూనియర్ కాలేజీలో వాటర్‌ట్యాంక్ గ్రౌండ్ లెవల్, కాంక్రీట్, స్టీల్ పనుల వరకు పూర్తయ్యాయి. హైస్కూల్లో గ్రౌండ్ లెవల్ వరకు మట్టి నింపారు. కాగా మూడు నెలలుగా ట్యాంకుల పనులు పూర్తిగా నిలిచిపోయాయి. ఏడాదిన్నర కావొస్తున్నా సగం దాటని లక్ష్యం ఫ ట్యాంకుల స్థాయిలో నిలిచిపోయిన పనులు ఫ పెట్టుబడికి డబ్బుల్లేవని చేతులెత్తేసిన కాంట్రాక్టర్ ఫ నోటీసులు ఇచ్చామంటున్న అధికారులు కారణాలివీ! పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ సబ్ కాంట్రాక్టర్‌కు అప్పగించాడు. ముందస్తుగా సొంత డబ్బులతో పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత ప్రభుత్వం బిల్లులు మంజూరు చేస్తుంది. అయితే సబ్ కాంట్రాక్టర్ వద్ద పెట్టుబడికి సరిపడా డబ్బులు లేకపోవడం వల్ల పనులు నిలిపివేసినట్లు తెలిసింది. అంతేకాకుండా ఇప్పటి వరకు చేపట్టిన పనుల్లోనూ నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదన్న విమర్శలున్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల కాంట్రాక్టర్ బాధ్యతారహితంగా పనులు చేశారని పలువురు ఆరోపిస్తున్నారు. పథకం పనులు పూర్తయ్యాక ఐదేళ్ల వరకు ఎలాంటి మరమ్మతులు వచ్చినా కాంట్రాక్టరు చేయించాల్సిన బాధ్యత ఉంది. -
శిక్షణను సద్వినియోగం చసుకోవాలి
యాదగిరిగుట్ట: విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేసవి శిక్షణ శిబిరాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని డీఈఓ సత్యనారాయణ సూచించారు. యాదగిరిగుట్టలోని ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. యోగా, స్పొకెన్, ఇంగ్లిష్, లైఫ్ స్కిల్స్, ఇండోర్ గేమ్స్, డ్రాయింగ్ తదితర అంశాలపై 15 రోజుల పాటు శిక్షణ ఉంటుందన్నారు. విద్యార్థులు చదువుతో పాటు ఆటలు, కళల్లో నైపుణ్యం సాధించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ శరత్‌యామిని, కాంప్లెక్స్ హెచ్ఎం మల్లికార్జున్, ప్రధానోపాధ్యాయులు నారాయణ, కె.శ్రీనివాస్‌రెడ్డి, సబీంబేగం, శంకరయ్య, ఎంఆర్సీ సిబ్బంది భాస్కర్, రమాదేవి, సీఆర్పీలు భిక్షపతి, రమేష్, సంగీత, సంజీవ తదితరులు పాల్గొన్నారు. -
ఇక్కత్‌కు, శిల్పకళకు ఫిదా..
సందడి చేసిన ప్రపంచ సుందరీమణులు భూదాన్‌పోచంపల్లిలోని టూరిజం పార్క్‌లో సుందరీమణులుభూదాన్పోచంపల్లి, యాదగిరిగుట్ట: మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు వచ్చిన సుందరీమణులు గురువారం సాయంత్రం యాదాద్రి జిల్లాలో పర్యటించారు. ఒక బృందం భూదాన్‌పోచంపల్లిని, మరో బృందం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సందర్శించింది. నేతన్నల గొప్పదనం చూసి.. అబ్బురపడి.. ఆఫిక్రా దేశాలకు చెందిన 25 మంది సుందరీమణులు భూదాన్‌పోచంపల్లిని సందర్శించారు. స్థానిక రూరల్ టూరిజం పార్కులో ఏర్పాటు చేసిన చేనేత థీమ్‌లో పాల్గొని ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఇక్కత్ వస్త్రాలను పరిశీలించి అబ్బురపడ్డారు. చేనేతల గొప్పతనం చూసి అందాలభామలు చప్పట్లు కొట్టారు. అలాగే ఇండో వెస్ట్రన్ ఇక్కత్ దుస్తులతో మోడల్స్ నిర్వహించిన ర్యాంప్ వాక్ చూపి మైమరిచిపోయారు. ప్రముఖ డిజైనర్ స్వాతి పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలతో రూపొందించిన ఇండో వెస్ట్రన్ ఫ్యాషన్ వస్త్రాలను ప్రముఖ మోడల్స్ ధరించి, ప్రముఖ కొరియోగ్రఫీ సుందర్ పర్యవేక్షణలో ప్రదర్శించిన రాంప్‌వాక్ వావ్ అన్పించింది. సుమారు 30 మంది మోడల్స్ ర్యాంప్‌వాక్ చేశారు. ఆకట్టుకున్న చేనేత స్టాళ్లు టూరిజం పార్కు ఆవరణలో పద్మశ్రీ గజం గోవర్థన్, జాతీయ అవార్డు గ్రహీత తడక రమేశ్, సాయిని భరత్, రాష్ట్ర అవార్డు గ్రహీతలు భోగ బాలయ్య, ఎన్నం మాధవిశివకుమార్, చేనేత టై అండ్ డై అసోషియేషన్ అధ్యక్షుడు భారత లవకుమార్, చేనేత సహకార సంఘంతో పాటు గద్వాల్, నారాయణపేట, సిద్ధిపేట గొల్లభామ చేనేత స్టాల్స్ ఏర్పాటు చేశారు.వీటిలో పోచంపల్లి ఇక్కత్‌తో పాటు తేలియారుమాళ్లు, గొల్లభామలు చీరలను చూసి ప్రపంచ సుందరీమణులు మురిసిపోయారు. సంప్రదాయ చీరకట్టుతో నృసింహుడి క్షేత్రానికి.. కరేబియన్ దీవులకు చెందిన తొమ్మిది మంది సుందరీమణులు యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయంలో శిల్ప కళను చూసి పరవశం పొందారు. సంప్రదాయ చీరకట్టు, లంగా ఓణీతో సాయంత్రం 5గంటలకు కొండపైన గల అతిథిగృహానికి చేరుకున్న సుందరీమణులు.. తొలుత అఖం దీపారాధన చేశారు. ఆ తరువాత శ్రీలక్ష్మీనరసింహస్వామి ఫొటోకు పూజలు చేసి మీడియా గ్యాలరీ వద్ద అతిథులకు అభివాదం చేశారు. అలాగే బ్రహ్మోత్సవ మండపం వద్ద ఎల్ఈడీ స్క్రీన్‌లో శ్రీస్వామివారి కై ంకర్యాలను వీక్షించి ఫొటోలు దిగారు. ఇక్కత్ వస్త్రాలతో సన్మానం సుందరీమణులకు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి ఇక్కత్ శాలువాతో సన్మానించారు.ఫ జిల్లాలో రెండు బృందాలుగా పర్యటన ఫ ఒక టీం భూదాన్‌పోచంపల్లి, మరొకటి యాదగిరిగుట్ట ఆలయ సందర్శన ఫ ఇక్కత్ డిజైన్లు చూసి అబ్బురపడిన అందగత్తెలు ఫ యాదగిరిగుట్టలో నృసింహుడి దర్శనం, శిల్పకళను వీక్షించి పరవశం -
ఆటో బోల్తా.. ఒకరు మృతి
● మరొకరికి తీవ్ర గాయాలు వలిగొండ: ఆటో బోల్తాపడి ఒకరు మృతిచెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన వలిగొండ మండలం అక్కంపల్లి సమీపంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కంచెనపల్లికి చెందిన లాడే సుధాకర్ (40), లాడే అంజాజీ ఇద్దరు కలిసి వాహన బ్యాటరీల వ్యాపారం నిమిత్తం గురువారం ఆటోలో చౌటుప్పల్‌కు వచ్చారు. తిరుగు ప్రయాణంలో వలిగొండ మండలం అక్కంపల్లి వద్ద ఆటో బోల్తా పడడంతో ఆటో నడుపుతున్న సుధాకర్ అక్కడికక్కడే మృతిచెందాడు. అంజాజీకి తీవ్ర గాయాలయ్యాయి. వాహనదారులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం, అంజాజీకి వైద్యం నిమిత్తం రామన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ యుగంధర్ తెలిపారు. -
వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసు చోరీ
నకిరేకల్ : వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసును గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. ఎస్ఐ లచ్చిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నకిరేకల్ మండలం మర్రూర్ గ్రామానికి చెందిన పుట్ట చంద్రమ్మ గురువారం తన ఇంటి బయట కూర్చోని ఉండగా.. ఇద్దరు యవకులు ఆమె వద్దకు వచ్చి మెడలోని రెండున్నర తులాల బంగారు గొలుసును లాక్కోని పారిపోయారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చసినట్లు ఎస్ఐ తెలిపారు. బస్సులో సీటు కోసం కొట్లాట యాదగిరిగుట్ట: యాదగిరి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు తిరుగు ప్రయాణంలో బస్సులో సీటు కోసం కొట్టుకున్నారు. గురువారం ఉదయం 11గంటల సమయంలో స్వామిని దర్శించుకునేందుకు హైదరాబాద్‌కు చెందిన భక్తులు వచ్చి తిరుగు ప్రయాణమయ్యారు. ఇదే సమయంలో కొండ పైన బస్టాండ్‌లోకి బస్సు రావడంతో సీట్ల కోసం ప్రయాణికులు పోటీ పడ్డారు. ఈ సమయంలో మహిళా భక్తుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆగ్రహానికి లోనైన ఇరు వర్గాల కుటుంబ సభ్యులు ఒకరిపై ఒకరు దాడి చేసుకుకున్నారు. దీంతో అక్కడే ఉన్న ఎస్పీఎఫ్ పోలీసులు, ఆలయ సిబ్బంది వారిని అడ్డుకొని, పంపించారు. -
సీఎం రేవంత్‌రెడ్డి చొరవతోనే..
– ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌రెడ్డి సీఎం రేవంత్‌రెడ్డి చొరవతోనే హైదరాబాద్ వేదికగా మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్నాయని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు. పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలు ఎంతో అందంగా, సాంస్కృతిక వారసత్వానికి చిహ్నాలుగా నిలుస్తాయని అన్నారు. మిస్ వరల్డ్ కాంటెస్టెంట్లు పోచంపల్లికి రావడం ద్వారా చేనేతకు మరింత వైభవం వస్తుందని అన్నారు. ప్రతిఒక్కరూ చేనేతను ఆదరించాలని విజ్ఞప్తిచేశారు. ఈ కార్యక్రమంలో స్టేట్ ఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్, మిస్ వరల్డ్ పోచంపల్లి ప్రోగ్రాం ఇన్చార్జి లక్ష్మి, రాచకొండ సీపీ సుధీర్‌బాబు, తెలంగాణ టూరిజం జనరల్ మేనేజర్ మందడి ఉపేందర్‌రెడ్డి, జెడ్పీ సీఈఓ శోభారాణి, పద్మశ్రీ అవార్డు గ్రహీతలు గజం గోవర్ధన్, చింతకింది మల్లేశం, భువనగిరి డీసీపీ అక్షాంశ్‌యాదవ్, ఏసీపీ మధుసూదన్‌రెడ్డి, చేనేత జౌళిశాఖ ఏడీ శ్రీనివాస్‌రావు, ఇన్చార్జి తహసీల్దార్ నాగేశ్వర్రావు, వివిధ శాఖల అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. -
సౌదీఅరేబియాలో కోదాడ వాసి మృతి
కోదాడరూరల్: సౌదీఅరేబియాలో కోదాడ పట్టణానికి చెందిన వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కోదాడ పట్టణంలోని కౌసర్‌నగర్‌కు చెందిన షేక్ తాజుద్దీన్(49) ఉపాధి కోసం పదేళ్ల కిందట సౌదీఅరేబియాకు వెళ్లాడు. అక్కడ దమామ్ పట్టణంలో నివాసముంటూ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అప్పుడప్పుడు ఇండియాకు వచ్చి వెళ్తుండేవాడు. నెల రోజుల క్రితం సౌదీఅరేబియాలో తనకు పరిచయం ఉన్న కపిల్ పేరు మీద తాజుద్దీన్ లైసెన్స్ తీసుకొని కూరగాయల వ్యాపారం మొదలుపెట్టాడు. కొన్నిరోజుల తర్వాత షాపు లైసెన్స్ తన పేరు మీద ఉంది కావును షాపును తనకు అప్పగించి వెళ్లిపోవాలని కపిల్ తాజుద్దీన్‌ను బెదిరించసాగాడు. ఈ క్రమంలో ఈ నెల 8వ తేదీన తాజుద్దీన్ అనుమానాస్పదస్థితిలో కాలిపోయి చావుబతుకుల మధ్య ఉంటే స్థానికులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం ఉదయం తాజుద్దీన్ మృతిచెందినట్లు అతడి స్నేహితులు ఫోన్ చేసి తాజుద్దీన్ కుటుంబ సభ్యులకు తెలిపారు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. తాజుద్దీన్ మృతదేహాన్ని ఇండియాకు తీసుకొచ్చేందుకు కుటుంబ సభ్యులు, నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. మార్చి 3న అక్కడకు వెళ్లి..జనవరి 6న తాజుద్దీన్, అతడి భార్య షాజహాన్ కలిసి ఇండియాకు వచ్చారు. మార్చి 3న తిరిగి సౌదీఅరేబియాకు వెళ్లి రూ.10లక్షల అప్పులు తీసుకొచ్చి కూరగాయల షాపు పెట్టినట్లు తాజుద్దీన్ భార్య తెలిపారు. షాపు పెట్టిన తర్వాత కపిల్ షాపు తనకు అప్పగించాలని బెదిరించినట్లు ఆమె పేర్కొన్నారు. -
వ్యక్తి మృతికి కారణమైన నిందితుడికి జైలుశిక్ష
చివ్వెంల(సూర్యాపేట): వ్యక్తి మృతికి కారణమైన నిందితుడికి ఐదేళ్లు జైలు శిక్ష, రూ.10వేల జరిమానా విధిస్తూ సూర్యాపేట జిల్లా ప్రధాన న్యాయ మూర్తి పి. లక్ష్మీశారద గురువారం తీర్పు వెలువరించారు. ఆత్మకూర్ (ఎస్) మండలం దాచారం గ్రామానికి చెందిన బొమ్మగాని శ్రీనివాస్‌కు అదే మండలం తుమ్మల పెన్‌పహాడ్ గ్రామ శివారులో 14 గుంటల భూమి ఉంది. అందులో 2 గుంటల భూమిని 2005లో తుమ్మల పెన్‌పహాడ్ గ్రామానికే చెందిన సల్లగుండ్ల బజార్‌కు విక్రయించాడు. దాని పక్కనే మరో 3 గుంటల భూమిని 2020లో బోట్యా తండాకు చెందిన గుగులోతు బుజ్జ మ్మకు విక్రయించాడు. 2020 జూన్ 16న బుజ్జ మ్మకు విక్రయించిన భూమిని కొలిచేందుకు గ్రామానికి చెందిన కొంతమంది పెద్దమనుషులను తీసుకుని వెళ్లాడు. భూమిని కొలుస్తుండగా.. పక్కనే భూమి ఉన్న సల్లగుండ్ల బజార్, అతడి భార్య యల్లమ్మ, కుమారుడు పవన్, అల్లుడు ఎర్ర సుమన్ అక్కడకు వచ్చి వారిని అడ్డుకున్నారు. తమకు విక్రయించిన భూమికి వాస్తు కోసం ఇంకా కొంత భూమి ఇవ్వాలని బొమ్మగాని శ్రీనివాస్‌తో ఘర్షణకు దిగారు. ఈ క్రమంలో నల్లగుండ్ల బజార్ బొమ్మగాని శ్రీనివాస్ గుండైపె బలంగా గుద్దడంతో శ్రీనివాస్ స్పృహతప్పి పడిపోయాడు. వెంటనే అతడిని అక్కడే ఉన్న పెద్దమనుషులు సూర్యాపేటలోని ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించగా అప్పటికే మృతిచెందాడు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు అప్పటి సీఐ విఠల్‌రెడ్డి సల్లగండ్ల బజార్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. పలువురు సాక్షులను విచారించిన న్యాయమూర్తి పబ్లిక్ ప్రాసిక్యూటర్ కొంపల్లి లింగయ్య వాదనలతో ఏకీభవిస్తూ నిందితుడు సల్లగుండ్ల బజార్‌కు ఐదేళ్ల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు లైజన్ ఆఫీసర్ గంపల శ్రీకాంత్, కోర్టు కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు సహకరించారు. గుండెపోటుతో సీపీఎం నేత చిట్యాల బుచ్చిరెడ్డి మృతిచౌటుప్పల్ రూరల్: చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామానికి చెందిన సీపీఎం సీనియర్ నాయకుడు చిట్యాల బుచ్చిరెడ్డి గుండెపోటుతో గురువారం మృతిచెందారు. రామన్నపేట తాలుకాలో సీపీఎం నిర్మాణం కోసం ఆయన ఎంతో కృషిచేశారు. గీత కార్మికుల హక్కుల కోసం అనేక పోరాటాలు చేశారు. నక్సలైట్ల హిట్ లిస్ట్‌లో ఉన్నా కూడా ధైర్యంతో చౌటుప్పల్ ప్రాంతంలో పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడ్డారు. బుచ్చిరెడ్డి అంత్యక్రియలు శుక్రవారం పంతంగి గ్రామంలో నిర్వహించనున్నట్లు సీపీఎం గ్రామశాఖ కార్యదర్శి రత్నం శ్రీకాంత్ తెలిపారు. బుచ్చిరెడ్డి మృతదేహానికి పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు బూర్గు కృష్ణారెడ్డితో పాటు సీపీఎం నల్లగొండ జిల్లా కమిటీ సభ్యులు పుచ్చకాయల నర్సిరెడ్డి, ఎండీ సలీం, భువనగిరి జిల్లా కమిటీ సభ్యుడు ఎండీ పాషా, సింగిల్‌విండో మాజీ చైర్మన్ చీరిక సంజీవరెడ్డి, నాయకులు బోయ యాదయ్య, అంతటి అశోక్ తదితరులు నివాళులర్పించారు. -
తెలంగాణ జరూర్ ఆనా..
సాక్షి, యాదాద్రి : ప్రపంచ సిల్క్ సిటీగా, సాంస్కతిక వారసత్వం, ఇక్కత్ చీరల నేతకు ప్రసిద్ధిగాంచిన భూదాన్‌పోచంపల్లి, ఆధ్యాత్మిక దివ్యక్షేత్రం యాదగిరిగుట్ట దేవస్థానం అంతర్జాతీయ సుందరీమణుల మన్ననలు పొందాయి. ప్రధానంగా పోచంపల్లి చీరల తయారీ,డిజైన్,అద్దకం ఇక్కత్ వస్త్రాలను చూసి అబ్బురపడ్డారు.అంతేకాక రుంజా వాయిద్యం,సంస్కృతి,సాంప్రదాయ నాదస్వర ,కోలాటాల స్వాగతంతో మైమరచిపోయారు. టూరిజం పార్క్ లోకి ఆహ్వానిస్తూ పోచంపల్లికి హృదయపూర్వక స్వాగతం్ఙ అంటూ అందగత్తెలకు ఆత్మీయ స్వాగతం పలికారు. పోచంపల్లి చేనేత టూరిజం పార్క్ ప్రవేశ దారం వద్ద ఫోటోలకు ఫోజులిస్తూ ‘తెలంగాణ జరూర్ ఆనా’ అంటూ నినదించారు. ఇక్కత్ చీరలు, వస్త్రాల తయారీని చూసి వీరు అబ్బురపడ్డారు.ప్రత్యేకమైన ఇక్కత్ చీరల తయారీ విధానాన్ని స్థానిక పార్కులోపరిశీలించిన అతిథులు, రాట్నంతో దారం చుట్టడం నుంచి రంగులు చొప్పించే క్లిష్టమైన ప్రక్రియలను చూసి ఆశ్చర్యచకితులయ్యారు. స్టెప్పులేసిన సుందరీమణులు రుంజా కిన్నెర,వాయిద్యాల మధుర సంగీతం అందగత్తెలను మంత్రముగ్ధుల్ని చేసింది. కొందరు కంటెస్టెంట్ లు స్వయంగా రుంజా వాయించగా, మరికొందరు సంగీథానికి లయబద్దంగా నాట్యం చేశారు. అరి చేతులపై నెమలి సోయగం, నాజూకై న నక్షత్రాలు, పువ్వుల డిజైన్లతో మురిసిపోయిన బ్యూటీలు ఫొటో సెషన్లకు పోజ్ ఇచ్చారు. నినదించిన ప్రపంచ అందగత్తెలు సుందరాంగుల మనసుదోచుకున్న భూదాన్‌పోచంపల్లి ఆకట్టుకున్న ఇక్కత్ చీరల ప్రక్రియ, డిజైన్లు అపూర్వ స్వాగతానికి అబ్బురపడిన అందగత్తెలు -
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని..
గట్టుప్పల్ : వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను హతమార్చింది భార్య. ఈ ఘటన గట్టుప్పల్ మండలం వెల్మకన్నె గ్రామంలో ఈ నెల 10న చోటు చేసుకోగా.. పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టి నిందితులిద్దరిని అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి గురువారం విలేకరులకు వెల్లడించారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. వెల్మకన్నె గ్రామానికి చెందిన వల్ల పు మల్లేష్(37) ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మల్లేష్ భార్య హేమలతతో అదే గ్రామానికి చెందిన రేవెల్లి నవీన్ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయం మల్లేష్‌కు తెలియడంతో హేమలతను మందలించాడు. దీంతో తమ వివాహేతర సంబంధానికి మల్లేష్ అడ్డొస్తున్నాడని అతడిని అంతమొందించాలని అతడి భార్య హేమలత, ఆమె ప్రియుడు నవీన్ నిర్ణయించుకున్నారు. మద్యం తాగించి.. ఈ నెల 10వ తేదీ మధ్యాహ్నం మల్లేష్ నూతనంగా నిర్మిస్తున్న ఇంట్లో టైల్స్ పెట్టడానికి నవీన్ వచ్చాడు. అనంతరం వారిద్దరు కలిసి గ్రామంలో మద్యం తాగి తమ ఇళ్లకు వెళ్లారు. తిరిగి సాయంత్రం నవీన్ మల్లేష్‌ను పిలిచి ఫుల్లుగా మద్యం తాగించాడు. ఈ విషయాన్ని నవీన్ ఫోన్ ద్వారా హేమలతకు చెప్పాడు. రాత్రి 10.30 గంటలకు మల్లేష్‌ను నవీన్ బైక్‌పై ఇంటికి తీసుకెళ్లి వదిలిపెట్టి అక్కడే ఉన్నాడు. ఈ క్రమంలో మల్లేష్ మంచంపై నిద్రకు ఉపక్రమించగానే నవీన్, హేమలత కలిసి టవల్‌తో మల్లేష్ ముఖంపై అదిమిపట్టి శ్వాస ఆడకుండా చేసి హతమార్చారు. మరుసటిరోజు తెల్లవారుజామున తన భర్త చనిపోయాడని హేమలత కేకలు వేస్తూ అత్తమామలకు, ఇరుగు పొరుగు వారికి చెప్పింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని హేమలతను ప్రశ్నించగా.. ఆమె పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అనుమానించి విచారణ చేపట్టారు. ఈ విచారణలో హేమలత, ఆమె ప్రియుడు నవీన్ కలిసి పథకం ప్రకారమే మల్లేష్ హతమార్చినట్లు నిర్ధారణ కావడంతో వారిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. డీఎస్పీ శివరాంరెడ్డి పర్యవేక్షణలో ఈ కేసును ఛేదించిన చండూరు సీఐ ఆదిరెడ్డి, గట్టుప్పల్ ఎస్ఐ వెంకట్‌రెడ్డి, ఏఎస్ఐ ఆర్. అంజయ్య, పోలీస్ సిబ్బంది వి. రమేశ్, సుదర్శన్‌ను జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ అభినందించారు. ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య నిందితుల అరెస్ట్.. రిమాండ్‌కు తరలింపు వివరాలు వెల్లడించిన నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి -
కంటైనర్‌ను ఢీకొట్టిన కారు.. భార్య మృతి
చివ్వెంల(సూర్యాపేట): ఆగి ఉన్న కంటైనర్‌ను కారు ఢీకొట్టిన ఘటనలో భార్య మృతిచెందగా.. భర్తకు గాయాలయ్యాయి. ఈ ఘటన చివ్వెంల మండలం ఐలాపురం గ్రామ శివారులో సూర్యాపేట–ఖమ్మం రహదారిపై గురువారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన భృగుమళ్ల హరీష్, అతని భార్య కళ్యాణి (32) కారులో ఖమ్మంకు వెళ్తుండగా మార్గమధ్యలో చివ్వెంల మండలం ఐలాపురం గ్రామ శివారులో సూర్యాపేట–ఖమ్మం రహదారి పక్కన ఆగి ఉన్న కంటైనర్‌ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో కళ్యాణి తలకు, చాతిలో బలమైన గాయాలై అక్కడికక్కడే మృతిచెందింది. కారులో ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో హరీష్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. హరీష్ ఫిర్యాదు మేరకు ఎస్ఐ వి. మహేశ్వర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట జనరల్ హాస్పిటల్‌కు తరలించారు. భర్తకు గాయాలు -
పోచంపల్లికి జరూర్ ఆనా..
– కలెక్టర్ హనుమంతరావు భూదాన్‌పోచంపల్లి: తెలంగాణతో పాటు పోచంపల్లికి జరూర్ ఆనా అని కలెక్టర్ హనుమంతరావు సుందరీమణులను కోరారు. హంపి థియేటర్ జరిగిన ర్యాంప్‌వాక్ కార్యక్రమం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోచంపల్లి ఇక్కత్ ప్రత్యేకమైన కళ అని, ఇది ప్రపంచంలో మరెక్కడా లేదన్నారు. 2021లో యునెస్కో చేనేత ఉత్తమ హెరిటేజ్ విలేజ్‌గా పోచంపల్లి అంతర్జాతీయ అవార్డు పొందిందని గుర్తు చేశారు. భూదానోద్యమానికి శ్రీకారం చుట్టి లక్షలాది మంది పేదలకు భూదానం చేసిన గొప్ప గ్రామమని కొనియాడారు. భూదాన్‌పోచంపల్లికి సుందరీమణుల సందర్శనతో చేనేతకు మరింత గుర్తింపురావడమే కాకుండా చేనేత కళాకారులకు కూడ మార్కెటింగ్ సదుపాయాలు పెరుగుతాయని అన్నారు. చేనేత కళను సజీవంగా నిలుపుతున్న చేనేత కళాకారులకు ధన్యవాదాలు తెలిపారు. -
యువకుడి ప్రాణం తీసిన చేపల వేట
కనగల్ : చేపల వేట యువకుడి ప్రాణం తీసింది. ఈ ఘటన కనగల్ మండలం పగిడిమర్రి గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. పగిడిమర్రి గ్రామానికి చెందిన అబ్బిడి నాగర్జున్‌రెడ్డి(36) వ్యవసాయంతో పాటు మెటార్ మెకానిక్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం ఉదయం పగిడిమర్రి గ్రామానికే చెందిన కొప్పుల ప్రవీణ్ బోరు మోటారు కాలిపోగా.. దానిని బయటకు తీసిన అనంతరం సమీపంలోనే ఉన్న నోములవారి కుంటలోకి నాగార్జున్‌రెడ్డి చేపల వేటకు వెళ్లాడు. చేపలు పట్టేందుకు కుంటలోకి దిగిన కొన్ని క్షణాల్లోనే నాగర్జున్‌రెడ్డి అందులో మునిగిపోయాడు. అక్కడే ఉన్న ప్రవీణ్ గమనించి గ్రామస్తులకు సమాచారం అందించాడు. గ్రామస్తులు ఎంత వెతికినా కుంటలో నాగార్జున్‌రెడ్డి ఆచూకీ లభించకపోవడంతో ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఫైర్ సిబ్బంది 4గంటల పాటు శ్రమించి నాగార్జున్‌రెడ్డి మృతదేహన్ని కుంటలో నుంచి బయటకు తీశారు. కరెంట్ షాక్‌తో మృతిచెందాడా..?నాగర్జున్రెడ్డితో పాటు మరో ఐదుగురు యువకులు కూడా చేపల వేటకు వెళ్లినట్లు తెలుస్తోంది. వీరు కరెంట్ సహాయంతో చేపలు పట్టేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే నాగర్జున్‌రెడ్డి విద్యుదాఘాతానికి గురై మృతిచెందినట్లు తెలుస్తోంది. మృతుడికి ఈత వచ్చని, చిన్న కుంటలో మునిగిపోయే అవకాశమే లేదని గ్రామస్తులు, బంధువులు పేర్కొంటున్నారు. గతంలో ఇదే గ్రామానికి చెందిన ఇద్దరు కరెంట్ సహాయంతో చేపలు పట్టేందుకు వెళ్లి మృత్యువాత పడ్డారు. ఈ క్రమంలోనే వారం క్రితం గ్రామ పరిధిలోని కుంటల్లో కరెంట్ సహాయంతో చేపలు పడితే రూ.10వేల జరిమానా విధిస్తామని డప్పు చాటింపు కూడా వేయించినట్లు మాజీ సర్పంచ్ గోలి నర్సిరెడ్డి తెలిపారు. గ్రామంలో విషాధచాయలు..నాగర్జున్‌రెడ్డి మృతితో పగిడిమర్రి గ్రామంలో విషాధచాయలు అలుముకున్నాయి. ఒక్కగానొక్క కుమారుడు మృతిచెందడంతో నాగార్జున్‌రెడ్డి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుడికి 3వ తరగతి చదివే కుమార్తె, 1వ తరగతి చదివే కుమారుడు ఉన్నాడు. నాగార్జున్‌రెడ్డి భార్య కోమలి ఏడుస్తున్న తీరు చూసి గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు. తహసీల్దార్ పద్మ ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందించలేదని పోలీసులు తెలిపారు. కుంటలో మునిగి మృతి కనగల్ మండలం పగిడిమర్రిలో ఘటన -
Miss World 2025: యాదగిరిగుట్టలో ప్రపంచ అందగత్తెలు
యాదాద్రి: ప్రపంచ హెరిటేజ్ విలేజ్ భూదాన్ పోచంపల్లి, ఆధ్మాతిక క్షేత్రమైన యాదగిరిగుట్టలో ఇవాళ ప్రపంచ సుందరీమణులు పర్యటించారు. మిస్ వరల్డ్ పోటీదారులకు ఆలయ సంప్రదాయం ప్రకారం అధికారులు ఘన స్వాగతం పలికారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. ముందుగా పోచంపల్లిలో చేనేత ఇక్కత్, డబుల్ ఇక్కత్ చీరల తయారీ, పుట్టపాక తేలియా రుమాల్, సిద్దిపేట గొల్లభామ, నారాయణపేట, గద్వాల చీరలు, వస్త్రాలను పరిశీలించారు. ఇందు కోసం 13 స్టాళ్లను ఏర్పాటు చేశారు.చేనేత విశిష్టతను వివిధ దేశాల అందగత్తెలకు వివరించారు. మరోవైపు తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే కోలాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కృష్ణశిలతో నిర్మితమైన యాదగిరి గుట్ట శ్రీలక్ష్మీ నర్సింహస్వామి ఆలయ విశిష్టతను ప్రపంచ సుందరీమణులకు వివరించారు.కాగా, పట్టు పరికిణీలు, చీరలు కట్టుకొని తెలుగుదనం ఉట్టిపడేలా తిలకం దిద్దుకున్న ప్రపంచ దేశాల సుందరీమణులు నిన్న(బుధవారం) ఓరుగల్లు పర్యటనలో జిగేల్మన్నారు. హెరిటేజ్ వాక్‌లో భాగంగా వివిధ దేశాలకు చెందిన 57 మంది సుందరీమణులు రెండు బృందాలుగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించారు. వరంగల్ కోట సందర్శనలో 22 మంది బుధవారం సాయంత్రం హనుమకొండకు చేరుకున్నారు. మరో బృందం ములుగు జిల్లా రామప్పలో సందడి చేసింది.సుందరీమణులకు తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలతో మహిళలు, సంప్రదాయ డోలు వాయిద్యాలతో ఆత్మీయ స్వాగతం పలికారు. మహిళలతో కలిసి బతుకమ్మ పాటలకు సుందరీమణులు నృత్యాలు చేశారు. అనంతరం సంప్రదాయ ప్రకారం ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన తాంబాలంలోని చెంబులో ఉన్న నీళ్లతో సుందరీమణులు కాళ్లను కడుక్కున్నారు. ఆలయ ఆవరణలో ఉన్న నంది విగ్రహం వద్ద ఫొటో షూట్లో పాల్గొన్నారు.అనంతరం కల్యాణ మంటపాన్ని దర్శించారు. అనంతరం ప్రధాన ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసిన సుందరీమణులు వరంగల్ కోటను సందర్శించి అక్కడే ఏర్పాటు చేసిన పేరిణి శివతాండవం, ఇతర సంప్రదాయ నృత్యాలను చూసి తిరిగి హరిత హోటల్‌కు చేరుకుని డిన్నర్ చేసి హైదరాబాద్‌కు బయలుదేరారు. ములుగు జిల్లా రామప్ప ఆలయం వద్ద ప్రపంచ సుందరీమణులకు గుస్సాడీ నృత్య ప్రదర్శన, ఒగ్గుడోలు ప్రదర్శన ద్వారా కళాకారులు ఆత్మీయ స్వాగతం పలికారు. ఆ తర్వాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ విశిష్టత చరిత్ర ఆలయ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పురాతన కట్టడం, వారసత్వ సంపద.. రామప్ప ఆలయాన్ని తిలకించి మంత్రముగ్ధులయ్యారు. -
బీబీనగర్: తప్పిన పెను ప్రమాదం.. రైలులో మంటలు
యాదాద్రి భువనగిరి జిల్లా: బీబీనగర్ సమీపంలో రెండు రైలు బోగీల నుంచి మంటలు రావడంతో అప్రమత్తమైన ప్రయాణికులు.. సమాచారాన్ని వెంటనే రైల్వే సిబ్బందికి చేరవేశారు. డెమో ప్యాసింజర్ రైలు మిర్యాలగూడ నుంచి కాచిగూడ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో బీబీనగర్ వద్ద రైలును నిలిపివేసి రైల్వే సిబ్బంది మంటలను అదుపు చేశారు. సుమారు గంటకుపైగా రైలు నిలిచిపోయింది.బ్రేక్ ప్యాడ్‌లో లోపం కారణంగా రాపిడితో మంటలు వచ్చినట్లు రైల్వే శాఖ వెల్లడించింది. దట్టమైన పొగలు రావడంతో గమనించిన ప్రయాణికులు.. రైల్వే సిబ్బందిని అప్రమత్తం చేయడంతో ప్రమాదం తప్పింది. బీబీనగర్ స్టేషన్లో మంటలను సిబ్బంది అదుపులోకి తీసుకొచ్చారు. అనంతరం కాచిగూడ రైల్వే స్టేషన్‌కు రైలు బయలుదేరింది. ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. -
బేస్‌బాల్ జాతీయ జట్టుకు పలివెల వాసి ఎంపిక
మిర్యాలగూడ: మునుగోడు మండలం పలివెల గ్రామానికి చెందిన గుత్తి శివకుమార్ బేస్‌బాల్ జాతీయ జట్టుకు ఎంపికై నట్లు మిర్యాలగూడకు చెందిన బేస్‌బాల్ కోచ్, బేస్‌బాల్ అసోసియేషన్ తెలంగాణ జాయింట్ సెక్రటరీ చిర్ర మల్లేష్‌యాదవ్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన శివకుమార్‌కు బేస్‌బాల్ క్రీడ పట్ల ఉన్న ఆసక్తిని గమనించి తాను నల్లగొండ జిల్లా కేంద్రంలో శిక్షణ ఇచ్చినట్లు మల్లేష్‌యాదవ్ తెలిపారు. ఇరాన్ దేశంలో రేపటి నుంచి 21వ తేదీ వరకు జరిగే బేస్‌బాల్ వెస్ట్ ఏషియా కప్ ఇరాన్–2025 ఇంటర్నేషనల్ టోర్నమెంట్లో భారత జట్టు తరఫున శివకుమార్ ఆడనున్నట్లు పేర్కొన్నారు. శివకుమార్ భారత జట్టుకు ఎంపిక కావడం పట్ల అమరావతి సైదులు, పాశం నరసింహారెడ్డి, ఉస్మాన్ షేక్, పరమేష్, శంకర్, మౌనిక, మహేష్, స్వామి, పవన్, రవి తదితరులు అభినందనలు తెలిపారు. కౌలు రైతుల నిరసనతుర్కపల్లి: కౌలు రైతులకు గుర్తింపు కార్డులివ్వాలని తుర్కపల్లికి చెందిన కౌలు రైతు రాపోలు నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం తుర్కపల్లి మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద కౌలు రైతులకు న్యాయం చేయాలంటూ ఆయన నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 2011 సాగుదారు గుర్తింపు కార్డుల చట్టాన్ని వానాకాలం సీజన్ నుంచి అమలు చేయీలని కోరారు. కౌలు రైతులకు రైతు బీమా, రైతు భరోసా, పంటల బీమా, పంట నష్ట పరిహారం, బ్యాంకు రుణాలు మంజారు చేయాలన్నారు. -
అందగత్తెలకు ఆతిథ్యం
నేడు భూదాన్‌పోచంపల్లి, యాదగిరిగుట్టలో మిస్ వరల్డ్ పోటీదారుల పర్యటన సాక్షి, యాదాద్రి, యాదగిరిగుట్ట, భూదాన్‌పోచంపల్లి : మిస్ వరల్డ్ పోటీలో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు వచ్చిన వివిధ దేశాలకు చెందిన సుందరీమణులు గురువారం యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించనున్నారు. యాదగిరిగుట్ట క్షేత్రాని ఓ బృందం, భూదాన్‌పోచంపల్లిలో మరో బృందం సందడి చేయనుంది. వీరి పర్యటన కోసం టూరిజం శాఖతోపాటు జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి చేసింది. పోలీస్ శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. నారసింహుడి క్షేత్రంలో ప్రత్యేక పూజలు వివిధ దేశాలకు చెందిన పది మంది సుందరీమణుల బృందం గురువారం సాయంత్రం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రానికి రానుంది. వీరు ప్రత్యేక బస్సులో హైదరాబాద్ నుంచి యాదగిరి కొండపైకి చేరుకుంటారు. కొండపైన అతిథి గృహం నుంచి ప్రత్యేక బ్యాటరీ వాహనాల్లో అఖండ దీపారాధన వద్దకు చేరుకుని దీపాలు వెలిగిస్తారు. అనంతరం గర్భాలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. సువర్ణ పుష్పార్చనలో పాల్గొంటారు. వేద పండితులు సుందరీమణులకు ఆశీర్వచనం చేసి, శ్రీస్వామి వారి చిత్రపటాలు, లడ్డూ ప్రసాదాలను అందజేస్తారు. దర్శనం తర్వాత ముఖ మండపంలో పలు ప్రాంతాలను వీక్షిస్తారు. అనంతరం స్వర్ణ విమాన గోపురం వద్ద ఆలయమంతా కనిపించేలా ఫొటోలు దిగుతారు. ఆలయంలో ఏర్పాట్లు.. బ్రేక్ దర్శనం రద్దు సుందరీమణులు యాదగిరి క్షేత్రానికి వస్తున్న నేపథ్యంలో ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రధానాలయ ముఖ మండపం, మహా రాజగోపురాలను అలంకరించారు. ఈ సందర్భంగా గురువారం సాయంత్రం భక్తులకు కల్పించే బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు. దీంతో పాటు జోడు సేవలను రద్దు చేశారు. సుందరీమణులు వెళ్లిన తరువాత భక్తులకు శ్రీస్వామి వారి దర్శనాలను కొనసాగిస్తారు. పోచంపల్లికి 25 మంది అందాలభామలు ఇక్కత్ వస్త్రాలకు ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచి, యునెస్కో అనుబంధ సంస్థచే ఉత్తమ పర్యాటక గ్రామంగా అంతర్జాతీయ అవార్డు అందుకున్న భూదాన్‌పోచంపల్లిని గురువారం సాయంత్రం 6 గంటలకు 25 మంది సుందరీమణులు సందర్శిస్తారు. టూరిజం పార్కులోని మ్యూజియంలో దారం నుంచి చేనేత వస్త్రాల తయారీ ప్రక్రియలను పరిశీలిస్తారు. వీరికి సింగిల్ ఇక్కత్, డబుల్ ఇక్కత్, తేలియా రుమాలు, చేనేత వస్త్రాల ప్రాముఖ్యతను వివరిస్తారు. హంపీ థియేటర్లో మోడల్స్‌చే నిర్వహించే ర్యాంప్ వాక్‌ను తిలకిస్తారు. పద్మశ్రీ గజం గోవర్ధన్, జాతీయ, రాష్ట్ర అవార్డు గ్రహీతలైన తడక రమేశ్, సాయిని భరత్, బోగ బాలయ్య, ఎన్నం మాధవి శివకుమార్, చేనేత సహకార సంఘం, పోచంపల్లి టై అండ్ డై అసోషియేషన్ల ఆధ్వర్యంలో పది స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. సంస్కృతికి పెద్దపీట కాగా టూరిజం పార్కులో చేనేతకు ప్రాధాన్యతమిస్తూనే మన సంస్కృతి, సంప్రదాయాలు, గ్రామీణ వాతావరణం ప్రతిబింబించేలా పెద్దపీట వేస్తూ అధికారులు ఏర్పాట్లు చేశారు. తెలంగాణ పండుగల ప్రాశస్థ్యాన్ని తెలియజేసే బతుకమ్మ, ఎడ్లబండి ప్రదర్శన, పల్లెలోని గుడిసె సెట్ వేసి అందులో చేనేత స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. ప్రపంచ సుందరీమణులకు స్థానిక మహిళలు బొట్టుపెట్టడం, పూలమాలలు వేసి సత్కరించనున్నారు. ఈ సందర్భంగా టూరిజం పార్కుతోపాటు పలు ప్రాంతాలను రంగురంగుల లైట్లతో తీర్చిదిద్దారు. ఫ శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోనున్న సుందరీమణులు ఫ టూరిజం పార్కులో చేనేత వస్త్రాల తయారీ ప్రక్రియల పరిశీలన ఫ ఏర్పాట్లు పూర్తిచేసిన యంత్రాంగంయాదగిరిగుట్టలో పర్యటన ఇలా.. అందగత్తెలు సాయంత్రం 5 గంటలకు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం అతిథిగృహానికి చేరుకుంటారు. 5:10– 5:20 గంటల వరకు అఖండ దీపారాధనలో పాల్గొంటారు. 5:20 – 5:30 వరకు స్థానిక కళాకారుల కోలాటం, సంప్రదాయ భజన, శాసీ్త్రయ నృత్యబృందాలతో తూర్పు గోపురానికి వెళ్తారు. 5:30 – 5:40 ఆలయ ప్రాంగణంలో ఫొటోషూట్ 5:50– 6 గంటల వరకు గర్భాలయంలో ప్రత్యేక పూజ, పంచనారసింహస్వామి దర్శనం 6:10 – 6:25 వరకు ఆలయ ప్రాంగణంలో గల శిల్పకళపై ఫొటో సెషన్. 6.30 – 6.40 : ఆలయ ప్రొటోకాల్ గెస్ట్ హౌస్‌లో అతిథులకు టీ, స్నాక్స్ అనంతరం కొంతసేపు సేదదీరుతారు. సాయంత్రం 6:40 గంటలకు గెస్ట్ హౌస్ నుంచి బయలుదేరి రోడ్డు మార్గంలో తిరిగి హైదరాబాద్ వెళ్తారు. పోచంపల్లిలో.. సాయంత్రం 6 గంటలకు పోచంపల్లి టూరిజం పార్క్‌కు చేరుకుంటారు. 6:10 గంటల వరకు కోలాట బృందాలు తెలంగాణ సంప్రదాయం ప్రకారం స్వాగతం పలుకుతాయి. 6:10 నుంచి 6:25 గంటల వరకు మ్యూజియం టూర్, మగ్గం వర్క్ గురించి వారికి చేనేత కళాకారులు వివరిస్తారు. టూరిజం పార్క్ ప్రాంగణంలో మెహందీ, లైవ్ మ్యూజిక్ కార్యక్రమంలో పాల్గొంటారు. రాత్రి 7:05 నుంచి7:30 గంటల వరకు మిస్ వరల్డ్ పోటీదారులు చేనేత జౌళి శాఖ ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శిస్తారు. 7:40 నుంచి 7:45 : తెలంగాణ టూరిజం రూపొందించిన అధికారిక వీడియో ప్రదర్శనను వీక్షిస్తారు. 7:45 నుంచి 8:15 గంటల వరకు తెలంగాణ హ్యాండ్లూమ్ ప్రదర్శన ఉంటుంది. ఇక్కడే స్థానిక మోడల్స్ తెలంగాణ చేనేత వస్త్రాలతో తయారు చేసిన దుస్తులను ధరించి సుందరీమణుల ముందు ప్రదర్శిస్తారు. 8:30 గంటలకు హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అవుతారు. -
వైభవంగా చక్రతీర్థస్నానం
మఠంపల్లి: మట్టపల్లిలో కొనసాగుతున్న తిరుకల్యాణోత్సవాల్లో భాగంగా బుధవారం అర్చకులు కృష్ణానదిలో శ్రీలక్ష్మీనరసింహస్వామిఅమ్మవారికి చక్రతీర్థస్నానం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. అంతకుముందు ఆలయంలో పూర్ణాహుతి చేపట్టారు. యాజ్ఞీకులు బొర్రా వెంకటవాసుదేవాచార్యులు ఆధ్వర్యంలో ప్రాతాః కాలార్చన, సుప్ర భాత సేవ, ద్రవిడ ప్రబంధసేవాకాలం, పంచామృతాభిషేకం, మంత్ర పుష్ప నీరాజనాలతో శ్రీరాజ్యలక్ష్మి అమ్మవారికి సమస్ర కుంకుమార్చన చేశారు. శ్రీస్వామి అమ్మవార్లను పల్లకిలో కృష్ణానదిలోని ప్రహ్లాద ఘాట్‌కు తరలించి వసంతసేవ, చక్రస్నానం నిర్వహించారు. ఆలయ ప్రవేశం అనంతరం నీరాజనమంత్రపుష్పాలతో మహానివేదన చేశారు. సాయంత్రం దోపుఉత్సవం, ధ్వజారోహణం, మౌనబలి నిర్వహించారు. గురువారం రాత్రి పవళింపుసేవతో కల్యాణోత్సవాలు ముగుస్తాయి. ఈకార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, ఈఓ నవీన్‌కుమార్, అర్చకులు పాల్గొన్నారు. -
అమరవీరుల స్ఫూర్తితోనే రాష్ట్రంలో ప్రజాపాలన
శాలిగౌరారం: అమరవీరుల స్ఫూర్తితోనే తెలంగాణలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రజాపాలనను అందిస్తున్నారని ఏఐసీసీ నాయకుడు, పీసీసీ మాజీ అధ్యక్షుడు వి. హన్మంతరావు అన్నారు. శాలిగౌరారం మండలం వల్లాల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అమరులైన వారికి స్మారక స్థూపం నిర్మించేందుకు బుధవారం ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమరుల త్యాగాలను గుర్తిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అందుకోసం సాహసోపేతమైన నిర్ణయాలతో ముందుకు సాగుతోందన్నారు. ఆనాడు రజాకార్లకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాలకు ఉమ్మడి నల్లగొండ జిల్లానే కేంద్రబిందువు అయ్యిందని అన్నారు. దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మతో పాటు అనేక మంది పోరాటంతోనే నిజాం పాలన నుంచి విముక్తి కలిగిందన్నారు. చరిత్ర తెలియకుండా కొంతమంది నాయకులు తమ ఇష్టానుసారం మాట్లాడుతున్నారని, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు సరికాదన్నారు. వల్లాల అవరవీరుల కుటుంబాలను అన్నివిధాలుగా ఆదుకుంటామన్నారు. తన సొంత ఖర్చులు రూ.3లక్షలతో అమరవీరుల స్మారక స్థూపం నిర్మాణ పనులను ఆగస్టు 15 నాటికి పూర్తిచేసి సీఎం రేవంత్‌రెడ్డి చేతులమీదుగా ఆవిష్కరింపజేస్తానన్నారు. భూమి పూజ తర్వాత ఆయన స్వయంగా కంకర, ఇసుక, సిమెంట్‌ను తలపై మోసి తాపీ మేసీ్త్రలకు అందించారు. కార్యక్రమంలో ఏఐసీసీ నాయకుడు ఎంఏ బాసిత్, పీసీసీ నాయకుడు శ్రీకాంత్‌గౌడ్, డీసీసీ ఉపాధ్యక్షుడు అన్నెబోయిన సుధాకర్, దండ అశోక్‌రెడ్డి, శాలిగౌరారం వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నరిగె నర్సింహ, మాజీ సర్పంచ్ షేక్ ఇంతియాజ్, మాధారంకలాన్ మాజీ ఎంపీటీసీ నోముల జనార్దన్, కట్టంగూరి శ్రీను, సురేందర్‌రెడ్డి, విజయ్, అంజయ్య తదితరులు పాల్గొన్నారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు వి. హన్మంతరావు -
యాదగిరి క్షేత్రంలో నిత్యపూజలు
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బుధవారం నిత్య పూజలు విశేషంగా కొనసాగాయి. వేకువజామునే ఆలయాన్ని తెరిచిన ఆచార్యులు స్వయంభూ, ప్రతిష్ఠా అలంకార మూర్తులకు సుప్రభాతం, అర్చన, అభిషేకం వంటి సంప్రదాయ పూజలను నిర్వహించారు. ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి పూజలను విశేషంగా జరిపించారు. అనంతరం ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు అష్టోత్తర పూజలు చేపట్టారు. ఆయా పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి శ్రీస్వామి వారికి శయనోత్సవం జరిపించి, ద్వారా బంధనం చేశారు. పంటల మార్పిడితో అధిక దిగుబడులుభువనగిరి : రైతులు పంట మార్పిడితో అధిక దిగుబడులు సాధిస్తూ.. సుస్థిర ఆదాయాన్ని పొందవచ్చని ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ విస్తరణ సంచాలకులు డాక్టర్ ఎం యాకాద్రి అన్నారు. బుధవారం మండలంలోని చందుపట్ల గ్రామంలో రైతు ముంగిట్లో శాస్త్ర వేత్తలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంటల మార్పిడి విధానం తో నేల సారం పరిరక్షించబడుతుందన్నారు. పరిమిత నీటితో సాగు చేయవచ్చన్నారు. అనంతరం పంటల సాగు విధాన పై ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ అనిల్‌కుమార్ అవగాహన కల్పించారు. వ్యవసాయ సాగులో మెలుకువలకు సంబందించి పాటించవల్సిన నియామలకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు మధుశేఖర్, భూగర్భ నీటి విభాగం అధికారి అశ్విత్, ఏఓ మల్లేష్, ఏఈఓ మల్లేష్, ఉపాధ్యాయులు వేణుగోపాల్, మాజీ ఎంపీటీసీ కొండల్‌రెడ్డి, అభ్యుదయ రైతులు సిద్దారెడ్డి,రాములు, కృష్ణారెడ్డి, మార్కెట్ కమిటి డైరెక్టర్ కృష్ణయ్య, విజయకాంత్, రూప తదితరులు పాల్గొన్నారు. యువ వికాసం దరఖాస్తుల పరిశీలనఆలేరురూరల్: యువ వికాసం పథకం దరఖాస్తులను త్వరగా పరిశీలించాలని లీడ్ బ్యాంక్ మేనేజర్ శివరామకృష్ణ, ఎస్సీ కార్పోరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్యామ్ సుందర్ అన్నారు. బుధవారం ఆలేరు మండల పరిషత్ కార్యాలయంలో ఉన్న రాజీవ్ యువ వికాసం దరఖాస్తులను వారు పరిశీలించి మాట్లాడారు. ఆలేరు మండల పరిధిలో 1,809 దరఖాస్తులు చేసుకోగా ఇందులో 1,425 మంది ఎంపీడీఓ కార్యాలయంలోనే అందజేశారని ఎంపీడీఓ సత్యాంజనేయ ప్రసాద్ తెలిపారు. వారి వెంట మండల స్పెషల్ అధికారి గోపాల్ తదితరులు ఉన్నారు. అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకోవాలి భానుపురి (సూర్యాపేట) : తెలంగాణ మైనార్టీస్ రెసిడెన్షియల్ సూళ్లు, కాలేజీల్లో అడ్మిషన్ల కోసం మైనార్టీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ సూచించారు. బుధవారం సూర్యాపేట కలెక్టరేట్లో తెలంగాణ మైనార్టీస్ రెసిడెన్షియల్ స్కూల్స్, కాలేజీల్లో అడ్మిషన్ దరఖాస్తుల స్వీకరణ, 2024–25 విద్యా సంవత్సరం సాధించిన ఫలితాల పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డీఎండబ్ల్యూఓ నరసింహారావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్రీనివాస్‌నాయక్, డీటీడీఓ శంకర్ పాల్గొన్నారు. -
నీటి బాధ తప్పింది
రెండేళ్ల కిందటి వరకు మా గ్రామంలో నీటి సమస్య బాగా ఉండేది. మూసీ నదిలో బావి తవ్వుకొని ఓడలు (రింగ్‌లు) ఏర్పాటు చేసుకునే వాళ్లం. ఒక్కోసారి నీరు అందక మోటార్లు కాలిపోయేవి. చెక్‌డ్యామ్‌లు నిర్మించాక ఆ సమస్యలు తొలగిపోయాయి. రెండు పంటలకు నీరు అందుతోంది. – సంకరమద్ధి రమణారెడ్డి, కాసరబాద రైతులకు మేలు గ్రామంలో వేసవి కాలంలో బోర్లు, బావులు ఇంకిపోయేవి. పక్కన మూసీ నది ఉన్నా తాగడానికి పనికిరావు. ప్రస్తుతం చెక్ డ్యామ్ వల్ల భూగర్భ జలాలు పెరిగి బోర్లు, బావుల్లో నీరు సరిపడా లభ్యమవుతోంది. రైతులకు ఎక్కువ మేలు జరుగుతోంది. – జంపాల శ్రీనివాస్, టేకుమట్ల రైతులను ప్రోత్సహించాలి వాటర్‌షెడ్ పథకంలో భాగంగా అన్ని వాగుల్లో చెక్‌డ్యామ్‌ల నిర్మాణం చేపట్టారు. నీరు వృథాగా పోకుండా ఇంకుడు గుంతలు, ఊట కుంటలు నిర్మించాలి. వృథాను అరికట్టేలా రైతులకు మెళకువలు నేర్పించాలి. – కొండూరి స్వామి, జనగాం, నారాయణపూర్ మండలం -
రైతులు భూసార పరీక్షలు చేయించుకోవాలి
పెన్‌పహాడ్: ప్రతి రైతు భూసారాన్ని తెలుకునేందుకు భూసార పరీక్షలు చేయించుకోవాలని గరిడేపల్లి మండలం గడ్డిపల్లిలోని కృషి విజ్ఞాన కేంద్రం మృత్తిక శాస్త్రవేత్త ఎ. కిరణ్ అన్నారు. బుధవారం పెన్‌పహాడ్ మండలంలోని యల్లప్పకుంట తండాలో భూసార పరీక్షలకు మట్టి నమూనాలను సేకరించే విధానంపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు భూసారానికి అనుగుణంగా ఎరువులు వాడితే అధిక దిగుబడులు పొందవచ్చని తెలిపారు. భూసార పరీక్షలు చేయడం ద్వారా భూమిలోని చౌడు, సున్నం శాతాన్ని గుర్తించవచ్చని పేర్కొన్నారు. రైతులు తమ పొలాల్లోని మట్టిని సేకరించి గడ్డిపల్లిలోని కృషి విజ్ఞాన కేంద్రానికి పంపిస్తే భూసార పరీక్ష చేసి భూ ఆరోగ్య పత్రాలు అందజేస్తామని తెలిపారు. మట్టి నమూనాలు సేకరించే విధానానికి 7893989055 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో కేవీకే యంగ్ ప్రొపెషనల్ జి. సంతోష్, సిబ్బంది బచ్చు వెంకటేశ్వర్లు, రైతులు బి. సైదా, జి. వెంకన్న, జి. సుధాకర్, భీమ్లా, పద్మ, సోమ్లా తదితరులు పాల్గొన్నారు. -
కరువు నేలన జలసిరులు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : నీటికి నిలకడ నేర్పితే కరువుఛాయలు దరిచేరవు. వాన నీటిని ఒడిసిపడితే జీవ వైవిధ్యం అలరారుతుంది. ఈ తరహాలో ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం, వరద, వృథా నీటిని నిల్వ చేస్తూ చెక్‌డ్యామ్‌లు, నీటి కుంటలు, కందకాలు నిర్మించడం ద్వారా ఏ కాలమైనా నీటికి ఢోకా ఉండడం లేదు. వీటి నిర్మాణంతో సాగునీటి సమస్య నుంచి రైతులు బయటపడ్డారు. ఆయా ప్రాంతాల్లో పశుపక్ష్యాదులకు నిరంతరం నీరు దొరుకుతోంది. సమగ్ర నీటి సంరక్షణ చర్యలతో ఆయా పల్లెలు కరువును జయించాయి. అష్టకష్టాల నుంచి గట్టెక్కి.. సూర్యాపేట మండలంలో గతంలో వేసవి ప్రారంభంలోనే ఎండిన చెరువులు, అడుగంటిన బోరుబావులతో ప్రజలు ఇబ్బందులు పడేవారు. తాగునీటి కోసం మైళ్ల దూరం నడిచి వెళ్లి తెచ్చుకునే పరిస్థితి ఉండేది. తలాపున మూసీ నది ఉన్నా గుక్కెడు నీళ్లు దొరక్క, పంటలు పండని పరిస్థితి నుంచి ఇప్పుడు ఈ ప్రాంతం పూర్తిగా మారిపోయింది. గత ప్రభుత్వం మూసీ నది కింద 9 చెక్ డ్యామ్‌ల నిర్మాణం చేపట్టి, ఆరింటిని పూర్తి చేసింది. టేకుమట్ల–2, రాయినిగూడెం–2, కాసారాబాద్–2 నిర్మాణం పూర్తి కాగా, ఝెడ్లపల్లి–1, కేటీ అన్నారం–1, కాసారాబాద్–1 నిర్మాణాలు పూర్తి కావొచ్చాయి. ఇప్పటికే పూర్తయిన నిర్మాణాలతో మండల పరిధిలోని భూగర్భ జలాలు పెరిగి ప్రజలకు తాగునీటి సమస్య తగ్గిపోయింది. బోరు బావులు, ఊట బావుల్లో నీరు సమృద్ధిగా ఉంటోంది. చెక్ డ్యామ్‌లలో నిల్వ ఉన్న నీటిని రైతులు మోటార్ల ద్వారా పొలాలకు తరలించుకుని పంటలు సాగుచేస్తున్నారు. చెక్ డ్యామ్‌లతో తీరిన నీటి సమస్య పెన్పహడ్ మండలంలో భూగర్భ జలాలు పెరిగేందుకు చెక్‌డ్యామ్‌లు దోహదపడుతున్నాయి. మండలంలోని దోసపహాడ్, అనాజీపురం, నాగులపహాడ్ గ్రామాల పరిధిలోని మూసీ నదిపై ఆరు చెక్ డ్యామ్‌లు నిర్మించారు. వీటి నిర్మాణంతో చుట్టుపక్కల గ్రామాల్లో భూగర్భజలాలు పెరిగాయి. వ్యవసాయ ఆధారిత బోర్లు, బావుల్లో నీరు సమృద్ధిగా ఉండటంతో ప్రజలకు వేసవిలో తాగునీటి నీటి సరఫరాలోనూ ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. ప్రతి వర్షపు చినుకు నీటిలో ఇంకేలా.. కరువు నేలలో జలాలను నిల్వ చేసి జీవం పోయడానికి పీఎం కృషి సంచాయ్ యోజన (పీఎంకేఎస్‌వై) పథకం కింద యాద్రాది భువనగిరి జిల్లాలో సంస్థాన్ నారాయణపురం మండలాన్ని ఎంపిక చేశారు. ఈ ప్రాజెక్టు పరిధిలోని జనగాం, పుట్టపాక, వావిళ్లపల్లి, చిల్లాపురం, కొత్తగూడెం సహా 16 గ్రామాల్లో ఈ పథకాన్ని గతేడాది నుంచి అమలు చేస్తున్నారు. అక్కడ ప్రతి వానచినుకు భూమిలోకి ఇంకేలా చర్యలు చేపట్టారు. కొండలు, వాలు ప్రాంతాల్లో పైనుంచి వచ్చే నీటిని భూగర్భ జలంగా మార్చేలా చెక్‌డ్యామ్‌లు, ఊట చెరువులు నిర్మించారు. పొలాల నుంచి మట్టి కొట్టుకుపోకుండా అడ్డుగా రాతి కట్టలు, కందకాల తవ్వకం చేపట్టారు. ఇప్పటి వరకు 68 పనులు పూర్తి చేశారు.ఫ పెరుగుతున్న భూగర్భ జలాలు ఫ వేసవిలోనూ బోర్లు, బావుల్లో సమృద్ధిగా నీరు ఫ తాగు, సాగునీటి సమస్యకు చెక్ ఫ నీటి సంరక్షణతో కరువును జయిస్తున్న పల్లెలు -
మిస్ వరల్డ్ పోటీదారులకు అసౌకర్యం కలగొద్దు
భూదాన్‌పోచంపల్లి: పోచంపల్లికి రానున్న మిస్ వరల్డ్ పోటీదారులకు ఎక్కడా అసౌకర్యం కలగకుండా చూడాలని పోచంపల్లి ప్రోగ్రామ్ ఇన్చార్జ్, స్టేట్ ఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్, ఐఏఎస్ డాక్టర్ లక్ష్మి అన్నారు. బుధవారం సాయంత్రం కలెక్టర్ హనుమంతరావు, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌తో కలిసి పోచంపల్లి టూరిజం పార్కును సందర్శించారు. అక్కడ చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించారు. స్వాగతం పలకడం నుంచి చివరి ప్రొగ్రామ్ ర్యాంప్‌వాక్ వరకు చేస్తున్న కార్యక్రమాలపై రిహార్సల్స్ చేపట్టారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ గురువారం సాయంత్రం 6 గంటలకు ఆఫ్రికా దేశాలకు చెందిన 25 మంది సుందరీమణులు పోచంపల్లికి రానున్న సందర్భంగా న్నారు. టూరిజం పార్కులో ఏర్పాట్లు పూర్తయ్యాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు చేనేత వస్త్రాల ప్రాముఖ్యత, వస్త్రాల తయారీ విధానాలను స్వయంగా తెలుసుకొంటారని అన్నారు. అలాగే హంపీ థియేటర్లో 20 మంది మోడల్స్‌చే ఇండో వెస్ట్రన్ కలగలిపిన చేనేత వస్త్రాలతో నిర్వహించే ర్యాంప్‌వాక్‌ను తిలకిస్తారన్నారు. కాగా ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు, జిల్లాలోని ప్రముఖులు, పద్మశ్రీలు, చేనేతలో అవార్డుగ్రహీతలను ఆహ్వానించామని పేర్కొన్నారు. కార్యక్రమం అనంతరం తిరిగి రాత్రి హైదరాబాద్‌కు వెళ్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ టూరిజం జీఎం ఉపేందర్‌రెడ్డి, డీపీఓ సునంద, డీసీపీ అకాంశ్యాదవ్, ఏసీపీ మధుసూధన్‌రెడ్డి, ఆర్డీఓ శేఖర్‌రెడ్డి, సీఐ రాములు, మున్సిపల్ కమిషనర్ అంజన్‌రెడ్డి, ఇన్చార్జ్ తహసీల్దార్ నాగేశ్వర్రావు, ఎంఆర్ఐ గుత్తా వెంకట్‌రెడ్డి, నాయకులు తడక వెంకటేశం, పాక మల్లేశ్, తడక రమేశ్, భారత లవకుమార్, మర్రి నర్సింహారెడ్డి తదితరులు ఉన్నారు.ఫ స్టేట్ ఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్ డాక్టర్ లక్ష్మి -
శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి సూచనలతోనే నీటి సంరక్షణ
రిటైర్డ్ ఇంజనీర్ మేరెడ్డి శ్యామ్ ప్రసాద్‌రెడ్డి సూచనలతోనే నీటి సంరక్షణకు చర్యలు చేపట్టా. ఒకసారి రైతులతో సమావేశం ఏర్పాటు చేసి అర్థమయ్యేలా చెప్పారు. దాంతో 50 ఎకరాల చుట్టూ కందకాలు తవ్వించా. ఐదెకరాలకు ఒకటి చొప్పున నీటి గుంతలను తవ్వించా. అంతకు ముందు మా భూమిలో జియాలజిస్టులు బోర్లు పడవన్నారు. ఇప్పుడు అదే భూమిలో 3 బోర్లు వేశా. భూగర్భ జలాలు పెరిగి, నీరు బాగా పోస్తున్నాయి. – పాల్వాయి సత్యనారాయణరెడ్డి, చండూరు బోరు బావుల్లో సమృద్ధిగా నీరు మూసీ నదిపై చెక్ డ్యామ్‌లు నిర్మించడం వల్ల గ్రామంలో బోర్లు, బావులు ఎండిపోలేదు. సమృద్ధిగా నీరు రావడంతో నీటి కొరత తలెత్తలేదు. గతంలో వేసవి వచ్చిందంటే బోర్లు, బావుల్లో నీరు తగ్గిపోయి ఇబ్బందులకు గురయ్యేవాళ్లం. చెక్ డ్యామ్‌లు నిర్మించాక నీటి సమస్యకు పరిష్కారం లభించింది. – వెంకట్‌రెడ్డి, దోసపహాడ్, పెన్‌పహాడ్ మండలం -
ధాన్యం కొనగోళ్లు పూర్తిచేయాలి
మోటకొండూర్: వరి ధాన్యం కొనుగోళ్లను త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్ హనుమంతరావు ఆదేశించారు. బుధవారం మోటకొండూరు మండలం ముత్తిరెడ్డిగూడెంలోని పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోళ్లలో జాప్యం ఎందుకు జరుగుతుందని, రైతుల వివరాలను వెంటనే ఎందుకు నమోదు చేయడం లేదని నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. కేంద్రాల్లో దళారులు ధాన్యం విక్రయిస్తున్నారని ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనుగోళ్లు వేగవంతం చేయాలని సూచించారు. ఆయన వెంట కేంద్రం నిర్వాహకులు, అధికారులు, రైతులు ఉన్నారు. -
గుర్తుతెలియని మృతదేహం లభ్యం
తిప్పర్తి: తిప్పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని నల్లగొండ–రాయినిగూడెం రైల్వే లైన్ ఎఫ్‌సీఐ గోదాం సమీపంలో రైలు పట్టాల పక్కన బుధవారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడి వయస్సు 40 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉంటుందని, 5.5 అడుగుల ఎత్తు ఉంటాడని రైల్వే ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. మృతదేహాన్ని నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 8712658595 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు. -
అమెరికాలో పందెనపల్లి యువతి మృతి
● స్వగ్రామంలో అంత్యక్రియలు పూర్తికట్టంగూర్: ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన కట్టంగూర్ మండలం పందెనపల్లి గ్రామానికి చెందిన యువతి బ్రెయిన్‌డెడ్ అయ్యి మృతిచెందింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామస్తులు, యువతి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పందెనపల్లి గ్రామానికి చెందిన కొండి వెంకట్‌రెడ్డి, శోభారాణి దంపతుల కుమార్తె ప్రియాంకరెడ్డి(26) అమెరికాలోని అలబామా స్టేట్ యూనివర్సిటీలో అగ్రికల్చర్ ఎమ్మెస్సీ(మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ అగ్రికల్చర్) పూర్తిచేసి అక్కడే పార్ట్‌టైం జాబ్ చేస్తోంది. ప్రియాంక ఈ నెల 6వ తేదీన తాను ఉంటున్న ఇంట్లోని బాత్రూంలో పడిపోయింది. స్నేహితులు గమనించి ఆమెను ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు పరీక్షించి బ్రెయిన్ డెడ్ అయినట్లు నిర్ధారించారు. ఒక రోజు చికిత్స అందించిన వైద్యులు ప్రియాంక తల్లిదండ్రులతో మాట్లాడి వెంటిలేటర్ తీసివేయటంతో ఈ నెల 8న ఆమె మృతిచెందింది.ప్రియాంక మృతదేహం బుధవారం స్వగ్రామం పందెనపల్లికి చేరుకుంది. కుటుంబ సభ్యులు, గ్రామస్తుల అశ్రునయనాల మధ్య ప్రియాంక అంత్యక్రియలు పూర్తిచేశారు. కుటుంబ తగాదాలతో వివాహిత ఆత్మహత్యచౌటుప్పల్ రూరల్: కుటుంబ తగాదాలతో వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం గ్రామంలో చోటుచేసుకుంది. బుధవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొయ్యలగూడెం గ్రామానికి చెందిన గోశిక భాస్కర్‌కు అదే గ్రామానికి చెందిన నవ్య(34)తో 11ఏళ్ల క్రితం వివాహం జరిగింది. భాస్కర్ చేనేత కార్మికుడిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. నవ్య భర్తకు చేదోడువాదోడుగా ఉంటోంది. భాస్కర్ ఇటీవల కాలంలో మద్యానికి బానిస కావడంతో కుటుంబంలో తగాదాలు జరుగుతున్నాయి. మంగళవారం భార్యాభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. క్షణికావేశంలో నవ్య చేనేత రంగుల్లో ఉపయోగించే నైట్రేట్ రసాయానాన్ని తాగింది. ఇది గమనించిన భాస్కర్ ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందింది. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతురాలి తమ్ముడు రాఘవేంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ జి. మన్మథకుమార్ తెలిపారు. స్వర్ణగిరీశుడికి తిరువీధి ఉత్సవ సేవభువనగిరి: భువనగిరి పట్టణంలోని స్వర్ణగిరి ఆలయంలో వేంకటేశ్వర స్వామికి బుధవారం తిరువీధి ఉత్సవ సేవ నిర్వహించారు. అంతకుముందు ఆలయంలో సుభ్రబాత సేవ, తోమాల సేవ, సహస్రనామార్చన, అష్టదళ పాదపద్మార్చన సేవ, నిత్య కల్యాణ మహోత్సవం నిర్వహించారు. మధ్యాహ్నం సుమారు 3వేల మందికి అన్నప్రసాద వితరణ చేశారు. సాయంత్రం స్వామివారికి మంగళహారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. -
వాన నీటిని ఒడిసి పడుతున్న రైతు
వర్షపు నీటిని ఒడిసి పట్టేందుకు చండూరు మండలానికి చెందిన రైతు పాల్వాయి సత్యనారాయణరెడ్డి ప్రయత్నం అభినందనీయమే. తనకున్న భూమిలో ఆరేళ్ల కిందటే భూగర్భ జలాలను పెంపొందించేందుకు కందకాలు తవ్వించారు. నాలుగు ఎకరాల్లో ఫాం పాండ్లు, నీటిని నీటి గుంతలు తవ్వించారు. ఎండలు మండుతున్నా ఆయన వ్యవసాయ క్షేత్రంలో నీటి నిల్వలు అలాగే ఉన్నాయి. ఆ నీటితోనే వ్యవసాయ క్షేత్రంలో మామిడి, సపోట, కొబ్బరి, సీతాఫలం, నిమ్మ తోటలు, జొన్న చేను సాగు చేస్తున్నారు. అంతర పంటలుగా టమాట, కర్బూజ, బూడిద గుమ్మడికాయ, దోసకాయ, బీరకాయ వంటివి పండిస్తున్నారు. అంతేకాదు వేప, జామాయిల్, కానుగ చెట్లను సైతం పెంచుతున్నారు. ఇప్పుడు ఆయన వ్యవసాయ క్షేత్రం అంతా పచ్చదనంతో నిండిపోయింది. -
భువనగిరిలో సుందరాంగుల విందు
భువనగిరిటౌన్: వివిధ దేశాలకు చెందిన 72 మంది మిస్ వరల్డ్ పోటీదారులు బుధవారం హైదరాబాద్ నుంచి వరంగల్‌కు వెళ్తూ మార్గమధ్యలో భువనగిరిలోని వివేరా హోటల్లోని వి కన్వెన్షన్ హాల్లో కొద్దిసేపు ఆగారు. 34 మందితో కూడిన మొదటి బృందం మధ్యాహ్నం 12.45గంటలకు మూడు బస్సుల్లో వి కన్వెన్షన్ హాల్‌కు చేరుకుని ఒక గంట పదిహేను నిమిషాల పాటు సేదతీరారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు వారు వరంగల్‌కు ప్రయాణమయ్యారు. అనంతరం 22 మందితో కూడిన రెండో బృందం సుమారు 25 నిమిషాల పాటు వి కన్వెన్షన్ హాల్లో స్నాక్స్ తిని వెళ్లారు. భువనగిరి ఖిలాను బస్సుల్లో నుంచి సుందరీమణులు తిలకించారు. సంప్రదాయ వంటకాలు వడ్డింపు.. సుందరీమణులకు వి కన్వెన్షన్ హాల్లో వారివారి దేశాలకు చెందిన 19 రకాల సంప్రదాయ వంటలను వివేరా హోటల్ యజమానులు తయారు చేసి వడ్డించారు. ఫుడ్ ఇన్స్పెక్టర్ స్వాతి ఆధ్వర్యంలో వంటకాలను తనిఖీ చేసిన అనంతరం వారికి విందు భోజనం పెట్టారు. అనంతరం వారు కన్వెక్షన్ హాల్లో కలియ తిరిగారు. 120 మంది పోలీసులతో భద్రత అందాల భామలు వస్తున్న నేపథ్యంలో వి కన్వెన్షన్ హాల్ వద్ద 120మంది పోలీసులతో భారీ భద్రత కల్పించారు. హోటల్‌కు వచ్చే వారిని పాసులు ఉంటేనే అనుమతి ఇచ్చారు. భద్రతా ఏర్పాట్లను రాచకొండ సీపీ సుధీర్‌బాబు, భువనగిరి డీసీపీ అక్షామ్స్యాదవ్, ఏఎస్పీ కంకణాల రాహుల్‌రెడ్డి, పట్టణ ఇన్స్పెక్టర్ రమేష్ పరిశీలించారు. అంతకుముందు సుందరీమణులకు హోటల్ యజమాని సద్ది వెంకట్‌రెడ్డి స్వాగతం పలికారు. గూడూరు టోల్‌ప్లాజా నుంచి ప్రధాన చౌరస్తాల వద్ద కూడా పోలీస్ భద్రత ఏర్పాటు చేశారు. వరంగల్ పర్యటనకు వెళ్తూ మధ్యలో ఆగిన 56 మంది అందాల భామలు ఖిలాను ఆసక్తిగా తిలకించిన అందగత్తెలు భామలను చూసి కేరింతలు ఆలేరు: ఆలేరు మీదుగా వరంగల్‌కు ప్రత్యేక బస్సుల్లో వెళ్తున్న సుందరీమణులను చూసేందుకు బహుపేట క్రాస్ రోడ్ నుంచి పెంబర్తి కాకతీయ కమాన్ వరకు బుధవారం స్థానికులు గుమిగూడారు. మధ్యాహ్నం 2.50గంటలకు బస్సు ఆలేరు సాయిబాబా గుడి సమీపంలోకి చేరుకోగానే స్థానికులు కేరింతలు కొట్టగా.. ప్రతిస్పందనగా సుందరీమణులు అభివాదాలు చేశారు. సుందరీమణులు ప్రయాణించే రూట్లో ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా ఆలేరు సీఐ కొండల్రావు, ఎస్ఐ రజనీకర్ ఆధ్వర్యంలో ఏఎస్ఐ అంజనేయులుతో పాటు 25 మంది కానిస్టేబుళ్లు, 10మంది ట్రాఫిక్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. -
ప్రభుత్వ భూములు అమ్మినా.. కొన్నా నేరమే
ఆత్మకూరు(ఎం): నిరుపేద రైతుల జీవనోపాధి కోసం ప్రభుత్వం పంపిణీ చేసిన భూములను అమ్మినా, కొన్నా నేరమే అవుతుందని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. పైలెట్ ప్రాజెక్టులో భాగంగా బుధవారం ఆత్మకూరు(ఎం) మండల కేంద్రంతోపాటు కొరటికల్‌లో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను ఆయన తనిఖీ చేసి మాట్లాడారు. తక్కువ ధరకు వస్తాయని అసైన్డ్‌మెంట్ భూములను కొనుగోలు చేస్తే చర్యలు తీసుకోవాల్సి వస్తుందని చెప్పారు. భూసమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు. అంతకుముందు ఆత్మకూరు(ఎం) రెవెన్యూ సదస్సును అదనపు కలెక్టర్ వీరారెడ్డి పరిశీలించారు. అనంతరం ఆత్మకూరు(ఎం) తహసీల్దార్ వి.లావణ్య, వలిగొండ తహసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డి రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సదస్సుల్లో ఆత్మకూరు(ఎం) డీటీ ఎండీ. షఫియొద్దీన్, భువనగిరి డీటీ ప్రణయ్, ఆర్ఐలు వై.మల్లిఖార్జునరావు, పాండు, మండల సర్వేయర్ స్వప్న, కంప్యూటర్ ఆపరేటర్ వనం రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ హనుమంతరావు -
ఇక్కత్‌కు ప్రపంచవ్యాప్త గుర్తింపు
భూదాన్‌పోచంపల్లి: మిస్‌వరల్డ్ పోటీదారుల సందర్శనతో పోచంపల్లి ఇక్కత్‌కు ప్రపంచవ్యాప్త గుర్తింపు వస్తుందని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. మంగళవారం పోచంపల్లి టూరిజం పార్కును ఆయన సందర్శించారు. ఈనెల 15న మిస్‌వరల్డ్ పోటీదారులు వస్తున్న నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించారు. చేనేత మ్యూజియం, హంపీ థియేటర్, స్టాల్స్ ఏర్పాటు ప్రదేశం, ప్రధాన ద్వారం వద్ద స్వాగత ఏర్పాట్లను పరిశీలించారు. ఈవెంట్ నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్ విలేకరులతో మాట్లాడుతూ.. సౌతాఫ్రికా సమీప దేశాలకు చెందిన 25 మంది పోటీదారులు 15న సాయంత్రం 6గంటల లోపు పోచంపల్లికి చేరుకుంటారన్నారు. వీరికి కోలాటాలతో ఘన స్వాగతం పలుకుతారన్నారు. అనంతరం మ్యూజియంలో కొకూన్స్ నుంచి దారం, దారం నుంచి వస్త్రం ఎలా తయారవుతుందో ప్రత్యక్షంగా చూస్తారని తెలిపారు. అనంతరం హంపీ థియేటర్లో సింగిల్ ఇక్కత్, డబుల్ ఇక్కత్‌తో పాటు మన చేనేత వస్త్రాలను ఆధునిక యుగంలో ఇంకా మోడ్రన్ ఎలా చూపించవచ్చునో ఉదాహరణగా ఇండోవెస్ట్రన్లో ఫ్యాషన్ డిజైజర్ల ప్రదర్శన ఉంటుందని తెలిపారు. సమావేశంలో టూరిజం శాఖ జీఎం ఉపేందర్‌రెడ్డి, జెడ్పీ సీఈఓ శోభారాణి, డీపీఓ సునంద, చౌటుప్పల్ ఆర్డీఓ శేఖర్‌రెడ్డి, ఇన్చార్జ్ తహసీల్దార్ నాగేశ్వర్రావు, మున్సిపల్ కమిషనర్ అంజన్‌రెడ్డి, చేనేత, జౌళిశాఖ ఏడీ శ్రీనివాస్‌రావు, చౌటుప్పల్ ఏసీపీ మధుసూదన్‌రెడ్డి, సీఐ రాములు, ఎస్ఐ భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు. యాదగిరిగుట్ట ఆలయ ప్రాముఖ్యతను తెలియజేసేందుకే.. యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ ప్రాముఖ్యతను ప్రపంచ వ్యాప్తంగా తెలియజేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం సుందరీమణుల పర్యటన ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. సుందరీమణుల పర్యటన నేపథ్యంలో కలెక్టర్ మంగళవారం కొండపైన వివిధ ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యాదగిరి క్షేత్రం ఏ విధంగా, ఎలా తీర్చిదిద్దారు, ఎంత మహిమాన్వితం ఉందనే అంశాలను సుందరీమణులకు తెలియజేసి, వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలకనున్నట్లు వెల్లడించారు. యాదగిరి క్షేత్ర విశిష్టతను విశ్వవ్యాప్తంగా తెలియజేసేందుకు సుందరీమణుల పర్యటన దోహదపడుతుందన్నారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ కృష్ణారెడ్డి, ఆలయ డీఈఓ భాస్కర్‌శర్మ, ఆలయాధికారులు ఉన్నారు. కలెక్టర్ హనుమంతరావు -
ముస్తాబవుతున్న టూరిజం పార్క్
భూదాన్‌పోచంపల్లి: మిస్‌వరల్డ్ పోటీదారులు పర్యటన నేపథ్యంలో భూదాన్‌పోచంపల్లి టూరిజం పార్కు ముస్తాబవుతోంది. హంపీ థియేటర్లో ప్రముఖ మోడల్స్ పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలు ధరించి ర్యాంప్‌వాక్ నిర్వహిస్తుండటంతో ర్యాంప్, లైటింగ్ సిస్టమ్ పనులు చేస్తున్నారు. మ్యూజియం లోపల చేనేత థీమ్‌ను ఉట్టిపడేలా ప్రాంగణమంతా ఇక్కత్ వస్త్రాలతో తీర్చిదిద్దుతున్నారు. టూరిజం ప్రాంగణంలో గుడిసెల సెట్లో చేనేత స్టాల్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. రోడ్డు వెంట చెట్లకొమ్మను తొలగించారు. -
సుందరీమణులు వస్తునా్నరు
రేపు పోచంపల్లిలో ఆఫ్రికా, యాదగిరిగుట్టలో కరేబియన్ అందగత్తెల పర్యటనసాక్షి, యాదాద్రి : పోచంపల్లిలో ఆఫ్రికా ఖండానికి చెందిన అందగత్తెలు, యాదగిరిగుట్టలో కరేబియన్ దీవుల సుందరీమణులు పర్యటించనున్నారు. ఈనెల 15న వీరి రాక కోసం పాలనా యంత్రాంగం, పోలీస్ శాఖ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తోంది. చేనేత వస్త్రాల తయారీ పరిశీలన కోసం భూదాన్ పోచంపల్లికి 25 మంది, టెంపుల్ టూరిజం టూర్ కోసం యాదగిరిగుట్టకు 10 మంది మొత్తం 35 మంది సుందరీమణులు రానున్నారు. అందగత్తెల వెంట మహిళా పోలీసులుభూదాన్ పోచంపల్లి, యాదగిరిగుట్టలకు వచ్చే అందగత్తెల వెంట మహిళా పోలీస్ సిబ్బందిని రక్షణగా నియమించారు. ఒక్కో అందగత్తె వెంట ఒక్కో మహిళా కానిస్టేబుల్‌కు ఉంటారు. వారితో సెల్ఫీ దిగాలని ప్రయత్నించినా మహిళా పోలీసులు అడ్డుకుంటారు. అతిగా చేస్తే కేసులు నమోదు చేస్తారు. ప్రత్యేక వాహనంలో రాకపోచంపల్లికి ప్రత్యేక వాహనంలో రానున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు హైదారాబాద్ నుంచి బయలుదేరి ఆరు గంటలకు పోచంపల్లికి చేరుకుంటారు. స్థానిక మహిళలు తిలకం దిద్దిన తర్వాత కళాకారుల కోలాట నృత్యంతో స్వాగతం పలుకుతూ టూరిజం లోని హాల్లోకి తీసుకెళ్తారు. అక్కడ 8 గంటల వరకు చేనేత వస్త్రాల తయారీ గురించి అడిగి తెలుసుకుంటారు. రాష్ట్రంలోని వివిధ రకాల చేనేత ఉత్పత్తుల స్టాళ్లను పరిశీలించి అక్కడి నుంచి హైదరాబాద్‌కు తిరిగి వెళ్తారు. యాదగిరిగుట్టలో దర్శనం, ఫొటో షూట్కరేబియన్ దీవులకు చెందిన అందగత్తెలు 10 మంది హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్ట కొండపైకి చేరుకుంటారు. కొండపైన గల దేవస్థానం గెస్ట్‌హౌజ్‌లో ఫ్రెషప్ అయిన తర్వాత ఎలక్ట్రికల్ వాహనాల్లో ఆలయ ప్రాంగణం చేరుకుంటారు. అక్కడ అఖండ దీపం వద్ద నూనె సమర్పిస్తారు. అక్కడే బంగారు తాపడంతో ఉన్న దివ్యవిమాన గోపురం కనిపించే విధంగా ఫొటో షూట్ ఉంటుంది. అనంతరం తూర్పు రాజగోపురం లోంచి ప్రధానాలయంలోకి ప్రవేశిస్తారు. స్వామి వారి దర్శనం అనంతరం పడమర రాజగోపురం మీదుగా బయటకు వస్తారు. అక్కడే శ్రీస్వామి వారి ప్రసాదం, చిత్రపటాలను అందజేస్తారు. వీరి పర్యటన సందర్భంగా గుట్టపై భక్తులకు దర్శనం నిలిపివేస్తారు. భువనగిరిలో సేదదీరనున్న అందగత్తెలువరంగల్, వేయి స్తంబాల గుడి, రామప్పకు వెళ్తున్న సుందరీమణుల కోసం భువనగిరిలో విడిది ఏర్పాటు చేశారు. వివేరా హోటల్లో విశ్రాంతి కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ నుంచి వోల్వో బస్సులను ఏర్పాటు చేశారు. ముందుగా రామప్పకు వెళ్లేవారు 22 మంది, వరంగల్‌కు వెళ్లే 10 మంది రెండు బ్యాచ్‌లుగా వస్తారు. తిరుగు ప్రయాణంలో కొద్దిసేపు వివేరాలో ఆగి సేదదీరుతారు. నిరంతరం నిఘాఅందగత్తెల రాకపోకల సందర్భంగా 500 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పర్యటన యావత్తు సీసీ కెమెరాల నిఘాలో సాగనుంది. పోచంపల్లిలో సుందరీమణులు పాల్గొనే టూరిజం కేంద్రం కార్యక్రమంతో పాటు వారు వచ్చే దారిలో సీసీకెమెరాలు ఏర్పాటు చేసి స్థానిక పోలీస్‌స్టేషన్ నుంచి నేరుగా హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్‌కు అనుసంధానం చేశారు. పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన రాచకొండ పోలీసులు పర్యటన సందర్భంగా గుట్టపై భక్తులకు దర్శనం నిలిపివేత -
ఉపాధి పనులపై విజిలెన్స్
ఆలేరురూరల్: గ్రామీణ ప్రాంత కూలీలకు పనులు కల్పించి వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తున్నాయి. దీనిద్వారా జిల్లాలో లక్షలాది మంది ఉపాధి పొందుతున్నారు. ఈ పథకాన్ని పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. గ్రామీణ స్థాయిలో ఉపాధి హామీ పనులపై నిఘా పెట్టేందుకు చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో గ్రామ స్థాయిలోనే పథకం పనుల పర్యవేక్షణకు విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ (వీఎంసీ)లను ఏర్పాటు చేస్తోంది. పనుల పర్యవేక్షణతో పాటు సామాజిక తనిఖీ నివేదికలపై ఎప్పటికప్పుడు సమీక్ష జరిపి అవకతవకలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకునేలా ప్రభుత్వం కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే జిల్లాలో ఇప్పటికే ఈ ప్రక్రియకు అడుగులు పడగా.. వీఎంసీలు పూర్తిస్థాఽయిలో పనిచేసేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లాలో ఉపాధి పనుల వివరాలుజిల్లాలో మొత్తం జాబ్ కార్డులు 1,43,205 కాగా, యాక్టివ్ జాబ్ కార్డులు 98,848 ఉన్నాయి. పని చేసే కూలీలు 1,37,475 మంది ఉన్నారు. మొత్తం పని దినాలు 25,49,676 కల్పించారు. రోజుకు 22,320 మంది సగటున హాజరవుతున్నారు. 2025–26కు సంబంధించి రూ.32,40,391 బడ్జెట్‌ను కేటాయించారు. ప్రతి గ్రామ పంచాయతీలో ఐదుగురు సభ్యులతో కూడిన వీఎంసీలు ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో ఎస్సీ, ఎస్టీకి చెందిన వారితో పాటు సగం మంది మహిళలు ఉండేలా నిర్ణయించారు. ఇక వీఎంసీ సభ్యులుగా గ్రామాల్లో పని చేసే ఉపాధ్యాయులు అంగన్వాడీలు, ఎస్‌హెచ్‌జీలు, రిసోర్స్ పర్సన్లు, సివిల్ క్లబ్ సంఘాల సభ్యులు ఉండేలా చూస్తున్నారు. పనుల పరిశీలన ఇలా..ఉపాధి పనులు పారదర్శకంగా జరిగేలా చూసేందుకు వీఎంసీ కమీటీలు నిరంతరం పర్యవేక్షణ చేయనున్నాయి. వారానికి ఒకసారి ఉపాధి హామీ పనులు పరిశీలించనున్నారు. ఇక ప్రతి నెల మూడో శుక్రవారం పంచాయతీ కార్యదర్శితో కలిసి ఉపాధి కూలీలు, సిబ్బందితో కమిటీలు సమావేశం కానున్నాయి. పనుల నిర్వహణపై కూలీలతో చర్చిస్తారు. ఉపాధి రికార్డులు, సౌకర్యాలను పరిశీలించడంతో పాటు పనుల నాణ్యత, వ్యయాన్ని అంచనా వేయడం, జరిగిన పనిపై నివేదిక ఇవ్వడం, పనుల తనిఖీ, లెక్కింపు, పనులు రిజిష్టర్‌లో నమోదు చేయడం వంటివి కమిటీలు చేయాల్సి ఉంది. ఇక సోషల్ ఆడిట్ సమయంలో కమిటీలు నివేదికలను ప్రవేశపెట్టాల్సి ఉండగా సోషల్ అడిట్ అధికారులు వాటిని పరిగణలోకి తీసుకోవాలి. కమిటీలు ఇచ్చే నివేదికలను బట్టి అధికారులు చర్యలు తీసుకోనున్నారు.పనులు పారదర్శకంగా జరుగుతాయి ఉపాధి హామీ పనులు పారదర్శకంగా జరిగేందుకు కమి టీ సభ్యులు, అధికారుల పర్యవేక్షణ పకడ్బందీగా ఉంటుంది. పనుల్లో నాణ్యత లోపించకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. పంచాయతీలో పర్యవేక్షణ కమిటీల ఏర్పాటుతో నిధులు దుర్వినియోగం కాకుండా అడ్డుకట్ట వేయడం జరుగుతుంది. – నాగిరెడ్డి, డీఆర్డీఓ ఐదుగురు సభ్యులతో విజిలెన్స్ మానిటరింగ్ కమిటీల ఏర్పాటు పనుల పర్యవేక్షణతో పాటు సామాజిక తనిఖీ నివేదికలపై ఎప్పటికప్పుడు సమీక్ష -
నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడమే లక్ష్యం
చౌటుప్పల్ : నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని, అందుకోసం త్వరలోనే విద్యుత్ శాఖలో సంస్కరణలు తీసుకురానుందని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. ఆయా సంస్కరణలను మునుగోడు నియోజకవర్గం నుంచే ప్రారంభించాలని కోరారు. నియోజకవర్గంలో నెలకొన్న విద్యుత్ సమస్యలు, విద్యుత్ అభివృద్ధి పనులపై మంగళవారం హైదరాబాద్‌లోని టీజీఎస్పీడీసీఎల్ కార్యాలయంలో సీఎండీ ముష్రాఫ్‌తో కలిసి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలో నెలకొన్న విద్యుత్ సమస్యలపై ఇప్పటికే పలుమార్లు సమీక్షలు నిర్వహించామన్నారు. ఆయా సమస్యలను పరిష్కరించేందుకుగాను రూ.34 కోట్లు ఖర్చవుతాయని గుర్తించామని, వెంటనే నిధులు మంజూరు చేయాలని కోరారు. విద్యుత్‌శాఖలో పనిచేసే అధికారులు విధుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాని, ప్రజలను వేధించి డబ్బులు వసూలు చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. నియోజకవర్గంపై ప్రత్యేక శ్రద్ధ వహించి సమస్యలను పరిష్కరించాలన్నారు. రాబోయే మూడు, నాలుగేళ్లలో సమస్యలు పూర్తిగా పరిష్కారమవ్వాలన్నారు. సీఎండీ ముష్రాఫ్ మాట్లాడుతూ.. వ్యవసాయ పొలాల మధ్య ఉన్న ట్రాన్స్ఫార్మర్లను మారుస్తామని తెలిపారు. వ్యవసాయ డీపీఆర్‌లకు ఏబీ స్విచ్‌లు పెంచుతామన్నారు. సమావేశంలో యాదాద్రి భువనగిరి, నల్లగొండ జిల్లాల విద్యుత్ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. విద్యుత్ సంస్కరణలను మునుగోడు నుంచి ప్రారంభించాలి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి -
నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు
భూదాన్‌పోచంపల్లి: ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి అన్నారు. మంగళవారం భూదాన్‌పోచంపల్లి మండలంలోని పెద్దరావులపల్లి పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ధాన్యం కొనుగోళ్ల నిర్వహణ, రికార్డులను పరిశీలించారు. రికార్డుల నిర్వహణ సరిగా లేకపోవడంతో నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రక్షీట్లు వెంటనే ఇవ్వకపోవడంతో కొనుగోళ్లలో జాప్యం జరుగుతున్న తీరును చూసి వారిని మందలించారు. రికార్డుల నిర్వహణ సరిగా ఉండాలని ఆదేశించారు. అకాల వర్షాలు వస్తాయని వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో కొనుగోళ్లను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఆయన వెంట జిల్లా వ్యవసాయాధికారి గోపాల్, సివిల్ సప్లై జిల్లా అధికారి రోజారాణి, చౌటుప్పల్ ఆర్డీఓ శేఖర్‌రెడ్డి, ఇన్చార్జ్ తహసీల్దార్ నాగేశ్వర్రావు, ఎంఆర్ఐ గుత్తా వెంకట్‌రెడ్డి, మండల వ్యవసాయాధికారిణి శైలజ, సివిల్ సప్లై డీటీ బాలమణి ఉన్నారు.హనుమంతుడికి ఆకుపూజ యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి క్షేత్రపాలకుడిగా ఉన్న శ్రీఆంజనేయస్వామికి అర్చకులు మంగళవారం ఆకుపూజను విశేషంగా నిర్వహించారు. ప్రధానాలయంతో పాటు విష్ణు పుష్కరిణి వద్ద, పాతగుట్ట ఆలయంలో ఆంజనేయస్వామిని సింధూరం, పాలతో అభిషేకించారు. అనంతరం తమలపాకులతో అర్చించారు. హనుమంతుడికి ఇష్టమైన నైవేద్యం సమర్పించి, భక్తులకు ప్రసాదంగా అందజేశారు. ఇక ప్రధానాలయంలో నిత్య పూజలు సంప్రదాయంగా కొనసాగాయి. శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం, సాయంత్రం వెండి జోడు సేవ పూజలు నిర్వహించారు. వృత్యంతర శిక్షణతో నాణ్యమైన బోధనభువనగిరి: ఉపాధ్యాయులు పొందుతున్న వృత్యంతర శిక్షణ ద్వారా విద్యార్థులకు నాణ్యమైన బోధన అందుతుందని డీఈఓ సత్యనారాయణ అన్నారు. మంగళవారం భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత, బాగాయత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ.. పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలల్లో 250 సాంఘిక శాస్త్రం, బీచ్ మహల్లా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 300 మంది గణిత, బాగాయత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 240 ఇంగ్లిష్ ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో అకాడమిక్ మానిటరింగ్ కో ఆర్డినేటర్ శ్రీనివాసులు, జానీ ఆఫ్గన్, కోర్స్ ఇన్చార్జిలు భాస్కర్, నర్సింహ, రవికుమార్, సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు. -
విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి
భూదాన్‌పోచంపల్లి: వేసవి శిబిరంలో విద్యార్థులు నేర్చుకున్న జ్ఞానాన్ని నిత్యజీవితంలో అన్వయించుకొని విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని రాష్ట్ర సమగ్ర శిక్షా ప్రాజెక్ట్ అడిషనల్ డైరెక్టర్ రాధారెడ్డి అన్నారు. మంగళవారం భూదాన్‌పోచంపల్లి మండలంలోని జలాల్పురం పరిధిలో గల కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో నిర్వహిస్తున్న వేసవిశిక్షణా శిబిరాన్ని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నిర్వహిస్తున్న శిక్షణా కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ రిసోర్స్ పర్సన్ యమునా శాస్త్రి విద్యార్థులకు చదువు ప్రాముఖ్యత, ఆర్థిక నిర్వహణపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జాయింట్ డైరెక్టర్ వెంకటనర్సమ్మ, జిల్లా విద్యాధికారి కందుల సత్యనారాయణ, కేబీజీవీల రాష్ట్రకోర్డినేటర్ హజారే శిరీష, స్థానిక కేవీజీబీ ప్రత్యేకాధికారిణి ఇందిర తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర సమగ్ర శిక్షా ప్రాజెక్ట్ అడిషనల్ డైరెక్టర్ రాధారెడ్డి -
రైతులకు నకిలీ విత్తనాలు విక్రయించొద్దు
సాక్షి,యాదాద్రి : రైతులకు నకిలీ విత్తనాలు విక్రయించొద్దని, నాణ్యత లేని విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్, అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ లక్ష్మీనారాయణ హెచ్చరించారు. నకిలీ విత్తనాలు అరికట్టడంలో భాగంగా మంగళవారం కలెక్టరేట్లోని ప్రధాన సమావేశ మందిరంలో వ్యవసాయ, పోలీసు శాఖ అధికారులు సంయుక్తంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నకిలీ విత్తనాలను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్ మాట్లాడుతూ.. విత్తనాల లైసెన్స్ కలిగిన విత్తన డీలర్ నుంచి మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలన్నారు. కొనుగోలు చేసిన విత్తనాలకు రశీదు పొందాలన్నారు. విత్తన నాణ్యత లోపం వల్ల కలిగే పంట నష్టాన్ని నిర్ధారించి, పంట నష్ట పరిహారం ఇప్పించడానికి విత్తన కొనుగోలు రశీదు తప్పనిసరి అని పేర్కొన్నారు. వ్యవసాయ, పోలీస్ శాఖ అధికారులతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని, వీరు నకిలీ విత్తనాలు అమ్మే వారిపై నిఘా పెట్టి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారన్నారు. అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. ఎమ్మార్పీ రేటు కన్నా ఎక్కువకు విత్తనాలు కొనగోలు చేయొద్దని సూచించారు. ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మేందుకు ప్రయత్నం చేస్తే మండల వ్యవసాయ అధికారికి గానీ పోలీసులకుగాని సమాచారం అందించాలని తెలిపారు. జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్ -
బోరుకు అనుమతి తప్పనిసరి
భువనగిరిటౌన్ : పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడైనా బోరు వేయాలంటే తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని అదనపు కలెక్టర్ వీరా రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం భూగర్భ జలశాఖ జిల్లా అధికారి జ్యోతికుమార్తో కలిసి సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వాల్టా చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని ఆదేశించారు. విని యోగించుకున్న నీటిని భూమిలోకి ఇంకింపజేసేందుకు అవసరమైన నిర్మాణాలు చేసేలా ప్ర జలకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ఎంజీయూ పరిధిలో 14 నుంచి డిగ్రీ పరీక్షలు నల్లగొండ టూటౌన్ : మహాత్మాగాంధీ యూని వర్సిటీ పరిధిలో ఈనెల 14 నుంచి డిగ్రీ సెమిస్టర్ 2, 4, 6 రెగ్యులర్, బ్యాక్లాగ్ 1, 3, 5 పరీక్షలు ప్రారంభమవుతున్నట్లు యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ఉపేందర్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు గతంలో తీసుకున్న హాల్‌టికెట్ లేదా నూతన హాల్‌టికెట్‌తో వచ్చినా పరీక్షలకు అనుమతిస్తారని తెలి పారు. కళాశాల గుర్తింపు కార్డు, లేదా ఏదైనా ఇతర ప్రభుత్వ గుర్తింపు కార్డుతో రావాలని పేర్కొన్నారు. పరీక్షల కోసం ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 36 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. రేషన్ దుకాణాల్లో తనిఖీలు బీబీనగర్: మండలంలోని కొండమడుగు, రహీంఖాన్‌గూడెం, రాఘవాపురం, రుద్రవెళ్లి, వెంకిర్యాల, పడమటిసోమారం గ్రామాల్లోని రేషన్ దుకాణాల్లో సోమవారం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. లబ్ధిదారులకు అందజేసే బియ్యాన్ని పరిశీలించడంతో పాటు పంపిణీ విధానంపై లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. బియ్యం పంపిణీ సక్రమంగా లేకపోతే ఫిర్యాదు చేయాలని సూచించారు. లబ్ధిదారులకు నిర్ణీత సమయంలో బియ్యం అందజేయాలని డీర్లను ఆదేశించారు. తనిఖీల్లో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ యాదయ్య, ఎస్ఐలు స్వామిదాస్, సంతోష్, డిప్యూటీ తహసీల్దార్ నరసింహారావు పాల్గొన్నారు. గుట్ట క్షేత్రంలో ఆర్జిత సేవలు పునఃప్రారంభంయాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో ఆర్జిత సేవలు పునః ప్రారంభం అయ్యాయి. నృసింహుడి జయంతి ఉత్సవాల నేపథ్యంలో ఈ నెల 9నుంచి 11వ తేదీ వరకు ప్రధానాయలంలో ఆర్జిత సేవలను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఉత్సవాలు ఆదివారం ముగియడంతో సోమవారం నుంచి శ్రీసుదర్శన నారసింహహోమం, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, జోడుసేవలను ఆగమ శాస్త్రనుసారంగా అర్చకులు ప్రారంభించారు. వేడుకల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.అదే విధంగా ప్రధానాలయంలో సంప్రదాయ పూజలు కొనసాగాయి. అక్షరాస్యులుగా మార్చాలి భువనగిరిటౌన్ : నిరక్షరాస్యులందరినీ అక్షరాస్యులుగా మార్చేందుకు కృషి చేయాలని అదనపు కలెక్టర్(రెవెన్యూ) వీరారెడ్డి సూచించారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లా వయోజన విద్య ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలన్నారు. ముందుగా ట్యూటర్లను ఏర్పాటు చేయాలని, అనంతరం జిల్లా, మండల, గ్రామ స్థాయిలో కమిటీలు వేసి ట్యూటర్లతో శిక్షణ ఇప్పించాలన్నారు. జిల్లాలో సుమారు 99 వేల మంది నిరక్షరాస్యులు ఉన్నట్టు నివేదిక ఉందన్నారు. ఉల్లాస్ యాప్ ద్వారా ప్రచారం చేసి ఎన్‌ఐసీపీ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో డీఆర్డీఓ నాగిరెడ్డి, డీపీఓ సునంద, వయోజన విద్య ఉపసంచాలకులు మమత, డీఈఓ సత్యనారాయణ, ఉల్లాస్ జిల్లా సభ్యులు కృష్ణారెడ్డి, రెడ్‌క్రాస్ సభ్యులు బాలాజీ, డీపీఎంలు పాల్గొన్నారు. -
ఆధ్యాత్మిక సర్క్యూట్..
ఆలయాలను చూసొద్దాం రండిహైదరాబాద్కు చేరువలో యాదాద్రి జిల్లాలో అనేక ప్రసిద్ధమైన ఆలయాలు ఉన్నాయి. వేసవి సెలవుల్లో కుటుంబంతో కలిసి యాదగిరిగుట్ట నృసింహుడి దర్శనానికి వచ్చే భక్తులు ఈ ఆలయాలను సందర్శించవచ్చు.పసిడి కాంతులతో స్వర్ణగిరి దేవాలయం యాదగిరిగుట్ట నుంచి 15 కిలోమీటర్ల దూరంలో వరంగల్–హైదరాబాద్ జాతీయ రహదారిపై భువనగిరిలో శ్రీస్వర్ణగిరి వేంకటేశ్వర ఆలయం ఉంది. ఈ మధ్య కాలంలో ఈ ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. యాదగిరీశుడిని దర్శించుకున్న భక్తులు తిరుగు ప్రయాణంలో స్వర్ణగిరి ఆలయాన్ని సందర్శించుకుని వెళ్తుంటారు. తిరుపతిని తలపించేలా ఈ ఆలయం ఉండడంతో తిరుపతికి వెళ్లలేని భక్తులు స్వర్ణగిరి వేంకటేశ్వరస్వామిని దర్శించుకొని వెళ్తుంటారు. ఇక్కడి నుంచి తిరుగు ప్రయాణంలో శ్రీరేణుక ఎల్లమ్మ ఆలయం ఉంటుంది. యాదగిరిగుట్ట: హైదరాబాద్ నుంచి 60 కి.మీ. దూరంలో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం ఉంది. ఈ ఆలయానికి వచ్చే భక్తులకు ఉదయం 9గంటల నుంచి 10గంటల వరకు, సాయంత్రం 4గంటల నుంచి 5 గంటలకు రూ.300 టిక్కెట్‌పై బ్రేక్ దర్శనం కల్పిస్తున్నారు. అంతేకాకుండా ధర్మ దర్శనంతో పాటు రూ.150 టిక్కెట్ కొనుగోలుపై వీఐపీ దర్శనానికి పంపిస్తారు. రాత్రి బస చేసేందుకు కొండపైన తెలంగాణ హరిత టూరిజంతో పాటు కొండ కింద దేవస్థానానికి చెందిన ప్రెసిడెన్షియల్ సూట్, తులసీ కాటేజీ, బస్టాండ్ సమీపంలో దేవస్థానం గదులు ఉన్నాయి. అంతేకాకుండా వివిధ కుల సంఘాలకు సంబంధించిన భవనాలు, ప్రైవేట్ గదులు అందుబాటులో ఉన్నాయి.నాగిరెడ్డిపల్లిలో బంగారు శివలింగం ఈ ఆలయం భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లి గ్రామ సమీపంలో ఉంది. ఇక్కడ పూర్తిగా బంగారంతో శివలింగాన్ని తయారు చేసి ప్రతిష్ఠించారు. యాదగిరిగుట్ట నుంచి ఈ ఆలయం 22 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సకల దేవతలకు నిలయం సురేంద్రపురియాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయం నుంచి 2 కిలోమీటర్ల దూరంలో సురేంద్రపురి పంచముఖ హనుమాన్ ఆలయం ఉంటుంది. ఇక్కడ భారీ ఎత్తులో పంచముఖ హనుమాన్, పంచ ముఖ శివుడి విగ్రహాలు ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడ వెంకటేశ్వరస్వామి ఆలయం సైతం ఉంటుంది. ప్రత్యేక టిక్కెట్ కొనుగోలు చేసి సురేంద్రపురిలో ఏర్పాటు చేసిన సకల దేవతలు కొలువైన మందిరాన్ని సందర్శించవచ్చు.యాదగిరిగుట్టకు అనుబంధంగా పాతగుట్ట యాదగిరీశుడి ఆలయం నుంచి 3కి.మీ. దూరంలో పూర్వగిరి(పాతగుట్ట) లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం ఉంది. యాదగిరిగుట్ట క్షేత్రం కంటే ముందు పూర్వగిరిలో స్వామి, అమ్మవార్లు వెలిశారని పురాణాలు చెబుతున్నాయి. క్రమక్రమంగా ఈ ప్రాంతమే పాతగుట్టగా మారింది. యాదగిరిగుట్ట నుంచి భక్తులు గుర్రం బండ్లపై ఈ ఆలయానికి వెళ్లేందుకు ఆసక్తి చూపుతారు. యాదగిరి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న భక్తులు తప్పనిసరిగా పూర్వగిరీశుడిని దర్శించుకుంటారు.వెంకటపురం లక్ష్మీనరసింహస్వామి ఆలయం యాదగిరిగుట్ట నుంచి కీసర, ఈసీఐఎల్ వెళ్లే మారంలో తుర్కపల్లి మండలం వెంకటపురంలో వెంకటగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయం యాదగిరిగుట్ట నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆలయ కొండ గుహల్లో స్వామివారు కొలువై ఉన్నారు. మెట్ల మార్గంలో ఈ ఆలయానికి చేరుకోవాల్సి ఉంటుంది. వేములకొండ మత్స్యగిరి ఆలయం వేములకొండ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం యాదగిరిగుట్ట నుంచి సుమారు 40 కిలోమీటర్లు ఉంటుంది. యాదగిరి లక్ష్మీనరసింహస్వామి, సురేంద్రపురి, నాగిరెడ్డిపల్లిలోని శివాలయాన్ని సందర్శించిన భక్తులు వలిగొండ మీదుగా ఈ వేములకొండ ఆలయానికి చేరుకోవచ్చు. ఈ ఆలయంలోని కోనేరులో మీసాలతో కూడిన చేపలు దర్శనమిస్తాయి. కొలనుపాక జైన్ మందిరం యాదగిరిగుట్ట ఆలయానికి వచ్చిన భక్తులు ఆలేరు మండలం కొలనుపాకలోని జైన్ మందిరం, శ్రీసోమేశ్వర ఆలయాలను సందర్శించవచ్చు. యాదగిరిగుట్ట నుంచి కొలనుపాక 22 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ జైన్ మందిరంతో పాటు సోమేశ్వర ఆలయం, వివిధ కుల సంఘాలకు సంబంధించిన మఠాలు సైతం ఉన్నాయి. జైన మందిరం, సోమేశ్వర ఆలయాలు నాటి కాకతీయులు, జైనులకు సంబంధించిన ఆనవాళ్లను గుర్తు చేస్తాయి. -
అర్జీలకు సత్వర పరిష్కారం చూపండి
భువనగిరిటౌన్ : ప్రజావాణి వినతులకు సత్వర పరి ష్కారం చూపాలని కలెక్టర్ హనుమంతరావు అధికా రులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజలనుంచి వినతులు స్వీకరించారు. అర్జీలకు ఎప్పటికప్పుడు పరిష్కారం జరగాలన్నారు. 56 దరఖాస్తులు రాగా అత్యధికంగా భూ సమస్యలకు సంబంధించినవే ఉన్నాయి. ● తన కుమారులు భూమిని వారిపై మార్చుకుని తన బాగోగులు చూడటం లేదని అంబాలకు చెందిన శాంతమ్మ కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది. ● రేషన్ కార్డులో తన కుమారుడి పేరు చేర్చాలని ఎల్బీనగర్కు చెందిన బాలమణి, పింఛన్ వస్తలేదని హనుమాపురం గ్రామానికి చెందిన ఆండాలు దంపతులు కలెక్టర్‌కు విన్నవించారు. ● తన భూమి ధరణిలో ఇతరుల పేరున నమోదైందని పొడిచేడుకు చెందిన మార్పాక స్వామి ఫి ర్యాదు చేశారు. వీరితో పాటు మరికొందరు తమ స్యలపై వినతులు వచ్చాయి. ఫ కలెక్టర్ హనుమంతరావు -
యాదగిరీశుడి సేవలో ఏపీ హైకోర్టు జడ్జి
యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామిని సోమవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు జడ్జి జస్టిస్ చల్లా గుణరంజన్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయ ముఖ మండపంలో అర్చకులు సంప్రదాయంగా స్వాగతం పలికారు. గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తుల చెంత ప్రత్యేక పూజలు చేశారు. జస్టిస్ గుణరంజన్‌కు అర్చకులు వేదాశీర్వచనం చేయగా, అధికారి రాజన్‌బాబు లడ్డూ ప్రసాదం అందజేశారు. రాష్ట్ర సమాచార కమిషనర్‌గా తుర్కపల్లి వాసితుర్కపల్లి: రాష్ట్ర సమాచార కమిషనర్‌గా తుర్కపల్లి మండల కేంద్రానికి చెందిన బోరెడ్డి అయోధ్యరెడ్డి నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సీపీఆర్ఓగా కొనసాగుతున్నారు. సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన ఆయన ఎల్ఎల్బీ పూర్తి చేశారు. 20 సంవత్సరాలు వివిధ దినపత్రికల్లో జర్నలిస్టుగా పనిచేశారు. తెలంగాణ ప్రదేశ్ క్రాంగెస్ కమిటీ అధికార ప్రతినిధిగా, మీడియా కోఆర్డినేటర్‌గా పనిచేశారు. శాసనసభ ఎన్నికల సమయంలో వార్‌రూం కన్వీనర్‌గా పనిచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆయనను చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్‌గా(సీపీఆర్ఓ) నియమించి సీఎంఓలో అవకాశం కల్పించారు. తాజాగా రాష్ట్ర సమాచార కమిషనర్‌గా నియమించారు. ఏఎస్‌టీసీ గౌరవ ఫెలోగా ఎంజీయూ వీసీ నియామకంనల్లగొండ టూటౌన్: అకాడమీ ఫర్ సైన్స్, టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్(ఏఎస్‌టీసీ)–హైదరాబాద్ గౌరవ ఫెలోగా మహాత్మాగాంధీ వైస్ చాన్స్‌లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ నియమితులయ్యారు. ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రముఖ వైద్యుడు నాగేశ్వర్‌రెడ్డి చేతుల మీదుగా గౌరవ ఫెలో నియామక పత్రాన్ని వీసీ అందుకున్నారు. తన నియామక ఎంజీయూకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు వీసీ తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పాల్గొన్నారు. చెరువులో పడి మహిళ మృతికోదాడరరూరల్ : కోదాడ పట్టణంలోని శ్రీనివాసనగర్‌కు చెందిన రామనర్సమ్మ(49) సోమవారం అనంతగిరి రోడ్డు వైపు పెద్ద చెరువులో పడి మృతిచెందింది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీసి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. -
టెర్రరిజం అంతానికి శాశ్వత పరిష్కారం వెతకాలి
హుజూర్నగర్ : టెర్రరిస్టులను అంతమొందించేందుకు ప్రపంచ దేశాలన్నీ కలసి శాశ్వత పరిష్కారం వెతకాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. సోమవారం హుజూర్‌నగర్‌లో జరిగిన స్వాతంత్య్ర సమరయోధురాలు పశ్య కన్నమ్మ సంతాప సభలో పాల్గొని మాట్లాడారు. పహల్గాంలో అమాయకులను చంపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, టెర్రరిస్టులు ఎప్పుడైనా ఆకస్మికంగా కాల్పులు జరపడం.. వెళ్లిపోవడమే చూశామని, మొదటిసారి మతప్రాతిపదికన చంపారని ఆయన అన్నారు. దేశంలో జరుగుతున్న టెరర్రిస్ట్ దాడులపై ప్రజలకు అనేక అనుమానాలు వస్తున్నాయని, దేశంలో ఎన్నికలు జరిగినప్పుడే టెరర్రిస్టులు దాడులు జరపడం అమాయకులు బలికావడం.. దానిని బీజేపీ వాడుకోవడం అనుమానాలకు తావిస్తోందని ఆయన ఆరోపించారు. అమెరికా ఒకవైపు పాకిస్తాన్‌తో ఆర్థిక సంబంధాలు కొనసాగిస్తూనే,, మరోవైపు ఉగ్రవాద కార్యకలాపాలను వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటిస్తుందని అన్నారు. పాకిస్తాన్లో ఉన్న ముస్లింలందరూ టెర్రరిస్టులు కాదని, అక్కడ కూడా టెర్రరిజాన్ని వ్యతిరేకించే సామాన్య ప్రజలు ఉన్నారని గుర్తుపెట్టుకోవాలని ఆయన సూచించారు. తీవ్రవాద సమస్యకు కేంద్రం శాశ్వత పరిష్కారం చేయడం బీజేపీకి ఇష్టం లేనట్లుంది అని ఆయన విమర్శించారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్‌రెడ్డి, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు పశ్య పద్మ పాల్గొన్నారు. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ -
కొనుగోళ్లు సగమే..!
హమాలీలు లేరు పదెకరాల్లో వరిసాగు చేశా. 22 రోజుల క్రితం వరి కోశా ను. 700 బస్తాల ధాన్యం దిగుబడి రాగా.. బోగారం కొనుగోలు కేంద్రంలో పో శాను. 60 సీరియల్ వచ్చింది. కేవలం 8 మంది హమాలీలు మాత్రమే ఉన్నారు. దీంతో రోజూ అర, ఒకటి లారీలు మాత్రమే తూకం వేసి ఎగుమతి చేస్తున్నారు. నా సీరియల్ రావడానికి ఇంకా వారం పడుతుంది. వర్షానికి ధాన్యం తడిసే అవకాశం ఉంది. త్వరగా కొనుగోలు చేయాలి. –రాధారపు నర్సింహ, రైతు, ఇంద్రపాలనగరంమందకొడిగా ధాన్యం సేకరణ ఫ నెల రోజులు గడిచినా 1.94 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొనుగోలు ఫ కేంద్రాల్లో హమాలీల కొరత ఫ లోడింగ్, అన్లోడింగ్కూ తిప్పలే రామన్నపేట : కొనుగోళ్లు కేంద్రాలను తెరిచి నెల రోజులు గడిచినా ధాన్యం సేకరణ పుంజుకోవడం లేదు. 3.25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్దేశించగా గురువారం వరకు కేవలం 1.94 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కాంటా అయ్యింది. లక్ష్యం, సేకరించిన వడ్లు యాసంగి సీజన్‌కు జిల్లాలో 2.75లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. రైతుల అవసరాలు, కొంత ప్రైవేట్‌కు పో యినా 4.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలన్నది లక్ష్యం. కాగా భూగర్భ జలాలు అడుగంటి పంటలు ఎండిపోవడం, అకాల వర్షాలతో దిగుబడి తగ్గడంతో లక్ష్యాన్ని 3 లక్షల మెట్రిక్ టన్నులకు కుదించారు. 375 కేంద్రాల ద్వారా సోమవారం నాటికి 1,94,092 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించి 1,86,924 మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లులకు ఎగుమతి చేశారు. కొనుగోలు చేసిన ధాన్యం విలువ రూ.449 కో ట్ల మేర ఉంటుంది. ఇప్పటి వరకు రూ.349.41 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశారు.ఈనెల 12 వరకు జరిగిన కొనుగోళ్లు సంస్థ కేంద్రాలు రైతులు సేకరించిన ధాన్యం (మెట్రిక్ టన్నుల్లో)ఐకేపీ 124 5,961 56,177.140 పీఏసీఎస్ 237 14,626 1,24,977.920 ఎఫ్‌పీఓ 14 1,534 1,29,37.400 మొత్తం 375 22,121 1,94,092.460 -
గౌతమ బుద్ధుడు గొప్ప దార్శనికుడు
నాగారం: ప్రపంచ మానవాళికి చక్కటి జీవన విధానాన్ని అందించిన గొప్ప దార్శనికుడు గౌతమ బుద్ధుడు అని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు అన్నారు. సోమవారం రాత్రి నాగారం మండలంలోని ఫణిగిరి బౌద్ధక్షేత్రం వద్ద బోధిసత్వ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన బుద్ధ జయంతి వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై బుద్ధుడి చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఫణిగిరి బౌద్ధక్షేత్రం ఒకప్పుడు ప్రపంచస్థాయి బౌద్ధ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లిందన్నారు. ప్రపంచ శాంతికి బుద్ధుడి బోధనలే మార్గమని అన్నారు. క్రీ.శ. 1వ శతాబ్దంలో ఫణిగిరి గ్రామం ధమ్మచక్రపురి పేరుతో బౌద్ధమతానికి నిలయంగా మారిందన్నారు. ఫణిగిరిలో లభించిన బౌద్ధ సందపను పరిరక్షించి, తెలంగాణ చారిత్రక వైభవాన్ని పునరుద్ధరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. ఫణిగిరి బౌద్ధ క్షేత్రాన్ని పర్యాటక కేంద్రంగామార్చాలన్నారు. అనంతరం మ్యూజియంలోని బౌద్ధ సంపదను పరిశీలించి, మ్యూజియం వెలుపల బోధి వృక్షాన్ని నాటారు. కార్యక్రమంలో తిరుమలగిరి మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఎల్సోజు చామంతినరేష్, బోధిసత్వ ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పులిగిళ్ల వీరమల్లుయాదవ్, టీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జంపాల రాజేష్, వేణు, వినోద్‌రావు, ఆలకుంట్ల బాలకృష్ణ, కొత్తగట్టు మల్లయ్య, బొడ్డు నాగరాజు, అనిల్, మధు, పురావస్తుశాఖ సిబ్బంది, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు ఫణిగిరి బౌద్ధ క్షేత్రంలో బుద్ధ జయంతి -
రేపటి నుంచే డిగ్రీ పరీక్షలు
భువనగిరి: కొంతకాలంగా డిగ్రీ పరీక్షల నిర్వహణపై నెలకొన్న సందిగ్ధత వీడింది. ఉన్నత విద్యామండలి చైర్మన్‌తో ప్రైవేట్ డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు జరిపిన చర్చలు ఫలించడంతో బుధవారం నుంచి డిగ్రీ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గత నెల 1వ తేదీ నుంచి జరగాల్సిన ప్రాక్టికల్స్, 11వ తేదీ నుంచి జరగాల్సిన డిగ్రీ పరీక్షలను ప్రైవేట్ డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు బహిష్కరించాయి. ఈ క్రమంలో మంత్రులు, ఉన్నతాధికారులను కలిసి చర్చలు జరిపినా ఫలితం లేకుండా పోయింది. తిరిగి ఈ నెల 14వ తేదీ నుంచి పరీక్షలు నిర్వహించేందుకు ఎంజీయూ పరీక్షల విభాగం అధికారులు 6వ తేదీన షెడ్యూల్ విడుదల చేసి, హాల్‌టికెట్లను ఆన్లైన్లో పొందుపర్చారు. ఇదే సమయంలో మళ్లీ ప్రైవేట్ డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకార వేతనాల బకాయిలు విడుదల చేసే వరకు పరీక్షలను నిర్వహించబోమని తేల్చిచెప్పాయి. దీంతో మళ్లీ పరీక్షల నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. కాగా సోమవారం ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలల మేనేజ్మెంట్ అసోసియేషన్‌తో ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి చర్చలు జరిపారు. వారి సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించడంతో ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించాయి. దీంతో బుధవారం నుంచి పరీక్షలు ప్రారంభంకానున్నాయి. 36 పరీక్ష కేంద్రాలు..మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పరీక్షల నిర్వహణ కోసం 36 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పరీక్షలకు 29,555 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఇందులో రెండో సెమిస్టర్ పరీక్షలకు 10,408, నాల్గో సెమిస్టర్‌కు 8,660, ఆరో సెమిస్టర్‌కు 8,447 మంది రెగ్యులర్ విద్యార్థులు ఉన్నారు. వీరితో పాటు బ్యాక్లాగ్ విద్యార్థులు ఒకటవ సెమిస్టర్ పరీక్షలకు 6,066, మూడో సెమిస్టర్‌కు 5,109, ఐదో సెమిస్టర్‌కు 4,171 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. గతంలో పొందిన హాల్‌టికెట్లతో హాజరుకావచ్చుఈ పరీక్షలకు కొత్త హాల్‌టికెట్లతో పాటు గత నెల 11వ తేదీన పరీక్షలు జరగాల్సిన సమయంలో విడుదల చేసిన హాల్టికెట్లతోనూ హాజరుకావచ్చని ఎంజీయూ పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ జి. ఉపేందర్‌రెడ్డి తెలిపారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాల వద్ద కళాశాల గుర్తింపు కార్డు లేదీ ఇతర ప్రభుత్వ గుర్తింపు కార్డులతో వస్తే అనుమతిస్తారని చెప్పారు.ఉన్నత విద్యా మండలి చైర్మన్‌తో ప్రైవేట్ కాలేజీల మేనేజ్మెంట్ అసోసియేషన్ సభ్యులు ఉన్నత విద్యామండలి చైర్మన్ హామీతో సమ్మె విరమించిన ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 36 కేంద్రాలు పరీక్షలకు హాజరుకానున్న 29,555 మంది విద్యార్థులు పాత హాల్‌టికెట్ ఉన్నా పరీక్షలకు అనుమతిఉన్నత విద్యా మండలి చైర్మన్‌కు ధన్యవాదాలుతెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి మా సమస్యలను విన్నవించగా.. ఆయన సీఎం దృష్టికి తీసుకెళ్లారు. త్వరలోనే ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకార వేతనాల బకాయిలను విడుదల చేసే విషయంపై హామీ ఇచ్చారు. ఆయన హామీ మేరకు సమ్మె విరమించి పరీక్షల నిర్వహణకు సహకరిస్తామని చెప్పాం. సమస్యల పరిష్కారం కోసం కృషి చేసిన చైర్మన్‌కు ధన్యవాదాలు. – సూర్యనారాయణరెడ్డి, ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలల మేనేజ్మెంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు -
జై జవాన్.. జై భారత్
భువనగిరి : పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌కు సంఘీభావంగా శుక్రవారం భువనగిరిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఉగ్రవాదంపై పోరాడుతున్న భారత సైన్యానికి ప్రజలంతా వెన్నుదన్నుగా నిలవాలని ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అదే విధంగా పాకిస్తాన్‌తో జరుగుతున్న యుద్ధంలో వీరమరణం పొందిన తెలుగు జవాన్ మురళీనాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పీసీసీ ప్రధాన కార్యదర్శి తంగళ్లపల్లి రవికుమార్, పోత్నక్ ప్రమోద్‌కుమార్, పోతంశెట్టి వెంకటేశ్వర్లు, ఈరపాక నర్సింహ, ప్రదీప్, కూర వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. -
అర్హుల ఎంపికకు తుది కసరత్తు
కలెక్టర్ చెంతకు ఇందిరమ్మ ఇళ్ల రెండో జాబితా రూ.లక్ష బిల్లు వచ్చింది ఇల్లు ఉండగా శిథిలావస్థకు చేరి వర్షాలకు కూలిపోయింది. ఇందిరమ్మ పథకం కింద ఇంటికోసం దరఖాస్తు చేసుకోగా మంజూరైంది. ప్రస్తు తం పిల్లర్ల దశలో పనులు ఉన్నాయి. బేస్మెంట్ వరకు రూ.లక్ష బిల్లు వచ్చింది. –చంద్రకళ, బండసోమారం గూడు సమస్య తీరనుంది తొలి విడతలోనే నాకు ఇంది రమ్మ ఇళ్లు వచింది. హాల్, కిచెన్, బెడ్రూంతో పాటు, దే వునిరూం నిర్మాణం చేస్తున్నా. ప్రస్తుతం గోడల వరకు ప నులు పూర్తయ్యాయి. త్వరలోనే ఇంటి నిర్మా ణం పూర్తవుతుంది. గూడు సమస్య తీరనుంది. ఇల్లు మంజూరు కావడం సంతోషంగా ఉంది. –ఎర్ర నర్సయ్య, బండసోమారం సాక్షి, యాదాద్రి : రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితా తుది కసరత్తు జరుగుతోంది. మొదటి, రెండో విడత కలిపి ప్రతి నియోజకవర్గంలో మొత్తం 3,500 ఇళ్లు అందించేలా అధికారులు జాబితా రూపొందించారు. తొలి విడతలో ఎంపిక చేసిన పైలట్ గ్రామాలను మినహాయించి, మిగిలిన గ్రామాల్లో తయారు చేసిన రెండో విడత జాబితా కలెక్టర్ చెంతకు చేరింది. 7,700 ఇళ్లతో జాబితా భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి, మునుగోడు, నకిరేకల్ నియోజకవర్గాలకు 8,834 ఇళ్లు మంజూరయ్యాయి. అందులో తొలి విడతలో పైలట్ గ్రామాలకు 762 ఇళ్లు మంజూరు చేశారు. రెండో విడత 7,700 ఇళ్లు అందించేలా ఇందిరమ్మ కమిటీలు, ఆ తరువాత ఎమ్మెల్యేలు లబ్ధిదారుల జాబితా రూపొందించి కలెక్టర్‌కు అందజేశారు. కలెక్టర్ లాగిన్‌లో ఉన్న జాబి తాను తహసీల్దార్లు, మండల ప్రత్యేక అధికారులు పరిశీలించి అనర్హులను పక్కన పెడుతున్నారు. కలెక్టర్ ర్యాండమ్ చెక్ తర్వాత జాబితాను జిల్లా ఇంచార్జ్ మంత్రి ఆమోదిస్తారు. ఆ తరువాత లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేయనున్నారు. సొంత స్థలం కలిగి ఉండి ఇల్లు లేని వారికి తొలిప్రాధాన్యం ఇవ్వనున్నారు. పైలట్ గ్రామాల్లో వేగంగా ఇళ్ల నిర్మాణాలు.. తొలి విడతలో ఎంపిక చేసిన 17 పైలట్ గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగంగా జరుగుతోంది. 762 ఇళ్లకు 481 గృహాలకు మార్కింగ్ ఇచ్చారు. ఇందులో 139 ఇళ్లు బేస్మెంట్ వరకు పూర్తికాగా 109 మందికి రూ.1 లక్ష చొప్పున బిల్లులు అందాయి. ఇంకా 20 మంది ఖాతాల్లో త్వరలోనే జమ చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. తుర్కపల్లి మండలంలోని కోనాపూర్, వలిగొండ మండలం నాతాళ్లగూడెంలో రూప్స్థాయిలో ఇళ్ల నిర్మాణాలు ఉన్నాయి. వలస కూలీలకు ఉపాధి ఇందిరమ్మ ఇళ్ల పథకం బిహార్, ఒడిశా, పశ్చిమబంగాల్ రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీలకు వరంగా మారింది. నిర్మాణ పనులకు స్థానిక కూలీలు సరిపోకపోవడంతో వలస కూలీలను వాడుకుంటున్నారు. ఫ విచారణ చేసి అనర్హుల తొలగింపు ఫ వారం రోజుల్లో ముగియనున్న ప్రక్రియ ఫ మంత్రి ఆమోదం పొందగానే లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్మంజూరైన ఇళ్లు నియోజకవర్గాల వారీగా.. ఆలేరు 3,196భువనగిరి 3,186మునుగోడు 1,250తుంగతుర్తి 627నకిరేకల్ 680 -
విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యం
చౌటుప్పల్ : విద్య, వైద్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తుందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తెలిపారు. చౌటుప్పల్ పట్టణంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలంలో రూ.3.29కోట్ల వ్యయంతో నిర్మించనున్న అదనపు భవన నిర్మాణ పనులకు శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్య, వైద్య రంగాలు బాగుంటేనే సామాన్య, మధ్య తరగతి ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. విద్య, వైద్యం కోసం తాను రాజీ పడబోనని, ఈ రెండు రంగాల్లో ఎలాంటి సమస్యలున్నా వెంటనే పరిష్కరిస్తానన్నారు. చదువుతోనే సమాజాభివృద్ధి సాధ్యమని.. హాస్టళ్లు, గురుకులాల్లో సమస్యలు పరిష్కరించి వాటి రూపురేఖలు మారుస్తామన్నారు.కేజీబీవీ పరిసరాల్లో కబ్జాకు గురైన ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని తహసీల్దార్‌ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, తహసీల్దార్ హరికృష్ణ, మున్సిపల్ మాజీ చైర్మన్ వెన్‌రెడ్డి రాజు, మాజీ జెడ్పీటీసీ చిలుకూరి ప్రభాకర్‌రెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ పజ్జూరు సిద్ధార్థర్దకుమార్, కేజీబీవీ ప్రత్యేకాధికారి భవానీ, మాజీ కౌన్సిలర్లు, మాజీ సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీలు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఫ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి -
బియ్యం నిల్వలో తేడాపై విచారణ!
ఆలేరు : పట్టణ పరిధిలోని సివిల్ సప్లై గోదాములో బియ్యం నిల్వల్లో వ్యతాసం ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు శుక్రవారం పౌరసరఫరాల శాఖ అధికారులు గోదామును సందర్శించి విచారణ చేశారు. స్టాక్ రికార్డులను పరిశీలించారు. బియ్యం నిల్వలో తేడాలు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించామని సివిల్ సప్లై జిల్లా మేనేజర్ హరికృష్ణ తెలిపారు. పూర్తిస్థాయి విచారణ అనంతరం వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. ఇదిలా ఉండగా గోదాము ఇంచార్జ్ కొంతకాలం క్రితం బదిలీపై వెళ్లారు. అతని స్థానంలో మరొకరు బాధ్యతలు స్వీకరించారు. బునాదిగాని కాల్వకు నీటి నిలిపివేత భువనగిరి : బునాదిగాని కాల్వకు మూసీ నుంచి తాత్కాలికంగా నీటి విడుదల నిలిపివేయనున్నట్లు కలెక్టర్ హనుమంతరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కాల్వ గేట్ల నిర్మాణ పనుల నేపథ్యంలో ఈనెల 10నుంచి జూలై 10వ తేదీ వరకు నీటి విడుదల నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. రైతులు ముందుగానే తగిన ప్రణాళిక రూపొందించుకుని అధికారులకు సహకరించాలని కోరారు. లెసెన్స్ సర్వేయర్ల శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానంలైసెన్స్ సర్వేయర్ శిక్షణకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కలెక్టర్ హనుమంతరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు మీసేవ కేంద్రాల ద్వారా ఈనెల 17 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులు ఇంటర్లో గణితంశాస్త్రం అంశంగా ఉండి కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలన్నారు. భువనగిరిలోని తెలంగాణ అకాడమీ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో 50 రోజుల పాటు శిక్షణ ఉంటుందన్నారు. వివరాలకు 91777 73713, 96400 43847 నంబర్లను సంప్రదించాలని కోరారు. జూలూరు పీఏసీఎస్ సీఈఓ సస్పెన్షన్ భూదాన్‌పోచంపల్లి : జూలూరు పీఏసీఎస్ సీఈఓ రెబ్బాస్ నర్సింహపై సస్పెన్షన్ వేటు పడింది. శుక్రవారం భూదాన్‌పోచంపల్లి మండలం జూలూరు. అలీనగర్‌లోని పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ హనుమంతరావు సందర్శించారు. రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. కొనుగోళ్ల తీరు, మాయిశ్చర్ యంత్రం ద్వారా ధాన్యం తేమశాతం పరిశీలించారు. కాగా అలీనగర్ కొనుగోలు కేంద్రంలో రైతులు పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. కొనుగోలు చేయడానికి అవసరమైన తేమ శాతం వచ్చినా ధాన్యం కొనుగోలు చేయడం లేదని, హమాలీలను ఏర్పాటు చేయలేదని, సీఈఓ, అధికారులు ఇప్పటివరకు కేంద్రాన్ని సందర్శించలేదని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ సీఈఓను సస్పెండ్ చేశారు. కేంద్రాలను సందర్శించి ధాన్యం కొనుగోళ్లను పర్యవేక్షిస్తుండాలని డీసీఓను ఆదేశించారు. వంగడాల ఎంపికే కీలకం భూదాన్‌పోచంపల్లి : మూసీ ఆయకట్టులో వంగడాల ఎంపిక కీలకమని వ్యవసాయ పరిశోధన సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ దామోదర్‌రాజు పేర్కొన్నారు. ఆర్ఎన్ఆర్ 28361, కేపీఎస్ 2874, ఆర్ఎన్ఆర్ 11718, కేపీఎస్ 6251 రకాలు అనువైనవన్నారు. శుక్రవారం భూదాన్‌పోచంపల్లి మండలం భీమనపల్లి రైతువేదికలో నిర్వహించిన రైతుల ముంగిట శాస్త్రవేత్తలు కార్యక్రమంలో పాల్గొని రైతులకు సలహాలు, సూచనలు చేశారు. పంట మార్పిడి విధానాలు అవలంభించాలన్నారు. రసాయన ఎరువుల వాడకం తగ్గించి జీలుగ విత్తనాలు, పచ్చిరొట్టతో భూసారం పెంచుకోవాలని కోరారు. జిల్లా వ్యవసాయాధికారి గోపాల్ మాట్లాడుతూ వరి కొయ్యలు కాల్చవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు సుజాత, డాక్టర్ సమత, భువనగిరి ఏడీఏ వెంకటేశ్వర్లు, పీఏసీఎస్ చైర్మన్ కందాడి భూపాల్‌రెడ్డి, వైస్ చైర్మన్ సామమోహన్రెడ్డి, చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మర్రి రాజిరెడ్డి, సుర్వి వెంకటేశ్‌గౌడ్, ఏఓ శైలజ, ఏఈఓలు రాజేశ్, నరేశ్, రైతులు కందాడి సుధాకర్‌రెడ్డి, ఆదిమూలం శ్రీను, కల్కూరి పాండు తదితరులు పాల్గొన్నారు. -
నేటి నుంచి హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ పోటీలు చారిత్రక, పర్యాటక ప్రాంతాల్లో పర్యటించనున్న పోటీదారులు 12న నాగార్జునసాగర్, 15న పోచంపల్లి, యాదగిరిగుట్టకు రాక మూడు ప్రాంతాలకు మూడు బృందాలుగా.. విస్తృత ఏర్పాట్లు చేస్తున్న పర్యాటక శాఖ
ప్రపంచ సుందరి (మిస్ వరల్డ్) పోటీలు శనివారం నుంచి హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఈ పోటీలో పాల్గొనే సుందరీమణులు ఇప్పటికే రాజధానికి చేరుకున్నారు. వారు బృందాలుగా ఏర్పడి తెలంగాణలోని చారిత్రక ప్రదేశాలు, ప్రసిద్ధ ఆలయాలను సందర్శించనున్నారు. అందులో భాగంగా ఈ నెల 12 నాగార్జునసాగర్, 15న యాదగిరి క్షేత్రాన్ని, భూదాన్పోచంపల్లిలోపర్యటిస్తారు. వీరి రాకకోసం ఆయా చోట్ల పర్యాటకశాఖ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.సుందరీమణులకు ప్రత్యేక ప్రసాదం యాదగిరిశుడిని దర్శించుకునేందుకు వస్తున్న సుందరీమణుల కోసం ఆలయ అధికారులు ప్రత్యేక ప్రసాదాన్ని తయారు చేయించనున్నారు. శ్రీస్వామి వారి లడ్డూ, పులిహోర ప్రసాదంతో పాటు సిర, కట్టె పొంగలి వంటి ప్రసాదాలను తయారు చేయించనున్నారు. ప్రసాదాలను అతిథి గృహంలోనే సుందరీమణులకు అందిస్తారు. యాదగిరీశుడి దర్శనం యాదగిరిగుట్ట : మిస్ వరల్డ్ పోటీదారులు ఈ నెల 15వ తేదీన సాయంత్రం 4గంటలకు యాదగిరి క్షేత్రానికి రానున్నారు. హైదరాబాద్ నుంచి 10 మంది సుందరీమణుల బృందం ప్రత్యేక వాహనాల్లో కొండపైన గల అతిథి గృహానికి చేరుకుంటారు. అక్కడ కలెక్టర్, ఆలయ ఈఓ వారికి స్వాగతం పలుకుతారు. ● అతిథి గృహం నుంచి బ్యాటరీ వాహనాల్లో తూర్పు మాఢవీధిలో ఉన్న అఖండ దీపారాధన చెంతకు చేరుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. అక్కడి నుంచి భజన, కోలాట బృందాలు వారి ముందు నడుస్తాయి. కూచిపూడి, భరట నాట్యం కళాకారుల స్వాగతం నడుమ వారు తూర్పు ద్వారం నుంచి తిరువీధుల్లో వెళ్తారు. అక్కడ ఆలయ అర్చకులు సంప్రదాయంగా స్వాగతం పలుకుతారు. ● త్రితల ద్వారం నుంచి ఆలయంలోకి వెళ్లి మొదటగా ఆంజనేయస్వామిని, అక్కడే ఉన్న గండబేరుండ నరసింహస్వామిని దర్శించుకుంటారు. ● అక్కడి నుంచి స్వర్ణ ధ్వజస్తంభానికి మొక్కి, గర్భాలయంలో శ్రీస్వామి అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తారు. ● గర్భాలయం నుంచి పక్కనే ఉన్న ఆండాళ్ అమ్మవారిని దర్శించుకొని, ముఖ మండపంలోకి వస్తారు. అక్కడ సువర్ణ పుష్పార్చన ఉత్సవ మూర్తుల చెంత అష్టోత్తర పూజల్లో పాల్గొంటారు. ముఖమండపంలోనే సుందరీమణులకు ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం చేస్తారు. ● పశ్చిమ ద్వారం నుంచి బయటకు వచ్చి ఆలయ ప్రాకార మండపాలు, మాఢ వీధులను చూసి, అక్కడ ఫొటోలు, వీడియోలు తీసుకొని, తిరిగి అతిథి గృహానికి వస్తారు. అరటి, మామిడి తోరణాలతో.. ప్రపంచ సుందరీమణులు యాదగిరి క్షేత్రానికి వస్తున్న నేపథ్యంలో ఆలయాన్ని తీర్చిదిద్దనున్నారు. ప్రధానాలయ ముఖమండపం, తూర్పు రాజగోపురం వద్ద రంగురంగుల పూలు, అరటి, మామిడి తోరణాలతో అలంకరించనున్నారు. రాత్రి సమయంలో శ్రీస్వామి వారి ఆలయం అద్భుతంగా కనిపించేలా విద్యుత్ దీపాలను ఏర్పాటు చేస్తున్నారు. ఏర్పాట్లపై ఇప్పటికే కలెక్టర్, డీసీపీలు ఈఓతో చర్చించారు. ఇక పాక్ – ఇండియా సరిహద్దుల్లో ఉద్రిక్తతతల నేపథ్యంలో సుందరీమణులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా, అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. నాగార్జునసాగర్ : ప్రపంచ సుందరీమణులు ఈనెల 12వ తేదీన నాగార్జునసాగర్‌కు రానున్నారు. ● మిస్ వరల్డ్ పోటీ దారులు హైదరాబాద్ నుంచి ప్రత్యేక వాహనంలో బయలుదేరి చింతపల్లి సమీపంలోని వెంకటంపేట స్టేజీ వద్దనున్న వెల్లంకి అతిథి గృహం వద్ద 15 నుంచి 30 నిమిషాలు గడపనున్నారు. ● అక్కడి నుంచి నాగార్జునసాగర్ విజయవిహార్ అతిథి గృహానికి చేరుకుని.. వారికి కేటాయించిన గదుల్లో ముస్తాబవుతారు. ● విజయ విహార్ ఎదుట ఈవెంట్ మేనేజర్ సూచనల మేరకు మీడియా కోసం ఫొటోలు దిగుతారు. ● ఆ తర్వాత విజయ విహార్ వెనకభాగంలో సాగర తీరాన 30 నిమిషాల పాటు ఫొటో షూట్ ఉంటుంది. ● అక్కడి నుంచి వారు వచ్చిన బస్సుల్లోనే బయలుదేరి బుద్ధవనం చేరుకుంటారు. 12న బుద్దపూర్ణిమ కావడంతో బుద్ధుడి పాదుకల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అక్కడి నుంచి నడుచుకుంటూ మహాస్థూపం వద్దకు వెళ్తారు. చివరి మెట్ల మీదునుంచి పైకెక్కి ఫొటో షూట్లో పాల్గొంటారు. వారినుంచి వంద అడుగుల దూరంలో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించిన గిరిజనుల నృత్యం ఉంటుంది. ● మహాస్థూపం చుట్టూ ఏర్పాటు చేసిన విగ్రహాల్లో ఎంపిక చేసిన వాటి గురించి టూర్ గైడ్ శివనాగిరెడ్డి ప్రపంచ సుందరీమణులకు వివరిస్తారు. ● మహాస్తూపంలోని అష్టబుద్ధుల వద్ద క్యాండిల్స్ వెలిగిస్తారు. అక్కడే వారికి కేటాయించిన సీట్లలో కూర్చుని మూడు నిమిషాలు ధ్యానం చేస్తారు. అక్కడే మరో ఐదు నిమిషాల పాటు మాంగ్స్ చాటింగ్‌లో పాల్గొంటారు. ఐదు నిమిషాల పాటు బుద్ధజయంతి గురించి తెలుసుకుంటారు. ● అక్కడి నుంచి మెట్లు దిగి జాతక పార్కుకు చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన కుర్చీల్లో ఆసీనులవుతారు. బుద్ధుడి చరిత్ర, తెలంగాణ బుద్ధిజం, బౌద్ధ విశేషాలు తెలుసుకుంటారు. అక్కడే బుద్ధచరితపై డ్రామా ఉంటుంది. ● అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన డిన్నర్లో పాల్గొని హైదరాబాద్ బయలు దేరతారు. వారివారి దేశ సంప్రదాయాల మెనూ ప్రకారం హైదరాబాద్ నుంచే భోజనాలను తీసుకురానున్నారు. భూదాన్‌పోచంపల్లి : ఇక్కత్ వస్త్రాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొంది, ఉత్తమ పర్యాటక గ్రామంగా యునెస్కో అనుబంధ సంస్థచే అంతర్జాతీయ అవార్డు పొందిన భూదాన్‌పోచంపల్లికి ఈనెల 15న మిస్‌వరల్డ్ కంటెస్టెంట్లు వస్తున్నారు. వారి రాకకోసం స్థానిక రూరల్ టూరిజం పార్కులో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. టూరిజం బస్సులో 25 మంది సుందరీమణుల బృందం సా యంత్రం 6 గంటలకు పోచంపల్లికి చేరుకుంటుంది. ఇక్కడ రెండు గంటల గడిపి తిరిగి రాత్రి 8 గంటలకు హైదరాబాద్ వెళ్తారు. అడుగడుగునా ఇక్కత్ థీమ్ ఉట్టిపడేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ● మిస్‌వరల్డ్ కంటెస్టెంట్లకు టూరిజం ప్రధాన ద్వారం నుంచి లోపలి మ్యూజియం వరకు మహిళలు కోలాటాలతో స్వాగతం పలుకుతారు. వారికి బొట్టుపెట్టి, పూలమాలలు వేసి సత్కరిస్తారు. ● టూరిజం లోపలి ద్వారం వద్ద ముగ్గుల్లో అలంకరించే టెర్రాకోట్ కుండలను ముద్దుగుమ్మలు పరిశీలిస్తారు. లోపలి గచ్చు ప్రాంతంలో మెహందీ వేయడాన్ని తిలకిస్తారు. అందాలభామలు కోరితే వారికి కూడా మెహందీ వేస్తారు. ఇక్కడే లైవ్ మ్యూజికల్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి మ్యూజియంలోకి వెళ్తారు. ● మ్యూజియం లోపల ఏర్పాటు చేసిన మగ్గాలపై చేనేత వస్త్రాల తయారీ విధానాన్ని ప్రత్యక్షంగా పరిశీలిస్తారు. ఇందుకోసం రెండు మగ్గాలను ఏర్పాటు చేస్తున్నారు. ● అక్కడి నుంచి కాన్ఫరెన్స్ హాల్లో స్నాక్ రిఫ్రెష్మెంట్ పూర్తయిన వెంటనే అక్కడ నుంచి మ్యూజియం బయటికి వస్తూ టూరిజం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎడ్ల బండిని తిలకిస్తారు. మరోపక్క తెలంగాణ సంప్రదాయానికి ప్రతీక అయిన మన బతుకమ్మను తిలకిస్తారు. ఇక్కడే కొందరూ మహిళలు బతుకమ్మను పేర్చుతూ పాటలు పాడుతారు. ● అక్కడ నుంచి హంపి థియేటర్‌కు చేరుకుంటారు. అక్కడ వీవీఐపీలతో పాటు సుందరీమణులు సోఫాల్లో కూర్చుని కార్యక్రమాలను అరగంటపాటు తిలకిస్తారు. ఇక్కడ ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ స్వాతిచే రూపొందించిన ఇండో – వెస్ట్రన్ ఇక్కత్ వస్త్రాలతో మోడల్స్ నిర్వహించే ర్యాంప్‌వాక్‌ను తిలకిస్తారు. ● తెలంగాణ టూరిజం శాఖ రూపొందించిన తెలంగాణ సంస్కృతి, సంప్రదాయం, పోచంపల్లి ఇక్కత్ ప్రాముఖ్యతను ఏవీ ప్రదర్శనను సైతం తిలకిస్తారు. అవసరం అనుకొంటే మిస్‌వరల్డ్ పోటీదారులు చేనేత వస్త్రాలను కొనుగోలు చేస్తారు. ఫొటోలు కూడా దిగుతారు. ● టూరిజం ప్రాంగణం ఇరువైపులా పల్లె వాతావరణం ప్రతిబింబించే గుడిసెల సెట్లో ఏర్పాటు చేసిన చేనేత స్టాల్స్‌ను పరిశీలిస్తారు. ఇక్కడ ఉన్న 10 స్టాల్స్‌లో పోచంపల్లి ఇక్కత్ స్టాల్స్ ఏడు, మిగతావి గద్వాల్, సిద్దిపేట గొల్లభామ, నారాయణపేట్ స్టాల్స్ ఉన్నాయి. ఇక్కడ కొకూన్స్ నుంచి వస్త్రం వరకు ఎలా తయారవుతుందో చేనేత మహిళలు వీరికి వివరిస్తారు. ● రెండో ప్రధాన ద్వారం వద్ద పూలతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రాబ్స్ అలంకరణను తిలకిస్తారు. అక్కడి నుంచి తిరిగి బస్సులో హైదరాబాద్ వెళ్తారు. పోచంపల్లిలో ‘ఇక్కత్ థీమ్’బుద్ధుడి చెంతకు..హైదరాబాద్‌కు చేరుకున్న మిస్ వరల్డ్ పోటీదారులు -
టెక్స్టైల్స్ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం
భూదాన్‌పోచంపల్లి, భువనగిరిటౌన్ : హ్యాండ్లూం టెక్స్టైల్ టెక్నాలజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కొరకు దరఖాస్తులు కోరుతున్నట్లు చేనేత, జౌళి శాఖ సహాయ సంచాలకులు శ్రీనివాసరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 205–26 విద్యా సంవత్సరానికి మూడు సంవత్సరాల కాలం కోర్సు వ్యవధి ఉంటుందన్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీలో గల కొండా లక్ష్మణ్ బాపూజీ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యూండ్లూమ్ టెక్నాలజీలో ఈనెల 16న కోర్సుపై అవగాహన సదస్సు ఉంటుందన్నారు. గుట్ట క్షేత్రంలో డిజిటలైజేషన్యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలోని అన్ని విభాగాలు, కౌంటర్లను డిజిటలైజ్ (కంప్యూటరైజ్డ్) చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈఓ వెంకట్రావ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకోసం ఈగవర్నెన్స్ కమిటీ ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. భక్తులకు మెరుగైన, సులభతరమైన సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రతి శుక్రవారం ప్రత్యేక బడిబాట భువనగిరి: వేసవిలో ప్రతి శుక్రవారం ప్రత్యేక బడిబాట కార్యక్రమం నిర్వహించాలని డీఈఓ సత్యనారాయణ గురువారం ఒక ప్రకటనలో సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ నెల 9,16,23,30 తేదీల్లో ఎంఈఓలు, హెచ్ఎంలు, ఉపాధ్యాయులు అమ్మ అదర్శ కమిటీ సభ్యులతో కలిసి ఆవాస ప్రాంతాల్లో ప్రత్యేక బడిబాట నిర్వహించాలని సూచించారు. బడిబయట ఉన్న పిల్లలను కలిసి బడిలో చేర్పించాలన్నారు. వారి తల్లిదండ్రులను సైతం కలిసి ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాల గురించి వివరించాలన్నారు. స్వయం సహాయక మహిళా సంఘాలు, అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు, గ్రామపెద్దలు, యువత సహకారంతో పిల్లలను బడిలో చేర్చేవిధంగా కృషి చేయాలని కోరారు. ఐకేపీ ఏపీఎంకు అవార్డు బీబీనగర్: ఐకేపీ బీబీనగర్ మండల ఏపీఎం శ్రీనివాస్ రాష్ట్రస్థాయి అవార్డు అందుకున్నారు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను బ్యాంకు లింకేజీ రుణాలు మంజూరు చేయించడంతో ఉత్తమ ప్రతిభ కనబర్చినందుకు గాను అవార్డు దక్కింది. గురువారం హైదరాబాద్‌లో పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క చేతుల మీదుగా అవార్డు అందుకున్నాడు. 15 నుంచి సమ్మర్ క్యాంపులు భువనగిరి: ప్రభుత్వ పాఠశాలల్లో ఈనెల 15నుంచి వేసవి శిబిరాలు నిర్వహించనున్నట్లు డీఈఓ సత్యనారాయణ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 6నుంచి 9వ తరగతి విద్యార్థులు క్యాంపులో పాల్గొనేందుక అవకాశం ఉంటుందని, జిల్లాలో 50 పాఠశాలలను ఎంపిక చేసినట్లు వెల్లడించారు. యోగాతో పాటు ఆటలపోటీలు, సీడ్‌బాల్ తయారీ, ఆర్ట్, డ్రాయింగ్, పేపర్ క్రాఫ్ట్ తయారీ వంటి వాటిలో శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 31వ తేదీ వరకు వేసవి శిబిరాలు కొనసాగుతాయని, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చెరువులను సర్వే చేయండిభువనగిరిటౌన్ : హెచ్ఎండీఏ పరిధిలో 242 చెరువులు ఉన్నాయని, వీటిని సర్వే చేసి నివేదిక సిద్ధం చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో నీటిపారుదల శాఖ డీఈలు, ఏఈలో, సర్వేయర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. చెరువులతో పాటు కాలువలను సర్వే చేయాలన్నారు. సర్వే నివేదికను ప్ర భుత్వానికి సమర్పించాల్సి ఉంటుందని, పక్కాగా ఉండాలని సూచించారు. సమావేశంలో ఆర్డీఓ కృష్ణారెడ్డి, ఇరిగేషన్ డీఈ నరసింహ ఉన్నారు. -
కనుల పండువగా లక్ష పుష్పార్చన
యాదగిరిగుట్ట: ఏకాదశి సందర్భంగా గురువారం యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి, అమ్మవారిని పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలతో అలంకరించి వివిధ రకాల పుష్పాలతో అర్చన చేశారు. అదే విధంగా ప్రధానాలయంలో సంప్రదాయ పూజలు ఆగమశాస్త్రం ప్రకారం చేపట్టారు. వేకువజామున సుప్రభాత సేవతో స్వామివారిన మేల్కొలిపిన అర్చకులు.. గర్భాలయంలోని స్వ యంభూలు, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజా భిషేకం చేసి, తులసీదళ అర్చనతో కొలిచారు. అనంతరం ప్రథమ ప్రాకార మండపంలో సుదర్శనహోమం, గజవాహన సేవ, స్వామి, అమ్మవారికి నిత్యకల్యాణం, ముఖ మండపంలో జోడు సేవో త్సవం తదితర పూజలు నిర్వహించారు. రాత్రి స్వామివారికి శయనోత్సవం చేసి ఆలయద్వార బంధనం చేశారు. -
ఏపీ ప్రభుత్వ వైఖరిపై నిరసన
భువనగిరిటౌన్ : సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనంజయ రెడ్డి నివాసంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు అకారణంగా తనిఖీలు చేసి భయభ్రాంతులకు గురి చేయడాన్ని నిరసిస్తూ గురువారం భువనగిరిలోని బాబు జగ్జీవ న్‌రాం చౌరస్తాలో జర్నలిస్టులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పత్రికా స్వేచ్ఛను హరించే ప్రయత్నం చేయడం తగదన్నారు. వీరికి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, సీపీఎం, సీపీఐతో పాటు కుల, ప్రజాసంఘాలు మద్దతు తెలిపాయి. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యుజేఐ జిల్లా అధ్యక్షుడు యంబ నర్సింహులు, బీఆర్ఎస్ నాయకుడు కొలుపుల అమరేందర్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కొండమడుగు నరసింహ, ఏశాల అశోక్, బర్రె జహంగీర్, కందుల శ్రీనివాస్, ఎనబోయిన ఆంజనేయులు, టీయూడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కొలుపుల వివేకానంద, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చందా మహేందర్‌గుప్తా, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఏశాల అశోక్, బీఆర్ఎస్ పట్టణ కమిటీ అధ్యక్షుడు ఏవీ కిరణ్‌కుమార్, కార్యదర్శి రచ్చ శ్రీనివాస్‌రెడ్డి, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ ఇమ్రాన్, టీయుడబ్ల్యూజేఐ జేయు పట్టణ కార్యదర్శి కందుల శ్రీనివాస్, మాటూరు బాలరాజుగౌడ్, సురుపంగ శివలింగం, బూరుగు మణికంఠ, జర్నలిస్ట్ సంఘాల నాయకులు కూరెల్ల మల్లేష్, ఖాజా బాయ్, లక్ష్మీనారాయణ, పాక జహంగీర్, కనక బాలకృష్ణ, భువనగిరి శ్రీనివాస్, బండారు జగదీష్, గుర్రాల శివనాగేందర్, ఎస్డీ అఫ్జల్, ఎండీ జకీర్, నిమ్మల సురేష్, గడ్డం వెంకటేష్, సతీష్, బుగ్గ శ్రీను, శ్యామల శోభన్‌బాబు, నవీన్, హరిబాబు, ఇటుకల దేవేందర్, కైరంకొండ నవీన్, గుండేటి హరిబాబు, ఈరపాక నరసింహ, మాయ కృష్ణ, ఈరపాక నరసింహ, మాటూరి వెంకటేశ్వర్లు, ఎండీ జమాలుద్దీన్, శివనందుల రమేష్, లోడే చంద్రశేఖర్‌గౌడ్, వడ్లకొండ భరత్, కోరుటూరి ఉపేందర్, ఎర్ర శ్రీకాంత్, కూర వెంకటేష్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఫ సాక్షి ఎడిటర్ ఇంట్లో పోలీసుల తనిఖీలను ఖండిస్తూ జర్నలిస్టుల ఆందోళన ఫ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల మద్దతు -
భారత సైన్యానికి సెల్యూట్ చేస్తున్నా..!
కోదాడ: కాశ్మీర్ లోయలో అమాయక ప్రజలను పొట్టనపెట్టుకున్న పాకిస్తాన్ ప్రేరిత ఉగ్రవాదులను మట్టికరిపించి, ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేసిన భారత సైన్యానికి మాజీ సైనికుడిగా తాను సెల్యూట్ చేస్తున్నానని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా కోదాడలో ఓ ప్రైవేట్ కార్యాక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఆయన విలేఖరులతో మాట్లాడారు. పీఓకేలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు అనేక సంవత్సరాలుగా స్ధావరాలను ఏర్పాటు చేసుకొని కాశ్మీర్ లోయలో అలజడులను సృష్టిస్తున్నారని అన్నారు. భారత సైన్యం ఎంతో ధైర్యసాహసాలను ప్రదర్శించి ఉగ్రవాద శిబిరాలపై విజయవంతంగా దాడులు నిర్వహించడం అభినందనీయన్నారు. తాను గతంలో భారత వైమానికదళంలో మిగ్ పైలెట్‌గా పనిచేసిన విషయాన్ని ఈ సందర్బంగా ఆయన గుర్తుచేశారు. పాకిస్తాన్ నుంచి వచ్చే ఎలాంటి చర్యలనైనా ఎదుర్కొనే శక్తి భారత సైన్యానికి ఉందని, భారత్ సైన్యం ముందు పాకిస్తాన్ ఆటలు సాగవని ఆయన అన్నారు. ఈ సమయంలో దేశం మొత్తం సైన్యానికి అండగా నిలవాలని మంత్రి ఉత్తమ్ పిలుపునిచ్చారు. ఫ మాజీ సైనికుడిగా ఆపరేషన్ సిందూర్‌ను స్వాగతిస్తున్నా ఫ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి -
సుందరీమణుల పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు
సాక్షి,యాదాద్రి : ప్రపంచంలోని వివిధ దేశాల సుందరీమణులు ఈనెల 15వ తేదీన యాదగిరిగుట్ట క్షేత్రం, భూదాన్‌పోచంపల్లిలో పర్యటించనున్న నేపథ్యంలో పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ హనుమంతరావు, యాదగిరిగుట్ట ఆలయ ఈఓ వెంకట్రావ్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో డీసీపీతో పాటు వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి ఏర్పాట్లపై సమీక్షించారు.గుట్ట, పోచంపల్లికి వచ్చే ప్రధాన మార్గాలను అర్చీలు, స్వాగత తోరణాలతో అందంగా తీర్చిదిద్దాలని సూచించారు.సుందరీమణులు పర్యటించే ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని, పోలీస్ అధికారులు ముందస్తుగా మాక్‌డ్రిల్ నిర్వహించాలని, బ్యాటరీ వాహనాలు, రోప్‌వే సిబ్బందిని సిద్ధంగా ఉంచాలని, గుర్తింపు పొందిన ప్రాంతాల్లో హోర్డింగులు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. అకాల వర్షాల దృష్ట్యా జేసీబీలను సిద్ధంగా ఉంచాలన్నారు. వైద్యాధికారులు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, జెడ్పీ సీఈఓ శోభారాణి, టూరిజం కార్పొరేషన్ జనరల్ మేనేజర్ ఉపేందర్‌రెడ్డి, భువనగిరి, చౌటుప్పల్ ఆర్డీఓలు కృష్ణారెడ్డి, శేఖర్‌రెడ్డి, భువనగిరి, చౌటుప్పల్, యాదగిరిగుట్ట ఏసీపీలు, జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ హనుమంతరావు, యాదగిరిగుట్ట ఆలయ ఈఓ వెంకట్రావ్ -
బునాదిగాని ఆధునీకరణ!
త్వరలో కాల్వ పనులు ప్రారంభం.. సిద్ధమవుతున్న యంత్రాంగంసాక్షి, యాదాద్రి : బునాదిగాని కాల్వ ఆధునీకరణ పనులు ప్రారంభించేందుకు యంత్రాంగం సిద్ధమవుతోంది. కాల్వ విస్తరణ, భూసేకరణ సాధ్యాసాధ్యాలపై భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి రెండు రోజుల క్రితం రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్షించారు. వానాకాలంలోగా వీలైన మేరకు పనులు పనులు చేపట్టాలని ఆదేశించారు. కాల్వ లోతు, వెడల్పు పెంచేందుకు ప్రభుత్వం ఇప్పటికే రూ.266.65 కోట్లు మంజూరు చేయగా.. టెండర్లు కూడా పూర్తయ్యాయి. 98.64 కిలో మీటర్ల పొడవు ఆధునీకరణ భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి నియోజకవర్గాల పరిధిలోని ఐదు మండలాల్లో బునాదిగాని కాల్వను ఆధునీకరించనున్నారు. బీబీనగర్ మండలం మక్తా అనంతారం ఎర్రగుంట నుంచి బునాదిగాని కాల్వ ప్రారంభం అవుతుంది. ఇక్కడి నుంచి భువనగిరి, వలిగొండ మండలంలోని పహిల్వాన్‌పురం పెద్దచెరువు మీదుగా మోత్కూరు మండలం ధర్మారం ఊర చెరువు వరకు 98.64 కిలో మీటర్ల పొడవు కాల్వను ఆధునీకరిస్తారు. ప్రస్తుతం ఉన్న కాల్వ నీటి ప్రవాహ సామర్థ్యం 50 క్యూసెక్కులు ఉంది. ఆధునీకరణలో భాగంగా కాల్వ పొడవు, వెడల్పు చేసి 350 క్యూసెక్కులకు పెంచనున్నారు. మూడు నియోజకవర్గాల పరిధిలో భువనగిరి, వలిగొండ, ఆత్మకూర్(ఎం), మోటకొండూరు, మోత్కూరు, అడ్డగూడూరు మండలం ధర్మారం వరకు కాల్వను ఆధునీకరించనున్నారు. భూ సేకరణే సమస్య బునాదిగాని కాల్వ ఆధునీకరణ పనులకు భూసేకరణ అడ్డంకిగా మారే అవకాశం ఉంది. అందుకే ముందుగా భూసేకరణ అవసరంలేని చోట పనులు చేపట్టాలని నిర్ణయించారు. భూ సేకరణకు రూ.44 కోట్లు కేటాయించారు. ప్రస్తుతం కాల్వ వెడల్పు, లోతు పెంచడానికి భూసేకరణ చేయాలి. భూసేకరణ నోటిఫికేషన్ విడుదల చేయడానికి అధికారులు సిద్ధం అవుతున్నారు. తొమ్మిది రీచ్‌లుగా విభజన కాల్వ ఆధునీకరణ పనులను తొమ్మిది రీచ్‌లుగా విభజించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఏదులాబాద్ నుంచి యాదాద్రి జిల్లాలోని బీబీనగర్ మక్తాఅనంతారం మీదుగా ముగ్ధుంపల్లి వరకు తొలి రీచ్ ఉండనుంది. కాల్వ ప్రారంభంలో 6.6 మీటర్ల వెడల్పు, లోతు 1.65 మీటర్లకు పెంచాలని నిర్ణయించారు. చివరి రీచ్‌లో రెండున్నర మీటర్ల మేర వెడల్పు చేయనున్నారు. వానాకాలం లోగా కాల్వ పనులు ప్రారంభిస్తాం మూసీ కాల్వల ద్వారా అదనపు ఆయకట్టు స్థిరీకరించడం ప్రభుత్వ లక్ష్యం. పిలాయిపల్లి, బునాదిగాని, ధర్మారెడ్డి కాల్వల ఆధునీకరణకు ఇప్పటికే ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. వానా కాలం సాగు పనులు ప్రారంభించే లోపు కాల్వ ఆధునీకరణ పనులు ప్రారంభిస్తాం. యాసంగి పంటకాలానికి ముందు కూడా కాలువ పనులు చేస్తాం. ఇలా విడుతల వారీగి రైతులకు ఇబ్బందిలేకుండా పనులుచేస్తాం. ముందుగా భూసేకరణ అవసరం లేని పనులను ప్రారంభిస్తాం. భూసేకరణకు కూడానిధులు సిద్ధంగా ఉన్నాయి. రైతులు భూసేకరణకు సహకరించాలి. –కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే ఫ తొలుత భూసేకరణ లేని చోట పనులు ఫ 350 క్యూసెక్కుల నీరు ప్రవహించేలా కాల్వ విస్తరణ ఫ రూ.266.65 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం పంట కాలానికి ముందే పనులు వానాకాలంలోపే పనులు ప్రారంభించే దిశగా చర్యలు మొదలయ్యాయి. నీటిపారుదల, రెవెన్యూ శాఖల అధికారులతో కలిసి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి బునాదిగాని కాల్వ వెంట పర్యటించి పరిశీలించారు. భూ సేకరణ సాధ్యాసాధ్యాలపై చర్చించారు. రైతులతోనూ చర్చించారు. కాల్వలో నీటి సామర్థ్యం పెరగడం వల్ల భూగర్భ జలాలు పెరగడంతో పాటు చివరి భూముల వరకు సాఫీగా నీరందుతుందని, భూ సేకరణకు సహకరించాలని రైతులకు సూచించారు. యాసంగి సీజన్ ప్రారంలోపు పనులు పూర్తికాని పక్షంలో అవసరమైతే క్రాప్‌హాలిడే తీసుకుని పనులు పూర్తి చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. -
ప్రారంభించకుండానే శిథిలావస్థకు..
గుండాల మండల కేంద్రంలో నిర్మించిన ఆర్టీసీ బస్టాండ్ ప్రారంభానికి నోచుకోకుండానే శిథిలావస్థకు చేరింది. బస్సుల కోసం ప్రయాణికులు ఎండ, వానలో నిరీక్షించకుండా ఎంపీ ల్యాండ్ నిధులతో బస్టాండ్ నిర్మించారు. కానీ, ఆర్టీసీ అధికారుల నిరక్ష్యం వల్ల వినియోగంలోకి రాలేదు. ప్రస్తుతం బస్టాండ్‌కు అమర్చిన షెట్టర్, కిటికీలు తుప్పుపట్టాయి. మరుగుదొడ్ల కిటికీలు, తలుపులు చెదలుపట్టాయి. దీంతో ప్రయాణికులు రోడ్డుపైనే నిలబడాల్సి వస్తుంది. బస్టాండ్‌ను ప్రారంభించి ఉపయోగంలోకి తేవాలని ప్రయాణికులు కోరుతున్నారు. –గుండాల -
ఆస్తిపన్ను వసూళ్లు రూ.3.20 కోట్లు
భువనగిరిటౌన్ : మున్సిపల్ శాఖ ప్రకటించిన ఎర్లీబర్డ్ స్కీంకు మంచి ఆధరణ లభించింది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మున్సిపాలిటీల్లో ముందస్తుగా ఆస్తిపన్ను చెల్లించిన వారికి ఐదు శాతం రాయితీ అవకాశం ప్రకటించింది. ఇందులో భాగంగా గడిచిన 38 రోజుల్లో వేలాది మంది ముందుకువచ్చి ఆస్తిపన్ను చెల్లించారు. ఐదు మున్సిపాలిటీల్లో 3 కోట్ల 22లక్షల 20వేలు వసూలైంది. ఏటా ఆర్థిక సంవత్సరం ముగియగానే ఏప్రిల్ 1నుంచి 31వ తేదీ వరకు మున్సిపల్ శాఖ ఎర్లీబర్డ్ స్కీం అమలు చేస్తోంది. ఈసారి వరుస సెలువులు రావడంతో పాటు మున్సిపల్ యంత్రాంగం వివిధ ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీగా ఉండడంతో ఈనెల 7వ తేదీ వరకు గడువు పొడిగించింది. ఫ్లెక్సీలు, ఆటోల ద్వారా ప్రచారం ఎర్లీబర్డ్ పథకంపై మున్సిపల్ యంత్రాంగ విస్తృతంగా ప్రచారం చేసింది. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి, ఆటో ద్వారా ప్రచారం కల్పించింది. ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్‌యువ వికాసం దరఖాస్తులు ఇచ్చేందుకు మున్సిపాలిటీలకు వచ్చే ప్రజలకు ఐదు శాతం రాయితీపై అవగాహన కల్పించి ముందస్తు ఆస్తిపన్ను చెల్లించేవిధంగా సఫలీకృతమైంది. మున్సిపాలిటీలవారీగా వసూలు ఇలా.. ● భువనగిరిలో ఆస్తిపన్ను రూ.9.28 కోట్లు డిమాండ్ కాగా.. ఐదు శాతం రాయితీ అవకాశం కల్పించడంతో రూ.1.61 కోట్లు వసూలయ్యాయి. ఇంకా రూ.7.67 కోట్లు వసూలు కావల్సి ఉంది. ● మోత్కూరులో రూ.1.49 కోట్లకు రూ.22 లక్షలు వ సూలయ్యాయి. రూ.1.27 కోట్లు పెండింగ్ ఉంది. ● యాదగిరిగుట్టలో రూ.3.44 కోట్లకు రూ.76 లక్షలు వసూలయ్యాయి. రూ.2.68 కోట్లు వసూలు కావాల్సి ఉంది. ● భూదాన్‌పోచంపల్లిలో డిమాండ్ రూ.2.56 కోట్లు ఉండగా.. రూ.26.20 లక్షలు రాబడి వచ్చింది. రూ.29 కోట్లు పెండింగ్ ఉంది. ● ఆలేరు మున్సిపాలిటీలో రూ.2.36 కోట్లకు రూ.35 లక్షలు వసూలయ్యాయి. రూ.2.01 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. ఫ మున్సిపాలిటీల్లో ఐదు శాతంరాయితీకి మంచి ఆధరణ ఫ వేలాదిగా సద్వినియోగం చేసుకున్న పన్నుదారులు ఫ అత్యధికంగా భువనగిరిలో రూ.1.61 కోట్లు వసూలు -
పీహెచ్‌సీని సందర్శించిన యూనిసెఫ్ బృందం
భూదాన్‌పోచంపల్లి : యూనిసెఫ్ కన్సల్టెంట్ (ఢిల్లీ) క్యాతివాట్స్ బృందం గురువారం భూదాన్‌పోచంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించింది. ఈ సందర్భంగా వారు గర్భిణులు, బాలింతలకు అందుతున్న వైద్యసేవలు, ఆర్యోగ కార్యక్రమాలపై అడిగి తెలుసుకున్నారు. ఐరన్, ఫోలిక్‌యాసిడ్, క్యాల్షియం మాత్రలు వాడే విధానం, వాటి ప్రయోజనాలపై ఆరా తీశారు. అనంతరం వైద్యసిబ్బందితో సమావేశమై మాతాశిశు మరణాల నివారణకు చేపడుతున్న కార్యక్రమాలపై చర్చించారు. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలుపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మెటర్నల్ హెల్త్, న్యూట్రిషన్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ శిల్ప, న్యూట్రిషనిస్ట్ సౌజన్యతో, డీఎంహెచ్ఓ మనోహర్, డిప్యూటీ డీఎంహెచ్ఓ యశోద, వైద్యాధి కారిణి శ్రీవాణి, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ పోతారెడ్డి, సూపర్వైజర్లు పాల్గొన్నారు. -
సందిగ్ధంలో డిగ్రీ విద్యార్థులు!
ఉమ్మడి జిల్లాలో 72 కళాశాలలు మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 72 కళాశాలలు ఉన్నాయి. ఇందులో ప్రభుత్వ 9, ఎయిడెడ్ 2, అటానమస్ 2, ప్రైవేట్ కళాశాలలు 59 వరకు ఉన్నాయి. ఆయా కళాశాలల్లో ప్రథమ, ద్వితీయ , తృతీయ సంవత్సరం విద్యార్థులు 15 వేల వరకు ఉన్నారు. వీరంతా పరీక్షల కోసం ఎదురుచూస్తున్నారు. భువనగిరి: మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరి ధిలో ఈనెల 14నుంచి జరగాల్సిన పరీక్షలపై విద్యార్థులు సందిగ్ధంలో ఉన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకారవేతన బకాయిలు విడుదల చేసే వరకు పరీక్షలను బహిష్కరిస్తున్నట్లు మరో సారి ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు ప్రకటించాయి. ఇదే విషయాన్ని యూనివర్సిటీ అధికారులకు తెలియజేసేందుకు శుక్రవారం వారితో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. దీంతో పరీక్షల నిర్వహణపై స్పష్టత లేకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. కొన్ని నెలలుగా నిరసన కార్యక్రమాలు ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకారవేతన బకాయిలు విడుదల చేయకపోవడాన్ని నిరసిస్తూ ప్రైవేట్ కళా శాలలు యాజమాన్యాలు కొంతకాలంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాయి. మంత్రులు, ఉన్నత విద్యామండలి అధికారులను కలిసి చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలో గత నెల 1నుంచి జరగాల్సిన ప్రాక్టికల్స్, 11నుంచి ప్రారంభం కావాల్సిన సబ్జెక్ట్ పరీక్షలను నిర్వహించబోమని చేతులెత్తేశాయి. కాగా ఈ నెల 14నుంచి 2, 4, 6 సెమిస్టర్ల రెగ్యులర్, 1, 3, 5 సెమిస్టర్ల బ్యాక్లాగ్ పరీక్షలు నిర్వహించేందుకు యూనివర్సిటీ అధికారులు ఈ నెల 6న షెడ్యూల్ విడుదల చేశారు. కానీ, పరీక్షలు నిర్వహించే పరిస్థితుల్లో తాము లేమని ప్రైవేట్ కళాశాలలు మరోసారి స్పష్టం చేయడంతో పరీక్షలు ప్రారంభం అవుతాయా.. లేదోనని విద్యార్థుల్లో సందిగ్ధం నెలకొంది. ఉన్నత చదువులకు ఇబ్బందులు ఫీజు బకాయిలు, పరీక్షలకు ముడిపెట్టవద్దని యూనివర్సిటీ అధికారులు కళాశాలల యాజమాన్యాలకు నచ్చజెబుతున్నా సేసేమిరా అంటున్నాయి. పీజీ ఇతర ఉన్నత చదువుల ప్రవేశాలకు డిగ్రీ చివరి సెమిస్టర్ పరీక్షలు కీలకం. డిగ్రీ 6వ సెమిస్టర్ పరీక్షలు త్వరగా రాస్తే వివిధ రకాల ప్రవేశ పరీక్షలకు సిద్ధం కావచ్చన్న ఆశతో విద్యార్థులు ఉన్నారు. కానీ, తాజా పరిణామాలు వారిని ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఫ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసిన మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఫ బహిష్కరిస్తున్నట్లు మరోసారి ప్రకటించిన ప్రైవేట్ కాలేజీలు ఫ ఆందోళనలో విద్యార్థులు విధిలేని పరిస్థితుల్లోనే నిర్ణయం కొన్నేళ్లుగా ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు విడుదల చేయ డం లేదు. దీంతో కళాశాలల నిర్వహణ కష్టంగా మారింది. అద్దె భవనాలకు కిరాయి, అధ్యాపకులు, సిబ్బందికి వేతనాలు చెల్లించలేని స్థితిలో ఉన్నాం. పీజీ సెట్‌కు సిద్ధమయ్యే విద్యార్థులు డిగ్రీ పరీక్షలు పూర్తి చేయాల్సి ఉంది. వారికి జరుగుతుందని తెలిసినా విధిలేని పరిస్థితుల్లోనే పరీక్షల నిర్వహణకు ముందుకు రావడం లేదు. విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా ప్రభుత్వం తక్షణమే స్పందించి రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి. –బి.సూర్యనారాయణరెడ్డి, తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలల మేనేజ్మెంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు -
ట్రాక్టర్ ఫ్యాన్ తగిలి మహిళకు తీవ్ర గాయాలు
తుంగతుర్తి: వరి ధాన్యం తూర్పార పడుతుండగా ట్రాక్టర్‌కు ఏర్పాటు చేసిన ఫ్యాన్ తగిలి మహిళకు తీవ్ర గాయమైంది. ఈ తుంగతుర్తి మండలం కొత్తగూడెం గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. కొత్తగూడెం గ్రామానికి చెందిన ఉప్పుల విజయ తమ వరి ధాన్యాన్ని గ్రామ పరిధిలోని ఐకెపీ కేంద్రంలో పోశారు. గురువారం ఐకేపీ కేంద్రంలో ట్రాక్టర్‌కు పంక ఏర్పాటు చేసుకుని ఉప్పుల విజయ తూర్పార పడుతుండగా.. ఆమె చేయి ట్రాక్టర్ ఫ్యాన్ కు తగిలి కండరం తెగింది. విజయ చేయి నుంచి రక్తం కారుతుండడంతో అది చూసిన ఆమె భర్త నవీన్ స్పృహతప్పి పడిపోయాడు. విజయను వెంటనే స్థానికులు అంబులెన్స్‌లో తుంగతుర్తి ప్రభుత్వ ఆస్పతరికి తరలించారు. అక్కడి నుంచి సూర్యాపేట ఆస్పత్రికి.. అటు నుంచి హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్లు పరిశీలించి విజయ చేతి ఎముక విరిగిపోయిందని, ఆపరేషన్ చేయాలని సూచించారని కుటుంబ సభ్యులు తెలిపారు. -
యాదగిరీశుడి జయంతి ఉత్సవాలు
యాదగిరిగుట్ట: యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శుక్రవారం నుంచి నృసింహుడి జయంతి ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. మూడురోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు గాను ఆలయ అర్చకులు, అధికారులు ఏర్పాట్లను పూర్తిచేశారు. ప్రధానాలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. స్వస్తీవాచనంతో శ్రీకారం శుక్రవారం ఉదయం 8.45గంటలకు ఆలయంలో స్వస్తీవాచనంతో జయంతి ఉత్సవాలకు శ్రీకారం చుడతారు. అనంతరం విష్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, రుత్విక్ వరణం జరిపిస్తారు. తర్వాత లక్ష కుంకుమార్చన నిర్వహించి, తిరు వేంకటపతి అలంకార సేవలో ఆలయ తిరు, మాఢ వీధుల్లో స్వామిని ఊరేగిస్తారు. సాయంత్రం మృత్సంగ్రహణం, అంకురార్పణ, హవనం జరిపించి గరుఢ వాహనంపై పర వాసుదేవ అలంకార సేవను ఆలయ తిరు, మాఢ వీధుల్లో ఊరేగిస్తారు. ● శనివారం ఉదయం నిత్య నృసింహ మూలమంత్ర హవనములు, లక్ష పుష్పార్చన నిర్వహించి స్వామిని కాళీయమర్ధన అలంకార సేవలో ఊరేగిస్తారు. సాయంత్రం నృసింహ మూలమంత్ర హవనములు, నిత్య పూర్ణాహుతి జరిపి, హనుమంత వాహనంపై శ్రీరామావతారంలో అలంకార సేవ నిర్వహిస్తారు. ● ఆదివారం ఉదయం 7గంటల నుంచి నృసింహ మూలమంత్ర హవనములు, 8.30గంటల నుంచి 9గంటల వరకు మహా పూర్ణాహుతి, సహస్ర కలశాభిషేకం చేపడతారు. సాయంత్రం 7గంటలకు విశేష తిరువారాధన, అర్చన, వేద స్వస్తీ, నృసింహ ఆవిర్భావం, మహా నివేధన, తీర్థ ప్రసాద గోష్ఠితో ఉత్సవాలను ముగిస్తారు. పాతగుట్ట ఆలయంలో పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సైతం శుక్రవారం నుంచే జయంతి ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. ఉదయం 8.45గంటలకు స్వస్తీవాచనం, విష్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, రక్షాబంధనం, రుత్విక్ వరణం, లక్ష కుంకుమార్చన జరిపిస్తారు. సాయంత్రం మృత్సంగ్రహణం, అంకురార్పణ, హవనం నిర్వహిస్తారు. సంగీత మహాసభలు జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆలయ సన్నిధిలో భజన, భక్తి సంగీతం, భరత నాట్యం, కూచిపూడి నృత్యం వంటి కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఇప్పటికే ధార్మిక, సాహిత్య, సంగీత మహాసభలకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తిచేసిన అధికారులు.. కళాకారులకు సైతం ఆహ్వానం అందజేశారు. ఆర్జిత సేవలు రద్దు ఈ ఉత్సవాల్లో భాగంగా భక్తులచే నిర్వహించే నిత్య, శాశ్వత కల్యాణం, సుదర్శన హోమం, బ్రహ్మోత్సవం, జోడు సేవలు వంటి ఆర్జిత సేవలను అధికారులు రద్దు చేశారు. మూడుజుల పాటు భక్తులు ఇందుకు సహకరించాలని ఆలయ ఈఓ వెంకట్రావ్ కోరారు.నేడు ఉదయం 8.45 గంటలకు స్వస్తీవాచనంతో శ్రీకారం ఆలయంలో ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు, అర్చకులు -
రోడ్డు ప్రమాదంలో వలస కూలీ మృతి
రామగిరి(నల్లగొండ): రోడ్డు ప్రమాదంలో వలస కూలీ మృతిచెందాడు. ఈ ఘటన నల్లగొండ మండలంలో నల్లగొండ–గుండ్లపల్లి రహదారిలో బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. గురువారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం యక్షాపురం గ్రామానికి చెందిన షేక్ మైబూషేన్(45) నల్లగొండకు వలస వచ్చి స్థానికంగా ఉంటూ.. నల్లగొండ నుంచి గుండ్లపల్లి వరకు జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనుల్లో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం మధ్యాహ్నం మైబూషేన్ డీజిల్ సప్లై చేసే వాహనం నడుపుకుంటూ గుండ్లపల్లి నుంచి నల్లగొండకు వస్తుండగా.. మార్గమధ్యలో వాహనం అదుపుతప్పడంతో రహదారి పక్కన వ్యవసాయ భూమిలో ఉన్న సమాధులను ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన మైబూషేన్ను స్థానికులు చికిత్స నిమిత్తం నల్లగొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. గురువారం మృతుడి భార్య రమిజాబీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ లింగారెడ్డి తెలిపారు. ఆటో ఢీకొని ఒకరు దుర్మరణంమునుగోడు: బైక్‌పై వెళ్తున్న యువకుడిని ఆటో ఢీకొనడంతో మృతిచెందాడు. ఈ ఘటన మునుగోడు మండలం గూడపూర్ గ్రామ సమీపంలో గురువారం జరిగింది. మృతుడి కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మునుగోడు గ్రామ పంచాయతీ పరిధిలోని లక్ష్మిదేవిగూడేనికి చెందినా యంపల్ల నరేష్(30) బైక్‌పై నల్ల గొండకు వెళ్తుండగా.. గూడపూర్ సమీపంలో ఎదురుగా వస్తున్న ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నరేష్ రోడ్డుపై ఎగిరిపడడంతో తల పగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నరేష్ మృతదేహాన్ని నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు. రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతియాదగిరిగుట్ట రూరల్: రైలు నుంచి జారిపడి గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన ఆలేరు–వంగపల్లి రైల్వే స్టేషన్ల మధ్య గురువారం రాత్రి చోటుచేసుకుంది. జీఆర్పీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆలేరు–యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామాల మధ్యన రైలు పట్టాలపై గుర్తుతెలియని వ్యక్తి రైలు నుంచి జారిపడి మృతిచెందినట్లు స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు జీఆర్పీ పోలీసులు ఘటనా స్ధలానికి వెళ్లి పరిశీలించారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు దొరకలేదని తెలిపారు. మృతదేహాన్ని భువనగిరి ఏరియా ఆస్పత్రి మార్చురీకి తరలించి కేసు నమోదు చేసినట్లు జీఆర్పీ ఇన్చార్జి కృష్ణారావు తెలియజేశారు. ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం.. మహిళపై కేసునల్లగొండ: నల్లగొండ జిల్లా కోర్టులో మహిళలకు ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి డబ్బులు తీసుకుని పారిపోయిన మహిళపై కేసు నమోదు చేసినట్లు నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి గురువారం తెలిపారు. కోర్టులో స్వీపర్ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి గాజుల జ్యోతి అనే మహిళ ఒక్కొక్కరి నుంచి రూ.50వేల చొప్పున 40 మంది వద్ద డబ్బులు వసూలు చేసి పరారైనట్లు డీఎస్పీ పేర్కొన్నారు. బాధితులు తిప్పర్తి, నల్లగొండ వన్‌టౌన్, టూటౌన్‌తో పాటు పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయడంతో ఆయా స్టేషన్ల పరిధిలో కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఇంకా ఎవరైనా బాధితులు ఉంటే నిర్భయంగా ముందుకు వచ్చి సంబంధిత పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయవచ్చిన డీఎస్పీ సూచించారు. -
వృద్ధురాలి కళ్లలో కారం చల్లి..
నేరేడుచర్ల: వృద్ధురాలి కళ్లలో కారం చల్లి ఆమె మెడలోని రెండు తులాల పుస్తెలతాడును గుర్తుతెలియని మహిళ ఎత్తుకెళ్లింది. ఈ ఘటన నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలో గురువారం జరిగింది. ఎస్ఐ రవీందర్‌నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని గ్రంథాలయం వీధికి చెందిన వృద్ధురాలు గుండా చంద్రకళ ఇంటికి గురువారం గుర్తుతెలియని మహిళ వచ్చి తాగడానికి నీళ్లు ఇవ్వమని అడిగింది. దీంతో చంద్రకళ ఇంట్లోకి వెళ్లి బాటిల్లో నీళ్లు తీసుకొచ్చి ఆ మహిళకు ఇచ్చింది. ఆమె నీళ్లు తాగినట్లు చేసి బాటిల్ మూతను కింద పడేసింది. కిందపడిన బాటిల్ మూతను చంద్రకళ తీసేలోపే ఆమె కళ్లలో గుర్తుతెలియని మహిళ కారం చల్లి ఆమె మెడలోని రెండు తులాల పుస్తెలతాడును లాక్కోని పారిపోయింది. చంద్రకళ ఇంట్లో నుంచి బయటకు వచ్చి కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి విషయం తెలుసుకుని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి వివరాలు తెలుసుకున్నారు. చంద్రకళ కుమారుడు సంతోష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మెడలోని పుస్తెలతాడు అపహరణ -
సుందరీమణుల పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
యాదగిరిగుట్ట: హైదరాబాద్‌లోని నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే వివిధ దేశాలకు సుందరీమణులు ఈ నెల 15వ తేదీన రానున్న యాదగిరి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు రానున్న నేపథ్యంలో గురువారం కలెక్టర్ హనుమంతరావు, భువనగిరి డీసీపీ ఆకాంశ్ యాదవ్, ఈఓ వెంకట్రావ్ ఆలయ పరిసరాలను పరిశీలించారు. కొండ పైన ఏర్పాట్లు ఎలా ఉండాలనే అంశాలను ఈఓతో కలెక్టర్, డీసీపీ చర్చించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అందాల భామలకు పర్యటన విజయవంతం చేసేందుకు అందరూ కృషిచేయాలని ఆలయ అధికారులకు కలెక్టర్ హనుమంతరావు సూచించారు. ఆలయ పరిసరాలు శుభ్రంగా ఉండేలా చూడాలని, ప్రధానాలయాన్ని రంగురంగుల పూలు, విద్యుత్ దీపాలతో అలంకరించాలన్నారు. వారి వెంట ఏసీపీ సైదులు, అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి, ఆలయాధికారులు దోర్బాల భాస్కర్‌రావు, రఘు, రాజన్‌బాబు, దయాకర్‌రెడ్డి తదితరులున్నారు. పోచంపల్లిలో భద్రతా ఏర్పాట్ల పరిశీలనభూదాన్పోచంపల్లి: అందాల భామలు 15న పోచంపల్లికి కూడా రానున్న నేపథ్యంలో గురువారం పోచంపల్లిని స్పెషల్ బ్రాంచ్ డీసీపీ జి. నర్సింహారెడ్డి, ఏఆర్ డీసీపీ శ్యామ్‌సుందర్, అడిషనల్ డీసీపీ ఎం. వెంకట్‌రెడ్డి, చౌటుప్పల్ ఏసీపీ మధుసూధన్‌రెడ్డి, ఐటీ ఏసీపీ నరేందర్, ఎస్డబ్ల్యూ ఏసీపీ శైలజ్కుమార్, చౌటుప్పల్ రూరల్ సీఐ రాములు, ఎస్ఐ భాస్కర్‌రెడ్డి సందర్శించారు. టూరిజం పార్కు ప్రాంగణం, పార్కులోని మ్యూజియం, గదులు, స్టాల్స్ ఏర్పాటు ప్రదేశాన్ని పరిశీలించారు. మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే సుందరీమణులు వస్తున్న నేపథ్యంలో తీసుకోవల్సిన భద్రతా ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. కార్యక్రమానికి ఎంత మంది హాజరవుతురు, వారికి ఇచ్చే పాసులు, టూరిజం పార్కులో ఏర్పాటు చేస్తున్న కార్యక్రమాలను చౌటుప్పల్ ఏసీపీ ద్వారా అడిగి తెలుసుకున్నారు. అనంతరం పలు సూచనలు చేశారు.బుద్ధవనంలో మెడికల్ క్యాంపు.. నాగార్జునాసాగర్: నాగార్జుసాగర్ను ఈ నెల 12న అందాల భామలు సందర్శించనున్న నేపథ్యంలో బుద్ధవనంలో మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు నల్లగొండ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పుట్ట శ్రీనివాస్ తెలిపారు. గురువారం ఆయన బుద్ధవనం, విజయవిహార్ అతిథి గృహాన్ని సందర్శించి మాట్లాడారు. ఈ మెడికల్ క్యాంపుతో పాటు స్థానిక కమలా నెహ్రూ ఆస్పత్రిలో అత్యాధునిక మెడికల్ ఎక్విప్మెంట్తో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశామని అన్నారు. ఆయన వెంట డిప్యూటీ డీఎంహెచ్ఓ కేశ రవి, జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ కృష్ణకుమారి, పెద్దవూర మండల వైద్యాధికారి నగేష్, విజయ విహార్ మేనేజర్ కిరణ్‌కుమార్, బుద్ధవనం ఈఓ రవిచంద్ర తదితరులు ఉన్నారు. -
11న గోమాతతో గిరి ప్రదక్షిణ
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా ఈ నెల 11న అఖిల భారత గో సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో గోమాతతో గిరి ప్రదక్షిణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఈఓ వెంకట్రావ్ తెలిపారు. గురువారం యాదగిరీశుడి ఆలయ సన్నిధిలో ఈఓ వెంకట్రావ్‌ను అఖిల భారత గో సేవా ఫౌండేషన్ ప్రతినిధులు కలిసి గోమాతతో గిరి ప్రదక్షిణ నిర్వహిస్తామని విన్నవించారు. దీనిపై స్పందించిన ఈఓ.. గిరి ప్రదక్షిణ ప్రాధాన్యతను మరింత పెంచేందుకు గోమాతతో గిరి ప్రదక్షిణ చేయడం చాలా మంచి కార్యక్రమం అన్నారు. అఖిల భారత గో రక్ష సమితి అధ్యక్షుడు బాలకృష్ణ గురుస్వామి మాట్లాడుతూ.. గో రక్షణ, భూ రక్షణ, పర్యావరణ రక్షణ, ధర్మం కోసం కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 515 కిలోమీటర్లు 182 రోజులు 14 రాష్ట్రాలు ఒక చిన్న పుంగనూరు గోమాతతో పాదయాత్ర నిర్వహించామన్నారు. ఈ గోమాతతో పాటు 500 మంది గో భక్తులతో యాదగిరి దేవస్థానంలో ఈ నెల 11న ఉదయం 5గంటల నుంచి గిరి ప్రదక్షిణ కార్యక్రమం చేపడతామన్నారు. ఈఓను కలిసిన వారిలో హైందవ సంఘాల ఐక్య వేదిక అధ్యక్షులు కట్టెగొమ్ముల రవీందర్‌రెడ్డి, గో విజయ్‌కుమార్, తాటిపాల రాములుగౌడ్, అడ్వకేట్ సురేష్‌గౌడ్, రాఘవేంద్ర, మాణిక్‌యాదవ్, నాందేవ్, ఆకుల అనిల్, ఎరుకల అనిల్ కుమార్‌గౌడ్ ఉన్నారు. -
భార్యలను ఇంట్లో నుంచి గెంటేసిన తండ్రి, కొడుకు
నార్కట్‌పల్లి: తమ భార్యలను తండ్రి, కొడుకు ఇంట్లో నుంచి గెంటివేయగా.. తమకు న్యాయం చేయాలని అత్త, కోడలు కలిసి ఇంటి ఎదుట దీక్షకు దిగారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. నార్కట్‌పల్లి మండల కేంద్రానికి చెందిన బద్దుల మల్లేష్ ఆర్టీసీలో మెకానిక్‌గా పని చేస్తున్నాడు. అతడి మొదటి భార్య క్యాన్సర్‌తో మృతిచెందడంతో 2012లో యాదమ్మ అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. మల్లేష్‌కు, అతడి మొదటి భార్యకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు సంతానం. రెండో భార్యతో సంతానం కలగలేదు. కొంతకాలం మల్లేష్, అతడి రెండో భార్య యాదమ్మ కాపురం సజావుగానే సాగింది. పిల్లల పెళ్లిళ్లు అయిన తర్వాత యాదమ్మను మల్లేష్ ఇంట్లో నుంచి వెళ్లగొట్టాడు. మల్లేష్ మొదటి భార్య కుమారుడైన బద్దుల మహేష్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ ఏపీలోని విజయవాడకు చెందిన దుర్గామల్లేశ్వరీని వివాహం చేసుకున్నాడు. అయితే మహేష్ కూడా తన భార్య దుర్గామల్లేశ్వరీతో పాటు మూడేళ్ల కుమారుడిని ఇటీవల ఇంట్లో నుంచి వెళ్లగొట్టాడు. తమను ఇంట్లోకి రానీయకుండా తండ్రి, కొడుకు ఇంటికి తాళం వేసి వెళ్లడంతో తమకు న్యాయం చేయాలని గురువారం అత్త యాదమ్మ, కోడలు దుర్గామల్లేశ్వరి కలిసి నార్కట్‌పల్లిలోని మల్లేష్ ఇంటి ఎదుట దీక్షకు దిగారు. పెళ్లి సమయంలో తన తల్లిగారు కిలో బంగారంతో పాటు విజయవాడలో ఓ ప్లాట్ ఇచ్చారని, తాను ఏం తప్పు చేశానని ఇంటి నుంచి వెళ్లగొట్టారని దుర్గామల్లేశ్వరీ కన్నీటి పర్యంతమైంది. వీరికి ఐద్వా నాయకురాళ్లు అండగా నిలిచారు. జల్సాలకు అటుపడి భార్యలను ఇంట్లో నుంచి గెంటేసిన తండ్రి మల్లేష్, కొడుకు మహేష్‌ను అరెస్ట్ చేయాలని ఐద్వా జిల్లా కార్యదర్శి పాలడుగు ప్రభావతి, సరోజ, నాగమణి డిమాండ్ చేశారు. ఇంటి ముందు ధర్నాకు దిగిన అత్త, కోడలు -
అమెరికాలో సర్వేల్ గురుకులం గోల్డెన్ జూబ్లీ వేడుకలు
సంస్థాన్ నారాయణపురం: అమెరికాలోని లాస్ వెగాస్ నగరంలోలో సంస్థాన్ నారాయణపురం మండలంలోని సర్వేల్ గురకుల విద్యాలయం పూర్వ విద్యార్థులు గోల్డెన్ జూబ్లీ వేడుకలను గురువారం నిర్వహించారు. గురుకుల విద్యాలయంలో 1972–1975 మధ్య కాలంలో చదువుకుని అమెరికాలో స్థిరపడిన వారు ఒకే చోట కలుసుకుని చిన్ననాటి జ్ఞాపకాలను ఒకరికొకరు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో డి. సత్యనారాయణ, చెన్న రాజ, కె. రవికుమార్, కర్ర మల్లారెడ్డి, సీ. నారాయణ, ప్రభాకర్, బసిని వెంకటేశ్వర్లు, వనం సత్తయ్య తదితరులు పాల్గొన్నారు. -
బావిలో పడి బాలుడు మృతి
వలిగొండ: సరదాగా ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు కాలు జారి బావిలో పడి బాలుడు మృతిచెందాడు. ఈ ఘటన వలిగొండ మండలం ఎం. తుర్కపల్లిలో సోమవారం జరిగింది. మంగళవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎం. తుర్కపల్లికి చెందిన బట్టు సుధాకర్ చిన్న కుమారుడు బట్టు చరణ్(12) చెవిటి, మూగవాడు. సోమవారం మధ్యాహ్నం సుధాకర్ సోదరుడి కుమారుడు బట్టు గౌతంతో కలిసి చరణ్ ఎం. తుర్కపల్లి గ్రామానికే చెందిన తుమ్మల బాల్‌రెడ్డి వ్యవసాయ బావి వద్దకు ఈత కొట్టేందుకు వెళ్లారు. వీరికి ఈత రాకపోవడంతో బావి ఒడ్డున స్నానం చేస్తుండగా చరణ్ కాలుజారి బావిలో పడిపోయాడు. భయంతో ఇంటికి వెళ్లిన గౌతం ఇంట్లో ఎవరికీ ఈ విషయం చెప్పలేదు. సాయంత్రం వరకు చరణ్ ఇంటికి రాకపోవడంతో కంగారుపడిన కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతికారు. చరణ్ బావిలో పడిన విషయాన్ని గౌతం కుటుంబ సభ్యులకు చెప్పడంతో బావి వద్దకు వెళ్లి విద్యుత్ మోటార్లతో నీటిని తోడుతుండగా చరణ్ మృతదేహం లభించింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహానికి పంచనామ నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం రామన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మంగళవారం చరణ్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ యుగంధర్ తెలిపారు. మట్టి తరలిస్తున్న టిప్పర్ల పట్టివేతహుజూర్నగర్: అక్రమంగా మట్టిని తరలిస్తున్న నాలుగు టిప్పర్లను రెవెన్యూ అధికారులు మంగళవారం పట్టకున్నారు. వివరాలు.. చిలుకూరు మండలం లక్ష్మీపురం గ్రామం నుంచి కొందరు అక్రమార్కులు టిప్పర్లలో మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు నాలుగు మట్టి టిప్పర్లను పట్టుకుని తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. ఈ సందర్బంగా తహసీల్దార్ నాగార్జునరెడ్డి మాట్లాడుతూ.. మట్టి టిప్పర్లను పట్టకున్న విషయాన్ని మైనింగ్ అధికారులకు తెలియజేశామని, వారు జరిమాన విధిస్తారని చెప్పారు. ఎవరైనా అధికారుల అనుమతి లేకుండా మట్టి, ఇసుకను అక్రమంగా తరలిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
రైల్వే వ్యవస్థ ప్రైవేటీకరణను వ్యతిరేకించాలి
రామగిరి(నల్లగొండ): రైల్వే వ్యవస్థను ప్రైవేటీకరించే విధానాలను వ్యతిరేకించాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి పిలుపునిచ్చారు. సీఐటీయూ అఖిల భారత కమిటీ పిలుపు మేరకు సీఐటీయూ జిల్లా నాయకులు మంగళవారం నలగొండ రైల్వే స్టేషన్ ఎదుట ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వీరారెడ్డి మాట్లాడుతూ దేశంలో రైల్వే వ్యవస్థను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పూర్తిగా ప్రైవేటీకరించడానికి తీవ్ర ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. రైల్వే రంగంలో భద్రతా చర్యలు పెంచాలని, ప్రమాదాలు అరికట్టాలని ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేశారు. రైల్వే ప్రైవేటీకరణ వల్ల సరుకు రవాణా చార్జీలు పెరగడంతో వస్తువుల రేట్లు పెరుగుతాయన్నారు. ప్రయాణికుల భద్రత కోసం సరైన చర్యలు చేపట్టాలని, ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని, ప్యాసింజర్ రైళ్లు పెంచాలని, రైళ్లల్లో సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు చినపాక లక్ష్మీనారాయణ, జిల్లా ఉపాధ్యక్షుడు ఎండీ సలీం, జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, జిల్లా కమిటీ సభ్యులు అద్దంకి నరసింహ, సలివోజు సైదాచారి, గంజి నాగరాజు, పల్లె నగేష్, అవుట రవీందర్, నకరెకంటి సత్తయ్య, లింగస్వామి, వెంకన్న, రాధాకష్ణ పాల్గొన్నారు. -
ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన కారు
శాలిగౌరారం: శాలిగౌరారం మండలం మాధారంకలాన్ గ్రామ సమీపంలో 365వ నంబర్ జాతీయ రహదారిపై మంగళవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందగా.. మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి. వివరాలు.. కట్టంగూరు మండలం అయిటిపాముల గ్రామ పంచాయతీ పరిధిలోని ఎస్ఎల్బీసీ కాలనీకి చెందిన మాదగాని లోకేశ్(24), కట్టంగూర్ మండలం మల్లారం గ్రామ పంచాయతీ పరిధిలోని పెద్దోనిబావి గ్రామానికి చెందిన రాచకొండ నిఖిల్(21) స్నేహితులు. లోకేశ్ ఐటీఐ పూర్తిచేసి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు తయారుచేసే కంపెనీలో అంప్రెంటీస్ చేస్తున్నాడు. నిఖిల్ డిగ్రీ పూర్తిచేసి ఇంటి వద్దనే ఉంటున్నాడు. లోకేశ్ మంగళవారం హైదరాబాద్ నుంచి బైక్‌పై పెద్దోనిబావి గ్రామానికి వచ్చి నిఖిల్‌ను పిలుచుకొని నకిరేకల్ మీదుగా 365వ నంబర్ జాతీయ రహదారిపై అర్వపల్లి వైపు వెళ్తున్నారు. మార్గమధ్యలో శాలిగౌరారం మండలం మాధారంకలాన్ గ్రామ సమీపంలోకి రాగానే ఎదురుగా వస్తున్న కారు వీరి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లోకేశ్‌కు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. బైక్‌పై వెనుక కూర్చున్న రాచకొండ నిఖిల్‌కు తీవ్రగాయాలు కావడంతో పాటు కారును నడుపుతున్న మండలంలోని చిత్తలూరు గ్రామానికి చెందిన దేశగాని విఠల్‌కు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నిఖిల్, విఠల్‌ను నకిరేకల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నిఖిల్ పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. ఈ ఘటనపై ఫిర్యాదు అందలేదని, మృతదేహాలను నకిరేకల్ ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించినట్లు ఎస్ఐ సైదులు తెలిపారు. ఇద్దరు యువకులు దుర్మరణం -
హనుమంతుడికి ఆకుపూజ
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి క్షేత్రపాలకుడిగా ఉన్న శ్రీఆంజనేయస్వామికి అర్చకులు మంగళవారం ఆకుపూజను విశేషంగా నిర్వహించారు. ప్రధానాలయంతో పాటు విష్ణు పుష్కరిణి వద్ద, పాతగుట్ట ఆలయంలో ఆంజనేయస్వామిని సింధూరం, పాలతో అభిషేకించారు. అనంతరం తమలపాకులతో అర్చించారు. హనుమంతుడికి ఇష్టమైన నైవేద్యం సమర్పించి, భక్తులకు ప్రసాదంగా అందజేశారు. ఇక ప్రధానాలయంలో నిత్య పూజలు సంప్రదాయంగా కొనసాగాయి. శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం, సాయంత్రం వెండి జోడు సేవ పూజలు నిర్వహించారు.జాతీయ స్థాయి హ్యాండ్‌బాల్ పోటీలకు ఎంపికనకిరేకల్: జాతీయ స్థాయి హ్యాండ్‌బాల్ పోటీలకు నకిరేకల్ మండలం మంగళపల్లి గ్రామానికి చెందిన కొప్పుల శ్రీజ ఎంపికై నట్లు ఉమ్మడి జిల్లా హ్యాండ్‌బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చింతకాయల పుల్లయ్య మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శాలిగౌరారం మండలం వల్లాల మోడల్ స్కూల్ ఇటీవల ఇంటర్మీడియట్ పూర్తిచేసిన శ్రీజ గత నెల 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన రాష్ట్రస్థాయి సీనియర్ మహిళల హ్యాండ్‌బాల్ చాంపియన్‌షిప్‌లో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై ందని తెలిపారు. ఈ నెల 9 నుంచి 12వ తేదీ వరకు తమిళనాడు రాష్ట్రంలో జరిగే జాతీయ స్థాయి సీనియర్ మహిళల హ్యాండ్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీల్లో శ్రీజ పాల్గొంటుందని తెలిపారు.రసాయన వ్యర్థాల శాంపిల్స్ సేకరణచివ్వెంల(సూర్యాపేట): లారీల్లో రసాయనిక వ్యర్థాలు తీసుకొచ్చి సోమవారం రాత్రి చివ్వెంల మండలం అక్కలదేవిగూడెం గ్రామ శివారులో సూర్యాపేట–ఖమ్మం రహదారి పక్కన రహదారి పక్కన వదిలిపెట్టారు. మంగళవారం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు రోడ్డు పక్కన పారబోసిన రసాయనిక వ్యర్థాల శ్యాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపించారు. వ్యర్థాలు వదిలిన లారీలను స్థానికుల ఫిర్యాదు మేరకు సోమవారం రాత్రి పోలీసులు పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. -
విద్యుత్ స్తంభాన్ని ఢీకొని కారు బోల్తా
తిప్పర్తి: అతివేగంగా వస్తున్న కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి బోల్తా పడింది. అనంతరం ఆ కారుపై విద్యుత్ స్తంభం విరిగి పడింది. ఈ ఘటన తిప్పర్తి మండలం మల్లేపల్లివారిగూడెం వద్ద సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు కారులో గుంటూరుకు వెళ్లి సోమవారం రాత్రి తిరిగి హైదరాబాద్‌కు వెళ్తున్నారు. మార్గమధ్యలో తిప్పర్తి మండలం మల్లేపల్లివారిగూడెం వద్దకు రాగానే కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి బోల్తాపడింది. కారు ఢీకొన్న వేగానికి విద్యుత్ స్తంభం విరిగి కారుపై పడిపోయింది. అయితే కారులో ప్రయాణిస్తున్న వారు సురక్షితంగా బయటపడ్డారు. కారుపై విరిగిపడిన విద్యుత్ స్తంభం -
ఈదురుగాలులకు ఒరిగిన ధ్వజ స్తంభం
మిర్యాలగూడ: దామరచర్ల మండలం వాడపల్లిలో మంగళవారం భారీ ఈదురుగాలులతో కూడి వర్షం కురవగా.. గ్రామ శివారులోని పురాతన శ్రీలక్ష్మీనృసింహస్వామి, మీనాక్షి అగస్త్యేశ్వరస్వామి ఆలయాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. ఈదురుగాలులకు లక్ష్మీనృసింహస్వామి ఆలయ ధ్వజస్తంభం ఒక పక్కకు ఒరిగింది. శివాలయంలోని భారీ చెట్లు నేలకొరిగాయి. ఆలయ పునరుద్ధరణలో భాగంగా 1995లో ఇండియా సిమెంట్స్ కంపెనీ యాజమాన్యం ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేసినట్లు ఆలయ కమిటీ చైర్మన్లు కొందూటి సిద్ధయ్య, పొదిల శ్రీనివాస్ తెలిపారు. విశిష్టమైన ఆలయాలు దెబ్బతినడం పట్ల అర్చకులు నాగేంద్రప్రసాద్శర్మ, సాంబశివరావుశర్మ, రామానుజాచార్యులు, గ్రామస్తులు విచారం వ్యక్తం చేశారు. -
ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి అనర్హుడు
సూర్యాపేటటౌన్ : రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి అనర్హుడని, రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చి మొసలి కన్నీరు కారుస్తున్నాడని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం సూర్యాపేటలో జగదీష్‌రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పాలన చేతకాని రేవంత్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంగా ఏర్పడినప్పుడే తెలంగాణ అప్పులతో మొదలైందని, అయినా పదేండ్లు కేసీఆర్ చేసిన అభివృద్ధి పాలన చూడలేదా అని అన్నారు. ఆదాయ వ్యయాల్లో కేసీఆర్‌కు, రేవంత్ కు చాలా వ్యత్యాసం ఉందన్నారు. రేవంత్ మాట్లాడిన ప్రతిమాట అబద్దమని, రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిని బట్టే కేసీఆర్ హామీలిచ్చారని చెప్పారు. రేవంత్‌రెడ్డి అడ్డగోలు హామీలిచ్చి అమలు చేతకాక ఇప్పుడు చేతులెత్తేసిండని విమర్శించారు. ఇచ్చిన హామీలను గాలికొదిలేసి.. గాలిమోటర్లో తిరిగి.. అప్పులు పుడతలేవంటున్నరని, సీఎం హోదాలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు సిగ్గుచేటన్నారు. రాష్ట్ర ఆదాయం తగ్గి మంత్రుల ఆదాయం పెరగడంతోనే అసలు సమస్య వస్తుందని చెప్పారు. హామీలు ఎగ్గొట్టడం కోసమే రేవంత్ దొంగ ఏడుపులు ఏడుస్తున్నాడని విమర్శించారు. తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పి రేవంత్ సీఎం పదవికి రాజీనామా చేయాలన్నారు. మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి -
జమకాని వంట గ్యాస్ రాయితీ
ఆలేరురూరల్: రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీల్లో భాగంగా మహాలక్ష్మి పథకం కింద రూ.500కే వంట గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రవేశపెట్టింది. జిల్లా మొత్తం 2,49,568 గ్యాస్ కనెక్షన్లు ఉండగా 1,25,762 మందిని లబ్ధిదారులుగా గుర్తించారు. ప్రస్తుతం సిలిండర్‌ను రూ.875 విక్రయిస్తున్నాయి. దీనికి కేంద్ర ప్రభుత్వం రూ.47 రాయితీగా ప్రతి వినియోగదారుడి ఖాతాలో జమచేస్తుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వ పథకంలో భాగంగా రూ.500కే సిలిండర్ ఇవ్వాలంటే ఒక్కో సిలిండర్‌కు రూ.328 ఆయా లబ్ధిదారుడి ఖాతాలో జమకావాలి. కానీ ఐదు నెలలుగా జమ కావడం లేదు. జిల్లాలో గ్యాస్ కనెక్షన్ల వివరాలు జిల్లాలో దీపం గ్యాస్ కనెక్షన్లు 51,391 ఉండగా, ఉజ్వల్ కనక్షన్లు 13,997 ఉన్నాయి. డొమెస్టిక్ కనెక్షన్లు 1,85,979 ఉండగా, మొత్తం 2,49,568 కనెక్షన్లు ఉన్నాయి. 14 కిలోల సిలిండర్ ధర రూ.875 ఉండగా.. అందులో కేంద్రం రూ.47 రాయితీని 13 సిలిండర్ల వరకు వర్తింపజేస్తుంది. ఇదే మాదిరి రాష్ట్ర ప్రభుత్వం కూడా రూ.500 గ్యాస్ సిలిండర్ పథకానికి పరిమితులు ఏమైనా విధించిందా అనే ప్రశ్న లబ్ధిదారుల్లో తలెత్తుతోంది. జిల్లా అధికారులకు సైతం దీనిపై అవగాహన లేకపోవడంతో రాయితీ ఎందుకు జమకావడం లేదో సమాధానం ఉండడం లేదు. ఫ ఐదు నెలలుగా ఎదురుచూస్తున్న మహాలక్ష్మి పథకం లబ్ధిదారులు -
మెరికల్లాంటి కార్యకర్తలకే ప్రాధాన్యం
ఆలేరు: మెరికల్లాంటి కార్యకర్తలు, నాయకులకే గ్రామ, మండల, బ్లాక్‌స్థాయి పార్టీ పగ్గాల అప్పగింతలో అధిక ప్రాధాన్యం ఉంటుందని ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య స్పష్టం చేశారు. మంగళవారం ఆలేరు పట్టణంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారం లేక పదేళ్లు ఎంత గోస పడ్డామో మీకు తెలుసని,.. ఇప్పుడు అధికారంలోకి వచ్చామనే ధీమాతో ఉన్నా.. ఉదాసీనత ధోరణి వీడాలని సూచించారు. అధికారంలోకి రావడం ఎంత ముఖ్యమో..వచ్చిన అధికారాన్ని నిలబెట్టుకోవడం అంతకన్నా ముఖ్యమనే విషయాన్ని విస్మరించొద్దన్నారు. పార్టీ పదవులు అలంకారప్రాయం కాకూడదని.. నిత్యం ప్రజలతో మమేకమవ్వాలన్నారు. సైనికుల్లా పనిచేసే వారికే పార్టీ పదవులు వస్తాయన్నారు. ప్రతి కార్యకర్త, నాయకుడూ మరింత బాధ్యతగా గ్రామాలు, మండల స్థాయిలో పర్యటిస్తూ రాష్ట్ర పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. పార్టీ పదవుల విషయంలో ఎవరూ పోటీ పడొద్దన్నారు. ఎవరేం చేస్తున్నారో హైకమాండ్ గమనిస్తోందన్నారు. సంస్థాగత ఎన్నికల్లో పదవులను తాను నిర్ణయించనని.. కార్యకర్తలు, నాయకుల అభీష్టమే ఫైనల్ అని చెప్పారు. ఈసారి కమిటీల్లో మహిళలకు అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అందరూ పని చేయాలన్నారు. పార్టీ కోసం పని చేసే వారికి పదవులతోపాటు తనవంతు ఆర్థిక సాయం అందించడానికి ముందుంటానని స్పష్టం చేశారు. సమావేశంలో పార్టీ పరిశీలకుడు ధన్వంతరి, జిల్లా అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి, ఇన్చార్జి అనిల్, మదర్‌డెయిరీ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి, పీసీసీ రాష్ట్ర కార్యదర్శి జనగాం ఉపేందర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ చైతన్య మహేందర్‌రెడ్డి, జిల్లా మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ, నాయకులు ఎంఎస్ విజయకుమార్, పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎంఏ.ఇజాజ్, వివిధ మండలాల నాయకులు, కార్యకర్తలు, మాజీ సర్పంచ్‌లు, డైరెక్టర్లు పాల్గొన్నారు.ఫ స్థానిక సమరంలో గెలుపే లక్ష్యం ఫ ఈసారి కమిటీల్లో మహిళలకు చోటు ఫ ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య -
ధాన్యం కొనుగోలు పద్ధతులు భేష్
ఆలేరు: రాష్ట్రంలో ధాన్యం కొనుగోలుకు అవలంబిస్తున్న పద్ధతులు భేష్ అని తమిళనాడు సీనియర్ ఐఏఎస్ అధికారి షణ్ముఖ సుందరం ప్రశంసించారు. మంగళవారం ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన నేతృత్వంలోని ఐదుగురు అధికారుల బృందం సందర్శించారు. ఈ సందర్భంగా వరిఽ సాగు నుంచి దిగుబడి తరువాత, కేంద్రాలకు తరలించి రైతులు పంటను విక్రయించే వరకు జరుగుతున్న ప్రక్రియను పరిశీలించారు. కేంద్రాల నుంచి మిల్లులకు ధాన్యం తరలింపు, ఓపీఎంఎస్ సాఫ్ట్వేర్ ద్వారా ఆన్లైన్లో రైతుల బ్యాంకుల ఖాతాల్లో డబ్బుల చెల్లింపు విధానాన్ని వ్యవసాయ, మార్కెట్ కమిటీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. దాదాపు 20రోజుల్లో 10633 క్వింటాళ్ల(26వేల బస్తాల) 233మంది రైతుల నుంచి ధాన్యాన్ని సేకరించడంపై తమిళనాడు బృందం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అదేవిధంగా తేమ శాతం, తుది నాణ్యత విశ్లేషణ, ధాన్యం మిల్లులకు తరలించిన ట్రక్కుల వివరాలతో కూడిన రిజిస్టర్లు, వాటి నిర్వహణ పద్ధతులు తెలుసుకున్నారు. ఓపీఎంఎస్ సాఫ్ట్వేర్ ద్వారా ఎన్ని దశలో రైతుల వివరాలను సేకరించి, నమోదు చేస్తున్నారో తెలుసుకున్నారు. రైతు ఊరు, ఆధార్ నంబర్, ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఎంత దిగుబడి వచ్చింది, నాణ్యతా ప్రమాణాలు ఆన్లైన్లో ఎలా నమోదు చేస్తున్నారో ఆలేరు వ్యవసాయ, మార్కెట్ కమిటీ అధికారులు తమిళనాడు బృందానికి వివరించారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కేంద్రాల వద్ద సౌకర్యాలు కల్పించడం పట్ల అధికారుల బృందం ప్రశంసించింది. అనంతరం వారిని సన్మానించారు. సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చైతన్య మహేందర్‌రెడ్డి, డీసీఎస్ఓ రోజా, డీఎంఓ హరికృష్ణ, మార్కెట్ కమిటీ కార్యదర్శి పద్మ, ఎఫ్‌పీఓ చైర్మన్ స్వామి, ఏఈ శివకుమార్, సూపర్వైజర్ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఫ తమిళనాడు సీనియర్ ఐఏఎస్ అధికారి షణ్ముఖ సుందరం