25లోగా కొనుగోళ్లు పూర్తి చేయాలి
భూదాన్‌పోచంపల్లి, వలిగొండ : ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేసి ఈ నెల 25లోపు పూర్తి చేయాలని కలెక్టర్ హనుమంతరావు ఆదేశించారు. ఆదివారం భూదాన్‌పోచంపల్లితో పాటు మండలంలోని జూలూరు, శివారెడ్డిగూడెం, దంతూర్ గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. కొనుగోళ్లు జరుగుతున్న తీరును పరిశీలించారు. ఇప్పటివరకు ఎంత కాంటా చేశారని, ఇంకా ఎన్ని కుప్పలు మిగిలి ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. రికార్డులను పరిశీలించారు. కాంటా చేసిన ధాన్యాన్ని ఎప్పటికపుడు మిల్లులకు పంపించాలని నిర్వాహకులను ఆదేశించారు. నిరంతరం పర్యవేక్షించాలని, సమన్వయంతో పనిచేస్తూ రైతులకు ఇబ్బందులు కలగకుండా తగుచర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. భూదాన్‌పోచంపల్లిలోని పీఏసీఎస్ కేంద్రం వద్ద కొత్తగా వేసిన బోరును కలెక్టర్ పరిశీలించి ముఖం కడుక్కున్నారు. ఆయన వెంట జిల్లా సివిల్‌సప్‌లై అధికారిణి రోజా, ఇంచార్జ్ తహసీల్దార్ నాగేశ్వర్‌రావు, డీటీ బాలమణి, ఎంఆర్‌ఐ గుత్తా వెంకట్‌రెడ్డి, ఏఆర్‌ఐ సత్యనారాయణరెడ్డి, పీఏసీఎస్ సీఈఓ సద్దుపల్లి బాల్‌రెడ్డి, ఆర్.నర్సింహ తదితరులు పాల్గొన్నారు.
వలిగొండలో..
వలిగొండ మండలం సంగెం గ్రామంలోని ఐకేపీ కేంద్రాన్ని కలెక్టర్ హనుమంతరావు సందర్శించారు. కొనుగోళ్లలో జాప్యం జరగకుండా చూడాలని నిర్వాహకులకు సూచించారు. కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించాలని పేర్కొన్నారు. ఆయన వెంట ఏపీఎం ఝాన్సీ, ఆర్‌ఐ కరుణాకర్‌రెడ్డి ఉన్నారు.
ఫ కలెక్టర్ హనుమంతరావు
25లోగా కొనుగోళ్లు పూర్తి చేయాలి


