పర్యాటకానికి ఊపు
భువనగిరి ఖిలా, పోచంపల్లి టూరిజం పార్క్, రాయిగిరి శిల్పారామం ప్రాంతాలకు పర్యాటకుల సంఖ్య పెరిగింది. మే15న హైదరాబాద్‌లో జరిగిన మిస్ వరల్డ్ పోటీలకు వచ్చిన ఆఫ్రికా అందగత్తెలు వచ్చారు. పోచంపల్లి టూరిజం పార్క్‌లో ఏర్పాటు చేసిన చేనేత థీమ్‌లో పాల్గొన్నారు. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకుని తెలంగాణ గొప్పతనానికి ఫిదా అయ్యారు. జూన్ 12న రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సతీమణితో కలిసి వచ్చిపోచంపల్లి టూరిజం పార్క్‌లో మ్యూజియం సందర్శించి ఇక్కత వస్త్రాల తయారీని స్వయంగా పరిశీలించారు. చేనేత కార్మికులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. రాయిగిరిలోని శిల్పారామంకు పర్యాటకుల సంఖ్య పెరిగింది. సాంస్కృతిక కార్యక్రమాలు అలరిస్తున్నాయి.
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహాస్వామి ఆలయ స్వర్ణ విమాన గోపురాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. 50.5 అడుగుల వైశాల్య ంతో ఉన్న రాజగోపురానికి 68 కిలోల బంగారం వినియోగించారు. ఇందుకు రూ. 3.90 కోట్ల ఖర్చు చేశారు. వానమామలై రామానుజ జీయర్ స్వామితో కలిసి శ్రీ సుదర్శన చక్రానికి మహాకుంభాభిషేక సంప్రోక్షణ జరిపించి, దివ్య స్వర్ణ విమాన గోపురాన్ని లక్ష్మీనృసిహుండికి అంకితమిచ్చా రు. పంచారాత్ర ఆగమశాస్త్రం ప్రకారం అత్యంత వైభవోపేతంగా మహాకుంబాభిషేక వేడుక జరిగింది.
ఫ రాయగిరి పరిధిలో
మినీ శిల్పారామం ఏర్పాటు
ఫ భువనగిరి ఖిలా పనుల్లో కదలిక
ఫ యాదగిరీశుడి స్వర్ణ
విమానగోపురానికి పసిడి శోభ
ఫ కొత్త రేషన్ కార్డులతో పేద కుటుంబాల్లో సంతోషం
ఫ ఇందిరమ్మ గృహ పథకంతో సొంతింటి కల సాకారం
పర్యాటకానికి ఊపు
పర్యాటకానికి ఊపు


