శివకేశవులకు విశేష పూజలు
యాదగిరిగుట్ట: యాదగిరి కొండపై శ్రీపర్వతవర్ధిని రామలింగేశ్వరస్వామి ఆలయంలో సోమవారం శివకేశవులకు విశేషపూజలు కొనసాగాయి. ఆలయంలోని స్పటికమూర్తికి అర్చకులు మంగళవాయిద్యా మధ్య రుద్రాభిషేకం, బిల్వార్చన తదితర పూజలు శైవాగమశాస్త్రరీతిలో నిర్వహించారు. ఇక ప్రధానాలయంలో సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపిన అర్చకులు.. గర్భాలయంలోని స్వయంభూలను పంచామృతాలతో అభిషేకించి, తులసీదళాలతో అర్చించారు. అనంతరం ప్రాకార మండపంలోని ఉత్సవమూర్తులను దివ్యమనోహరంగా అలంకరించిన అర్చకులు.. సుదర్శన నారసింహ హోమం, నిత్య తిరుకల్యాణం నేత్రపర్వంగా చేపట్టారు. వివిధ పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.
బంగారు తాపడం ప్రభ బహూకరణ
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలోని ఆండాళ్ అమ్మవారికి ఏర్పా టు చేయడానికి సూర్యాపేటకు చెందిన భక్తుడు గోపాలకృష్ణ బంగారు తాపడంతో చేయించిన ప్రభను బహూకరించారు. సోమవారం ఆలయ ఈఓ వెంకట్రావ్, అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తికి అందజేశారు. కాపర్ ప్రభ స్థానంలో బంగారు తాపడం ప్రభ అమర్చనున్నారు. గోపాలకృష్ణకు అర్చకులు ఆశీర్వచనం చేశారు. అంతకుముందు ఆయన స్వామివారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు.
డీసీసీబీ పర్సన్ ఇన్‌చార్జిగా బాధ్యతల స్వీకరణ
నల్లగొండ టౌన్ : జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) అఫీషియల్ పర్సన్ ఇన్‌చార్జిగా కలెక్టర్ ఇలా త్రిపాఠి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం నూతన సంవత్సరం క్యాలెండర్, డైరీ ఆవిష్కరించారు. బ్యాంకు అభివృద్ధికి సమష్టిగా కృషి చేయాలని ఉద్యోగులను కోరారు. కార్యక్రమంలో మాజీ చైర్మన్ కుంభం శ్రీనివాస్‌రెడ్డి, సీఈఓ శంకర్‌రావు, అధికారులు నర్మద, సంపత్‌రెడ్డి, శ్రీనివాస్, మైపాల్‌రెడ్డి పాల్గొన్నారు
శివకేశవులకు విశేష పూజలు
శివకేశవులకు విశేష పూజలు


