ఆస్తమా బాధితులూ జాగ్రత్త
– తుంగతుర్తి సంతోష్‌రావు, భువనగిరి
సమాధానం: జిల్లాలో స్క్రబ్ టైఫస్ వ్యాఽధి వచ్చిన వారు ఎక్కడా లేరు. జ్వరం వచ్చిందని ఆందోళన చెందవద్దు. మూడు పూజల వేడి ఆహారం తీసుకోవాలి. కాచి చల్లార్చిన నీటిని తాగాలి. ఉదయం వాకింగ్ అలావాటు ఉన్నవారు ఎండ వచ్చిన తరువాత వెళ్లాలి.
– రాపోలు పవన్‌కుమార్, దాసిరెడ్డిగూడెం
సమాధానం: చిన్న పిల్లలు జలుబు, జ్వరం దగ్గు, న్యుమోనియా వంటి వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుంది. చేతులు, కాళ్లకు ఉన్ని తొడుగులు, తలకు మంకీ క్యాప్ పెట్టాలి. క్రమం తప్పకుండా రోజూ మాయిశ్చరైజర్ అప్‌లై చేయాలి. ఎక్కువగా ద్రవరూప ఆహారం అందించాలి. తేలికై నా దుస్తులు మాత్రమే వేయాలి. ఉదయం సాధ్యమైనంత వరకు ఎండలో ఉంచాలి.
భువనగిరి : చలితీవ్రత పెరిగింది. జనం జలుబు, దగ్గు, జ్వరం, శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అత్యవసరమైతేనే బయటకు రావాలి. ముఖ్యంగా ఆస్తమా బాధితులు మరింత అప్రమత్తంగా ఉండాలి. వృద్ధులు, చిన్నారుల ఆరోగ్య విషయంలోనూ ఏమాత్రం ఏమరుపాటు వహించవద్దని జిల్లా కేంద్ర ఆస్పత్రి సూపరింటెండెంట్ పాండునాయక్ తెలిపారు. చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వచ్చే వ్యాధులు, నివారణ చర్యలపై సోమవారం ‘సాక్షి’ ఫోన్ ఇన్ ద్వారా ప్రజలు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు.
ప్రశ్న: కుటుంబంలో అందరికీ జలుబు చేసింది.
–ఏశాల అశోక్, బస్వాపూర్, భువనగిరి మండలం
సమాధానం: వాతావరణ మార్పుల నేపథ్యంలో జలుబు, జ్వరం, దగ్గు వంటి సమస్యలు వస్తుంటాయి. వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి.
ప్రశ్న: గొంతు నొప్పి చేయడంతో పీహెచ్‌సీకి వెళ్లారు. అక్కడ ఇచ్చిన మందులను మూడు రోజులగా వాడినా తగ్గలేదు? –కనకపోయిన రమేష్, వలిగొండ
సమాధానం: భయపడాల్సిన అవసరం లేదు. గోరువెచ్చని నీటిలో కాస్త ఉప్పు వేసి మూడుదఫాలు గొంతువరకు తీసుకొని వదలాలి. అయినా నొప్పి తగ్గని పక్షంలో వైద్యుడిని సంప్రదించండి.
ప్రశ్న: మందులు అందుబాటులో ఉన్నాయా?
– గాజుల వెంకటేశం, రాయపల్లి,
(ఆత్మకూర్.ఎం) మండలం
సమాధానం:చలి కాలంలో వచ్చే వ్యాధుల నివారణకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులు అందుబాటులో ఉన్నాయి. భువనగిరిలోని ప్రభుత్వ ఆస్పత్రిలో 24 గంటలు వైద్యసేవలు అందుతాయి. అనారోగ్య సమస్య తీవ్రంగా ఉన్న వ్యక్తులు అక్కడికి వెళ్లవచ్చు.
ప్రశ్న: మూత్ర విసర్జనలో సమస్యలు వస్తే ఏం చేయాలి? – బేజాడ కిరణ్‌కుమార్, చిన్నరావుపల్లి,
బీబీనగర్ మండలం
సమాధానం: చలికాలంలో సాధారణంగా మూత్ర విసర్జణకు సంబంధించిన సమస్యలు రావు. ఒక వేళ సమస్య వస్తే వైద్యులను సంప్రదించాలి, పరీక్షలు చేసి మందులు రాస్తారు.
ప్రశ్న: మాదాపూర్‌లోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో రాత్రి సమయంలో గుండెపోటుకు సంబంధించి చికిత్స చేయడం లేదు. ఎలా?
–ప్రవీణ్, మాదాపూర్, తుర్కపల్లి మండలం
సమాధానం: గుండెపోటు వచ్చినప్పుడు తప్పనిసరిగా ప్రాథమిక చికిత్స అవసరం ఉంటుంది. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తే సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తాం.
ప్రశ్న: అంబులెన్స్‌లు అందుబాటులో ఉన్నాయా?
–శివ, భువనగిరి
సమాధానం: భువనగిరిలోని ప్రభుత్వ ఆస్పత్రిలో రెండు అంబులెన్స్‌లు అందుబాటులో ఉన్నాయి. వృద్ధులు, పిల్లలకు అత్యవసర వైద్యం కోసం హైదరాబాద్‌కు తీసుకెళ్లాలంటే డిజిల్ ఖర్చు భరించాలి.
ప్రశ్న: కొద్ది రోజులుగా గొంతునొప్పి, జలుబు ఎక్కువగా వస్తుంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
– రమాదేవి, వాసాలమర్రి, తుర్కపల్లి
సమాధానం: చాలామంది మెడికల్ షాప్‌కు వెళ్లి మందులు తీసుకుని వాడుతుంటారు. అలాకాకుండా ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చి పరీక్షలు చేయించుకున్న తర్వాతనే వైద్యుల సూచనల మేరకు మందులు వాడాలి. గోరువెచ్చని నీటిలో ఉప్పు వేసి మూడుసార్లు పుక్కిలించి ఊంచడం వల్ల గొంతు నొప్పి తగ్గుతుంది.
ప్రశ్న: ఎలాంటి దుస్తులు ధరించాలి?
– ప్రసాద్, యాదగిరిగుట్ట
సమాధానం: చలి నుంచి రక్షణ పొందడానికి ఉన్ని దుస్తులు ధరించాలి. తలకు మంకీ క్యాప్ వాడాలి. చేతులకు కూడా గ్లౌజ్‌లు వేసుకుంటే ఇంకా చాలా మంచిది. తప్పనిసరి అయితనే ఉదయం, రాత్రి సమయాల్లో బయటకు రావాలి.
ఫ చలికాలం మరింత అప్రమత్తత అవసరం
ఫ వృద్ధులు, చిన్నారుల ఆరోగ్య
విషయంలోనూ జాగ్రత్తలు తప్పనిసరి
ఫ ఉదయం, సాయంత్రం బయటకు రావొద్దు
‘సాక్షి’ ఫోన్ ఇన్‌లో జిల్లా కేంద్ర ఆస్పత్రి సూపరింటెండెంట్ పాండునాయక్


