అర్జీలను పెండింగ్‌లో ఉంచొద్దు
భువనగిరిటౌన్ : ప్రజావాణిలో వచ్చిన అర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ హనుమంతరావు అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ భాస్కర్‌రావుతో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. బాధితులకు సత్వర న్యాయం చేయాలని, మళ్లీ అర్జీ పెట్టుకోకుండా పనిచేయాలని సూచించారు. కాగా ప్రజావాణిలో రెవెన్యూ, పంచాయతీ రాజ్, విద్య, మున్సిపల్, గ్రామీణాభివృద్ధి శాఖలకు సంబంధించి 24 అర్జీలు వచ్చాయి.
భూ భారతి దరఖాస్తులపై సమీక్ష
ప్రజావాణి అనంతరం తహసీల్దార్లు, ప్రత్యేక అధికారులతో కలెక్టర్ సమావేశం ఏర్పాటు చేసి భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులపై సమీక్షించారు. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించడంతో పాటు క్షేత్రస్థాయిలో విచారణ జరిపిన తరువాతే ఆమోదించాలన్నారు.
ఫ కలెక్టర్ హనుమంతరావు


