రూ.1051.45 కోట్ల పనులకు శంకుస్థాపన
ఆలేరు నియోజకవర్గం తుర్కపల్లి మండలం తిర్మలాపురంలో సీఎం రేవంత్‌రెడ్డి రూ.1051.45 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రూ.574.56 కోట్లతో గంధమల్ల రిజర్వాయర్ పనులు, రూ.200 కోట్లతో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ పనులు, రూ.183 కోట్లతో మెడికల్ కాలేజీ భవన నిర్మాణం, రూ.25.50 కోట్లతో యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో తాగునీరు, డ్రెయినేజీ, సీసీ, బీటీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. వీటితో పాటు రూ.7.50 కోట్లతో కొలనుపాకలో హైలెవెల్ బ్రిడ్జి పనులు, రూ.6 కోట్లతో కాల్వపల్లి గ్రామంలో హైలెవెల్ బ్రిడ్జిపనులు, రూ.8.25 కోట్లతో మోటకొండూరు మండలంలో తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.రూ.22.75 కోట్లతో దాతర్‌పల్లిలో 20 వేల మెట్రిక్ సామర్థ్యం గల గోదోముల పనులు, రూ.21.14 కోట్లతో ఆలేరు అసెంబ్లీ సెగ్మెంట్‌లో బీటీ రోడ్ల నిర్మాణం, రూ.2.75 కోట్లతో ఆలేరు మార్కెట్ కమిటీలో 2500 మెట్రిక్ సామర్థ్యం గల గోదాముల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
గ్రామ పంచాయతీ పాలకవర్గాలు ఏర్పాటు అయ్యాయి. ఏడేళ్లుగా పాలకవర్గం లేని చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం పాలకవర్గం కొలువు దీరింది. కొత్తగా ఏడు గ్రామ పంచాయతీల పాలక వర్గాలు కొలువుదీరాయి. మొత్తం 427 పంచాయతీలకు సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, వార్డు సభ్యులు ప్రజల చేత ఎన్నుకోబడ్డారు.
యాదగిరిగుట్ట, స్వర్ణగిరి, కొలనుపాక, మత్స్యగిరి, పూర్ణగిరి తదితర క్షేత్రాలు ఆధ్యాత్మిక కేంద్రాలుగా మారాయి. హైదరాబాద్‌కు శివారులో ఉండటంతో నిత్యం వేలాది మంది వచ్చి దర్శించుకుంటున్నారు. సెలవు రోజుల్లో భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
కొన్నేళ్లుగా కార్డుల కోసం, ఉన్నకార్డుల్లో పేర్ల నమో దు కోసం లబ్ధిదారులు ఎదురుచూపులు ఫలించాయి. 3,330 కొత్త కార్డులు మంజూరు కాగా, 47,402 మంది పేర్లు కొత్తగా నమోదు చేశారు.మొత్తం 2,48,593 కార్డులకు 7,8153 యూనిట్లకు 4957.817 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం ఇస్తున్నారు.
జిల్లాలో 9992 ఇళ్లు మంజూరయ్యాయి, 8178 ఇళ్లు ప్రారంభించారు. ఇందులో 181 ఇళ్లు రికార్డుస్థాయిలో పూర్తి అయ్యాయి.ఎన్నో ఏళ్లుగా ఇళ్ల కోసం కలలు కంటున్న వారికి ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్లు లబ్ధి చేకూరుస్తున్నాయి.
హైదరాబాద్ – వరంగల్ హైవేపై ఘట్కేసర్, కొండమడుగు, ఎయిమ్స్, వంగపల్లి జంక్షన్ల వద్ద బ్రిడ్జిల నిర్మాణం జరుగుతోంది. జాతీయ రహదారి గౌరెల్లి– కొత్తగూడెం వలిగొండ నుంచి తిరుమలగిరి, తొర్రూరు, మహబూబాద్ వరకు పనులు కొనసాగుతున్నాయి. వలిగొండ నుంచి కాటేపల్లి వరకు రూ.49 కోట్లతో నిర్మించిన బీటీ రోడ్డునుమంత్రి వెంకట్‌రెడ్డి ప్రారంభించారు.


