
సీఎం రేవంత్‌రెడ్డి చొరవతోనే..
– ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌రెడ్డి
సీఎం రేవంత్‌రెడ్డి చొరవతోనే హైదరాబాద్ వేదికగా మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్నాయని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు. పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలు ఎంతో అందంగా, సాంస్కృతిక వారసత్వానికి చిహ్నాలుగా నిలుస్తాయని అన్నారు. మిస్ వరల్డ్ కాంటెస్టెంట్లు పోచంపల్లికి రావడం ద్వారా చేనేతకు మరింత వైభవం వస్తుందని అన్నారు. ప్రతిఒక్కరూ చేనేతను ఆదరించాలని విజ్ఞప్తిచేశారు. ఈ కార్యక్రమంలో స్టేట్ ఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్, మిస్ వరల్డ్ పోచంపల్లి ప్రోగ్రాం ఇన్‌చార్జి లక్ష్మి, రాచకొండ సీపీ సుధీర్‌బాబు, తెలంగాణ టూరిజం జనరల్ మేనేజర్ మందడి ఉపేందర్‌రెడ్డి, జెడ్పీ సీఈఓ శోభారాణి, పద్మశ్రీ అవార్డు గ్రహీతలు గజం గోవర్ధన్, చింతకింది మల్లేశం, భువనగిరి డీసీపీ అక్షాంశ్‌యాదవ్, ఏసీపీ మధుసూదన్‌రెడ్డి, చేనేత జౌళిశాఖ ఏడీ శ్రీనివాస్‌రావు, ఇన్‌చార్జి తహసీల్దార్ నాగేశ్వర్‌రావు, వివిధ శాఖల అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.