వాగా.. డంపింగ్ యార్డా
ఆలేరు: ఆలేరు వాగు ఆనవాళ్లు కోల్పోతోంది. చెత్త డంపింగ్ చేయడం ద్వారా వాగు జలాలు కలుషితం అవుతున్నాయి. వాగులో చెత్త డంపింగ్‌ను నిలిపివేసి, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
రోజూ 3 టన్నుల చెత్త తరలింపు
మున్సిపాలిటీలో 12 వార్డుల నుంచి రోజూ సుమా రు మూడు టన్నుల చెత్త, ఇతర వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. మున్సిపల్ వాహనాలతో పాటు ప్రైవేట్ వాహనాల్లో చెత్తను సేకరించి వాగులో, దాని పరిసరాల్లో డంప్ చేస్తున్నారు. తడి, పొడి చెత్తతో పాటు మటన్, చికెన్ షాపుల నుంచి వచ్చే వ్యర్థాలు, ప్లాస్టిక్ కవర్లు, పాత బట్టలు.. ఇలా మొత్తం వాగులో డంపింగ్‌చేస్తున్నారు. మూడేళ్లుగా ఇదే పరిస్థితి కొనసాగుతుండడంతో వాగు ఆనవాళ్లు కోల్పోతోంది. అంతేకాకుండా నిరంతరం పందులు సంచరిస్తుడటంతో జనాలు వాగునీటిని వినియోగించుకోలేని దుస్థితి నెలకొంది. దుర్గమ్మ గుడి నుంచి కొలనుపాకకు వెళ్లే రోడ్డు మార్గంలో దుర్వాసన వస్తుండటంతో వాహనదారులు, స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు.
సాయిగూడెం శివారులో రెండెకరాలు కేటాయింపు
ఆలేరు మున్సిపాలిటీ పరిధిలోని సాయిగూడెం శివారులో మూడేళ్ల క్రితం చెత్త డంపింగ్ యార్డుకు రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని అధికారులు కేటాయించారు. అయితే స్థానికులు, రైతుల నుంచి అభ్యంతరం వ్యక్తం కావడంతో డంపింగ్‌యార్డు ఏర్పాటుకు బ్రేక్ పడింది. మరోచోట స్థలం ఎంపికకు అధికారులు య త్నించకపోవడంతో డంపింగ్ యార్డు ఏర్పాటులో జాప్యం జరుగుతుందనే వాదనలు ఉన్నాయి.
ఆలేరు పెద్ద వాగులో గుట్టలుగా వ్యర్థాలు
ఫ సాయిగూడెం శివారులో డంపింగ్ యార్డు ఏర్పాటుకు స్థలం కేటాయింపు
ఫ స్థానికుల నుంచి అభ్యంతరం రావడంతో పనులకు బ్రేక్


