
గుర్తుతెలియని వ్యక్తుల మృతదేహాలు లభ్యం
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట పట్టణంలో బుధవారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. పట్టణ సీఐ బి. భాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం.. యాదగిరిగుట్ట పట్టణంలోని రింగ్ రోడ్డు సమీపంలో గల పార్కింగ్ ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి వయస్సు సుమారు 35 నుంచి 40ఏళ్లు ఉంటాయని, అతడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదని సీఐ తెలిపారు. మృతదేహాన్ని భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసినట్లుపేర్కొన్నారు.
మోత్కూరులో..
మోత్కూరు: మోత్కూరు మున్సిపల్ కేంద్రంలోని కొత్త బస్టాండ్ సమీపంలో బుధవారం మధ్యాహ్నం స్థానికులు గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు. మృతుడు కొద్దిరోజులుగా భిక్షం ఎత్తుకుంటూ బస్టాండ్ సమీపంలో సంచరిస్తున్నాడని స్థానికులు పేర్కొన్నారు. మృతదేహాన్ని రామన్నపేట ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్‌ఐ డి. నాగరాజు తెలిపారు.

గుర్తుతెలియని వ్యక్తుల మృతదేహాలు లభ్యం