
జీపీఓల పరీక్షకు పటిష్ట ఏర్పాట్లు
సాక్షి,యాదాద్రి : ఈ నెల 25న జరగబోయే గ్రామ పాలన అధికారు(జీపీఓ)ల రాత పరీక్షకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ హనుమంతరావు ఆదేశించారు. బుధవారం భువనగిరిలోని వెన్నెల కాలేజీలో ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. పరీక్ష కేంద్రంలో విద్యుత్, తాగునీటి సౌకర్యం కల్పించాలని సూచించారు. మాస్ కాపీయింగ్ ఆస్కారం ఉండవద్దని, పరీక్ష సమయంలో 144 సెక్షన్ అమలు చేయా లని, జిరాక్స్ సెంటర్లను మూసి వేయించాలన్నారు. ఆయన వెంట ఆర్డీఓ కృష్ణారెడ్డి, కలెక్టరేట్ ఏఓ జగన్‌మోహన్‌ప్రసాద్ ఉన్నారు.
ఫ కలెక్టర్ హనుమంతరావు