
కాంగ్రెస్ సమావేశంలో రసాభాస
అర్వపల్లి: అర్వపల్లిలోని శ్రీరామ ఫంక్షన్ హాల్‌లో శుక్రవారం నిర్వహించ తలపెట్టిన కాంగ్రెస్ పార్టీ మండల సమావేశం ప్రారంభంలోనే రసాభాసగా మారింది. సమావేశానికి ఎమ్మెల్యే, పార్టీ పరిశీలకుడు, డీసీసీ అధ్యక్షుడు రావాల్సి ఉంది. అయితే వారు రాకముందే కాంగ్రెస్‌లో ఇరువర్గాల మధ్య ఘర్షణ మొదలైంది. సమావేశం స్టేజీపైకి కుర్చీలు విసిరారు. దీంతో ఎమ్మెల్యే సామేలు, డీసీసీ ఉపాధ్యక్షుడు దరూరి యోగానందచారి వర్గీయుల మధ్య ఘర్షణ పెరగడంతో పోలీసులు చెదరగొట్టారు. దీంతో సమావేశాన్ని వాయిదావేశారు. ఆ తర్వాత మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మోరపాక సత్యం మండల కమిటీ పోటీలో ఉంటున్న కొంతమంది నుంచి దరఖాస్తులను స్వీకరించారు. కాగా కాంగ్రెస్ వర్గీయుల మధ్య ఘర్షణ విషయం తెలిసిన జిల్లా ఏఎస్పీ నాగేశ్వర్‌రావు అర్వపల్లికి చేరుకొని కొంతసేపు అక్కడే ఉన్నారు. నాగారం సీఐ రఘువీర్‌రెడ్డి, స్థానిక ఎస్‌ఐ బాలకృష్ణ జిల్లా స్పెషల్ పార్టీ, స్థానిక పోలీస్ సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు.
ఇరువర్గాల మధ్య ఘర్షణ
వాయిదా పడిన అర్వపల్లి సమావేశం