సెలవుల్లో.. కంప్యూటర్‌ శిక్షణ | - | Sakshi
Sakshi News home page

సెలవుల్లో.. కంప్యూటర్‌ శిక్షణ

May 18 2025 1:19 AM | Updated on May 18 2025 1:19 AM

సెలవు

సెలవుల్లో.. కంప్యూటర్‌ శిక్షణ

తాళ్లగడ్డ (సూర్యాపేట): ఒకప్పుడు వేసవి సెలవులు వచ్చాయంటే చాలు విద్యార్థులు, యువత తమకు ఇష్టమైన క్రీడల్లో శిక్షణ లేదా స్విమ్మింగ్‌, కరాటే, స్పోకెన్‌ ఇంగ్లిష్‌ వంటివి నేర్చుకునేవారు. మరికొందరు సంగీతం, వివిధ రకాల కళలను నేర్చుకునేవారు. కానీ ప్రస్తుత ఆధునిక యుగంలో కంప్యూటర్‌ పరిజ్ఞానం తప్పనిసరి కావడంతో తల్లిదండ్రులు తమ పిల్లలకు వేసవి సెలవుల్లో కంప్యూటర్‌ పరిజ్ఞానంపై శిక్షణ ఇప్పించేందుకు ఆసక్తి చూపుతున్నారు. అందుకనుగుణంగానే పట్టణాల్లో కంప్యూటర్‌ ఇనిస్టిట్యూట్‌లు విద్యార్థులు, యువతతో కళకళలాడుతున్నాయి. సూర్యాపేట జిల్లా కేంద్రానికి చుట్టుపక్కల గ్రామాల యువత, విద్యార్థులు వేసవి సెలవుల్లో ప్రతిరోజు వచ్చి కంప్యూటర్‌ ఇనిస్టిట్యూట్‌లలో చేరి శిక్షణ పొందుతున్నారు. కొందరు ఉపాధి కోసం మరికొందరు ఉన్నత చదువుల కోసం, ఇంకొందరు ఉద్యోగోన్నతి కోసం కంప్యూటర్‌ శిక్షణ తీసుకుంటున్నారు.

ఆకట్టుకుంటున్న నిర్వాహకులు..

సూర్యాపేట పట్టణంలో కంప్యూటర్‌ ఇనిస్టిట్యూట్‌ల సంఖ్య పెరగడంతో పోటీని తట్టుకునేందుకు పలువురు నిర్వాహకులు ఫీజులో రాయితీ కూడా కల్పిస్తున్నారు. వేసవి కాలం కావడంతో ఎక్కువగా యువత, చిన్నారులు శిక్షణకు వస్తుండటంతో బ్యాచ్‌కు 10 నుంచి 5 మంది చొప్పున, ప్రతిరోజు 10 బ్యాచ్‌ల వరకు నడుపుతున్నారు. నెల రోజులు పాటు ఇచ్చే శిక్షణకు గాను రూ.2000 వరకు తీసుకుంటున్నారు. శిక్షణ అనంతరం పరీక్ష నిర్వహించి కేంద్ర ప్రభుత్వం అనుమతి పొందిన ఐఎస్‌ఓ సర్టిఫికెట్‌ అందజేస్తున్నట్లు పలువురు నిర్వాహకులు తెలిపారు.

వేసవి సెలవులను సద్వినియోగం

చేసుకుంటున్న విద్యార్థులు, యువత

క్రీడలతో సమానంగా పిల్లలకు

నేర్పించేందుకు ఆసక్తి చూపుతున్న తల్లిదండ్రులు

కొన్ని కోర్సులకు మంచి డిమాండ్‌

యువత కంప్యూటర్‌ కోర్సులో ఎంస్‌ ఆఫీస్‌ నేర్చుకునేందుకు ఎక్కువగా ఇష్టపడతారు. ఆ తర్వాత ఫొటోషాప్‌, డీటీపీ, టాలీ, ఆటో కాడ్‌ వంటి కోర్సులు నేర్చుకుంటున్నారు. వీటి తర్వాత పీజీడీసీఏ ఆరు నెలల కోర్సు కావడంతో అవసరం ఉన్న వారు మాత్రమే దానిని ఎంచుకుంటారు. శిక్షణ పొందిన వారు కొందరు ఇంటర్‌నెట్‌ సెంటర్లలో, కాలేజీలు, ఆస్పత్రుల్లో కంపూటర్‌ ఆపరేటర్లుగా పనిచేస్తూ జీవనోపాధి పొందుతున్నారు.

ఫోన్‌ వద్దని కంప్యూటర్‌ క్లాసులకు..

ఇంటి దగ్గర ఫోన్‌ వాడుతుండటంతో మా అమ్మానాన్నలు ఫోన్‌కి బదులుగా జీవితంలో ఉపయోగపడే కంప్యూటర్‌ నేర్చుకోమని ఇనిస్టిట్యూటల్‌లో జాయిన్‌ చేశారు. కంప్యూటర్‌ కొంతమేర నేర్చుకున్నాను. చాలా హ్యాపీగా ఉంది. – ఈషాన్‌, 8వ తరగతి, సూర్యాపేట

ఉపాధి పొందేందుకు ఉపయోగం

వేసవి సెలవులను వృఽథా చేయకుండా ప్రస్తు తం సూర్యాపేట పట్ట ణంలోని ఈసీఎస్‌ కంప్యూటర్‌ కోచింగ్‌ సెంటర్‌లో టాలీ నేర్చుకుంటున్నాను. కాల వ్యవధి లోగా టాలీపై పట్టుసాధించి ఏదైనా ప్రైవేట్‌ ఉద్యోగంలో చేరాలనేదే నా లక్ష్యం.. – నసీర్‌, డిగ్రీ, సూర్యాపేట

భవిష్యత్‌ కోసం..

నేను పదో తరగతి పూర్తి చేశాను. సూర్యాపేట పట్టణానికి 15 కిలోమీటర్ల దూరం ఉన్న గుంజలూరు నుంచి రోజూ వచ్చి కంప్యూటర్‌ నేర్చుకుంటున్నాను. ఉన్నత చదువుల కోసం, భవిష్యత్‌లో ఉద్యోగ ప్రయత్నాల్లో ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఎంఎస్‌ ఆఫీస్‌ నేర్చుకుంటున్నాను.

– ప్రదీప్‌, 10వ తరగతి, గుంజలూరు

కంప్యూటర్‌ పరిజ్ఞానం తప్పనిసరి

ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఏ రంగంలోనైనా కంప్యూటర్‌ అనుసంధానంగానే పనులు జరుగుతున్నాయి. గతంతో అవసరం ఉంటేనే కంప్యూటర్‌ నేర్చుకునేవారు.. కానీ నేడు కంప్యూటర్‌ నేర్చుకొని ఉండటం తప్పనిసరి. శిక్షణ అనంతరం కొంత మందికి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తున్నాము. మా వద్ద శిక్షణ తీసుకున్న వారు కంప్యూటర్‌ ఆపరేటర్లుగా పనిచేస్తూ ఉపాధి పొందుతున్నారు.

– ఎండీ మహ్మద్‌, కంప్యూటర్‌ కోచింగ్‌ సెంటర్‌ నిర్వాహకుడు

సెలవుల్లో.. కంప్యూటర్‌ శిక్షణ1
1/4

సెలవుల్లో.. కంప్యూటర్‌ శిక్షణ

సెలవుల్లో.. కంప్యూటర్‌ శిక్షణ2
2/4

సెలవుల్లో.. కంప్యూటర్‌ శిక్షణ

సెలవుల్లో.. కంప్యూటర్‌ శిక్షణ3
3/4

సెలవుల్లో.. కంప్యూటర్‌ శిక్షణ

సెలవుల్లో.. కంప్యూటర్‌ శిక్షణ4
4/4

సెలవుల్లో.. కంప్యూటర్‌ శిక్షణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement