
డెంగీరహిత జిల్లాగా మార్చుదాం
భువనగిరి : డెంగీరహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ మనోహర్ అన్నారు. జాతీయ డెంగీ దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం భువనగిరిలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని డీఎంహెచ్‌ఓ ప్రారంభించి మాట్లాడారు. ప్రతి ఒక్కరూ తాము ఉంటున్న పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ప్రతి శుక్రవారం డ్రై డే ఫ్రై డేగా పాటించాలని కోరారు. దోమలు వృద్ధి చెందకుండా ఉండాలంటే ఇంటి పరిసరాల్లో నీటి నిల్వ ఉండకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ వీణ, డాక్టర్ నిరోష, డిప్యూటీ డెమో అంజయ్య, ఆశ నోడల్ ఆఫీసర్ సత్యవతి, సిబ్బంది పాల్గొన్నారు.
ఫ డీఎంహెచ్‌ఓ మనోహర్