
ఇంటికొక రక్తదాత తయారు కావాలి
మోత్కూరు: రక్తాన్ని కృత్రిమంగా తయారు చేయలేమని, ఇంటికొక రక్తదాత తయారుకావాలని సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ అన్నారు. మోత్కూరు మండలం పాటిమట్లలో మాతృదేవోభవ–పితృదేవోభవ సంస్థ 6వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం రక్తదాతల అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. యువత స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. మాతృదేవోభవ–పితృదేవోభవ సంస్థ అధ్యక్షుడు కురుమేటి నవీన్ బాల్యంలోనే తన తల్లిదండ్రులను కోల్పోయి, వారి జ్ఞాపకార్ధం ఈ సంస్థను ఏర్పాటు చేసి వృద్ధులు, వితంతువులు, అనాథలు, పేదలు, నిరుపేదలకు సేవ చేయడం అభినందనీయమన్నారు. కురుమేటి నవీన్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సర్దార్ సర్వాయి పాపన్న, గీత కార్మిక సంఘం ఆలిండియా అధ్యక్షుడు కప్పల రవికుమార్‌గౌడ్, తెలంగాణ నర్సింగ్ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కురుమేటి గోవర్ధన్, ఇండియన్ రెడ్‌క్రాస్ జిల్లా అధ్యక్షుడు గుర్రం లక్ష్మీనర్సింహారెడ్డి, మదర్ డెయిరీ డైరెక్టర్ రచ్చ లక్ష్మీనర్సింహారెడ్డి, ఉపాధ్యాయుడు ముక్కాముల లింగమల్లు, జనయేత్రి ఫౌండేషన్ అధ్యక్షుడు మునీర్ అహ్మద్ షరీఫ్, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, రక్తదాతలు పాల్గొన్నారు.
సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్
లక్ష్మీనారాయణ