
ఆస్తిపన్ను వసూళ్లు రూ.3.20 కోట్లు
భువనగిరిటౌన్ : మున్సిపల్ శాఖ ప్రకటించిన ఎర్లీబర్డ్ స్కీంకు మంచి ఆధరణ లభించింది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మున్సిపాలిటీల్లో ముందస్తుగా ఆస్తిపన్ను చెల్లించిన వారికి ఐదు శాతం రాయితీ అవకాశం ప్రకటించింది. ఇందులో భాగంగా గడిచిన 38 రోజుల్లో వేలాది మంది ముందుకువచ్చి ఆస్తిపన్ను చెల్లించారు. ఐదు మున్సిపాలిటీల్లో 3 కోట్ల 22లక్షల 20వేలు వసూలైంది. ఏటా ఆర్థిక సంవత్సరం ముగియగానే ఏప్రిల్ 1నుంచి 31వ తేదీ వరకు మున్సిపల్ శాఖ ఎర్లీబర్డ్ స్కీం అమలు చేస్తోంది. ఈసారి వరుస సెలువులు రావడంతో పాటు మున్సిపల్ యంత్రాంగం వివిధ ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీగా ఉండడంతో ఈనెల 7వ తేదీ వరకు గడువు పొడిగించింది.
ఫ్లెక్సీలు, ఆటోల ద్వారా ప్రచారం
ఎర్లీబర్డ్ పథకంపై మున్సిపల్ యంత్రాంగ విస్తృతంగా ప్రచారం చేసింది. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి, ఆటో ద్వారా ప్రచారం కల్పించింది. ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్‌యువ వికాసం దరఖాస్తులు ఇచ్చేందుకు మున్సిపాలిటీలకు వచ్చే ప్రజలకు ఐదు శాతం రాయితీపై అవగాహన కల్పించి ముందస్తు ఆస్తిపన్ను చెల్లించేవిధంగా సఫలీకృతమైంది.
మున్సిపాలిటీలవారీగా వసూలు ఇలా..
● భువనగిరిలో ఆస్తిపన్ను రూ.9.28 కోట్లు డిమాండ్ కాగా.. ఐదు శాతం రాయితీ అవకాశం కల్పించడంతో రూ.1.61 కోట్లు వసూలయ్యాయి. ఇంకా రూ.7.67 కోట్లు వసూలు కావల్సి ఉంది.
● మోత్కూరులో రూ.1.49 కోట్లకు రూ.22 లక్షలు వ సూలయ్యాయి. రూ.1.27 కోట్లు పెండింగ్ ఉంది.
● యాదగిరిగుట్టలో రూ.3.44 కోట్లకు రూ.76 లక్షలు వసూలయ్యాయి. రూ.2.68 కోట్లు వసూలు కావాల్సి ఉంది.
● భూదాన్‌పోచంపల్లిలో డిమాండ్ రూ.2.56 కోట్లు ఉండగా.. రూ.26.20 లక్షలు రాబడి వచ్చింది. రూ.29 కోట్లు పెండింగ్ ఉంది.
● ఆలేరు మున్సిపాలిటీలో రూ.2.36 కోట్లకు రూ.35 లక్షలు వసూలయ్యాయి. రూ.2.01 కోట్లు వసూలు చేయాల్సి ఉంది.
ఫ మున్సిపాలిటీల్లో ఐదు శాతంరాయితీకి మంచి ఆధరణ
ఫ వేలాదిగా సద్వినియోగం చేసుకున్న పన్నుదారులు
ఫ అత్యధికంగా భువనగిరిలో రూ.1.61 కోట్లు వసూలు