
బీఆర్‌ఎస్ పాలనలోనే కులవృత్తులకు ప్రాధాన్యం
భువనగిరి: బీఆర్‌ఎస్ ప్రభుత్వంలోనే కులవృత్తులకు ప్రాధాన్యం దక్కిందని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. భువనగిరి మండలంలోని నందనం గ్రామంలో ఏర్పాటు చేసిన నీరా ఉత్పత్తుల కేంద్రాన్ని మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డితో కలిసి ఆదివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా విలేకరు లతో మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రూ.7 కోట్ల వ్యయంతో నందనంలో నీరా ఉత్పత్తుల కేంద్రాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. కేంద్రాన్ని ప్రారంభించాలనుకున్న సమయంలోనే ఎన్నికల కోడ్ రావడంతో నిలిచిపోయిందన్నారు. నీరా కేంద్రాలను వ్యాపార కేంద్రాలుగా చూడవద్దన్నారు. హైదరాబాద్ లోని ట్యాంక్‌బండ్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నీరా కేంద్రాలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించకుండా ప్రభుత్వమే వాటిని నిర్వహణ బాధ్యతలు చేపట్టాల న్నారు. బీఆర్‌ఎస్ సర్కార్ అన్ని కుల వృత్తులకు ప్రాధాన్యమిచ్చిందని, అందులో భాగంగానే కల్లుగీత కార్మికులను ప్రోత్సహించేందుకు అప్పటి ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డి కోరిక మేరకు నందనంలో నీరా ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. నందనంలోని నీరా ఉత్పత్తుల కేంద్రానికి బొమ్మగాని ధర్మభిక్షం పేరు పెట్టి జూన్ 2వ తేదీలోపు ప్రారంభించాలన్నారు. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి తక్షణమే నీరా కేంద్రాన్ని సందర్శించి ప్రారంభానికి చర్యలు తీసుకోవా లని కోరారు. రాష్ట్రంలో రానున్నది బీఆర్‌ఎస్ ప్రభు త్వమేనని, కులవృత్తులు నిర్వీర్యం కాకుండా చూ స్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కల్లు గీత కార్మిక పారిశ్రామిక కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్‌గౌడ్, నాయకులు లక్ష్మీనారాయణ, మొగుళ్ల శ్రీనివాస్‌గౌడ్, బీఆర్‌ఎస్ మండల, పట్టణ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు జనగాం పాండు, ఏవీ కిరణ్‌కుమార్, ప్రకాష్, పడమటి మమత, తుమ్మల వెంకట్‌రెడ్డి, కడమంచి ప్రభాకర్, రాఘవేందర్‌రెడ్డి, రమేష్‌గౌడ్, మట్ట ధనుంజయ్యగౌడ్, ర్యాకల శ్రీని వాస్, నగేష్, వెంకటేశ్వర్లతో పాటు పలువురు గీత కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు.
ఫ మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
ఫ నందనంలోని నీరా
ఉత్పత్తుల కేంద్రం పరిశీలన