
మీసేవ ఆపరేటర్స్ అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారిగా శ్రీక
సూర్యాపేట అర్బన్ : తెలంగాణ మీసేవ ఆపరేటర్స్ అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారిగా సూర్యాపేట పట్టణానికి చెందిన గొట్టిపర్తి శ్రీకాంత్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం హైదరాబాద్‌లోని బృందావన్ ఇన్‌లో అన్ని జిల్లాల అసోసియేషన్ల అధ్యక్ష, కార్యదర్శుల సమక్షంలో రాష్ట్ర కోశాధికారిగా ఎన్నికై న శ్రీకాంత్‌తో ప్రమాణస్వీకారం చేయించి సన్మానించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ రాష్ట్ర కార్యవర్గంలో స్థానం కల్పించినందుకు అధ్యక్ష, కార్యదర్శులు, వర్కింగ్ ప్రెసిడెంట్‌కు కృతజ్ఞతలు తెలిపారు. శ్రీకాంత్ ఎన్నిక పట్ల సూర్యాపేట జిల్లా మీసేవ ఆపరేటర్స్ అభినందనలు తెలిపారు.
‘గోపా’ బలోపేతానికి
కృషిచేయాలి
తాళ్లగడ్డ (సూర్యాపేట): గౌడ్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (గోపా) బలోపేతానికి కృషిచేయాలని ఆ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చీకూరు సత్యం గౌడ్ అన్నారు. ఆదివారం సూర్యాపేట పట్టణంలోని సాయి గౌతమి జూనియర్ కళాశాలలో గోపా జిల్లా అధ్యక్షుడు బూర రాములు గౌడ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన జిల్లా కార్యవర్గ సమావేశాని ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విస్తృత స్థాయిలో గోప సభ్యత్వాలు చేయించాలని, భవిష్యత్ కార్యక్రమాల నిర్వహణపై చర్చించారు. ఈ సందర్భంగా పలువురికి సభ్యత్వాలు అందజేశారు. ఈ సమావేశంలో అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు నాతి సవీందర్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎరగాని లక్ష్మయ్య గౌడ్, ఉపాధ్యక్షుడు నామాల గురుమూర్తి గౌడ్, కోశాధికారి అయితబోయిన రాంబాబు గౌడ్, జాయింట్ సెక్రటరీలు రాపర్తి మహేష్ గౌడ్, భూపతి నారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

మీసేవ ఆపరేటర్స్ అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారిగా శ్రీక