
కొనుగోళ్లు సగమే..!
హమాలీలు లేరు
పదెకరాల్లో వరిసాగు చేశా. 22 రోజుల క్రితం వరి కోశా ను. 700 బస్తాల ధాన్యం దిగుబడి రాగా.. బోగారం కొనుగోలు కేంద్రంలో పో శాను. 60 సీరియల్ వచ్చింది. కేవలం 8 మంది హమాలీలు మాత్రమే ఉన్నారు. దీంతో రోజూ అర, ఒకటి లారీలు మాత్రమే తూకం వేసి ఎగుమతి చేస్తున్నారు. నా సీరియల్ రావడానికి ఇంకా వారం పడుతుంది. వర్షానికి ధాన్యం తడిసే అవకాశం ఉంది. త్వరగా కొనుగోలు చేయాలి.
–రాధారపు నర్సింహ, రైతు, ఇంద్రపాలనగరం
మందకొడిగా ధాన్యం సేకరణ
ఫ నెల రోజులు గడిచినా 1.94 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొనుగోలు
ఫ కేంద్రాల్లో హమాలీల కొరత
ఫ లోడింగ్, అన్‌లోడింగ్‌కూ తిప్పలే
రామన్నపేట : కొనుగోళ్లు కేంద్రాలను తెరిచి నెల రోజులు గడిచినా ధాన్యం సేకరణ పుంజుకోవడం లేదు. 3.25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్దేశించగా గురువారం వరకు కేవలం 1.94 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కాంటా అయ్యింది.
లక్ష్యం, సేకరించిన వడ్లు
యాసంగి సీజన్‌కు జిల్లాలో 2.75లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. రైతుల అవసరాలు, కొంత ప్రైవేట్‌కు పో యినా 4.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలన్నది లక్ష్యం. కాగా భూగర్భ జలాలు అడుగంటి పంటలు ఎండిపోవడం, అకాల వర్షాలతో దిగుబడి తగ్గడంతో లక్ష్యాన్ని 3 లక్షల మెట్రిక్ టన్నులకు కుదించారు. 375 కేంద్రాల ద్వారా సోమవారం నాటికి 1,94,092 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించి 1,86,924 మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లులకు ఎగుమతి చేశారు. కొనుగోలు చేసిన ధాన్యం విలువ రూ.449 కో ట్ల మేర ఉంటుంది. ఇప్పటి వరకు రూ.349.41 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశారు.
ఈనెల 12 వరకు జరిగిన కొనుగోళ్లు
సంస్థ కేంద్రాలు రైతులు సేకరించిన ధాన్యం
(మెట్రిక్ టన్నుల్లో)
ఐకేపీ 124 5,961 56,177.140
పీఏసీఎస్ 237 14,626 1,24,977.920
ఎఫ్‌పీఓ 14 1,534 1,29,37.400
మొత్తం 375 22,121 1,94,092.460

కొనుగోళ్లు సగమే..!