
కనుల పండువగా లక్ష పుష్పార్చన
యాదగిరిగుట్ట: ఏకాదశి సందర్భంగా గురువారం యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి, అమ్మవారిని పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలతో అలంకరించి వివిధ రకాల పుష్పాలతో అర్చన చేశారు. అదే విధంగా ప్రధానాలయంలో సంప్రదాయ పూజలు ఆగమశాస్త్రం ప్రకారం చేపట్టారు. వేకువజామున సుప్రభాత సేవతో స్వామివారిన మేల్కొలిపిన అర్చకులు.. గర్భాలయంలోని స్వ యంభూలు, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజా భిషేకం చేసి, తులసీదళ అర్చనతో కొలిచారు. అనంతరం ప్రథమ ప్రాకార మండపంలో సుదర్శనహోమం, గజవాహన సేవ, స్వామి, అమ్మవారికి నిత్యకల్యాణం, ముఖ మండపంలో జోడు సేవో త్సవం తదితర పూజలు నిర్వహించారు. రాత్రి స్వామివారికి శయనోత్సవం చేసి ఆలయద్వార బంధనం చేశారు.