పెండింగ్‌ పనులు త్వరగా పూర్తి చేయండి | - | Sakshi
Sakshi News home page

పెండింగ్‌ పనులు త్వరగా పూర్తి చేయండి

May 24 2025 12:55 AM | Updated on May 24 2025 12:55 AM

పెండి

పెండింగ్‌ పనులు త్వరగా పూర్తి చేయండి

భువనగిరిటౌన్‌ : గ్రామాల్లో పెండింగ్‌ అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరితగతి పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్‌ సృజన అధికారులను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్‌ నుంచి డీపీఓలు, జెడ్పీ సీఈఓలతో వీ డియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పనుల ప్రగతిపై సమీక్షించారు. నిర్ణీత లక్ష్యానికి అనుగుణంగా పనులు పూర్తి చేయాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జెడ్పీ సీఈఓ, డీపీఓ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పెండింగ్‌ పనులు పూర్తి చేయించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జెడ్పీ సీఈఓ శోభారాణి, డీపీఓ సునంద, డీఆర్‌డీఓ నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఆయుష్మాన్‌ ఆరోగ్య కేంద్రాల తనిఖీ

రాజాపేట: మండలంలోని బొందుగుల గ్రామంలో ఆయుష్మాన్‌ ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం డీఎంహెచ్‌ఓ మనోహర్‌ తనిఖీ చేశారు. రోగులు, గర్భిణుల నమోదు రికార్డులు, మందుల స్టాక్‌ను పరిశీలించారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందజేసి ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం పెంచాలని వైద్యసిబ్బందికి సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ కాన్పులు పెంచాలని పేర్కొన్నారు. ఆయన వెంట ఎంఎల్‌హెచ్‌పీ మానస, ఏఎన్‌ఎం అలేఖ్య, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్‌ ఉన్నారు.

యాదగిరిగుట్ట రూరల్‌: యాదగిరిగుట్ట పీహెచ్‌సీ, వంగపల్లిలోని ఆయుష్మాన్‌ ఆరోగ్య మందిర్‌ను డీఎంహెచ్‌ఓ సందర్శించారు. ప్రతి శుక్రవారం ఫ్రైడే ,డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించాలని కోరారు. దోమలు వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

వృత్యంతర శిక్షణతో బోధన మెరుగు

యాదగిరిగుట్ట: ఉపాధ్యాయులు బోధన నైపు ణ్యాలు మెరుగుపరుచుకునేందుకు వృత్యంతర శిక్షణ దోహదపడుతుందని డీఈఓ సత్యనారా యణ పేర్కొన్నారు. యాదగిరిగుట్ట పట్టణంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో జిల్లా, ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయులకు నిర్వహి స్తున్న వృత్యంతర శిక్షణ తరగతులను శుక్రవా రం ఆయన సందర్శించారు. ప్రస్తుత పరిస్థితు ఉపాధ్యాయులకు అన్ని సబ్జెక్టులతో పాటు డిజిటల్‌ బోధన పట్ల శిక్షన ఇవ్వడం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు బలపడుతాయన్నారు. వృత్యంతర శిక్షణ తరగతుల్లో నేర్చుకున్న అంశాలను తరగతి గదిలో అమలు పర్చాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో శిక్షణ శిబిరం కోర్స్‌ ఇంచార్జ్‌, ఎంఈఓ యామిని, రిసోర్స్‌ పర్సన్లు నాగలింగం, బాలలక్ష్మి, నాగమణి, బాలసుబ్రహ్మణ్యం, మనోహర్‌, అరవింద రాయుడు, వెంకటేష్‌, కొండల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సెర్ప్‌ ఉద్యోగుల బదిలీలు?

జిల్లాలో 70 మంది సిబ్బంది

సాక్షి యాదాద్రి : పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌)లో బదిలీలకు రంగం సిద్ధమైంది. నిబంధనల ప్రకారం 30 శాతం ఉద్యోగులను మాత్రమే బదిలీ చేయాల్సి ఉంటుంది. కానీ, వంద శాతం బదిలీలకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం ఎంత మంది ఉన్నారు, ఏ ప్రాతిపదికన బదిలీ చేయాలి.. తదితర అంశాలపై శనివా రం సెర్ప్‌ ఉన్నతాధికారులు రాష్ట్రస్థాయిలో యూనియన్‌ నాయకులతో సమావేశమై చర్చించనున్నట్లు తెలిసింది. కాగా కౌన్సెలింగ్‌ ద్వారా బదిలీల ప్రక్రియ చేపట్టాలని ఉద్యోగులు కోరుతున్నారు.

ఉద్యోగులు ఇలా..

జిల్లా సెర్ప్‌లో మొత్తం 70 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరిలో ఏపీఎంలు 23, డీపీఎంలు నలుగురు, సీసీలు 43 మంది ఉన్నారు. వీరంతా బదిలీల పరిధిలోకి రానున్నారు. జూన్‌ 1వ తేదీనుంచి బదిలీలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. చాలా ఏళ్ల తరువాత బదిలీలు జరుగుతుండడంతో ఉద్యోగుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

పెండింగ్‌ పనులు త్వరగా పూర్తి చేయండి
1
1/1

పెండింగ్‌ పనులు త్వరగా పూర్తి చేయండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement