
అదుపుతప్పి కారు బోల్తా
బీబీనగర్: దైవ దర్శనానికి వచ్చి తిరిగి వెళ్తుండగా కారు అదుపు తప్పి బోల్తా కొట్టడడంతో ఒకరు మృతి చెందగా.. ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన శుక్రవారం బీబీనగర్ మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌కు చెందిన చేగూరి రామస్వామిగౌడ్(60), లక్ష్మి దంపతులు, వారి కోడళ్లు భూమిక, మనీషతోపాటు వీరి పిల్లలైన అక్షిత్, అక్షయ్, శ్రీయాంక, సహస్రలతో కలిసి గురువారం సాయంత్రం కారులో యాదగిరిగుట్టలోని శ్రీలక్ష్మీ నర్సింహ స్వామి దర్శనానికి వచ్చారు. శుక్రవారం ఉదయం స్వామివారి దర్శనం చేసుకొని తిరిగి మొయినాబాద్‌కు బయలుదేరారు. బీబీనగర్‌కు రాగానే జాతీయ రహదారిపై గల ఫ్లైఓవర్ సమీపంలో కారు అదుపు తప్పి సర్వీస్ రోడ్డుపైకి పల్టీ కొట్టింది. దీంతో కారు పూర్తిగా ధ్వంసం కాగా అందులో ఉన్న ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను బయటకు తీశారు. నేషనల్ హైవే అంబులెన్స్‌లో వారిని భువనగిరి ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లగా రామస్వామి, లక్ష్మితోపాటు, మరొకరి పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. రామస్వామి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. ప్రమాదానికి గురైన కారులో నలుగురు ఐదేళ్లలోపు చిన్నారులే ఉన్నారు.
బైక్‌ను తుఫాన్ ఢీకొట్టడంతో ఒకరు మృతి
యాచారం: నాగార్జునసాగర్–హైదరాబాద్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాలు.. నల్లగొండ జిల్లా చందంపేటకు చెందిన కృష్ణ(32) గురువారం అర్ధరాత్రి బైక్‌పై రంగారెడ్డి జిల్లా యాచారం నుంచి మాల్ వైపు వెళ్తున్నాడు. మార్గ మధ్యలో చింతపట్ల గేట్ వద్ద తుఫాన్ వాహనం ఢీకొట్టింది. ఈ సంఘటనలో కృష్ణకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు యాచారం సీఐ నందీశ్వర్‌రెడ్డి తెలిపారు.
ఫ ఒకరు మృతి.. ఏడుగురికి తీవ్రగాయాలు
ఫ దైవ దర్శనానికి వచ్చి తిరిగి వెళ్తుండగా ఘటన
స్వర్ణగిరి క్షేత్రంలో తిరువీధి ఉత్సవసేవ
భువనగిరి: పట్టణ శివారులోని స్వర్ణగిరి క్షేత్రంలో శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయంలో శుక్రవారం సాయంత్రం తిరువీధి ఉత్సవసేవ వైభవంగా నిర్వహించారు. అంతకు ముందు ఉదయం స్వామి వారికి సుప్రభాత సేవ, పంచామృతాభిషేకం, సహస్రనామార్చన సేవ, సుదర్శన నరసింహ హవనం, నిత్య కల్యాణ మహోత్సవం, మధ్యాహ్నం సుమారు 3వేల మంది భక్తులకు అన్నప్రసాద వితరణ, సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవ, పద్మావతి అమ్మవారికి కుంకుమార్చన సేవ జరిపించారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.

అదుపుతప్పి కారు బోల్తా

అదుపుతప్పి కారు బోల్తా