మహిళా సంఘాలకు కొత్త సారథులు | - | Sakshi
Sakshi News home page

మహిళా సంఘాలకు కొత్త సారథులు

May 24 2025 12:55 AM | Updated on May 24 2025 12:55 AM

మహిళా సంఘాలకు కొత్త సారథులు

మహిళా సంఘాలకు కొత్త సారథులు

ఆలేరురూరల్‌ : మహిళా స్వయం సహాయక సంఘాలకు కొత్త సారథులు వచ్చారు. జిల్లాలో 14,900 సంఘాలు, 16మండల సమాఖ్యలను సెర్ప్‌ రూపొందించిన నూతన బైలా ద్వారా ఎన్నుకున్నారు. వలిగొండ మండల సమాఖ్య నూతన కార్యవర్గ ఎన్నిక ఈనెల 26న జరగనుంది. ఇక జిల్లా సమాఖ్య అధ్యక్షురాలి ఎంపిక జూన్‌ 6వ తేదీన నిర్వహించనున్నారు.

మూడు స్థాయిల్లో సంఘాలు

జిల్లా, గ్రామ, మండల స్థాయిలో స్వయం సహాయక సంఘాలు పని చేస్తున్నాయి. గ్రామస్థాయిలో ఒక్కో స్వయం సహాయక బృందానికి ఇద్దరు లీడర్లు, పాలకవర్గ సభ్యులు, గ్రామ సమాఖ్యకు అధ్యక్షురాలు, ఉపాధ్యక్షురాలు, ప్రధాన కార్యదర్శి, కోశాధికారితో కార్యవర్గం ఉంటుంది. ఇదే తరహాలో మండల, జిల్లా సమాఖ్యలు ఉంటాయి. వీటికి ఇప్పటికే ఎన్నికలు నిర్వహించి కొత్త లీడర్లను ఎన్నుకున్నారు. ఎన్నికల నిర్వహణకు ఏపీఎం, సీసీలకు ఇతర సిబ్బందికి జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు.శిక్షణ పొందిన సిబ్బంది గ్రామస్థాయిలో కొత్త లీడర్ల ఎన్నికపై గ్రామైక్య సంఘాల సభ్యులకు అవగాహన కల్పించారు.

ఎన్నిక ఈ విధంగా నిర్వహించారు

ప్రతి స్వయం సహాయక సంఘం(ఎస్‌ఎచ్‌జీ)లో 10 నుంచి 15 మంది సభ్యులు ఉన్నారు. అధ్యక్ష, ఉపాధ్యక్షురాళ్ల ఎన్నికకు నిబంధనల ప్రకారం ఆసక్తి ఉన్న సభ్యులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఏకగ్రీవంగా, చేతులు పైకెత్తడం, చీటీలు రాసి మద్దతు ప్రకటించడం వంటి మూడు పద్ధతులను అవలంభించారు. వీటిలో ఒక విధానం ద్వారా అధ్యక్ష, ఉపాధ్యక్షురాళ్ల్లను ఎన్నుకున్నారు. గ్రామంలోని స్వయం సహాయం సంఘాల సభ్యుల్లో ఒకరిని గ్రామ సమాఖ్య అధ్యక్షురాలిగా, గ్రామ సంఘాల అధ్యక్షుల నుంచి ఒకరిని మండల సమాఖ్య అధ్యక్షురాలిగా ఎన్నుకున్నారు. మండల సమాఖ్య అధ్యక్షురాలి నుంచి జిల్లా సమాఖ్య అధ్యక్షురాలిని ఎన్నుకో నున్నారు. జిల్లా అధ్యక్షురాలి ఎంపికతో ఎన్నికల ప్రక్రియ ముగియనుంది.

రుణాల సద్వినియోగంలో వారే కీలకం

ప్రభుత్వం అందిస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకుంటున్న స్వయం సహాయక సంఘాల సభ్యులు అర్థికాభివృద్ధి సాధిస్తున్నారు. చిరువ్యాపారాలు ఏర్పాటు చేసుకోవడంతోపాటు పొదుపు పాఠాలు అలవర్చుకుంటున్నారు. ప్రతి నెలా తప్పనిసరిగా వాయిదాల పద్ధతిన సీ్త్రనిధి రుణాలను బ్యాంక్‌లో జమ చేస్తున్నారు. ఈ ప్రక్రియలో అధ్యక్ష, ఉపాధ్యక్షురాళ్లు పాత్ర ఎంతో కీలకమైనదిగా చెప్పవచ్చు.

పదవీకాలం మూడేళ్లు

నూతన కార్యవర్గాల పదవీకాలం మూడు సంవత్సరాలు ఉంటుంది.

తుది దశకు ప్రక్రియ

జిల్లాలో మహిళా స్వయం సహాయక సంఘా లకు కొత్త సారథులను ఎన్నుకునేందుకు పది రోజుల క్రితం మొదలైన ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరింది. 14,900 సంఘాలకు, 16 మండల సమాఖ్యలకు గాను ఇప్పటికే నూతన లీడర్లను ఎన్నుకున్నారు. జూన్‌ 6వ తేదీతో ప్ర క్రియ పూర్తికానుంది. అనంతరం నూతన కార్యవర్గాలకు శిక్షణ ఇవ్వనున్నారు. పొదుపు, బ్యాంకు రుణాలు పొందడం, కిస్తులు చెల్లించడంపై అవగాహన కల్పిస్తారు.

ఫ 14,900 సంఘాలు, 16 మండల సమాఖ్యలకు ఎన్నికలు పూర్తి

ఫ జూన్‌ 6న జిల్లా సమాఖ్య అధ్యక్షురాలి ఎంపిక

వీఓలు 562

మండల సమాఖ్యలు 17

మహిళా సంఘాలు 14,900

మొత్తం సభ్యులు 1,51,876

పారదర్శకంగా ఎన్నికలు

జిల్లాలోని మహిళా స్వయం సహాయ సంఘాలకు ఎన్నికలు జరిగే ప్రక్రియ కొనసాగుతుంది. ఈనెలాఖరుకు ఎన్నికలు పూర్తి చేసేందుకు అన్ని చర్యలు చేపడుతున్నాం. ఇప్పటికే గ్రామ స్థాయిలో పూర్తికాగా, మండల అధ్యక్షురాళ్ల ఎన్నిక చివరి దశకు వచ్చింది. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరిగింది. –పాశికంటి మల్లేశం,

అసిస్టెంట్‌ ప్రాజెక్టు మేనేజర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement