నకిలీ కట్టడికి టాస్క్‌ఫోర్స్‌ | - | Sakshi
Sakshi News home page

నకిలీ కట్టడికి టాస్క్‌ఫోర్స్‌

May 17 2025 7:11 AM | Updated on May 17 2025 7:11 AM

నకిలీ

నకిలీ కట్టడికి టాస్క్‌ఫోర్స్‌

వ్యవసాయ, పోలీస్‌ శాఖల ఆధ్వర్యంలో మూడు ప్రత్యేక బృందాలు

విత్తన ఎంపికలో జాగ్రత్త

నకిలీ విత్తనాల బారిన పడకుండా రైతులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ అధికారులు హెచ్చరిస్తున్నారు. లైసెన్స్‌డు డీలర్ల వద్దనే విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు కొనుగోలు చేయాలని, తప్పనిసరిగా రశీదు తీసుకోవాలని సూచిస్తున్నారు. తక్కువ ధరకు విక్రయిస్తున్నారని, ఆఫర్లు, రంగురంగుల ప్యాకెట్లను చూసి మోసపోవద్దని, విత్తన నాణ్యత, మొలక శాతం, కంపెనీ బ్రాండెడ్‌ వివరాలను పరిశీలించిన తరువాతే కొనుగోలు చేయాలని చెబుతున్నారు.

ఆలేరు: వానాకాలం సాగు షురూ అయింది. చాలా మంది రైతులు వరి, పత్తి పంటలు అధికంగా సాగు చేస్తుంటారు. ఇదే సమయంలో అనుమతి లేని విత్తనాలు, బీటీ–3 విత్తనాలు, నకిలీ సీడ్‌ను మార్కెటింగ్‌ చేసుకోవడానికి వ్యాపారులు ప్రయత్నిస్తుంటారు. ఆకర్షణీయంగా ఉండే రంగురంగుల ప్యాకెట్లలో నింపి, తమ వంగడాలు అధిక దిగుబడి ఇస్తాయని నమ్మబలుకుతూ వాటిని రైతులకు అంటగడుతుంటారు. నకిలీ విత్తనాల వల్ల దిగుబడి తగ్గి రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం పొంచి ఉంది. దీన్ని అరికట్టేందుకు వ్యవసాయ, పోలీసు శాఖలు సంయుక్తంగా వ్యూహాలను సిద్ధం చేశాయి. నకిలీ విత్తన ముఠాల ఆటకట్టించేందుకు మూడు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ బృందాల(స్క్వాడ్‌)ను ఏర్పాటు చేశాయి.

ఇదీ.. టాస్క్‌ఫోర్స్‌ టీం

టాస్క్‌ఫోర్స్‌ బృందంలో వ్యవసాయ సహాయ సంచాలకులు (ఏడీఏ), ఇద్దరు మండల వ్యవసాయ అధికారులు, ఒక ఏఎస్‌ఐ, ఒక కానిస్టేబుల్‌ ఉంటారు. వీరికి ఏడీఏ నేతృత్వం వహిస్తారు. జిల్లాలో 17 మండలాలు ఉండగా రెండు బృందాలు ఐదు మండలాల చొప్పున, ఒక బృందం ఏడు మండలాల్లో తనిఖీలు చేస్తుంది. రైతుల భాగస్వామ్యంతో టీంలు పని చేయనున్నాయి. టీంల పనితీరుపై కలెక్టర్‌, జిల్లా వ్యవసాయ అధికారి, డీసీపీ పర్యవేక్షణ ఉంటుంది.

తనిఖీలకు సిద్ధం

వ్యవసాయ సీజన్‌ ప్రారంభంకానున్న నేపథ్యంలో తనిఖీలు ముమ్మరం చేయాలని అధికారులు నిర్ణయించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అనుమానిత ప్రదేశాలు, ఎరువులు, విత్తన దుకాణాలతో పాటు ఫిర్యాదులు అందిన షాపుల్లో టాస్క్‌ఫోర్స్‌ టీంలు తనిఖీలు నిర్వహించేందుకు సిద్ధమవుతు న్నాయి.అంతేకాకుండా జిల్లా సరిహద్దు ప్రాంతాలు, గతంలో అధికంగా నకిలీ విత్తనాలు పట్టుబడిన మార్గాలపై ప్రత్యేక నిఘా ఉంచుతాయి. వరుసగా మూడుదఫాల కంటే ఎక్కువ సార్లు పట్టుబడిన వ్యక్తులపై పీడీ యాక్ట్‌ నమోదు చేయనున్నారు. అదే విధంగా నాసిరకం విత్తనాలు కొనుగోలు చేయకుండా రైతులకు అవగాహన కల్పించనున్నారు. లైసెన్స్‌డు డీలర్‌ వద్దనే విత్తనాలు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటారు.

గతంలో పట్టుబడిన నకిలీ విత్తనాలు

గతంలో మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూర్‌ నుంచి తీసుకువచ్చిన నకిలీ పత్తి విత్తనాలను టాస్క్‌ఫోర్స్‌ టీంలు పట్టుకున్నాయి.

ఫ ఎరువులు, విత్తన దుకాణాల్లో తనిఖీలకు సిద్ధం

ఫ జిల్లా సరిహద్దులు, గతంలో నకిలీ సీడ్‌ పట్టుబడిన ప్రాంతాలపై ప్రత్యేక నిఘా

ఫ మూడు కంటే ఎక్కువ సార్లు పట్టుబడిన వ్యక్తులపై పీడీ యాక్ట్‌

నకిలీ సీడ్‌ అమ్మితే క్రిమినల్‌ కేసులు

రైతులు నకిలీ విత్తనాలు కొని నష్టపోవద్దన్న ఉద్దేశంతో తనిఖీల కోసం ఉన్నతా ధికారుల ఆదేశాల మేరకు ప్రత్యేకంగా మూడు టాస్క్‌ ఫోర్స్‌ టీంలను ఏర్పాటు చేశాం. నిషేధిత, నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసి, విత్తనాలు సీజ్‌ చేస్తాం. జిల్లాలోని 17 మండలాలతో పాటు సరిహద్దు ప్రాంతాలపై నిరంతర నిఘా ఉంటుంది. ఎవరైనా నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నట్లు తెలిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలి. రైతులు విత్తన కొనుగోలులో జాగ్రత్తలు తీసుకోవాలి. లైసెన్స్‌డు డీలర్ల వద్దనే కొనాలి.

–గోపాల్‌, జిల్లా వ్యవసాయాధికారి

యాదాద్రి భువనగిరి జిల్లాలో వానాకాలం 4.35 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అధికారులు అంచనాలు రూపొందించారు. అందులో సుమారు 3 లక్షల ఎకరాల్లో వరి, 1.10 లక్షల ఎకరాల్లో పత్తి, మిగతా ఎకరాల్లో ఇతర పంటలు సాగు కానున్నాయి.

నకిలీ కట్టడికి టాస్క్‌ఫోర్స్‌1
1/2

నకిలీ కట్టడికి టాస్క్‌ఫోర్స్‌

నకిలీ కట్టడికి టాస్క్‌ఫోర్స్‌2
2/2

నకిలీ కట్టడికి టాస్క్‌ఫోర్స్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement