
అర్జీలకు సత్వర పరిష్కారం చూపండి
భువనగిరిటౌన్ : ప్రజావాణి వినతులకు సత్వర పరి ష్కారం చూపాలని కలెక్టర్ హనుమంతరావు అధికా రులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజలనుంచి వినతులు స్వీకరించారు. అర్జీలకు ఎప్పటికప్పుడు పరిష్కారం జరగాలన్నారు. 56 దరఖాస్తులు రాగా అత్యధికంగా భూ సమస్యలకు సంబంధించినవే ఉన్నాయి.
● తన కుమారులు భూమిని వారిపై మార్చుకుని తన బాగోగులు చూడటం లేదని అంబాలకు చెందిన శాంతమ్మ కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది.
● రేషన్ కార్డులో తన కుమారుడి పేరు చేర్చాలని ఎల్బీనగర్‌కు చెందిన బాలమణి, పింఛన్ వస్తలేదని హనుమాపురం గ్రామానికి చెందిన ఆండాలు దంపతులు కలెక్టర్‌కు విన్నవించారు.
● తన భూమి ధరణిలో ఇతరుల పేరున నమోదైందని పొడిచేడుకు చెందిన మార్పాక స్వామి ఫి ర్యాదు చేశారు. వీరితో పాటు మరికొందరు తమ స్యలపై వినతులు వచ్చాయి.
ఫ కలెక్టర్ హనుమంతరావు