
పీహెచ్‌సీని సందర్శించిన యూనిసెఫ్ బృందం
భూదాన్‌పోచంపల్లి : యూనిసెఫ్ కన్సల్టెంట్ (ఢిల్లీ) క్యాతివాట్స్ బృందం గురువారం భూదాన్‌పోచంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించింది. ఈ సందర్భంగా వారు గర్భిణులు, బాలింతలకు అందుతున్న వైద్యసేవలు, ఆర్యోగ కార్యక్రమాలపై అడిగి తెలుసుకున్నారు. ఐరన్, ఫోలిక్‌యాసిడ్, క్యాల్షియం మాత్రలు వాడే విధానం, వాటి ప్రయోజనాలపై ఆరా తీశారు. అనంతరం వైద్యసిబ్బందితో సమావేశమై మాతాశిశు మరణాల నివారణకు చేపడుతున్న కార్యక్రమాలపై చర్చించారు. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలుపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మెటర్నల్ హెల్త్, న్యూట్రిషన్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ శిల్ప, న్యూట్రిషనిస్ట్ సౌజన్యతో, డీఎంహెచ్‌ఓ మనోహర్, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ యశోద, వైద్యాధి కారిణి శ్రీవాణి, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ పోతారెడ్డి, సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.