
ట్రాక్టర్ ఫ్యాన్ తగిలి మహిళకు తీవ్ర గాయాలు
తుంగతుర్తి: వరి ధాన్యం తూర్పార పడుతుండగా ట్రాక్టర్‌కు ఏర్పాటు చేసిన ఫ్యాన్ తగిలి మహిళకు తీవ్ర గాయమైంది. ఈ తుంగతుర్తి మండలం కొత్తగూడెం గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. కొత్తగూడెం గ్రామానికి చెందిన ఉప్పుల విజయ తమ వరి ధాన్యాన్ని గ్రామ పరిధిలోని ఐకెపీ కేంద్రంలో పోశారు. గురువారం ఐకేపీ కేంద్రంలో ట్రాక్టర్‌కు పంక ఏర్పాటు చేసుకుని ఉప్పుల విజయ తూర్పార పడుతుండగా.. ఆమె చేయి ట్రాక్టర్ ఫ్యాన్ కు తగిలి కండరం తెగింది. విజయ చేయి నుంచి రక్తం కారుతుండడంతో అది చూసిన ఆమె భర్త నవీన్ స్పృహతప్పి పడిపోయాడు. విజయను వెంటనే స్థానికులు అంబులెన్స్‌లో తుంగతుర్తి ప్రభుత్వ ఆస్పతరికి తరలించారు. అక్కడి నుంచి సూర్యాపేట ఆస్పత్రికి.. అటు నుంచి హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్లు పరిశీలించి విజయ చేతి ఎముక విరిగిపోయిందని, ఆపరేషన్ చేయాలని సూచించారని కుటుంబ సభ్యులు తెలిపారు.