
11న గోమాతతో గిరి ప్రదక్షిణ
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా ఈ నెల 11న అఖిల భారత గో సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో గోమాతతో గిరి ప్రదక్షిణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఈఓ వెంకట్రావ్ తెలిపారు. గురువారం యాదగిరీశుడి ఆలయ సన్నిధిలో ఈఓ వెంకట్రావ్‌ను అఖిల భారత గో సేవా ఫౌండేషన్ ప్రతినిధులు కలిసి గోమాతతో గిరి ప్రదక్షిణ నిర్వహిస్తామని విన్నవించారు. దీనిపై స్పందించిన ఈఓ.. గిరి ప్రదక్షిణ ప్రాధాన్యతను మరింత పెంచేందుకు గోమాతతో గిరి ప్రదక్షిణ చేయడం చాలా మంచి కార్యక్రమం అన్నారు. అఖిల భారత గో రక్ష సమితి అధ్యక్షుడు బాలకృష్ణ గురుస్వామి మాట్లాడుతూ.. గో రక్షణ, భూ రక్షణ, పర్యావరణ రక్షణ, ధర్మం కోసం కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 515 కిలోమీటర్లు 182 రోజులు 14 రాష్ట్రాలు ఒక చిన్న పుంగనూరు గోమాతతో పాదయాత్ర నిర్వహించామన్నారు. ఈ గోమాతతో పాటు 500 మంది గో భక్తులతో యాదగిరి దేవస్థానంలో ఈ నెల 11న ఉదయం 5గంటల నుంచి గిరి ప్రదక్షిణ కార్యక్రమం చేపడతామన్నారు. ఈఓను కలిసిన వారిలో హైందవ సంఘాల ఐక్య వేదిక అధ్యక్షులు కట్టెగొమ్ముల రవీందర్‌రెడ్డి, గో విజయ్‌కుమార్, తాటిపాల రాములుగౌడ్, అడ్వకేట్ సురేష్‌గౌడ్, రాఘవేంద్ర, మాణిక్‌యాదవ్, నాందేవ్, ఆకుల అనిల్, ఎరుకల అనిల్ కుమార్‌గౌడ్ ఉన్నారు.