
విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి
భూదాన్‌పోచంపల్లి: వేసవి శిబిరంలో విద్యార్థులు నేర్చుకున్న జ్ఞానాన్ని నిత్యజీవితంలో అన్వయించుకొని విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని రాష్ట్ర సమగ్ర శిక్షా ప్రాజెక్ట్ అడిషనల్ డైరెక్టర్ రాధారెడ్డి అన్నారు. మంగళవారం భూదాన్‌పోచంపల్లి మండలంలోని జలాల్‌పురం పరిధిలో గల కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో నిర్వహిస్తున్న వేసవిశిక్షణా శిబిరాన్ని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నిర్వహిస్తున్న శిక్షణా కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ రిసోర్స్ పర్సన్ యమునా శాస్త్రి విద్యార్థులకు చదువు ప్రాముఖ్యత, ఆర్థిక నిర్వహణపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జాయింట్ డైరెక్టర్ వెంకటనర్సమ్మ, జిల్లా విద్యాధికారి కందుల సత్యనారాయణ, కేబీజీవీల రాష్ట్రకోర్డినేటర్ హజారే శిరీష, స్థానిక కేవీజీబీ ప్రత్యేకాధికారిణి ఇందిర తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర సమగ్ర శిక్షా ప్రాజెక్ట్
అడిషనల్ డైరెక్టర్ రాధారెడ్డి