
ముస్తాబవుతున్న టూరిజం పార్క్
భూదాన్‌పోచంపల్లి: మిస్‌వరల్డ్ పోటీదారులు పర్యటన నేపథ్యంలో భూదాన్‌పోచంపల్లి టూరిజం పార్కు ముస్తాబవుతోంది. హంపీ థియేటర్‌లో ప్రముఖ మోడల్స్ పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలు ధరించి ర్యాంప్‌వాక్ నిర్వహిస్తుండటంతో ర్యాంప్, లైటింగ్ సిస్టమ్ పనులు చేస్తున్నారు. మ్యూజియం లోపల చేనేత థీమ్‌ను ఉట్టిపడేలా ప్రాంగణమంతా ఇక్కత్ వస్త్రాలతో తీర్చిదిద్దుతున్నారు. టూరిజం ప్రాంగణంలో గుడిసెల సెట్‌లో చేనేత స్టాల్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. రోడ్డు వెంట చెట్లకొమ్మను తొలగించారు.

ముస్తాబవుతున్న టూరిజం పార్క్