తిప్పర్తి: తిప్పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని నల్లగొండ–రాయినిగూడెం రైల్వే లైన్ ఎఫ్‌సీఐ గోదాం సమీపంలో రైలు పట్టాల పక్కన బుధవారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడి వయస్సు 40 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉంటుందని, 5.5 అడుగుల ఎత్తు ఉంటాడని రైల్వే ఎస్‌ఐ రామకృష్ణ తెలిపారు. మృతదేహాన్ని నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 8712658595 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు.