
అర్హుల ఎంపికకు తుది కసరత్తు
కలెక్టర్ చెంతకు ఇందిరమ్మ ఇళ్ల రెండో జాబితా
రూ.లక్ష బిల్లు వచ్చింది
ఇల్లు ఉండగా శిథిలావస్థకు చేరి వర్షాలకు కూలిపోయింది. ఇందిరమ్మ పథకం కింద ఇంటికోసం దరఖాస్తు చేసుకోగా మంజూరైంది. ప్రస్తు తం పిల్లర్ల దశలో పనులు ఉన్నాయి. బేస్మెంట్ వరకు రూ.లక్ష బిల్లు వచ్చింది. –చంద్రకళ, బండసోమారం
గూడు సమస్య తీరనుంది
తొలి విడతలోనే నాకు ఇంది రమ్మ ఇళ్లు వచింది. హాల్, కిచెన్, బెడ్‌రూంతో పాటు, దే వునిరూం నిర్మాణం చేస్తున్నా. ప్రస్తుతం గోడల వరకు ప నులు పూర్తయ్యాయి. త్వరలోనే ఇంటి నిర్మా ణం పూర్తవుతుంది. గూడు సమస్య తీరనుంది. ఇల్లు మంజూరు కావడం సంతోషంగా ఉంది.
–ఎర్ర నర్సయ్య, బండసోమారం
సాక్షి, యాదాద్రి : రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితా తుది కసరత్తు జరుగుతోంది. మొదటి, రెండో విడత కలిపి ప్రతి నియోజకవర్గంలో మొత్తం 3,500 ఇళ్లు అందించేలా అధికారులు జాబితా రూపొందించారు. తొలి విడతలో ఎంపిక చేసిన పైలట్ గ్రామాలను మినహాయించి, మిగిలిన గ్రామాల్లో తయారు చేసిన రెండో విడత జాబితా కలెక్టర్ చెంతకు చేరింది.
7,700 ఇళ్లతో జాబితా
భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి, మునుగోడు, నకిరేకల్ నియోజకవర్గాలకు 8,834 ఇళ్లు మంజూరయ్యాయి. అందులో తొలి విడతలో పైలట్ గ్రామాలకు 762 ఇళ్లు మంజూరు చేశారు. రెండో విడత 7,700 ఇళ్లు అందించేలా ఇందిరమ్మ కమిటీలు, ఆ తరువాత ఎమ్మెల్యేలు లబ్ధిదారుల జాబితా రూపొందించి కలెక్టర్‌కు అందజేశారు. కలెక్టర్ లాగిన్‌లో ఉన్న జాబి తాను తహసీల్దార్లు, మండల ప్రత్యేక అధికారులు పరిశీలించి అనర్హులను పక్కన పెడుతున్నారు. కలెక్టర్ ర్యాండమ్ చెక్ తర్వాత జాబితాను జిల్లా ఇంచార్జ్ మంత్రి ఆమోదిస్తారు. ఆ తరువాత లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేయనున్నారు. సొంత స్థలం కలిగి ఉండి ఇల్లు లేని వారికి తొలిప్రాధాన్యం ఇవ్వనున్నారు.
పైలట్ గ్రామాల్లో వేగంగా
ఇళ్ల నిర్మాణాలు..
తొలి విడతలో ఎంపిక చేసిన 17 పైలట్ గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగంగా జరుగుతోంది. 762 ఇళ్లకు 481 గృహాలకు మార్కింగ్ ఇచ్చారు. ఇందులో 139 ఇళ్లు బేస్మెంట్ వరకు పూర్తికాగా 109 మందికి రూ.1 లక్ష చొప్పున బిల్లులు అందాయి. ఇంకా 20 మంది ఖాతాల్లో త్వరలోనే జమ చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. తుర్కపల్లి మండలంలోని కోనాపూర్, వలిగొండ మండలం నాతాళ్లగూడెంలో రూప్‌స్థాయిలో ఇళ్ల నిర్మాణాలు ఉన్నాయి.
వలస కూలీలకు ఉపాధి
ఇందిరమ్మ ఇళ్ల పథకం బిహార్, ఒడిశా, పశ్చిమబంగాల్ రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీలకు వరంగా మారింది. నిర్మాణ పనులకు స్థానిక కూలీలు సరిపోకపోవడంతో వలస కూలీలను వాడుకుంటున్నారు.
ఫ విచారణ చేసి అనర్హుల తొలగింపు
ఫ వారం రోజుల్లో ముగియనున్న ప్రక్రియ
ఫ మంత్రి ఆమోదం పొందగానే లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్
మంజూరైన ఇళ్లు
నియోజకవర్గాల వారీగా..
ఆలేరు 3,196
భువనగిరి 3,186
మునుగోడు 1,250
తుంగతుర్తి 627
నకిరేకల్ 680

అర్హుల ఎంపికకు తుది కసరత్తు

అర్హుల ఎంపికకు తుది కసరత్తు