
శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి సూచనలతోనే నీటి సంరక్షణ
రిటైర్డ్ ఇంజనీర్ మేరెడ్డి శ్యామ్ ప్రసాద్‌రెడ్డి సూచనలతోనే నీటి సంరక్షణకు చర్యలు చేపట్టా. ఒకసారి రైతులతో సమావేశం ఏర్పాటు చేసి అర్థమయ్యేలా చెప్పారు. దాంతో 50 ఎకరాల చుట్టూ కందకాలు తవ్వించా. ఐదెకరాలకు ఒకటి చొప్పున నీటి గుంతలను తవ్వించా. అంతకు ముందు మా భూమిలో జియాలజిస్టులు బోర్లు పడవన్నారు. ఇప్పుడు అదే భూమిలో 3 బోర్లు వేశా. భూగర్భ జలాలు పెరిగి, నీరు బాగా పోస్తున్నాయి.
– పాల్వాయి సత్యనారాయణరెడ్డి, చండూరు
బోరు బావుల్లో సమృద్ధిగా నీరు
మూసీ నదిపై చెక్ డ్యామ్‌లు నిర్మించడం వల్ల గ్రామంలో బోర్లు, బావులు ఎండిపోలేదు. సమృద్ధిగా నీరు రావడంతో నీటి కొరత తలెత్తలేదు. గతంలో వేసవి వచ్చిందంటే బోర్లు, బావుల్లో నీరు తగ్గిపోయి ఇబ్బందులకు గురయ్యేవాళ్లం. చెక్ డ్యామ్‌లు నిర్మించాక నీటి సమస్యకు పరిష్కారం లభించింది.
– వెంకట్‌రెడ్డి, దోసపహాడ్, పెన్‌పహాడ్ మండలం

శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి సూచనలతోనే నీటి సంరక్షణ