
ఆటో బోల్తా.. ఒకరు మృతి
● మరొకరికి తీవ్ర గాయాలు
వలిగొండ: ఆటో బోల్తాపడి ఒకరు మృతిచెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన వలిగొండ మండలం అక్కంపల్లి సమీపంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కంచెనపల్లికి చెందిన లాడే సుధాకర్ (40), లాడే అంజాజీ ఇద్దరు కలిసి వాహన బ్యాటరీల వ్యాపారం నిమిత్తం గురువారం ఆటోలో చౌటుప్పల్‌కు వచ్చారు. తిరుగు ప్రయాణంలో వలిగొండ మండలం అక్కంపల్లి వద్ద ఆటో బోల్తా పడడంతో ఆటో నడుపుతున్న సుధాకర్ అక్కడికక్కడే మృతిచెందాడు. అంజాజీకి తీవ్ర గాయాలయ్యాయి. వాహనదారులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం, అంజాజీకి వైద్యం నిమిత్తం రామన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ యుగంధర్ తెలిపారు.