మండుటెండల నుంచి ఉపశమనం
భువనగిరిటౌన్ : ఆవర్తన ద్రోణి ప్రభావంతో జిల్లాలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాతావరణం చల్లబడింది. దాదాపు అన్ని మండలాల్లో 41 డిగ్రీల లోపే పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బుధవారం యాదగిరిగుట్ట పట్టణంలో 41, వలిగొండలో 41, మోటకొండూరు మండలంలో 32 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. వాతావరణం చల్లడటంతో ప్రజలు ఉపశమనం పొందారు. పలుచోట్ల రహదారులపై నీరు నిలిచింది. మరోవైపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని 40నుంచి 50 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ భావిస్తోంది. ఈ క్రమంలో జిల్లాకు ఎల్లో అలర్ట్ హెచ్చరికలు జారీ చేసింది. రోహిణి కార్తెకు ముందే వర్షాలు కురుస్తుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఆలేరు: ఆలేరు పట్టణంలో భారీ కురిసింది. రోడ్లు, లోతట్టు ప్రాంతాల్లో పలు కాలనీలు జలమయం అయ్యాయి. దీంతో ప్రజలు ఇబ్బందులకు గుర య్యారు. రైల్వేగేట్ వద్ద అండర్ బ్రిడ్జి నిర్మాణం కోసం తీసి గుంతల్లో వర్షపు నీరు చేరింది. అక్కడక్కడ చెట్ల కొమ్మలు విరిగి కరెంట్ తీగలపై పడటంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
ఆత్మకూరు(ఎం) : మండలంలో సుమారు గంట సేపు భారీ వర్షం పడింది. రైతులు ముందు జాగ్రత్తగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశులపై టార్ఫాలిన్ పట్టాలు కప్పి ఉంచడంతో నష్టం తప్పింది. వర్షాలు కురుస్తున్నందున ధాన్యాన్ని త్వరగా కొను గోలు చేయాలని రైతులు అధికారులను కోరారు.
మోత్కూరు: పట్టణంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో మోస్తరు వర్షం కురిసింది. వర్షానికి మోత్కూరులో రోడ్లు జలమయం అయ్యాయి.
యాదగిరిగుట్ట : పట్టణంలో రెండు గంటల పాటు మోస్తరు వర్షం కురిసింది. వర్షానికి పట్టణంలోని ప్రధాన రహదారులపై నీరు ప్రవహించింది. అంతే కాకుండా యాదగిరి క్షేత్రానికి వచ్చిన భక్తులు టెంట్ కింద, ప్రాకార మండపాల కిందికి చేరారు. యాద గిరికొండపై ఎండ, ఉక్కపోతతో అవస్థలు పడ్డ ప్రజానీకం ఉపశమనం పొందారు.
కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం
వలిగొండ : మండలంలో బుధవారం కురిసిన అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది. వర్కట్‌పల్లి, గోకారం, సంగెం, నాగా రం, వెల్వర్తి కేంద్రాల్లో లారీలు రాకపోవడం వల్ల తూకం వేసిన ధాన్యం పాక్షికంగా తడిసింది. ఏదుళ్లగూడెంలో రైతు కొలను సంధ్యకు చెందిన సుమారు 1,376 బస్తాల ధాన్యం రవాణా చేసే లోపే వర్షానికి తడిసిపోయింది. వర్కట్‌పల్లిలో కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ వీరారెడ్డి, సివిల్ సప్లై మేనేజర్ హరికృష్ణ సందర్శించి ధాన్యాన్ని పరిశీలించారు. తడిసిన ధాన్యాన్ని మిల్లులకు ఎగుమతి చేసేందుకు చర్యలు తీసుకుంటామని, ఆందోళన చెందవద్దని రైతులకు అదనపు కలెక్టర్ భరోసా ఇచ్చారు. కాంటా వేసిన ధాన్యాన్ని ఏరోజుకారోజు మిల్లులకు ఎగుమతి చేయాలని అధికారులను ఆదేశించారు. వారి వెంట తహసీల్దార్ దథరథ ఉన్నారు. అదే విధంగా పలు చోట్ల ఈదురుగాలులకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది.
ఫ జిల్లాలో మోస్తరు వర్షాలు
ఫ చల్లబడ్డ వాతావరణం
బుధవారం నమోదైన వర్షపాతం (మి.మీ)
మండలం వర్షపాతం
యాదగిరిగుట్ట 41
వలిగొండ 41
మోటకొండూరు 32
ఆత్మకూర్ 26
రాజాపేట 23
ఆలేరు 21
భువనగిరి 20
బొమ్మలరామారం 19
మోత్కూరు 15
తుర్కపల్లి 13
అడ్డగూడూరు 13
పోచంపల్లి 11
గుండాల 06
బీబీనగర్ 05
చౌటుప్పల్ 04
నారాయణపురం 03
మండుటెండల నుంచి ఉపశమనం


