ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం
భువనగిరి : ఉపకార వేతనాలకు ఎస్సీ విద్యార్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు డీఈఓ సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలల్లో 5 నుంచి 10వ తరగతి చదువుతున్న ఎస్సీ కులా లకు చెందిన విద్యార్థులు ఈ నెల 31 లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. తల్లిదండ్రుల వార్షిక ఽఽఆదాయం రూ. 2.50 లక్షలకు మించకుండా ఉండాలన్నారు. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
అంతర్జాతీయ యోగా పోటీల్లో గోల్డ్ మెడల్స్
భూదాన్‌పోచంపల్లి : మండలంలోని గౌసుకొండ గ్రామానికి చెందిన వాకిటి బాల్‌రెడ్డి, దీప దంపతుల కుమార్తె ఆరాధ్యరెడ్డితో పాటు వాకిటిజంగారెడ్డి, లక్ష్మీ దంపతుల కుమారుడు రిషివర్థన్‌రెడ్డి అంతర్జాతీయ యోగా పోటీల్లో ప్రతిభ కనబరిచి పతకాలు సాధించారు. ఈ నెల 27న ఢిల్లీలో యూఎస్‌ఎఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన నాల్గవ అంతర్జాతీయ యోగా పోటీల్లో బంగారు పతకాలు సాధించారు. విద్యార్థులను యోగా గురువు నరేష్ ఆభినందించారు.
హైవేపై సండే రద్దీ
చౌటుప్పల్ : హైదరాబాద్ –విజయవాడ జాతీ య రహదారిపై ఆదివారం వాహనాల రద్దీ నెలకొంది. క్రిస్మస్ పండుగకు హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి సొంతూళ్లకు వెళ్లిన ప్రజానీకం సెలవులు ముగియడంతో తిరుగు పయనమయ్యారు. దీనికి తోడు వీకెండ్ తోడవడంతో హైవేపై వాహనాల రద్దీ ఏర్పడింది. ఈ క్రమంలో చౌటుప్పల్ పట్టణంలో వాహనాలు పెద్ద సంఖ్యలో బారులుదీరాయి. ట్రాఫిక్‌జామ్ ఏర్పడకుండా ట్రాఫిక్ పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు.
యాదగిరీశుడి సన్నిధిలో శ్రీభాష్యకార పీఠాధిపతి
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని శ్రీభాష్యకార సిద్ధాంత పీఠాధిపతి అనంత శ్రీ విభూషిత శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీరామచంద్ర రామానుజ జీయర్ స్వామి ఆదివారం దర్శించుకున్నారు. స్వామిజీకి ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం స్వామీజీ గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులను, ముఖ మండపంలోని అష్టోత్తర మూర్తులను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా భక్తులకు జీయర్ స్వామిజీ ప్రవచనాలు చేశారు.
ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం
ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం


