ముక్కోటికి స్వర్ణగిరి ముస్తాబు
భువనగిరి : పట్టణ పరిధిలోని స్వర్ణగిరి క్షేత్రం ముక్కోటి ఏకాదశికి ముస్తాబైంది. ఈనెల 30 నుంచి జనవరి 8వ తేదీ వరకు వేడుకలు నిర్వహించనున్నారు. ఉత్సవాల్లో భాగంగా శ్రీదేవిభూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామివారు 30వ తేదీ వేకువజామున భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని అన్నప్రసాదం సిద్ధం చేయనున్నారు. వాహనాల పార్కింగ్, మంచినీటి వసతి, శానిటేషన్, సమాచార కేంద్రం, ప్రథమ చికిత్స కేంద్రం ఏర్పాటు చేశారు. ఆన్‌లైన్ సేవలు సైతం అందుబాటులో ఉంటాయని ఆలయ వ్యవస్థాపకులు మానేపల్లి రామారావు తెలిపారు.
విద్యుత్ దీపాలంకరణలో స్వర్ణగిరి క్షేత్రం


