కేసీఆర్‌లా ఫాంహౌస్‌కు పరిమితం కావొదు్ద
వలిగొండ: గెలిచిన సర్పంచ్‌లు ప్రజలతో మమేకమై, ప్రజా జీవితంలో ఉండాలని, కేసీఆర్‌లాగా ఫాం హౌస్‌కు పరిమితం కావొద్దని రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సూచించారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సుంకిశాలలోని శ్రీ వేంకటేశ్వర స్వామీ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కాంగ్రెస్ పార్టీ 140 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్థానిక రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి పార్టీ జెండా ఆవిష్కరించారు. వలిగొండలో వలిగొండ నుంచి సుంకిశాల మీదుగా కాటేపెల్లి వరకు రూ.49.50కోట్ల వ్యయంతో నిర్మించిన బీటీ రోడ్డును ఆయన ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, అనిల్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి ప్రారంభించారు. ఇటీవల నూతనంగా గెలిచిన సర్పంచ్, ఉప సర్పంచ్‌ల ఆత్మీయ సన్మానం కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. గత ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ నుంచి 19 మంది ఎమ్మెల్యే లు గెలిస్తే కేసీఆర్ 12 మంది ఎమ్మెల్యే లను కొనుగోలు చేశారని మిగిలిన వారితో భట్టి విక్రమార్క అసెంబ్లీ లో పోరాటం చేశారని గుర్తు చేశారు. కేసీఆర్ ప్రతిపక్ష హోదాను సద్వినియోగం చేసుకోవడం లేదని, గతంలో పార్లమెంట్‌లో ప్రతిపక్ష హోదా లేకున్నా ఖరే ప్రతి రోజూ మోదీ, అమిత్‌షాను ఎండగట్టారని తెలిపారు. శ్రీకేసీఆర్ ఇటీవల ఫామ్ హౌస్ నుంచి బయటికి వచ్చి నిన్నటివరకు ఒకలెక్క నేటి నుంచి ఒక లెక్క అని అంటున్నారు.. కానీ, నీ కూతురే నీ లెక్కలు చెపుతున్నారు అని పేర్కొన్నారు. ఈ ప్రాంత ప్రజల కోరిక మేరకు మూసీ ప్రక్షాళన చేస్తామంటే బీజేపీ నాయలు అడ్డు పడుతున్నారని ఆరోపించారు.
సీఎం స్థాయి వరకు ఎదగొచ్చు : ఎంపీ చామల
నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లు ప్రజలతో కలిసి ఉంటే సీఎం స్థాయికి ఎదగవచ్చని, అందుకు ఉదా హరణ రేవంత్‌రెడ్డి అని.. ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ప్రజలు నమ్మకంతో ఎన్నుకున్నారని, నిబద్ధతతో పని చేసి మరింత ఆదరణ పొందితే భవిష్యత్‌లో మళ్లీ గెలిపిస్తారన్నారు. ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇంత పెద్ద మొత్తంలో సర్పంచ్‌లు గెలవడం భువనగిరి నియోజకవర్గ చరి త్రంలో మొదటిసారి అని, పరిషత్ ఎన్నికల్లోనూ 90 శాతం స్థానాలు గెలిపించుకుందామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు, డీసీసీ అక్షాంశ్‌యాదవ్, ఆర్డీఓ శేఖర్‌రెడ్డి, ఏసీపీ పటోళ్ల మధుసూదన్‌రెడ్డి, ఆర్‌అండ్‌బీ ఈఎన్‌సీ మోహన్‌నాయక్, ఈఈ సరితారాణి, డీఈ సురేందర్, ఎలిమినేటి కృష్ణారెడ్డి, సుర్కంటి సత్తిరెడ్డి, ప్రమోద్ కుమార్, పోతంశెట్టి వెంకటేశ్వర్లు, బర్రె జహంగీర్, శ్యాంగౌడ్, గోలి పింగళ్‌రెడ్డి, పాక మల్లేష్, మర్రి నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి


