
అమెరికాలో సర్వేల్ గురుకులం గోల్డెన్ జూబ్లీ వేడుకలు
సంస్థాన్ నారాయణపురం: అమెరికాలోని లాస్ వెగాస్ నగరంలోలో సంస్థాన్ నారాయణపురం మండలంలోని సర్వేల్ గురకుల విద్యాలయం పూర్వ విద్యార్థులు గోల్డెన్ జూబ్లీ వేడుకలను గురువారం నిర్వహించారు. గురుకుల విద్యాలయంలో 1972–1975 మధ్య కాలంలో చదువుకుని అమెరికాలో స్థిరపడిన వారు ఒకే చోట కలుసుకుని చిన్ననాటి జ్ఞాపకాలను ఒకరికొకరు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో డి. సత్యనారాయణ, చెన్న రాజ, కె. రవికుమార్, కర్ర మల్లారెడ్డి, సీ. నారాయణ, ప్రభాకర్, బసిని వెంకటేశ్వర్లు, వనం సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

అమెరికాలో సర్వేల్ గురుకులం గోల్డెన్ జూబ్లీ వేడుకలు