పరిహారం.. ఎంతిదా్దం? | - | Sakshi
Sakshi News home page

పరిహారం.. ఎంతిదా్దం?

May 27 2025 1:51 AM | Updated on May 27 2025 1:51 AM

పరిహా

పరిహారం.. ఎంతిదా్దం?

గంధమల్ల చెరువు

తుర్కపల్లి : గంధమల్ల రిజర్వాయర్‌ భూసేకరణకు క్షేత్రస్థాయిలో అధికారులు కసరత్తు చేపట్టారు. రైతులకు పరిహారం చెల్లింపు, అడ్డంకులను అధిగమించడంపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా జలాశయంలో భూములు కోల్పోతున్న రైతులతో రెండు దఫాలుగా సమావేశమై చర్చలు జరిపారు. తొలుత ఆర్డీఓ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో సమావేశం కాగా... ఆ తరువాత అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి(రెవెన్యూ) సమావేశం నిర్వహించి వారి అభిప్రాయా లు సేకరించారు.

రైతుల డిమాండ్‌ ఇదీ..

భూ నిర్వాసితులతో అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి ఈనెల 22న కలెక్టరేట్‌లో సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి దాదాపు 100 మంది రైతులు హాజరై పరిహారంపై తమ అభిప్రాయాలు తెలియజేశారు. ఎంతోకాలంగా భూమిని నమ్ముకుని బతుకుతున్నామని, వ్యవసాయమే జీవనాధారమన్నారు. రిజర్వాయర్‌కు తాము వ్యతిరేకం కాదని, అయితే తమకు న్యాయపరమైన పరిహారం చెల్లించాలని కోరారు. రీజినల్‌ రింగ్‌ రోడ్డు బాధితులకు ఎకరాకు రూ.45 లక్షల నుంచి రూ.47 లక్షల వరకు పరిహారం ఖరారు చేశారని, తమకూ అంతే ఇవ్వాలన్నారు. రీజినల్‌ రింగ్‌ రోడ్డు విధానాన్నే తమ విషయంలోనూ కచ్చితంగా అనుసరించాలని విన్నవించారు.

మరోసారి రైతులతో సమావేశం

భూ నిర్వాసితుల అభిప్రాయాలకు సంబంధించిన నివేదికను అదనపు కలెక్టర్‌ ప్రభుత్వానికి నివేదించారు.తదుపరి ఆదేశాలు వచ్చిన అనంతరం మరోసారి రైతులతో సమావేశం కానున్నారు. వచ్చే నెల 6వ తేదీలోపు పరిహారం విషయాన్ని కొలిక్కి తీసుకువచ్చే ప్రయత్నంలో అధికారులు ఉన్నారు.

ఇంటికో ఉద్యోగం ఇవ్వాలి

జీవనాధారమైన భూములు రిజర్వాయర్‌లో పోతున్నాయి. రీజినల్‌ రింగ్‌ రోడ్డు బాధితులకు ఇచ్చిన మాదిరిగా మాకు ఎకరానికి రూ.47లక్షల చొప్పున నష్ట పరిహారం చెల్లించాలి. అంతేకాకుండా భూములు కోల్పోతున్న ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. పరిహారం విషయంలో వివక్ష చూపకుండా అందరికీ సమానంగా న్యాయం జరగాలి.

–కుంభం సత్తయ్య, భూ నిర్వాసితుడు

మూడింతలు ఎక్కువ చెల్లించాలి

రీజినల్‌ రింగ్‌ రోడ్డు రైతులకు ఇచ్చిన విధంగానే గంధమల్ల రైతులకు మూడింతల రేటుతో పరిహారం చెల్లించాలి. భూములు పోవడం వల్ల తాము జీవనాధారం కోల్పోతున్నామన్న విషయం ప్రభుత్వ గుర్తించాలి. భూములు విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.లక్షల్లో ఉంది. భూ విలువకు తగిన రీతిలో అంచనా వేసి పరిహారం చెల్లించాలి.

–గడిపే ఇస్తారి, భూ నిర్వాసితుడు

జీవనాధారం కోల్పోతున్నాం

ప్రాజెక్టు కోసం ప్రభుత్వం భూములు తీసుకోవడం మంచి ఉద్దేశానికే కావచ్చు. కానీ, దశాబ్దాలుగా ఆ భూములపైనే ఆధారపడి జీవిస్తున్నాం. భూములు పోవడం వల్ల జీవనాధారం కోల్పోతున్నామని ప్రభుత్వం గ్రహించాలి. నిర్వాసితులందరికీ సమానంగా న్యాయం జరగాలి. పరిహారం విషయంలో తేడా వస్తే పోరాటం చేస్తాం.

–జక్కుల వెంకటేశం, భూ నిర్వాసితుడు

‘గంధమల్ల’ భూ సేకరణకు కసరత్తు

ఫ రెండు దఫాలు రైతులతో సమావేశం,

అభిప్రాయ సేకరణ

ఫ ఎకరాకు రూ.45 లక్షల నుంచి రూ.47లక్షలు అడుగుతున్న నిర్వాసితులు

ఫ ప్రభుత్వానికి నివేదిక అందజేసిన అధికారులు

ఫ జూన్‌ 6లోగా మరోసారి సమావేశం

1028.83 ఎకరాలు..

గంధమల్ల రిజర్వాయర్‌ ద్వారా ఆలేరు నియోజకవర్గంలో సుమారు 60 వేల ఎకరాలకు సాగునీరు అందించాలన్నదిలక్ష్యం. 1.41 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో ప్రాజెక్టు నిర్మించాలని నిర్ణయించిన ప్రభుత్వం.. రూ.575.55 కోట్లు మంజూరు చేసింది. ప్రాజెక్టు నిర్మాణం 1028.83 ఎకరాల భూసేకరణ అవసరం. ఇందులో గంధమల్ల గ్రామ రెవెన్యూ పరిధిలో 619.34 ఎకరాలు, వీరారెడ్డిపల్లిలో 212.34 ఎకరాలు, కట్ట చుట్టూ 147.15 ఎకరాలు సేకరించాల్సి ఉంది.

పరిహారం.. ఎంతిదా్దం?1
1/3

పరిహారం.. ఎంతిదా్దం?

పరిహారం.. ఎంతిదా్దం?2
2/3

పరిహారం.. ఎంతిదా్దం?

పరిహారం.. ఎంతిదా్దం?3
3/3

పరిహారం.. ఎంతిదా్దం?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement