
అధికంగా భూ సమస్యలే..!
వర్ష సూచన
భువనగిరిటౌన్ : నైరుతి రుతుపవనాల ఆగమనంతో జిల్లాలో మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. వర్షంతో పాటు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం ఇప్పటికే ధాన్యం సేకరణ తుది దశకు చేరగా.. నిల్వలున్న చోట ఒకటి, రెండు రోజుల్లో పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
భువనగిరి : వానాకాలం సమీపిస్తున్నందున సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్య సిబ్బందికి డీఎంహెచ్‌ఓ మనోహర్ సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లోని మినీ హాల్‌లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాకాలం మలేరియా, డెంగీ, చికెన్‌గున్యా, మెదడువాపు, ఫైలేరియా వ్యాధులు ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుందన్నారు. సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించేందుకు అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు నిర్వహించాలని సూచించారు. ప్రతి శుక్రవారం ఫ్రై డే డ్రైడేగా పాటించాలని పేర్కొన్నారు.100 శాతం ఇమ్యూనైజేషన్ జరగాలని ఆదేశించారు. ఈనెల 31న పోగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మత్తు పదార్థాల వల్ల అనార్థలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం అధికారులు డాక్టర్ సాయిశోభ, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ యశోధ, డాక్టర్ వీణ, డిప్యూటి డెమో అంజయ్య, హెల్త్ ఎడ్యుకేటర్ సత్యనారాయణ, సాయిరెడ్డి పాల్గొన్నారు.
ఇండోనేషియా సదస్సులో డీసీసీబీ చైర్మన్
నల్లగొండ అగ్రికల్చర్: ఇండోనేషియాలోని బాలిలో బ్యాంక్ ఆఫ్ ఇండోనేషియా, రీజనల్ పాలసీ ఫోరం 78వ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న సదస్సులో డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయ రంగ అభివృద్ధికి బ్యాంకులు అధిక ప్రాధాన్యమివ్వాలని సూచించారు. సహకార బ్యాంకుల ద్వారా రైతులకు అందజేస్తున్న రుణాలు, అభివృద్ధి తదితర అంశాలను సదస్సులో వివరించారు. అదే విధంగా వ్యవసాయ రంగంలో వేస్టేజీ, పొల్యూషన్ లేకుండా వనరులను వినియోగించుకునే విధానం, ఇండోనేషియాలో వ్యవసాయ రంగం అభివృద్ధికి అవలంభిస్తున్న విధానాలపై అధ్యయనం చేశారు. ఈ సదస్సులో అన్ని జిల్లాల సహకార బ్యాంకుల చైర్మన్లు, వివిధ దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు.
భువనగిరిటౌన్ : కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఎప్పటిలాగే భూ సమస్యలపైనే అధికంగా అర్జీలు వచ్చాయి. మొత్తం 40 దరఖాస్తులు రాగా అందులో 20 వరు భూ సమస్యలకు సంబంధించినవి ఉన్నాయి. అదనపు కలెక్టర్ వీరారెడ్డి, జిల్లా ఉన్నతాధికారులతో కలిసి కలెక్టర్ హనుమంతరావు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. వాటికి సత్వర పరిష్కారం చూపాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏఓ జగన్‌మోహన్‌ప్రసాద్, డీఆర్‌డీఓ నాగిరెడ్డి, డీపీఓ సునందతో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
● జిల్లా కేంద్రంలోని బాలసదనంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని బాలల హక్కుల పరిరక్షణ వేదిక నాయకులు కొడారి వెంకటేష్ కలెక్టర్‌కు విన్నవించారు.
● రసాయన పరిశ్రమ విడుదల చేసే వ్యర్థాలతో నీరు, గాలి కలుషితమై భక్తులు ఇబ్బందులు పడుతున్నారని, పరిశ్రమపై చర్యలు తీసుకోవాలని బీబీనగర్ మండలం మహాదేవపూర్‌లోని వేణుగోపాలస్వామి ఆలయ చైర్మన్ శివారెడ్డి, ప్రభాకర్, స్వామిరెడ్డి, ఆంజనేయులు, పద్మారెడ్డి, కరుణాకర్‌రెడ్డి, అఖిల్, రాములు ఫిర్యాదు చేశారు.
● 14 ఎకరాల భూమి సర్వే కోసం చాలానా కట్టి నాలుగేళ్లు అవుతుందని, అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ మోటకొండూరు మండలం సింగారం గ్రామానికి చెందిన పన్నాల అనూష ఫిర్యాదు చేశారు.
● ఇందిరమ్మ ఇళ్లు మంజూరైనా ముగ్గు పోయడానికి ఎవ్వరూ రావడం లేదని భూదాన్‌పోచంపల్లి మండలం జిబ్లక్‌పల్లి గ్రామినికి చెందిన సయ్యద్ సుల్తానా, ఆమె భర్త చాంద్‌పాషా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.
స్లాట్ బుక్ చేసి మూడు నెలలవుతుంది
రోడ్డు ప్రమాదంలో తీ వ్రంగా గాయపడటంతో నా కాలు పూర్తిగా తొలగించారు. సదరం సర్టి ఫికెట్ కోసం మూడు నెలల క్రితం మీసేవలో స్లాట్ బుక్ చేసుకున్నా. ఇప్పటి వరకు పరీక్షలకు పిలవలేదు. మాది నిరుపేద కుటుంబం. పింఛన్ వస్తే ఆసరా అవుతుంది. పింఛన్ రావాలంటే సదరం సర్టిఫికెట్ తప్పనిసరి అని అధికారులు చెబుతున్నారు. ధ్రువీకరణ పత్రం అందేలా చూడాలి. –కొడతల శ్రీధర్, కాటేపల్లి,
మోటకొండూరు మండలం
ఫ ప్రజావాణికి 40 దరఖాస్తులు
ఫ వినతులను స్వీకరించిన కలెక్టర్, ఉన్నతాధికారులు

అధికంగా భూ సమస్యలే..!

అధికంగా భూ సమస్యలే..!

అధికంగా భూ సమస్యలే..!