చిలుకూరు ఎస్‌ఐని సస్పెండ్ చేయాలి
మునగాల : కోదాడ పట్టణానికి చెందిన దళిత యువకుడు కర్ల రాజేశ్ మృతికి కారకుడైన చిలుకూరు ఎస్‌ఐ సురేశ్‌రెడ్డిని సస్పెండ్ చేసే వరకు ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు, ధర్నాలు, నిరసన కొనసాగుతూనే ఉంటాయని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ స్పష్టం చేశారు. శుక్రవారం మునగాల మండలం ఆకుపాముల శివారులో జాతీయ రహదారి పక్కన ఉన్న పెట్రోల్ బంక్‌ను ఆయన సందర్శించారు. కర్ల రాజేశ్ ఇదే బంక్‌లో పనిచేయడంతో ఆయన బంక్‌లో పని చేస్తున్న సిబ్బందిని కలిసి విచారించారు. అనంతరం మాట్లాడుతూ కోదాడ రూరల్ సీఐ, ఇతర పోలీసులు చిత్ర హింసలకు గురి చేయడం వల్లే రాజేశ్ మృతిచెందాడని పేర్కొన్నారు. దళిత వర్గాలపై పోలీసుల వేధింపులు అధికమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన వెంట ఎంఎస్పీ జిల్లా అధికార ప్రతినిఽధి ఏపూరి రాజుమాదిగ, కర్ల రాజేశ్ సోదరుడు కమల్, నాయకులు ఉన్నారు.


