కారును ఢీకొన్న లారీ
యాదగిరిగుట్ట రూరల్: లారీకి హ్యాండ్ బ్రేక్ వేయకపోవడంతో కారును వెనక నుంచి ఢీ కొంది. ఈ సంఘటన యాదగిరిగుట్ట మండలం తాళ్లగూడెం స్టేజీ సమీపంలో హైదరాబాద్– వరంగల్ ప్రధాన జాతీయ రహదారి ఎన్‌హెచ్–163లో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. లారీ, వరంగల్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తోంది. యాదగిరిగుట్ట మండలం తాళ్లగూడెం స్టేజీ సమీపానికి రాగానే రోడ్డు పక్కన టీ తాగుదామని లారీని ఆపి హ్యాండ్ బ్రేక్ వేయకుండానే డ్రైవర్ టీ షాప్‌కు వెళ్లిపోయాడు. అదే సమయంలో వరంగల్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు.. లారీ వెనకాల నిలిపాడు. అందులోని వ్యక్తి టీ తాగేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో లారీ వెనుకకు కదిలి కారును నెట్టుకుంటూ రోడ్డు పక్కకు వెళ్లింది. లారీ కారు మీదుగా ఒరగడంతో కారు పూర్తిగా ధ్వంసమైంది. అందులో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది.
● వాహనంలో ప్రయాణికులు లేకపోవడంతో తప్పిన ప్రాణనష్టం


