వైభవంగా ఊంజల్ సేవోత్సవం
యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఆండాళ్ అమ్మవారికి శుక్రవారం ఊంజల్ సేవోత్సవాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. అమ్మవారికి ఇష్టమైన రోజు కావడంతో సాయంత్రం వేళ అమ్మవారిని బంగారు ఆభరణాలు, వివిధ రకాల పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించి ఆలయ తిరు, మాఢ వీధుల్లో ఊరేగించారు. మహిళా భక్తులు మంగళ హారతులతో స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని అద్దాల మండపంలో అధిష్టించి ఊంజల్ సేవోత్సవాన్ని చేపట్టారు. ఆండాళ్ అమ్మవారికి నాధ స్వరాన్ని వినిపించారు. అనంతరం హారతినిచ్చారు. ఇక ప్రధాన ఆలయంలో సుప్రభాతం, సహస్రనామార్చన, ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సం వంటి పూజలు నిర్వహించారు.
రేపు పుల్లెలంలో హనుమంతు అంత్యక్రియలు
చండూరు : ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన మావోయిస్టు అగ్రనేత పాక హనుమంతు అంత్యక్రియలు స్వగ్రామమైన చండూరు మండలంలోని పుల్లెంలలో ఆదివారం జరుగనున్నాయి. ఆయన పార్థివదేహాన్ని తీసుకురావడానికి కుటుంబ సభ్యులు శుక్రవారం సాయంత్రానికి ఒడిశా చేరుకున్నారు. శనివారం అర్ధరాత్రి పుల్లెంలకు హనుమంతు పార్థివదేహాన్ని తీసుకొస్తారు. ఆయన అంత్యక్రియలు నిర్వహించేందుకు పుల్లెంలలోని పాత ఇంటి వద్ద ఉన్న ఖాళీ ప్రదేశాన్ని శుభ్రపరిచారు. అంత్యక్రియల ఏర్పాట్లను హనుమంతు బావ మల్లిక్ పరిశీలించి గ్రామంలోని ముఖ్యులతో సమావేశమై చర్చించారు.
వయోవృద్ధులను గౌరవించాలి
చౌటుప్పల్ : వయోవృద్ధులను ప్రతిఒక్కరూ గౌరవించాలని చౌటుప్పల్ ఏసీపీ పటోళ్ల మధుసూదన్‌రెడ్డి అన్నారు. సీనియర్ సిటిజన్స్ మండల కమిటీ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్‌ను శుక్రవారం ఆయన చౌటుప్పల్ పట్టణంలో ఆవిష్కరించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సీఐ మన్మథకుమార్, సంఘం మండల అధ్యక్షుడు కానుగుల వెంకటయ్య, ప్రదానకార్యదర్శి గోశిక లక్ష్మయ్య, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం మండల అధ్యక్షుడు భీమిడి మోహన్‌రెడ్డి, ప్రతినిధులు డాకోజి లక్ష్మీనారాయణ, బొమ్మిడి సత్తిరెడ్డి, తొర్పునూరి కృష్ణ, బొల్లారం లక్ష్మీనారాయణ, వడ్త్యా బిక్కు తదితరులు పాల్గొన్నారు.
వైభవంగా ఊంజల్ సేవోత్సవం
వైభవంగా ఊంజల్ సేవోత్సవం


