గ్రామాల అభివృద్ధికి సహకారమందిస్తా
మోత్కూరు : గ్రామాల సమగ్రాభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని భువనగిరి ఎంపీ చామల కిరన్‌కుమార్‌రెడ్డి నూతన సర్పంచ్‌లకు హామీ ఇచ్చారు. శుక్రవారం హైదరాబాద్‌లోని అంబర్‌పేటలోని తన కార్యాలయంలో మోత్కూరు మండలానికి చెందిన ముశిపట్ల సర్పంచ్ పైళ్ల నర్సిరెడ్డి, సదర్శాపురం సర్పంచ్ మునుకుంట్ల నీలకంఠం, పొడిచేడు సర్పంచ్ జిట్ట సైదులు, దత్తప్పగూడెం సర్పంచ్ గుండు యాదగిరిలు ఎంపీని మర్యాద పూర్వకంగా కలిశారు. దీంతో కొత్త సర్పంచ్‌లను ఎంపీ శాలువాలతో సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులతో సమన్వయంగా ఉంటూ ప్రజల మన్ననలు పొందేలా ప్రజా సమస్యల పరిష్కారానికి అహర్నిశలు శ్రమించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు పైళ్ల సోమిరెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు వంగాల సత్యనారాయణ, ఏపీఐడీసీ మాజీ డైరెక్టర్ కంచర్ల యాదగిరిరెడ్డి, నాయకులు తీగల నర్సింహారెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఎండి.సమీరుద్దిన్, కారుపోతుల వెంకన్న, ప్రశాంత్‌రెడ్డి, అడ్వకేట్ పర్రెపాటి యుగేంధర్, అవిశెట్టి కిరణ్, మహేష్, యాదగిరి, సాజిద్, బండ లింగయ్య, బండ సోమయ్య, మత్స్యగిరి తదితరులు పాల్గొన్నారు.
ఫ కొత్త సర్పంచ్‌లకు ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి హామీ


