
సర్వేయర్లకు ఫీల్డ్ ట్రాకింగ్ కీలకం
భువనగిరిటౌన్ : సర్వేయర్లకు ఫీల్డ్ ట్రాకింగ్ చాలా కీలకమని, రకరకాల భూములు సర్వే చేయాల్సి ఉంటుందని, శిక్షణ ద్వారా ఆయా అంశాలపై అవగాహన పెంచుకోవాలని కలెక్టర్ హనుమంతరావు సూచించారు. భువనగిరి పట్టణంలోని వెన్నెల కళాశాలలో సర్వే, ల్యాండ్ రికార్డ్స్ శాఖ ఆధ్వర్యంలో లైసెన్స్‌డ్ సర్వేయర్లకు శిక్షణ తరగతులు ఏర్పాటు నిర్వహిస్తున్నారు. మొదటి రోజు సోమవారం కలెక్టర్ శిక్షణ తరగుతలకు హాజరై సర్వేయర్లుకు పలు సూచనలు చేశారు. సర్వేకు సంబంధించి 35 సెక్షన్లు ఉంటాయని, వాటిపై పూర్తిగా అవగాహన కలిగి ఉండాలన్నారు. భూమిని సర్వే చేసేటప్పుడు కొన్ని మెళకువలు పాటిస్తే సర్వే సులభంగా చేయవచ్చన్నారు. అనంతరం సర్వేయర్లకు మెటీరియల్ అందజేశారు. శిక్షణలో 198 మంది పాల్గొన్నారు. వీరిని 10 బ్యాచ్‌లుగా చేసి శిక్షణ ఇస్తున్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడీ వేణుగోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.
రాజీవ్ యువ వికాసంపై సమీక్ష
రాజీవ్ యువ వికాసం పథకం లబ్ధిదారుల ఎంపికపై కలెక్టర్ హనుమంతరావు సోమవారం జూమ్ మీటింగ్ నిర్వహించి సమీక్షించారు. నిరుద్యోగ యువతను ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని, అందుకోసం లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేపట్టాలని అధికారులకు సూచించారు. యూనిట్‌ల ఎంపికలో జాగ్రత్తలు పాటించాలని పే ర్కొన్నారు. జూమ్ మీటింగ్‌లో డీఆర్‌డీఓ నాగిరెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్యాంసుందర్, బీసీ సంక్షేమ అధికారి యాదయ్య, ఎంపీడీఓలు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ హనుమంతరావు