క్రీడలతో ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది
రామగిరి(నల్లగొండ): క్రీడలు విద్యార్థుల జీవితాల్లో ఆత్మవిశ్వాసం పెంపొందిస్తాయని నల్లగొండ జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి ఎండీ అక్బర్ అలీ అన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని మేకల అభినవ్ స్టేడియంలో 2025–26 జిల్లా స్థాయి ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్‌ను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఆటలు ఆడడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుందని, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయన్నారు. నల్లగొండ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ నరసింహరావు మాట్లాడుతూ.. క్రీడల్లో గెలుపోటములను సమానంగా స్వీకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్ ఐలయ్య, సత్తయ్య, పీడీ ప్రసాద్, అధ్యాపకులు వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, శ్రీమాధురి, అంజయ్య, జ్యోతి, సిబ్బంది విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.
ఉత్సాహంగా కొనసాగిన పోటీలు..
ఈ స్పోర్ట్స్ మీట్‌లో భాగంగా అథ్లెటిక్స్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, క్రికెట్, బ్యాడ్మింటన్ తదితరల పోటీలు ఉత్సాహభరితంగా కొనసాగాయి. ఉమ్మడి జిల్లాలోని నల్లగొండ, నాగార్జునసాగర్, సూర్యాపేట, తిరుమలగిరి, యాదాద్రి భువనగిరి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలతో పాటు కోదాడలోని అనురాగ్ ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాల జట్లు పోటీల్లో పాల్గొన్నాయి. బుధవారంతో ఈ స్పోర్ట్స్ మీట్ ముగియనుంచి. మొదటి స్థానంలో నిలిచిన జట్లను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తారు.
ఫ నల్లగొండ జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి అక్బర్ అలీ
ఫ మేకల అభినవ్ స్టేడియంలో ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ మీట్ ప్రారంభం


