
ధాన్యం కొనగోళ్లు పూర్తిచేయాలి
మోటకొండూర్: వరి ధాన్యం కొనుగోళ్లను త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్ హనుమంతరావు ఆదేశించారు. బుధవారం మోటకొండూరు మండలం ముత్తిరెడ్డిగూడెంలోని పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోళ్లలో జాప్యం ఎందుకు జరుగుతుందని, రైతుల వివరాలను వెంటనే ఎందుకు నమోదు చేయడం లేదని నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. కేంద్రాల్లో దళారులు ధాన్యం విక్రయిస్తున్నారని ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనుగోళ్లు వేగవంతం చేయాలని సూచించారు. ఆయన వెంట కేంద్రం నిర్వాహకులు, అధికారులు, రైతులు ఉన్నారు.