
ధాన్యం తరలింపులో జాప్యం చేయొద్దు
వలిగొండ : కొనుగోలు కేంద్రాల్లో కాంటా వేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హనుమంతరావు అధికారులను ఆదేశించారు. శనివారం వలిగొండ మండలంలోని ప్రొద్దుటూరు, ఏదుళ్లగూడెం, నాతాళ్లగూడెంలో కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. వర్షాలు కురుస్తున్నందున ధాన్యాన్ని కేంద్రాల్లో నిల్వ ఉంచటానికి వీల్లేదన్నారు. జాప్యం చేయకుండా మిల్లులకు ఎగుమతి చేయాలని సూచించారు. ఎగుమతి చేసిన ధాన్యం వివరాలను ఏరోజుకారోజు ట్రక్షీట్ కట్ చేసి రికార్డుల్లో నమోదు చేయాలని సూచించారు. రైతులతో మాట్లాడి కొనుగోలు కేంద్రాల్లో సమస్యలపై ఆరా తీశారు. ధాన్యం తడవకుండా ధాన్యం రాశులపై ముందుస్తుగా టార్పాలిన్లు ఏర్పాటు చేసుకోవాలని వారికి సూచించారు. ఆయన వెంట వెంట రెవెన్యూ అధికారులు ఉన్నారు.
ఫ కలెక్టర్ హనుమంతరావు