
యాదగిరీశుడి సేవలో ఏపీ హైకోర్టు జడ్జి
యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామిని సోమవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు జడ్జి జస్టిస్ చల్లా గుణరంజన్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయ ముఖ మండపంలో అర్చకులు సంప్రదాయంగా స్వాగతం పలికారు. గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తుల చెంత ప్రత్యేక పూజలు చేశారు. జస్టిస్ గుణరంజన్‌కు అర్చకులు వేదాశీర్వచనం చేయగా, అధికారి రాజన్‌బాబు లడ్డూ ప్రసాదం అందజేశారు.
రాష్ట్ర సమాచార కమిషనర్‌గా తుర్కపల్లి వాసి
తుర్కపల్లి: రాష్ట్ర సమాచార కమిషనర్‌గా తుర్కపల్లి మండల కేంద్రానికి చెందిన బోరెడ్డి అయోధ్యరెడ్డి నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సీపీఆర్‌ఓగా కొనసాగుతున్నారు. సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన ఆయన ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు. 20 సంవత్సరాలు వివిధ దినపత్రికల్లో జర్నలిస్టుగా పనిచేశారు. తెలంగాణ ప్రదేశ్ క్రాంగెస్ కమిటీ అధికార ప్రతినిధిగా, మీడియా కోఆర్డినేటర్‌గా పనిచేశారు. శాసనసభ ఎన్నికల సమయంలో వార్‌రూం కన్వీనర్‌గా పనిచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆయనను చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్‌గా(సీపీఆర్‌ఓ) నియమించి సీఎంఓలో అవకాశం కల్పించారు. తాజాగా రాష్ట్ర సమాచార కమిషనర్‌గా నియమించారు.
ఏఎస్‌టీసీ గౌరవ ఫెలోగా ఎంజీయూ వీసీ నియామకం
నల్లగొండ టూటౌన్: అకాడమీ ఫర్ సైన్స్, టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్(ఏఎస్‌టీసీ)–హైదరాబాద్ గౌరవ ఫెలోగా మహాత్మాగాంధీ వైస్ చాన్స్‌లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ నియమితులయ్యారు. ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రముఖ వైద్యుడు నాగేశ్వర్‌రెడ్డి చేతుల మీదుగా గౌరవ ఫెలో నియామక పత్రాన్ని వీసీ అందుకున్నారు. తన నియామక ఎంజీయూకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు వీసీ తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పాల్గొన్నారు.
చెరువులో పడి
మహిళ మృతి
కోదాడరరూరల్ : కోదాడ పట్టణంలోని శ్రీనివాసనగర్‌కు చెందిన రామనర్సమ్మ(49) సోమవారం అనంతగిరి రోడ్డు వైపు పెద్ద చెరువులో పడి మృతిచెందింది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీసి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.

యాదగిరీశుడి సేవలో ఏపీ హైకోర్టు జడ్జి

యాదగిరీశుడి సేవలో ఏపీ హైకోర్టు జడ్జి